వికీపీడియా:తెవికీ 20 వ వార్షికోత్సవం/నివేదిక
From Wikipedia, the free encyclopedia
తెలుగు వికీపీడియా 20 వ వార్షికోత్సవం 2023 జనవరి 26-28 తేదీలలో విశాఖపట్నంలో జరిగింది. సిఐఎస్ ఎ2కె ఆర్థిక, నిర్వహణా సహకారంతో తెలుగు వికీమీడియన్లం ఈ వార్షికోత్సవాన్ని నిర్వహించాం. 30 మంది అహ్వానితులైన వికీపీడియన్లు, ఐదుగురు వికీయేతర అతిథులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు ప్రత్యేకంగా తెవికీ పండగ అనే పేరు పెట్టి, ఒక లోగో తయారు చేయించాం.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/01/VisakhapatnamH.jpg/640px-VisakhapatnamH.jpg)
ప్రధాన పేజీ | చర్చ | కార్యక్రమ ప్రణాళిక | కమిటీలు | సన్నాహక సమావేశాలు | స్కాలర్షిప్స్ | నివేదిక | భావి కార్యాచరణ |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8f/Telugu_Wikipedia_20th_Bday_01.jpg/640px-Telugu_Wikipedia_20th_Bday_01.jpg)
జనవరి 26, గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు. 27, 28 శని, ఆదివారాలు. ఈ మూడు రోజుల్లో, విశాఖపట్నం డాల్ఫిన్ హోటల్లో జరిగిన తెవికీ పండగ విశేషాలు ఇవి.