బంకించంద్ర ఛటర్జీ రచించిన సంస్కృత గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.[1][2] [3] [4]

వందేమాతరం

వందేమాతరం

సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం

కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం

తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం

త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం,మాతరం వందేమాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం

వందేమాతరం

Thumb
వందేమాతర గేయానికి రూపకల్పన 1923 లో ప్రచురితం
త్వరిత వాస్తవాలు Lyrics, Music ...
వందేమాతరం
Thumb
Lyricsబంకిం చంద్ర ఛటర్జీ, ఆనందమఠం
Musicహేమంత ముఖర్జీ , జదునాథ్ భట్టాచార్య
Adopted24 జనవరి 1950
మూసివేయి
వందేమాతరం పేరుతో ఉన్న ఇతర పేజీల కోసం వందేమాతరం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

అర్ధం

వందేమాతరం మొదటి చరణ భావం : భారతమాతకు వందనం, తియ్యని నీటితో, కమ్మని పండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరుతో విలసిల్లే భారతమాతకు వందనం, రాత్రులు తెల్లని వెన్నెలలతో పులకిస్తూ విరబూసిన చెట్లతో శోధిస్తూ స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే భారత మాతకు వందనం.

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.