From Wikipedia, the free encyclopedia
లారా లీ ట్రంప్ (ఆంగ్లం: Lara Trump; 1982 అక్టోబరు 12) ఒక అమెరికన్ మాజీ టెలివిజన్ నిర్మాత, ఆమె మార్చి 2024లో రిపబ్లికన్ నేషనల్ కమిటీ సహ-అధ్యక్షత వహించింది. ఆమె అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మూడవ సంతానం ఎరిక్ ట్రంప్ ను వివాహం చేసుకుంది. ఆమె ట్రంప్ ప్రొడక్షన్స్ రియల్ న్యూస్ అప్డేట్ నిర్మాత, హోస్ట్. అలాగే, ఇన్సైడ్ ఎడిషన్ నిర్మాత కూడా.[1]
లారా ట్రంప్ | |
---|---|
సహ-అధ్యక్షురాలు, రిపబ్లికన్ నేషనల్ కమిటీ | |
Incumbent | |
Assumed office 2024 మార్చి 8 | |
అంతకు ముందు వారు | డ్రూ మెక్కిస్సిక్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | లారా లీ యునస్కా 1982 అక్టోబరు 12 విల్మింగ్టన్, నార్త్ కరోలినా, అమెరికా |
రాజకీయ పార్టీ | రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్) |
జీవిత భాగస్వామి | |
సంతానం | 2 |
బంధువులు | డోనాల్డ్ ట్రంప్ (మామయ్య) |
లారా యునస్కా నార్త్ కరోలినాలోని విల్మింగ్టన్ లో 1982 అక్టోబర్ 12న లిండా ఆన్ సైక్స్, రాబర్ట్ ల్యూక్ యునస్కాలకు జన్మించింది. ఆమెకు కైల్ రాబర్ట్ యునస్కా అనే తమ్ముడు ఉన్నాడు.[2] ఆమె ఎమ్స్లీ ఎ. లానీ ఉన్నత పాఠశాలలో చదివింది.[3] ఆమె నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీ నుండి కమ్యూనికేషన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పుచ్చుకుంది. న్యూయార్క్ లోని ఫ్రెంచ్ పాకశాస్త్ర సంస్థ (French Culinary Institute)లోనూ ఆమె చదువుకుంది.[4]
ఆమె 2012 నుండి 2016 వరకు టీవీ న్యూస్ మ్యాగజైన్ ఇన్సైడ్ ఎడిషన్ కు స్టోరీ కోఆర్డినేటర్ కమ్ నిర్మాతగా ఉంది.[5] 2021 మార్చి 29న, ఆమె ఫాక్స్ న్యూస్ కంట్రిబ్యూటర్ గా చేరి,[6][7] డిసెంబరు 2022 వరకు కొనసాగింది.[8]
2024 ఫిబ్రవరి 12న, లారా ట్రంప్ ను నార్త్ కరోలినా రిపబ్లికన్ పార్టీ నాయకుడు మైఖేల్ వాట్లీతో పాటు రిపబ్లికన్ నేషనల్ కమిటీ సహ-అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది.[9][10] అయితే, 2024 మార్చి 8న లారా ట్రంప్ ఏకగ్రీవ ఓటు ద్వారా రిపబ్లికన్ నేషనల్ కమిటీ సహ-అధ్యక్షురాలిగా ఎన్నికయ్యింది.[11]
లారా యునస్కా 2014 నవంబరు 8న ఎరిక్ ట్రంప్ ను వివాహం చేసుకుంది.[12][13] 2017 సెప్టెంబరు 12న, ఈ జంట మొదటి బిడ్డకు[14], 2019 ఆగష్టు 19న రెండవ బిడ్డకు జన్మనిచ్చింది.[15]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.