From Wikipedia, the free encyclopedia
డోనాల్డ్ జాన్ ట్రంప్ అమెరికా రాయకీయ నాయకుడు, వ్యాపారవేత్త, బుల్లితెర వ్యాఖ్యాత, రచయిత, 2016 అమెరికా అధ్యక్ష్య ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ తరపున నవంబరు నెలలో జరిగిన ఎన్నికలలో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
డోనాల్డ్ జె. ట్రంప్ | |
---|---|
Donald J. Trump | |
జననం | డోనాల్డ్ జాన్ ట్రంప్ June 14, 1946 (age 69) న్యూయార్క్ |
వృత్తి | ట్రంప్ ఆర్గనైజేషన్ కి అద్యక్ష్యుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1968-నేటికీ |
రాజకీయ పార్టీ | రిపబ్లికన్ పార్టీ (1987–99; 2009–11; 2012–present); స్వతంత్ర రాజకీయవేత్త(2011–12); డెమోక్రటిక్ పార్టీ(before 1987; 2001–09); రిఫార్మ్ పార్టీ (1999–2001) |
బంధువులు | డోనాల్డ్ ట్రంప్ (కోడలు) |
సంతకం | |
జున్ 14, 1946న ఫ్రెడ్ ట్రంప్- మేరీ అన్నా మెక్లాయిడ్ దంపతులకు రెండో సంతానంగా డోనాల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లో జన్మించారు.[1] ట్రంప్ తండ్రి మూలాలు జర్మనీలో.. తల్లి మూలాలు స్కాట్లాండ్లో ఉన్నాయి. ఈ దంపతులకు మొత్తం నలుగురు సంతానం.[2] ట్రంప్ బాల్యం, విద్యాభ్యాసం న్యూయార్క్‌లోనే పూర్తయ్యాయి.ట్రంప్ కుటుంబం జమైకా ఎస్టేట్స్‌లో ఉన్నప్పుడు క్యూ ఫారెస్ట్ స్కూల్లో చదువుకునేవారు. అయితే కొన్ని సమస్యల కారణంగా 13వ ఏటే ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చేసి న్యూయార్క్ మిలటరీ అకాడమీలో చేరారు. అక్కడే హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. తర్వాత బ్రోనెక్స్‌లోని ఫార్డమ్ విశ్వవిద్యాలయంలో రెండేళ్లు చదివారు. అనంతరం అమెరికాలోనే స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన కోర్సులు ఆఫర్ చేసే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వాటర్‌లూన్ స్కూల్ నుంచి ఆయన అర్థశాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆయన తమ కుటుంబ సంస్థ అయిన ఎలిజబెత్ ట్రంప్ అండ్ సన్స్‌లో పని చేసేందుకే ఇక్కడ చదివారు. ట్రంప్ సోదరుడు 1981లో మద్యానికి బానిసై మృతి చెందారు. ఇదే తనను మద్యం, ధూమపానం నుంచి దూరంగా ఉంచిందని ట్రంప్ తరచూ చెబుతుంటారు.
ట్రంప్ ప్రపంచ కుబేరుల్లో స్థానం సంపాదించినా ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త కాదా అనే అంశం కూడా వివాదాస్పదంగానే ఉంది. 1985 నుంచి 2016 వరకు అమెరికా స్టాక్ మార్కెట్‌ను, న్యూయార్క్‌లో ఆస్తి విలువలను పోల్చుకుంటే ట్రంప్ ఎదుగుదల సగటు స్థాయిలోనే ఉందని 2016లో ది ఎకనమిస్ట్ అనే పత్రిక పేర్కొంది. వ్యాపార విజయాల వంటి మెరుపులతో పాటు బ్యాంకులకు అప్పుల ఎగవేతలు వంటి మరకలు కూడా ఉన్నాయని ఆ పత్రిక పేర్కొంది. వ్యాపార, నైతిక అపజయాలతోపాటు రియల్ ఎస్టేట్ విజయాలు కలిస్తే ట్రంప్ అని ఆయన ప్రత్యర్థులు అంటుంటారు. ట్రంప్ తొలుత కుటుంబ సంస్థ అయిన ఎలిజబెత్ అండ్ సన్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆయన తొలి ప్రాజెక్టును తండ్రితో కలిసి పూర్తి చేశారు. 1971లో ఆయన వ్యాపార పగ్గాలను స్వీకరించగానే సంస్థ పేరును ది ట్రంప్ ఆర్గనైజేషన్‌గా మార్చేశారు. కార్యాలయాన్ని కూడా మాన్‌హట్టన్‌కు మార్చేశారు. ఆయన 1978లో అక్కడ గ్రాండ్ హయత్ హోటల్‌ను నిర్మించారు. అమెరికాలోనే పలు ప్రముఖ భవనాలు ట్రంప్ నిర్మించారు. వీటిల్లో ట్రంప్ ఓషన్ క్లబ్, ట్రంప్ టవర్, సెంట్రల్ పార్క్‌లోని వూల్మాన్ రింక్ హోటల్ ఉన్నాయి. తర్వాత ప్లాజా హోటల్, అట్లాంటిక్ సిటీలోని తాజ్‌మహల్ కేసినోలను కొనుగోలు చేశారు.
1885లో ట్రంప్ పూర్వీకులు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చారు . రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖుడైన తన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ స్ఫూర్తితో వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. ఇండియాలోని ముంబై, పుణెల్లోనూ రియల్ వెంచర్లు ప్రారంభించాడు. రియల్ ఎస్టేట్‌తో పాటు హోటళ్లు, ఎంటర్టైన్ మెంట్ చానళ్లు, స్పోర్ట్స్ క్లబ్‌లు, అందాల పోటీలు.. ఇలా అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. అమెరికన్ సంపన్నుల్లో ట్రంప్ ఒకరు. ఆయన సంపద 5 ట్రిలియన్ డాలర్లు . 1968లో వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ట్రంప్ గ్రూప్‌తో పాటు ట్రంప్ ఎంటర్టైనమెంట్ అండ్ రిసార్ట్స్ సంస్థకు ఆయన సీఈఓగా నియమితులయ్యాడు.
ట్రంప్ వ్యక్తిగతంగా ఎప్పుడూ దివాళా ప్రకటించలేదు. కానీ ఆయన హోటల్, కేసినో వ్యాపారాలు దాదాపు ఆరుసార్లు దివాళా తీశాయి. వాస్తవానికి ఇవి దివాళాలు కావు. అక్కడ దివాళా చట్టంలోని చాప్టర్ 11లోని లొసుగులు వాడుకుంటూ వ్యాపారాలు చేయడం వంటిది. ఈ విషయాన్ని 2011లో న్యూస్‌వీక్ పత్రికతో మాట్లాడుతూ ట్రంప్ వెల్లడించారు. ‘నేను దివాళా చట్టాలతో ఆడుకుంటాను.. అవి నాకు ఎప్పుడూ మంచే చేశాయి’ అని నాడు ట్రంప్ అన్నారు. మరో సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ ‘నేను దేశంలోని చట్టాలను వాడుకుంటాను.. చట్టాన్ని ఉపయోగించుకొని బ్యాంకులతో బేరాలాడి అద్భుతమైన డీల్స్ కుదుర్చుకుంటాను. ఇది వ్యక్తిగతమైంది కాదు.. కేవలం వ్యాపారంలో భాగమే’ అన్నారు. ఈ మాటలు ట్రంప్‌లో కఠినమైన వ్యాపారవేత్తను చూపిస్తాయి. తర్వాత కాలంలో ట్రంప్ తన పేరు, చిత్రానికి కూడా లైసెన్స్‌లు పొందారు. టర్కీకి చెందిన ఓ వ్యాపారి ఆయన పేరు వాడుకున్నందుకు డబ్బు చెల్లించాడు. రియల్ ఎస్టేట్‌తోపాటు ట్రంప్ ఆర్గనైజేషన్ అమెరికా వ్యాప్తంగా సుమారు 18 గోల్ఫ్‌కోర్సులను నిర్వహిస్తోంది. ఓ గోల్ఫ్ కోర్స్ నిర్మాణ సమయంలో స్థానికులకు ట్రంప్‌కు మధ్య వివాదం రేగడంతో సుమారు 6000 ఉద్యోగాలు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. కానీ ఆ గోల్ఫ్‌కోర్స్ కేవలం 200 ఉద్యోగాలను మాత్రమే సృష్టించింది. తర్వాత ట్రంప్ ఫుట్‌బాల్ లీగ్‌లు, సైక్లింగ్ వంటి వాటికి స్పాన్సర్‌గా వ్యవహరించారు. నిత్యం వివాదాలను ఇష్టపడే ట్రంప్ మైక్ టైసన్ ఓ యువతిని గర్భవతిని చేసిన కేసుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు బూటకమని ఆయన వ్యాఖ్యానించారు. ‘అలా అయితే చాలా మంది మహిళలు టైసన్‌ను బలాత్కరించారని’ ఆయన అన్నారు. టైసన్‌ను విడుదల చేసి పోటీల్లో పాల్గొనేలా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ అప్పట్లో టైసన్‌కు ఆరేళ్లు జైలు శిక్ష పడింది. పెరోల్‌పై వచ్చిన టైసన్ కెరీర్‌ను.. ట్రంప్‌తో స్నేహాన్ని కొనసాగించాడు. ట్రంప్ మాత్రం జైలు జీవితం అనంతరం టైసన్ పాల్గొన్న బౌట్లను ప్రమోట్ చేయలేదు.
ట్రంప్ కేవలం క్రీడలనే కాదు అందాల పోటీలను కూడా అద్భుతంగా ప్రమోట్ చేశారు. 1996 నుంచి 2015 వరకు మిస్ యూనివర్స్, మిస్ యూఎస్ఏ, మిస్‌టీన్ యూఎస్ఏ పోటీలను ఆయన ప్రమోట్ చేశారు. ఎక్కువ సార్లు మిస్‌వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలను ప్రమోట్ చేసిన వ్యక్తిగా ఆయన ఘనత సాధించారు. 2006 మిస్ అమెరికా కిరీట విజేత తారా కొకైన్ వాడిందని తెలిసినా ఆమెను విజేతగా కొనసాగించాలనే ట్రంప్ నిర్ణయం విమర్శలపాలైంది. ఈ పోటీ పక్షపాతంతో కొనసాగిందని పోటీలో పాల్గొన్న యువతి ఆరోపించింది. ఆమెపై కేసువేసి ట్రంప్ ఐదు మిలియన్ డాలర్లను రాబట్టారు. 2015లో ఎన్బీసీలో వాటాలు కొనుగోలు చేసి తానే మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్‌కు యజమానిని అని ప్రకటించారు. అదికాస్తా వివాదాస్పదమై కూర్చుంది. దీంతో కొన్నాళ్లకే దానిలోని వాటాలను విక్రయించేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రధానాంశాల్లో ట్రంప్ పన్ను ఎగవేత వ్యవహారం కూడా ఒకటి. ఆయన ఇప్పటి వరకు కొంత సమాచారాన్ని మాత్రమే ప్రజలకు అందజేశాడు. పూర్తి సమాచారాన్ని మాత్రం ఇవ్వలేదు. ప్రస్తుతం అవి ఐఆర్ఎస్ పరిశీలనలో ఉన్నాయని వివరణ మాత్రం ఇచ్చారు. 2015లో ఆయన స్థూల ఆదాయాన్ని 611 మిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. ఇది కూడా వివాదాస్పదమైంది. ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన లెక్కల ప్రకారం ఆయన ఆదాయం 362 మిలియన్ డాలర్లని ఫార్చ్యూన్ పత్రిక పేర్కొంది. కానీ వీటిల్లో నుంచి ఖర్చులు తీసివేస్తే ఆయన ఆదాయం మూడో వంతు మాత్రమేనని తెలిపింది.
ట్రంప్ ప్రస్తుత భార్య మెలినియ ట్రంప్, తనని 1998లో న్యూయార్క్ లో ఒకనొక ఫ్యాషన్ వీక్ లో కలిసింది. అప్పటికే, డొనాల్డ్ ట్రంప్ తన రెండవ భార్యకి విడాకులు ఇచారు. 1820 నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రథమ మహిళలలో మెలినియ ట్రంప్, మొదటి విదేశీయురాలైన ప్రథమ మహిళ. డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ 2022 జులై 14న మరణించింది.[3] వవీరు 1977లో వివాహం చేసుకున్నారు. 1992లో విడాకులు తీసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.. డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్.
ట్రంప్ రాజకీయ ప్రస్థానం పార్టీలు మారుతూ వచ్చింది. తొలుత ఆయన రిపబ్లికన్ పార్టీకి మద్దతు ఇచ్చారు. తర్వాత ఆయన రిఫార్మ్ పార్టీకి మారారు. మూడేళ్ల తర్వాత ఆయన డెమొక్రటిక్ పార్టీలో చేరారు. 2001 నుంచి 2008 వరకు ఆయన డెమొక్రాట్‌గా కొనసాగారు. తర్వాత ఆయన జాన్ మెక్కెయిన్ను అధ్యక్ష అభ్యర్థిగా బలపరుస్తూ రిపబ్లికన్ పార్టీలోకి వచ్చారు. ఆయన రిపబ్లికన్ పార్టీలోకి వచ్చే ముందు ఐదు నెలలపాటు తటస్థంగా ఉన్నారు. మొత్తం ఆరుగురు డెమొక్రటిక్, నలుగురు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు ఆయన సాయం చేశారు. వీరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. దీంతో ఆయన రిపబ్లికన్లకు దగ్గరయ్యారు.[4][5]
అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్ పలుమార్లు ప్రయత్నాలు చేశారు. 1988, 2004, 2012, అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించగా.. న్యూయార్క్ గవర్నర్ పదవిపై 2006, 2014లో దృష్టి పెట్టారు. కానీ ఆయన ప్రత్యక్షంగా రేసులోకి రాలేదు.
పలు ప్రయత్నాల అనంతరం 2015 జూన్ 16న అమెరికా అధ్యక్ష పదవి కోసం ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు. మళ్లీ అమెరికాను ఉన్నత స్థానానికి చేరుస్తాను అనే నినాదంతో ఆయన ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన విభిన్నమైన ప్రచారానికి తెరతీశారు. హిల్లరీ పై వ్యక్తిగత విమర్శలు చేయడం, మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు, పన్ను ఉల్లంఘన వివాదాలు, లైంగిక వేధింపుల వివాదాలు ఆయన్ను చుట్టుముట్టాయి. మూడు సార్లు నిర్వహించిన జనరల్ ఎలక్షన్ డిబేట్స్‌లోను హిల్లరీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించినా ఆయన ఏ మాత్రం వెరవకుండా ప్రచారం చేశారు. రిపబ్లికన్లు తనను వీడి వెళుతున్నా లెక్కచేయక పోవడం ట్రంప్ శైలికి నిదర్శనం. అంతిమంగా ఆయన అనుకున్నది సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా అవతరించారు.
అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ ఖరారయ్యాడు. రిపబ్లికన్ పార్టీకి చెందిన అలబామా సెనెటర్ జెఫ్ సెషన్స్, ట్రంప్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా.. సౌత్ కరోలీనా లెఫ్ట్ నెంట్ గవర్నర్ హెన్రీ మ్యాక్ మాస్టర్, న్యూయార్క్ రిప్రజెంటెటివ్ క్రిస్ కోలిన్స్ బలపరిచారు. అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వం కోసం టెక్సాస్ సెనేటర్ క్రూజ్ తో పోటీ పడిన ట్రంప్ 1,237 డెలిగేట్ల మద్దతు దక్కించుకొని అభ్యర్థిగా ఖరారు అయ్యాడు.
2016 నవంబర్ నెలలో జరిగిన ఎన్నికలలో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.