రామోజీ ఫిల్మ్ సిటీ
ఫిలిం సిటీ అఫ్ ఇండియా / From Wikipedia, the free encyclopedia
రామోజీ ఫిలిం సిటి 2000 ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం ( ఫిలింసిటీ) గా పేరుగాంచింది. ఇది హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు 65వ నెంబరు జాతీయ రహదారి ప్రక్కన హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో[1] ఉంది. రామోజీ గ్రూపు అధిపతి రామోజీరావు 1996లో స్థాపించిన ఈ ఫిలింసిటి పర్యాటక ప్రదేశం గానూ పేరుగాంచింది. ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడ్డాయి. హైద్రాబాదు నుండి బస్సు సౌకర్యంకలదు. దీనిలో వివిధ దేశాలలోని ఉద్యానవనాల నమూనాలు, రకరకాల దేశ విదేశీ శిల్పాలు, సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల రంగస్థలాలు ఉన్నాయి. సందర్శకులకు ఆనందాన్ని కల్గించటానికి ప్రత్యేక సంగీత, నృత్య కార్యక్రమాలు రోజూ వుంటాయి.
త్వరిత వాస్తవాలు రామోజీ ఫిల్మ్ సిటీ, తరహా ...
రామోజీ ఫిల్మ్ సిటీ | |
---|---|
తరహా | ప్రైవేట్ |
స్థాపన | 1996 |
ప్రధానకేంద్రము | హైదరాబాదు తెలంగాణ, భారతదేశం |
కీలక వ్యక్తులు | రామోజీరావు, వ్యవస్థాపకుడు, రామోజీ గ్రూపు |
పరిశ్రమ | చిత్ర పరిశ్రమ |
యజమాని | రామోజీరావు |
మాతృ సంస్థ | రామోజీ గ్రూపు |
మూసివేయి