From Wikipedia, the free encyclopedia
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
భగవద్గీత | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
గమనిక
వ్రేళ్ళు పైకీ, కొమ్మలు దిగువకూ ఉన్నదీ, వేద అనువాకాలే ఆకులు కలదీ ఐన అశ్వత్థవృక్షం ఒక్కటి ఉందని చెప్పబడుతున్న వృక్షాన్ని తెలిసినవాడే వేదవిదుడని తెలుసుకో. దీని కొమ్మలు త్రిగుణాల వలనే విస్తరించి ఇంద్రియార్థాలే చిగుళ్ళుగా కల్గి, క్రిందికీ మీదికీ వ్యాపించి ఉన్నాయి.కాని మనుష్య లోకంలో కర్మానుబంధంతో దిగువకు పోయే వేళ్ళు కూడా ఉన్నాయి. సంసారం లోని ప్రాణులు ఈ చెట్టు యొక్క స్వరూపం తెలుసుకోలేరు.ఈ సంసారవృక్షాన్ని మూలంతో పాటు వైరాగ్యంతోనే ఛేదించాలి. దేనిని పొందితే తిరిగి సంసారం లోనికి రామో ఈ విశ్వము ఎవరి వలన సాగుతుందో అతన్ని శరణు వేడెదము అన్న భావనతో సాధన చేయాలి. బ్రహ్మజ్ఞానులై దురహంకారం, చెడుస్నేహాలు, చెడు ఊహలు లేక కోరికలను విడిచి ద్వంద్వాతీతులైన జ్ఞానులు మాత్రమే మోక్షం పొందుతారు. చంద్ర, సూర్య, అగ్నులు దేనిని ప్రకాశింపచేయలేరో, దేనిని పొందితే తిరిగి రానక్కరలేదో అలాంటి స్వయంప్రకాశమైనదే నా పరమపదం. నా పురాతన అంశయే జీవుడుగా మారి, జ్ఞానేంద్రియాలను మనసుగ్నూ ఆకర్షిస్తున్నారు. గాలి సువాసన తీసుకుపోయేట్లు జీవుడు కొత్త శరీరం పొందేటప్పుడు పూర్వశరీర భావాలను తీసుకెలుతున్నాడు. మనసు సహాయంతో ఇంద్రియవిషయాలను జీవుడు అనుభవిస్తున్నాడు. జీవుడి దేహాన్ని త్యజించడం, గుణప్రభావం చే మరో కొత్త దేహాన్ని పొందడం మూర్ఖులు తెలుసుకోలేరు.జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు. ఆత్మానుభవం చేత తమ బుద్ధిలో దీనిని చూడగలుతారు.కాని చిత్తశుద్ధి లేని సాధన చేత కనిపించదు. సూర్య, చంద్ర, అగ్నుల తేజస్సు నాదే. నా శక్తి చే, నేనే భూమియందు ప్రవేశించి సర్వభూతాలను ధరిస్తున్నాను.రసస్వరూపుడైన చంద్రూడినై అన్ని సస్యాలను పోషిస్తున్నాను. జీవుల జఠరాగ్ని స్వరూపంతో అవి తినే నాలుగురకాల ఆహారాలను ప్రాణ, అపాన వాయువులతో కూడి నేనే జీర్ణం చేస్తున్నాను. నేనే అందరి అంతరాత్మను.జ్ఞాపకం, జ్ఞానం, మరుపు నావలనే కలుగుతున్నాయి.నేనే వేదవేద్యుడను, వేదాంతకర్తను, వేదవేత్తనూ కూడా అయి ఉన్నాను. క్షర, అక్షర అని రెండు రకాలు.ప్రపంచభూతాలన్నీ క్షరులనీ, కూటస్థుడైన నిర్వికల్పుడు మాత్రమే అక్షరుడు. వీరిద్దరికంటే ఉత్తముడు పరమాత్మ.అతడే మూడు లోకాలను పోషిస్తోన్న అక్షయుడూ, నాశనం లేనివాడు. అందువలనే పరమాత్మ వేదాలలో పురుషోత్తమునిగా కీర్తింపబడ్డాడు. భ్రాంతిని వదిలి, నన్నే పరమాత్మగా తెలుసుకొన్నవాడు సర్వజ్ఞుడై, అన్నివిధాలా నన్నే సేవిస్తాడు. అర్జునా!అతిరహస్యమైన ఈ శాస్త్రాన్ని నీ నిమిత్తమై చెప్పాను.దీనిని గ్రహించినవాడు జ్ఞానియై, కృతార్థుడవుతాడు.
పురుషోత్తమ ప్రాప్తి యోగము 16, 17 శ్లోకాలలో త్రైత సిద్ధాంతం నిమిడి వున్నదన్నది వీరి వాదన. క్షరుడు అనగా జీవాత్మ అని, అక్షరుడు అనగా మధ్యాత్మ అయిన ఆత్మ అనీ, పురుషోత్తమ అనగా పరమాత్మ అనీ చెప్తారు. ముగ్గురు పురుషుల వివరమే ఈ శ్లోకాలలో వివరించబడింది అనీ, త్రైతం ఆధారంగానే శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీత తెలియచేశాడని వీరి వాదన. దీనిని ఆధారం చేసుకొనే ఆచార్యప్రబోధానంద యోగీశ్వరులు "త్రైత సిద్ధాంత భగవద్గీత" రాశారు.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.