![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9f/Bangkok_montage_2.jpg/640px-Bangkok_montage_2.jpg&w=640&q=50)
బ్యాంకాక్
థాయిలాండ్ యొక్క రాజధాని / From Wikipedia, the free encyclopedia
బ్యాంకాక్ థాయిలాండ్ దేశపు రాజధాని. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే అందమైన నగరం. అయితే బ్యాంకాక్ అసలు పేరు అత్యంత పొడవుగా ఉండి గిన్నిస్ బుక్‌లోనూ చోటు సంపాదించుకుంది. ఆ పేరు "క్రుంగ్ థెప్ మహా నాఖోన్ అమోన్ రతన కోసిన్ మహింత్రయుత్తయ మహ దిలోక్ పోప్ నప్ప రాట్ రటచా థాని బురి రోమ్ ఉడొమ్ రటాచ నివెట్ మహా సతాన్ అమోన్ ఫిమన్ అవటాన్ సట్‌హిట్ సఖ తాట్టియా విట్సనుకమ్ ప్రసిట్" (థాయ్: กรุงเทพมหานคร อมรรัตนโกสินทร์ มหินทรายุธยา มหาดิลกภพ นพรัตนราชธานีบูรีรมย์ อุดมราชนิเวศน์มหาสถาน อมรพิมานอวตารสถิต สักกะทัตติยวิษณุกรรมประสิทธิ์). ప్రస్తుతం ఇంతపొడవు పేరున్న ఈ నగరం బాహ్య ప్రపంచానికి బ్యాంకాక్, కానీ ఆ పొడవు పేరును కుదించి ‘క్రుంగ్ థెప్ మహా నిఖోన్’గా కానీ ‘క్రుంగ్ థెప్’గా కానీ స్థానికులు పిలుచుకుంటారు.[5]
బ్యాంకాక్ (Bangkok)
กรุงเทพมหานคร Krung Thep Maha Nakhon | |
---|---|
ప్రత్యేక పరిపాలనా యంత్రాంగము | |
![]() పైనుండి సవ్య దిశలో: సి లోమ్–సతన్ వాణిజ్య జిల్లా, వత్ అరుణ్, భారీ ఊయల, విక్టోరియా స్మారకము, వట్ ఫ్రా కియో | |
![]() Location within Thailand | |
దేశము | ![]() |
ప్రాంతము | సెంట్రల్ థాయిలాండ్ |
Settled | c 15th century |
Founded as capital | 21 ఏప్రిల్ 1782 |
Re-incorporated | 13 డిసెంబరు 1972 |
Founded by | రామా 1 రాజు |
Governing body | బ్యాంకాక్ మెట్రోపాలిటన్ పరిపాలనా యంత్రాంగము |
Government | |
• Type | ప్రత్యేక పరిపాలనా ప్రాంతము |
• గవర్నరు | సుఖుంబంధ్ పరిబ్రత (ప్రజాస్వామ్య పార్టీ) |
విస్తీర్ణం | |
• City | 1,568.737 కి.మీ2 (605.693 చ. మై) |
• Metro | 7,761.6 కి.మీ2 (2,996.8 చ. మై) |
Elevation | 1.5 మీ (4.9 అ.) |
జనాభా (2010 census)[4] | |
• City | 82,80,925 |
• జనసాంద్రత | 5,300/కి.మీ2 (14,000/చ. మై.) |
• Metro | 1,45,65,547 |
• Metro density | 1,900/కి.మీ2 (4,900/చ. మై.) |
Demonym | బ్యాంకాకియన్ |
Time zone | UTC+7 (Thailand) |
Postal code | 10### |
ప్రాంతపు కోడ్ | 02 |
ISO 3166 code | TH-10 |
కింగ్ మాంగ్‌కుట్ మహారాజు బ్యాంకాక్‌కు పెట్టిన ఈ పేరు పాలి, సంస్కృత భాషల్లోని పదాలతో కూర్చినది. దీనికి అర్థం ‘దేవదూతల నగరం, అమరత్వం పొందిన నగరం, తొమ్మిది రత్నాల అద్భుతమైన నగరం, చక్రవర్తి సింహాసనం, రాజభవంతుల నగరం, మానవరూపంలో అవతరించిన దేవతల ఇల్లు, ఇంద్రుడి ఆదేశాలతో విశ్వకర్మ నిర్మించిన నగరం’’.[6]
పల్లెటూరుగా ఉన్న బ్యాంకాక్‌ను 15వ శతాబ్దంలో ఆయుత్తయ రాజులు నగరంగా అభివృద్ధి చేయాలనుకున్నారు. అప్పటి నుంచి ఆయా రాజులు ప్రధాన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. 1782లో కింగ్ రామ-1 బ్యాంకాక్‌ను రాజధానిగా మార్చుకున్నాడు. ఆయన హయాంలో బ్యాంకాక్‌ను ‘‘క్రుంగ్ థెప్ తవరవాడి సి ఆయుత్తయ" అని పిలిచేవారు.[7]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e8/%E0%B8%A7%E0%B8%B1%E0%B8%94%E0%B8%9E%E0%B8%A3%E0%B8%B0%E0%B8%A8%E0%B8%A3%E0%B8%B5%E0%B8%A3%E0%B8%B1%E0%B8%95%E0%B8%99%E0%B8%A8%E0%B8%B2%E0%B8%AA%E0%B8%94%E0%B8%B2%E0%B8%A3%E0%B8%B2%E0%B8%A1_%E0%B8%A7%E0%B8%B1%E0%B8%94%E0%B8%9E%E0%B8%A3%E0%B8%B0%E0%B9%81%E0%B8%81%E0%B9%89%E0%B8%A7_%E0%B8%81%E0%B8%A3%E0%B8%B8%E0%B8%87%E0%B9%80%E0%B8%97%E0%B8%9E%E0%B8%A1%E0%B8%AB%E0%B8%B2%E0%B8%99%E0%B8%84%E0%B8%A3_-_Wat_Phra_Kaew%2C_Temple_of_Emerald_Buddha%2C_Bangkok%2C_Thailand.jpg/640px-thumbnail.jpg)