ప్రపంచంలోని ప్రకృతి లేదా మానవుల ద్వారా చేసిన మొదటివి, అద్భుతమైన విషయాలను పొందుపరిచే పుస్తకం. From Wikipedia, the free encyclopedia
ప్రపంచంలో రికార్డులు సాధించిన వారి వివరములు గల పుస్తకము.
గిన్నీస్ ప్రపంచ రికార్డులు | |
గిన్నీస్ ప్రపంచ రికార్డులు 2008 సంచిక | |
కృతికర్త: | ఎవరూ లేరు |
---|---|
అనువాదకులు: | ఎవరూ లేరు |
బొమ్మలు: | ఇయన్ బుల్ , ట్రుడి వెబ్బ్ |
ముఖచిత్ర కళాకారుడు: | యేఉంగ్ పూన్ |
దేశం: | United Kingdom |
భాష: | English, Arabic, Brazilian, Portuguese, Chinese, Croatian, Czech, Danish, Dutch, Finnish, French, German, Greek, Hebrew, Hungarian, Icelandic, Italian, Japanese, Norwegian, Russian, Slovakian, Spanish, Swedish and Turkish |
సీరీస్: | గిన్నీస్ ప్రపంచ రికార్డులు |
ప్రక్రియ: | ప్రపంచ రికార్డులు |
విభాగం (కళా ప్రక్రియ): | సమాచారం |
ప్రచురణ: | హిట్ ఎంటర్టైన్మెంట్ |
విడుదల: | ఆగష్టు 27, 2007 |
పేజీలు: | 288 (2006) 287 (2007) 289 (2008) |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | 978-1-904994-18-3 |
గిన్నీస్ ప్రపంచ రికార్డులు (ఆంగ్లం: Guinness World Records) (2000 వరకు ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని పిలవబడ్డాయి) ప్రతి సంవత్సరం ప్రచురించబడే ఒక ప్రమాణిక పుస్తకము. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రపంచ రికార్డులను నమోదు చేస్తుంది. ఇందులో మానవులు సాధించిన ఘనవిజయాలు, ప్రకృతిలో జరిగే విపరీతాలను గుర్తింపబడతాయి. ఈ పుస్తకమే కాపీరైటు పొందిన పుస్తకాల అమ్మకాలలో ఒక ప్రపంచ రికార్డు సాధించింది.[1]
1951 నవంబరు 10న సర్ హగ్ బీవర్, ఐర్లాండ్ లోని గిన్నీస్ బ్రెవరీ కంపెనీ డైరెక్టరు ఒక రోజు స్నేహితులతో ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే పక్షి ఏది అని వాదిస్తున్నాడు. అయితే తొందరలోనే ఈ విషయాన్ని నిర్ధారించడం చాలా కష్టమని అతనికి అర్ధం అయింది.[2] అయితే బ్రిటన్లో ప్రచురించబడే 81,400 ప్రచురణలలో ఇలాంటి వివాదాలను పరిష్కరించే పుస్తకం అప్పటివరకు విడుదలకాలేదు. అతని ఆలోచనలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను చూపించే పుస్తకం చాలా ప్రాచుర్యం పొందుతుందని భావించారు.
బీవర్ ఆలోచనను గిన్నీస్ కంపెనీలో ఉద్యోగిగా ఉండే క్రిష్టాఫర్ కాటవే బాగా సమర్ధించి లండన్లోని నోరిస్, రాస్ అనే ఇద్దరు కవలలకు ఆ పని అప్పగించాడు. ఈ అన్నదమ్ములు పూర్తిచేసిన పుస్తకం "ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు" ఆగష్టు 1954లో ఒక వెయ్యి కాపీలు ముద్రించి అందరికీ పంచిపెట్టారు.[3]
గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు స్థాపించిన తరువాత మొదటి 198-పేజీల ప్రతిని 27 ఆగష్టు 1955లో విడుదలచేశారు. క్రిస్టమస్ కల్లా బ్రిటిష్ బెస్ట్ సెల్లర్ గా నమోదయింది. ఆ తరువాతి సంవత్సరం అమెరికాలో విడుదల చేసి 70,000 కాపీలు అమ్ముడయ్యాయి. అప్పటినుండి ప్రతి సంవత్సరం కొత్త రికార్డులతో అక్టోబరులో ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. మెక్ విటర్స్ అన్నదమ్ములు తరువాత బహుళ ప్రాచుర్యం పొందిన దూరదర్శినిలో పిల్లల ప్రశ్నలకు సమాధానాలు చెప్పెవారు.
1976 సంవత్సరంలో గిన్నీస్ బుక్ ఆఫ్ ప్రపంచ రికార్డుల ఎగ్జిబిషన్ హాలు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్లో ప్రారంభించబడింది. దీనిలో ప్రపంచంలోని అత్యంత పొడువైన మనిషి (రాబర్ట్ వాడ్లో) విగ్రహం, ప్రపంచంలో అత్యంత పొడవైన వానపాము, కత్తులను మ్రింగే వ్యక్తి X-రే ఫోటో, మెరుపుల వలన కన్నాలు పడిన టోపీ మొదలైనవి ఉన్నాయి.[4]
ఈ మధ్యకాలంలో గిన్నీస్ కంపెనీ అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలలో మూజియాలు స్థాపించడానికి అంగీకరించింది. ప్రస్తుతం టోక్యో, కోపెన్ హాగన్, సాన్ ఆంటోనియో, నయగారా జలపాతాలు, కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్, టెన్నిస్సె లలో ఉన్నాయి.
గిన్నీస్ ప్రపంచ రికార్డులు వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ (2022) ఫైనల్ మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంకు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే ఈ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఇందులో 1,32,000 మంది కూర్చుని వీక్షించే వసతి ఉంది. ఇప్పుడు మరో ఘణత సాధించింది. IPL 2022 సందర్భంగా ప్రదర్శించిన 66 X 44 మీటర్ల సైజుతో క్రికెట్ జెర్సీ, అతిపెద్ద క్రికెట్ జెర్సీగా గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం చేసుకుంది. ఈ జెర్సీలో పది జట్ల లోగోలతో పాటు 15వ సీజన్ ను ప్రతిఫలిస్తూ జెర్సీపై 15వ నంబర్ వేశారు.[8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.