భారతదేశ నటి, హిందీ చిత్రాల్లో ప్రముఖంగా నటించింది. From Wikipedia, the free encyclopedia
బిపాషా బసు (జ. 1979 జనవరి 7) ఒక భారతీయ సినిమా నటి, మోడల్. ఈమె వివాహానంతరం బిపాషా బసు సింగ్ గ్రోవర్ గా పిలువబడుతోంది. [4] ఈమె ప్రధానంగా హిందీ సినిమాలలో నటించినా, తమిళ, తెలుగు, బెంగాలీ, ఇంగ్లీషు సినిమాలలో కూడా నటించింది. ఈమె భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఈమె అనేక పురస్కారాలను పొందింది. ఈమెను మీడియా తరచుగా సెక్స్ సింబల్‌గా అభివర్ణిస్తూ ఉంటుంది.
ఢిల్లీలో పుట్టి కోల్‌కతాలో పెరిగిన బిపాషా 1996లో గోద్రేజ్ సింథాల్ సూపర్ మోడల్ కాంటెస్ట్‌లో గెలుపొంది తరువాత ఫ్యాషన్ మోడల్‌గా వృత్తిని విజయవంతంగా కొనసాగించింది. దానితో ఈమెకు సినిమా అవకాశాలు రావడం మొదలయ్యింది. ఈమె 2001లో "అజ్నబీ అనే థ్రిల్లర్ సినిమాలో ఒక ప్రతికూల పాత్రతో సినిమారంగంలో అడుగు పెట్టింది. ఆ పాత్ర ఈమెకు ఉత్తమ నటి (మొదటి సినిమా) విభాగంలో ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఈమె ప్రధాన పాత్ర "రాజ్" అనే హారర్ సినిమాలో తొలిసారి నటించింది. తరువాత ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. "జిస్మ్", "కార్పొరేట్", "నో ఎంట్రీ", "ఫిర్ హేరాఫేరీ", "ఆల్ ద బెస్ట్: ఫన్ బిగిన్స్", ధూం -2, "రేస్", "రాజ్-3D", "బచ్నా ఏ హసీనో", "ఆత్మ", "క్రియేచర్ -3D", "అలోన్" వంటి అనేక సినిమాలలో ఈమె తన నటనను ప్రదర్శించింది. అనేక సినిమాలలో ఐటం సాంగ్స్‌లో నటించింది.
బిపాషా బసు 1979, జనవరి 7న ఒక బెంగాలీ కుటుంబంలో ఢిల్లీలో జన్మించింది. ఈమె తండ్రి హీరక్ బసు ఒక సివిల్ ఇంజనీరు. తల్లి మమత గృహిణి. ఈమెకు బిదిషా బసు అనే అన్నయ్య, విజేత బసు అనే చెల్లెలు ఉన్నారు. ఢిల్లీలో ఈమె నెహ్రూప్లేస్‌లో 8వ యేడు వచ్చేవరకు నివసించింది. అక్కడ ఏపిజె ఉన్నత పాఠశాలలో చదివింది. [5] ఆమె కుటుంబం తరువాత కోల్‌కతాకు మారింది. అక్కడ ఈమె భవన్స్ విద్యామందిర్‌లో చదివింది.[6] పాఠశాలలో ఈమె లీడర్‌గా ఎన్నికై 'లేడీ గుండా'గా పేరు తెచ్చుకుంది.[7] ఈమె 12వ తరగతి వరకు సైన్స్ ప్రధాన అంశంగా చదివింది. తరువాత కామర్స్ సబ్జెక్టుకు మారింది.
ఈమెను మాజీ మిస్ ఇండియా మెహర్ జెసియా 1996లో కోల్‌కాతాలోని ఒక హోటల్ లో చూసి మాడలింగ్ చేపట్టమని సలహా ఇచ్చింది.[8]ఆ ఏడాది ఈమె ఫోర్డ్ కంపెనీ నిర్వహించిన గోద్రెజ్ సింథాల్ సూపర్ మోడల్ పోటీలో విజయం పొంది, భారతదేశం తరఫున మయామిలో జరిగిన "ఫోర్డ్ మోడల్స్ సూపర్ మోడల్ ఆఫ్ ద వరల్డ్" పోటీలో పాల్గొనింది.[9][10]
ఈమె పాల్గొన్న గోద్రేజ్ సింథాల్ సూపర్ మోడల్ కాంటెస్ట్ న్యాయనిర్ణేతలలో ఒకరైన వినోద్ ఖన్నా తన కుమారుడు అక్షయ్ ఖన్నా సరసన "హిమాలయ్ పుత్ర" సినిమాలో నటించడానికి ఈమెను ఆహ్వానించాడు. అయితే వయసు తక్కువగా ఉందనే కారణంతో ఈమె ఆ పాత్రను తిరస్కరించింది. దానితో ఆ పాత్ర అంజలా జవేరీకి దక్కింది. తరువాత జయాబచ్చన్ తన కుమారుడు అభిషేక్ బచ్చన్ జె.పి.దత్తా దర్శకత్వంలో నటిస్తున్న "ఆఖరీ ముఘల్" అనే సినిమాలో నటింపజేయడానికి బిపాషాను ఒప్పించింది. [11] అయితే దత్తా మరో స్క్రిప్టుతో అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్లతో రెఫ్యుజీ అనే సినిమా నిర్మాణం చేపట్టడంతో ఆఖరీ ముఘల్ సినిమా రద్దయింది.[12] రెఫ్యుజీ చిత్రంలో సునీల్ శెట్టి సరసన నటించడానికి ఈమెను సంప్రదించారు కానీ ఈమె తిరస్కరించింది.[8]
చివరకు 2001లో అక్షయ్ కుమార్ హీరోగా అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో వెలువడిన "అజ్నబీ" అనే సినిమాతో సినిమారంగంలో అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఈమె నటించిన దుష్టపాత్రకు విమర్శకులనుండి ప్రశంసలతో పాటు ఫిలింఫేర్ ఉత్తమ నూతననటి అవార్డు లభించింది.[8]
2002లో రాజ్ సినిమాతో ఈమెకు ప్రధాన పాత్రలు లభించడం మొదలయ్యింది.[13]
ఈమె జాన్ అబ్రహాం, బాబీ డియోల్, మహేష్ బాబు, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్, పరేష్ రావెల్, కరణ్ సింగ్ గ్రోవర్ వంటి నటుల సరసన నటించింది. విక్రం భట్, సంజయ్ గద్వీ, డేవిడ్ ధావన్, రామ్ గోపాల్ వర్మ, జయంత్ సి పరాన్జీ, కె. విజయ భాస్కర్, అమిత్ సక్సేనా, రోహిత్ శెట్టి, మహేష్ మంజ్రేకర్, విశాల్ భరద్వాజ్, ఆదిత్య చోప్రా, ఋతుపర్ణ ఘోష్, భూషణ్ పటేల్ వంటి దర్శకుల సినిమాలలో నటించింది. ఈమె చిత్రపరిశ్రమలో 15 సంవత్సారాలకు పైగా నిలదొక్కుకున్న అతికొద్ది మంది నటీమణులలో ఒకరు.
ఈమె సినిమాలలో నటించడంతో పాటు 2010 నుండి "లవ్ యువర్ సెల్ఫ్", "బ్రేక్ ఫ్రీ", "అన్లీష్" అనే ఫిట్నెస్ డివిడిలను విడుదల చేసింది. వీటిలో శారీరక దృఢత్వం, ఆరోగ్యం, బరువు తగ్గుదల మొదలైన అంశాలపై శిక్షణ ఇచ్చింది.
బిపాషా "రాజ్" సినిమాలో తన జోడీ అయిన డినో మోరియాతో 1996 నుండి సంబంధాలను నెరిపింది. 2002లో వారిద్దరూ విడిపోయారు. తరువాత "జిస్మ్" సినిమా నిర్మాణ సమయంలో సహ నటుడు జాన్ అబ్రహాంతో డేటింగ్ ప్రారంభించింది. 2011 ఆరంభం వరకూ వీరిద్దరి మధ్యా సంబంధాలు కొనసాగాయి.[14][15][16] మీడియా ఈ జంటను "సూపర్ కపుల్"గా అభివర్ణించింది.[17]
2014లో ఈమె నటుడు హర్మన్ బవేజాతో సంబంధమున్నట్లు అంగీకరించింది.[18] అదే యేడాది డిసెంబరులో తాము విడిపోయినట్లు ప్రకటించింది.[19] 2015లో "అలోన్" సినిమా సహనటుడైన కరణ్ సింగ్ గ్రోవర్తో డేటింగ్ ప్రారంభించింది. వారిద్దరూ 2016 ఏప్రిల్ 30వ తేదీన వివాహం చేసుకున్నారు.[20]
విడుదలైన సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాష | వివరణ |
---|---|---|---|---|
2001 | అజ్నబీ | సోనియా బజాజ్/నీతా | హిందీ | తొలి సినిమా |
2002 | టక్కరి దొంగ | పనస | తెలుగు | |
2002 | రాజ్ | సంజనా భరద్వాజ్ | హిందీ | హీరోయిన్గా మొదటి సినిమా |
2002 | ఆంఖేఁ | రైనా | హిందీ | ప్రత్యేక పాత్ర |
2002 | మేరే యార్ కీ షాదీ హై | రియా | హిందీ | |
2002 | చోర్ మచాయే షోర్ | రంజిత | హిందీ | |
2002 | గునా | ప్రభా నారాయణ్ | హిందీ | |
2003 | తుఝే మేరీ కసమ్ | గిరిజ | హిందీ | ప్రత్యేక పాత్ర |
2003 | జిస్మ్ | సోనియా ఖన్నా | హిందీ | |
2003 | ఫుట్‌పాత్ | సంజనా శ్రీవాత్సవ్ | హిందీ | |
2003 | రూల్స్: ప్యార్ కా సూపర్‌హిట్ ఫార్ములా | బిపాషా బసు | హిందీ | |
2003 | జమీన్ | నందినీ రాయ్ | హిందీ | |
2004 | ఇష్క్ హై తుమ్ సే | ఖుష్బూ | హిందీ | సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం వహించిన సినిమా. |
2004 | ఎయిత్బార్ | రియా మల్హోత్రా | హిందీ | |
2004 | రుద్రాక్ష్ | గాయత్రి | హిందీ | |
2004 | రక్త్ | దృష్టీ నాయర్ | హిందీ | |
2004 | మధోషి | అనుపమా కౌల్ | హిందీ | |
2005 | చెహరా | మేఘ | హిందీ | |
2005 | సచిన్ | మంజు | తమిళం | |
2005 | విరుద్ధ్: ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ | - | హిందీ | ప్రత్యేక పాత్ర |
2005 | బర్సాత్ | అన్నా వీర్వాణి | హిందీ | |
2005 | నో ఎంట్రీ | బాబీ | హిందీ | |
2005 | అపహరణ్ | మేఘా బసు | హిందీ | |
2005 | శిఖర్ | నటాషా | హిందీ | |
2006 | హమ్ కో దీవానా కర్ గయే | సోనియా బెర్రీ | హిందీ | |
2006 | డర్నా జరూరీ హై | వర్ష | హిందీ | రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం. |
2006 | ఫిర్ హేరా ఫేరీ | అనూరాధ | హిందీ | |
2006 | అలగ్ | బిపాషా బసు | హిందీ | ప్రత్యేక పాత్ర |
2006 | కార్పొరేట్ | నిసిగంధ దాస్‌గుప్తా | హిందీ | |
2006 | ఓంకార | బిల్లో చమన్బహార్ | హిందీ | |
2006 | జానే హోగా క్యా | అదితి | హిందీ | |
2006 | ధూమ్-2 | సోనాలి బోస్/మోనాలి బోస్ | హిందీ | |
2007 | నెహ్లే పె దేహ్లా | పూజ | హిందీ | |
2007 | నో స్మోకింగ్ | - | హిందీ | |
2007 | ఓం శాంతి ఓం | బిపాషా బసు | హిందీ | |
2007 | గోల్ | రుమానా | హిందీ | |
2008 | రేస్ | సోనియా మార్టిన్ | హిందీ | |
2008 | బచ్నా ఏ హసీనో | రాధిక/శ్రేయ రాథోడ్ | హిందీ | |
2008 | రబ్ నే బనాదీ జోడీ | - | హిందీ | |
2009 | ఆ దేఖే జరా | సిమీ ఛటర్జీ | హిందీ | |
2009 | ఆల్ ద బెస్ట్: ఫన్ బిగిన్స్ | జాన్వీ చోప్రా | హిందీ | |
2009 | షొబ్ చరిత్రోం కాల్పొనిక్ | రాధికా మిత్ర | బెంగాలీ | |
2010 | పంఖ్ | నందిని | హిందీ | |
2010 | లమ్హా | అజీజా | హిందీ | |
2010 | ఆక్రోష్ | గీత | హిందీ | |
2011 | దమ్ మారో దమ్ | జోయీ మెండోంకా | హిందీ | |
2012 | ప్లేయర్స్ | రియాథాపర్ | హిందీ | |
2012 | జోడీ బ్రేకర్స్ | సోనాలీ అగ్నిహోత్రి | హిందీ | |
2012 | రాజ్-3D | శయన శేఖర్ | హిందీ | |
2013 | రేస్ - 2 | సోనియా మార్టిన్ | హిందీ | |
2013 | ఆత్మ | మాయా వర్మ | హిందీ | |
2013 | ది లవర్స్ | తులజ నాయక్ | ఇంగ్లీషు | |
2014 | హం షకల్స్ | మిస్తీ | హిందీ | |
2014 | క్రియేచర్-3D | ఆహనా దత్ | హిందీ | |
2015 | అలోన్ | సంజన/అంజన | హిందీ |
బిపాషా బసు తన 17 యేళ్ల సినిమా అనుభవంలో ఎన్నో అవార్డులను గెలుపొందింది. మొత్తం 31 అవార్డులను కైవసం చేసుకోగా మరో 46 సందర్భాలలో ఈమె పేరు అవార్డు కొరకు ప్రతిపాదించబడింది.
ఈమె గెలుచుకున్న అవార్డులలో కొన్ని ముఖ్యమైనవి:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.