భారతదేశ ప్రధానమంత్రి
From Wikipedia, the free encyclopedia
భారత ప్రధానమంత్రి, భారత ప్రభుత్వ అధినేత.[2][3] ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన స్థానం. పదవి రీత్యా రాష్ట్రపతి స్థానం దీనికంటే ఉన్నతమైనదైనా, రాష్ట్రపతి అధికారాలు కేవలం నామమాత్రం కాగా, వాస్తవంలో అధికారాలన్నీ ప్రధానమంత్రి, మంత్రి వర్గం వద్దే కేంద్రీకృతమై ఉంటాయి.[4][5] లోక్సభలో మెజారిటీ ఉన్న పార్టీ లేదా కూటమి నాయకుడే సాధారణంగా ప్రధానమంత్రి అవుతారు.[6]
త్వరిత వాస్తవాలు భారత ప్రధానమంత్రి, విధం ...
భారత ప్రధానమంత్రి | |
---|---|
ప్రధానమంత్రి కార్యాలయం | |
విధం |
|
రకం | ప్రభుత్వాధినేత |
స్థితి | కార్యనిర్వాహక నేత |
Abbreviation | PM |
సభ్యుడు | |
రిపోర్టు టు | |
అధికారిక నివాసం | 7, లోక్ కళ్యాణ్ మార్గ్, న్యూ ఢిల్లీ |
స్థానం | Prime Minister's Office, South Block, Central Secretariat, Raisina Hill, New Delhi, Delhi, India |
Nominator | లోక్సభ సభ్యులు |
నియామకం | భారత రాష్ట్రపతి by convention, based on appointee's ability to command confidence in the Lok Sabha |
కాలవ్యవధి | At the pleasure of the President Lok Sabha term is 5 years unless dissolved sooner No term limits specified |
స్థిరమైన పరికరం | Articles 74 & 75, Constitution of India |
అగ్రగామి | Vice President of the Executive Council |
నిర్మాణం | 15 ఆగస్టు 1947; 76 సంవత్సరాల క్రితం (1947-08-15) |
మొదట చేపట్టినవ్యక్తి | జవాహర్లాల్ నెహ్రూ |
ఉప | ఉప ప్రధాని |
జీతం |
మూసివేయి
భారత్ అనుసరిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి లో లోక్సభలో అత్యధిక బలం కలిగిన రాజకీయ పక్షానికి గాని, కూటమికి గాని నాయకుడై, సభలో మెజారిటీ పొందగలిగి ఉండాలి. ప్రధాన మంత్రి లోక్సభ లోగాని, రాజ్యసభ లోగాని సభ్యుడై ఉండాలి, లేదా ప్రధానమంత్రిగా నియమితుడైన ఆరు నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి. ప్రధానమంత్రి, తన మంత్రివర్గంతో సహా అన్నివేళలా లోక్సభకు జవాబుదారీగా ఉంటారు.[7][8]