పడుకున్న భంగిమలో ఉన్న బుద్ధుడు బౌద్ధమత కళలో చాలా ప్రాముఖ్యత ఉన్న ఆకృతి. ఈ ఆకృతిలో బుద్ధుడు నిద్రపోతున్నట్టు భూమికి వాలి, ఒక పక్కకు తిరిగి పడుకున్నట్టు ఉంటుంది. ఇది బుద్ధుని జీవితంలోని ఆఖరి రోజుల్లో ఆరోగ్యం విషమించినప్పుడు శరీరం వదిలివేసే(మహాపరినిర్వాణం) అవస్థకు ముందున్న పరిస్థితిని చూపిస్తుంది.[1] ఈ ఆకృతిలో బుద్ధుడు తన కుడివైపుకి తిరిగి, కుడి చేతిని తల కింద ఆధారంగా చేసుకొని పడుకుని ఉంటాడు. బుద్ధుడి మరణం తరువాత, అతని అనుచరులు బుద్ధుడు శయనావస్థలో ఉన్న విగ్రహాన్ని రూపొందించాలని అనుకున్నారు.మొదటగా అలాంటి విగ్రహాన్ని వాట్ ఫొ లో తయారు చేసి, కాలక్రమేణా ఆగ్నేయ ఆసియాలోని అన్ని ప్రాంతాలలో ఈ భంగిమలో విగ్రహాలు ప్రతిష్ఠించడం ఒక పోకడగా మారింది.
థాయి బౌద్ధ చిత్రకళలో పడుకున్న భంగిమలో ఉన్న బుద్ధుడు, బుద్ధుని జీవితానికి సంబంధించిన మూడు ఘట్టాలను గురించి అయి ఉండవచ్చు.
నిర్వాణ స్థితి (ปางปรินิพพาน; పాంగ్ పరి నిప్ఫన్)
అసురుడైన రాహుకు బోధ చేస్తున్న స్థితి (ปางโปรดอสุรินทราหู; పాంగ్ ప్రోడ్ అసురిన్ త్రా రాహు)