నటరాజస్వామి ఆలయం (చిదంబరం)
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
చిదంబరం దేవాలయం (తమిళం: சிதம்பரம் கோயில்) పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయం. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు యొక్క మధ్యస్థ తూర్పు భాగంలోని, కడలూర్ జిల్లాలోని కారైకల్ కి ఉత్తరంగా 60 కిలో మీటర్ల దూరంలో,, పాండిచ్చేరికి దక్షిణంగా 78 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆలయనగరమైన చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది. తమిళ సంగం సాహిత్య రచనల ప్రకారం, సనాతన విశ్వకర్మ ల యొక్క వంశస్థుడైన విదువేల్విడుగు పెరుమ్తకన్, ఈ ఆలయం యొక్క పునః సృష్టికి ప్రధాన రూపశిల్పి. ప్రాచీన, పూర్వ-మధ్యస్థ కాలంలో, ప్రత్యేకించి పల్లవ, చోళ రాజుల కాలంలో, ఈ ఆలయంలో పలు నూతన రూపకల్పనలు జరిగాయి.[1]
చిదంబరం ఆలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 11°23′58″N 79°41′36″E |
పేరు | |
ప్రధాన పేరు : | చిదంబరం తిల్లై నటరాజర్-కూతన్ కోయిల్ |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | కుడలోర్ జిల్లా |
ప్రదేశం: | చిదంబరం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | నటరాజు (తిల్లై కూతన్ - శివుడు) |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ నిర్మాణశైలి |
హిందూమత సాహిత్యం ప్రకారం, చిదంబరం అనేది శివుని ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచ భూతాలకి ఒక్కొక్క ఆలయం నిర్మించబడంది. చిదంబరం ఆకాశతత్త్వానికీ, తిరువనైకవల్ జంబుకేశ్వర జలతత్త్వానికీ, కంచి ఏకాంబరేశ్వర భూమితత్త్వానికీ, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర అగ్నితత్త్వానికీ, శ్రీకాళహస్తీశ్వర స్వామి వాయుతత్త్వానికీ నిదర్శనాలు.
ఈ ఆలయాల సముదాయం నగరం నడిబొడ్డున వ్యాపించి ఉంది. ఇది 40 ఎకరాల విస్తీర్ణం కలిగి యుంది. శైవుల, వైష్ణవుల యొక్క దేవతలు కొలువున్న అతికొద్ది దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. నటరాజు అయిన శివుడుకి, గోవిందరాజ పెరుమాళ్ళుకి అంకితమైన ప్రాచీన, చారిత్రాత్మక దేవాలయం ఇది. ఏ విధంగా కోవెల (గుడి) అంటే వైష్ణవులకు, శ్రీరంగం లేదా తిరువరంగం స్మరణకి వస్తుందో అదే విధంగా శైవులకి చిదంబర ఆలయమే స్మరణకి వస్తుంది.
చిదంబరం అను పదం, "చైతన్యం" అని అర్ధం వచ్చిన చిత్,, "ఆకాశం" (ఆకాయం నుంచి పుట్టిన) అని అర్ధం వచ్చిన అంబరం; సూచించిన చిదాకశం, చైతన్యం ఆరోపించబడినట్టి ఆకాశం, దీనినే అన్ని వేదాలు, శాసనాల ప్రకారం, మానవుడు చేరుకోవలసిన అంతిమ లక్ష్యంగా చెప్పబడింది.
మరొక సిద్ధాంతం ఏమనగా, ఇది చిత్ + అంబళం నుంచి పుట్టినది. అంబళం అనగా కళలను ప్రదర్శించుట కొరకు ఒక "వేదిక". చిదాకశం అనేది పరమేశ్వరుని యొక్క చిద్విలాసం లేదా ఆనందం, నటరాజుని చిద్విలాసం లేదా ఆనంద నటన యొక్క చిహ్నాత్మక వర్ణన. చిదంబరాన్ని దర్శిస్తే విముక్తి లభిస్తుందని శైవులు నమ్ముతారు.
ఇంకా మరొక సిద్ధాంతం ప్రకారం, "ఆట లేక దైవ నృత్యం" అని అర్ధం వచ్చే చితు, "వేదిక" అని అర్ధం వచ్చే అంబళం నుంచి వచ్చిన చిత్రాంబళం నుంచి ఈ పదం పుట్టినది.
సర్వాలంకృతభూషితుడైన నటరాజుని చిత్రం, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. పరమ శివుడు, భరతనాట్య నృత్యం యొక్క దైవంగా వర్ణించినది, శివుడికి శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా మనుష్య రూపాన్ని ఆరోపించిన మూర్తితో శివుడిని నెలకొల్పిన అతికొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి. పరమ శివుడు నిలుపునట్టి ఈ విశ్వం యొక్క కదలికలు, నటరాజు యొక్క జగత్సంబంధమైన నృత్యాన్ని పోలి ఉంటుంది. ఆలయంలో ఐదు ఆవరణలు ఉన్నాయి.
అరగాలూరు ఉదయ ఇరరతెవన్ పొంపరప్పినన్ (అలియాస్ వనకోవరైయన్) సా.శ..1213 లో చిదంబరం లోని శివుని ఆలయాన్ని పునర్నిర్మించాడు. అదే బాణ సామ్రాజ్య ప్రముఖుడు తిరువన్నమలై ఆలయాన్ని కూడా నిర్మించాడు.
ఈ ఆలయాన్ని సనాతనంగా నడిపిస్తున్న దిక్షితార్ అని పిలువబడే, అంతర్వివాహీకులైన శైవ బ్రాహ్మణులు, అధికారిక పురోహితులు కూడా.
దీక్షితార్లకి, తమిళనాడు ప్రభుత్వానికీ మధ్య జరిగిన దీర్ఘకాలిక యుద్ధానికి ఇది చరమాంకం. ప్రభుత్వం దీక్షితార్లు కానివారిని తేవరం స్తోత్రాలను దేవుని యొక్క 'గర్భగుడి'లో (సంస్కృతం: గర్భగ్రిహ) గానం చేయుటకు అనుమతించినప్పుడు, దీక్షితులు, వారికి మాత్రమే నటరాజుని గర్భగుడిలో పూజించే హక్కు కలదని తెలియజెప్పి అభ్యంతరం చెప్పుటతో మొదలైనది.
చిదంబర కథ పరమశివుడు తిల్లైవన సంచారంతో మొదలౌతుంది, (వనం అనగా అర్ధం అడవి, తిల్లై వృక్షాలు - వృక్షశాస్త్ర నామం ఎక్సోకేరియా అగాల్లోచ, ఒక ప్రత్యేకమైన నీటి చెట్టు- ఇది ప్రస్తుతం చిదంబరం దగ్గరలోని పిఛావరం నీటిచలమల్లో పెరుగుతోంది. ఆలయ చెక్కడాలు తిల్లై వృక్షాలు క్రీశ 2వ శతాబ్దంలోనివిగా వర్ణిస్తాయి).
తిల్లై వనాలలో కొంతమంది మునులు లేదా 'ఋషులు' నివసించేవారు, వారు మంత్రశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను నమ్మారు, భగవంతుడిని కొన్ని క్రతువులు, 'మంత్రాల'తో నియంత్రించవచ్చని భావించారు. దేవుడు, 'పిచ్చతనాదర్' రూపంలో, ఒక సాధారణ యాచకుడివలే, ఎంతో అందమైన, ప్రకాశవంతమైన అడవిలో సంచరిస్తాడు. అతనిని మోహిని అవతారంలోనున్న అతని సహవాసియైన విష్ణువు అనుసరిస్తాడు. ఋషులు, వారి భార్యలు, ఎంతో ప్రకాశవంతమైన ఈ యాచకుడు, అందమైన ఆతని సహవాసిని చూసి ముగ్ధులౌతారు.
ఆనందభరితులైన వారి యొక్క ఆడవారిని చూసి, ఋషులు ఆగ్రహిస్తారు, మంత్రాలతో కూడిన క్రతువులను ఆచరించి అసంఖ్యాకమైన 'సర్పాల'ను (సంస్కృతం: నాగ) ఆమంత్రిస్తారు. యాచకుడైన ఆ భగవంతుడు సర్పాలను ఎత్తి వాటిని మెడకు, నడుముకి దట్టంగా చుట్టుకొని ఆభరణములవలె ధరిస్తాడు. మరింత ఆగ్రహించిన ఋషులు, ఒక భయానకమైన పులిని ఆమంత్రించగా, దాన్ని కూడా శివుడు చీల్చి, ఆ పులి చర్మాన్ని నడుము చుట్టూ శాలువా వలె ధరిస్తాడు.
పూర్తిగా విసుగు చెందిన ఋషులు, వారి యొక్క ఆధ్యాత్మిక శక్తిని మొత్తం కూడదీసుకొని, ఒక శక్తివంతమైన రాక్షసుడు ముయాలకన్ - అను, అజ్ఞానానికి, గర్వానికి చిహ్నమైన ఒక శక్తివంతమైన రాక్షసుడిని ఆమంత్రిస్తారు. పరమ శివుడు ఒక చిరునవ్వుతో, రాక్షసుడి యొక్క వెన్ను మీద కాలు మోపి, కదలకుండా చేసి ఆనంద తాండవం (ఆద్యంతరహితమైన చిద్విలాస నృత్యం) చేస్తాడు, ఆతని నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. భగవంతుడు వాస్తవమని, అతను మంత్రాలకు, ఆగమ సంబంధమైన క్రతువులకు అతీతుడని గ్రహించి, ఋషులు లొంగిపోతారు.
పరమ శివుని యొక్క ఆనంద తాండవ భంగిమ, యావత్ ప్రపంచంలో ప్రసిద్ధమైన భంగిమలలో ఒకటిగా, అనేకులు (ఇతర మతస్థులు కూడా హిందూ మతానికి చెందిన దీన్ని కొనియాడి) గుర్తించారు. ఈ దివ్య నృత్య భంగిమ భరతనాట్య నర్తకుడు ఎలా నర్తించాలో తెలియజేస్తుంది.
ఇట్టి ప్రధాన సంగతులను నటరాజ మూర్తి, దివ్యమైన నృత్య భంగిమ వర్ణిస్తాయి. ఇక్కడి నుంచి 32కిమీ దూరంలోని మేలకదంబూర్ ఆలయంలో తాండవ భంగిమ యొక్క అరుదైన రకం అగుపడుతుంది. ఈ కోవెలలో, నటరాజు దున్నపోతు మీద నర్తిస్తున్నట్టు, గుండ్రంగా తిరుగుచూ చేయు నృత్యభాగం ఈ పుణ్య స్థానంలో ఉంచబడిన ఒక పాలా కళగా గుర్తించడమైనది.
ఆదిశేషువు అనే సర్పం, తల్పం వలె మారి విష్ణువుగా సాక్షాత్కరించిన భగవంతుని సేవిస్తుండగా, ఆనంద తాండవం గురించి విని దానిని చూసి తరించవలెనని ఉత్సాహపడతాడు. అంతట భగవంతుడు ఆదిశేషువుని దీవించి, అతనికి యోగ స్వరూపుడైన 'పతంజలి' రూపాన్ని ప్రసాదించి తిల్లై అడవులకి వెడలి పొమ్మని, అతను అచిరకాలంలోనే నృత్యంలో విన్యాసాలు చేయగలడని చెబుతాడు.
కృత యుగంలో పతంజలి హిమాలయాల్లో తపస్సు చేసి మరొక ముని వ్యాఘ్రపథార్ / పులికాల్ముని ని కలుస్తాడు (వ్యాఘ్ర / పులి అనగా అర్ధం "పులి", పథ / కాల్ అనగా అర్ధం "పాదం" – అతను దేవుని పూజకు తెచ్చు పూల మీద తుమ్మెదలు వ్రాలుటకు ముందే అనగా వేకువ జాములో చెట్లను ఎక్కి కోయుటకు వీలుగా అతనికి అట్టి పాదాలు, పులి యొక్క కంటిచూపు మాదిరి చూపు వచ్చెనని తెలియజేయు కథ ద్వారా ఆ పేరు అతనికి వచ్చినది). పతంజలి యోగి, అతని యొక్క ఉత్తమ శిష్యుడైన ఉపమన్యు యోగి యొక్క కథలు విష్ణు పురాణం అదే విధంగా శివ పురాణంలో కూడా వర్ణించబడ్డాయి. వారు తిల్లై వనంలోకి వెళ్లి ప్రార్థించిన శివలింగ రూపంలోని పరమశివుడు, ప్రస్తుతం పూజిస్తున్న తిరుమూలాటనేస్వరర్ లోని దేవుడు ఒక్కడే (తిరు - శ్రీ, మూలటనం - స్వయంభువుడైన, ఈశ్వరర్ - ఈశ్వరుడు). పరమ శివుడు, నటరాజుగా అతని యొక్క చిద్విలాస నృత్యాన్ని (ఆనంద తాండవం) ఈ ఇద్దరు మునులకు పూసం నక్షత్రం ఉన్న రోజున, తమిళ మాసం తాయ్ (జనవరి – ఫెబ్రవరి) లో ప్రదర్శించాడని పురాణాలు చెబుతాయి.
చిదంబరాన్ని వివిధ రచనలలో, తిల్లై (గతంలో తిల్లైవనంలో ఇప్పుడున్న దేవాలయం నెలకొన్నది), పెరుంపత్రపులియుర్ లేదా వ్యాఘ్రపురం (వ్యాఘ్రపథార్ ముని జ్ఞాపకార్ధం) అని కూడా సూచించడమైనది.
ఆలయం, విశ్వం యొక్క హృదయ కమలంలో నెలకొల్పారని భావించడమైనది": విరాట్ హృదయ పద్మ స్థలం . దైవం యొక్క చిద్విలాస నృత్యం, ఆనంద తాండవం ప్రదర్శించిన స్థలం - "తిరుమూలాటనేస్వర్ ఆలయా"నికి సరిగ్గా దక్షిణంలో ఉన్నది, ప్రస్తుతం ఆ స్థలం పొన్నాంబలం / పోర్సాబై (పొన్ అనగా అర్ధం బంగారం, అంబళం /సబై అనగా అర్ధం వేదిక)లో పరమశివుడు నర్తిస్తున్న రూపం ఉన్నది. అందువలన భగవంతుడిని సభనాయకార్ అనగా వేదిక పై వెలసిన దైవం అని కూడా అంటారు.
చిదంబర ఆలయం యొక్క బంగారపు పై కప్పు కలిగిన గర్భ గుడిలో దైవం మూడు రూపాలలో సాక్షాత్కరిస్తాడు:
పంచభూతాల స్థలాలలో ఒకటైన చిదంబరంలో, ఆకాశం లేదా ఆగయంగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు ("పంచ" అనగా అర్ధం ఐదు, భూత అనగా అర్ధం మూలకం: భూమి, నీరు, నిప్పు, గాలి,, అంతరాళం, "స్థల" అనగా ప్రదేశం).
మిగతావి ఏవనగా:
చిదంబరం అనేది కూడా పరమ శివుడు నర్తించిన ఐదు ప్రదేశాలలో ఒకటి, అన్ని ప్రదేశాలలో వేదికలు/ సభైలు ఉన్నాయి. పోర్ సభై కలిగి ఉన్న చిదంబరం కాక, మిగతావి ఏవనగా, తిరువాలన్గాడులోని రతిన సభై (రతినం అనగా – రత్నం/ఎరుపు), కోర్తళ్ళంలోని చిత్ర సభై (చిత్ర – ఛాయా చిత్రం), మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలోని రజత సభై లేదా వెల్లి అంబళం (రజత / వెల్లి – వెండి), తిరునెల్వేలి నెల్లైఅప్పార్ ఆలయంలోని తామిర సభై (తామిరం – రాగి).
తిల్లై ఆలయ అర్చకులకు తన ఆదరణని చూపి, దైవసమానుడైనట్టి సుందరర్ తిరుతొందర్ తోగై లోకి (పరమశివుని యొక్క 63 భక్తుల చిట్టా) స్థానం సంపాదించాడు. తిల్లైలోని అర్చకుల యొక్క భక్తులకు, నేను భక్తుడను .
నలుగురు పుణ్యాత్ములైన కవులు - తిరుజ్ఞాన సంబంతార్, తిరునావుక్కరసర్, సుందరమూర్తి నయనార్,, మణిక్కవసాగర్ వంటి కవుల యొక్క కవిత్వంతో ఆలయం, స్వామి కూడా అమరత్వం పొందారు. మొదటి ముగ్గురి నుంచి సేకరించబడిన రచనలను తరచుగా దేవారా లు అని పిలుస్తారు కానీ ఇది తప్పు. కేవలం అప్పార్ (తిరునావుక్కరసర్) యొక్క గానాలను దేవారం అని అంటారు. సంబంతార్ యొక్క గానాలను తిరుకడైకప్పు అని అంటారు. సుందరర్ యొక్క గానాలను తిరుపాటు అని అంటారు.
తిరుజ్ఞాన సంబంతార్ చిదంబరంలోని స్వామిని కీర్తిస్తూ 2 గేయాలను రచించాడు, నటరాజస్వామిని కీర్తిస్తూ తిరునావుక్కరసర్ అకా అప్పార్ 8 తేవరాలు,, నటరాజస్వామిని కీర్తిస్తూ సుందరర్ ఒక గేయం రచించారు.
మణిక్కవసాగర్ రచించిన రెండు రచనలలో, మొదటిది తిరువాసకం (పవిత్ర ఉచ్చ్హారణలు) ని చిదంబరంలో ఎక్కువగా గానం చేయగా, రెండవది తిరుచిత్రంబలక్కోవైయర్ (అకా తిరుకోవైయర్), మొత్తం చిదంబరంలోనే గానం చేశారు. మణిక్కవసాగర్, చిదంబరంలోనే మోక్షం పొందాడని చెబుతారు.
మొదటి ముగ్గురి యొక్క రచనలు, ఆలయంలోని తాళపత్రాలలో భద్ర పరచారు, వాటిని శ్రీ రాజరాజ చోళునిగా ఖ్యాతికెక్కిన చోళ రాజు అరున్మోజ్హివర్మన్, నంబియన్దార్నంబి ఆధ్వర్యంలో స్వాధీనపరచుకున్నారు.
ఆలయానికి 9 ముఖద్వారాలు ఉండగా, వీటిలో నాలుగింటికి 7 స్థాయిలు కలిగిన ఎత్తైన పగోడాలు లేదా గోపురాలు తూర్పు, దక్షిణం, పడమర,, ఉత్తరంలో ఉన్నాయి. తూర్పు దిక్కునున్న గోపురానికి, భారతీయ నృత్యరూపమైన భరతనాట్యంలోని 108 భంగిమల (కర్ణముల ) యొక్క శిల్పాలు చెక్కబడి ఉంటాయి.
5 సభలు లేదా వేదికలు లేదా మందిరాలు ఉన్నాయి:
ఐదు సభై లలో లేని మిగతావి:
ఆలయ ప్రాంగణంలో అనేక చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి.
మూర్తి (విగ్రహం), స్థలం (ప్రదేశం), తీర్థం (జలం), ఆలయ పవిత్రతను సంతరించుకొని ఉంటాయి. చిదంబరం ఆలయంలో, చుట్టుపక్కలలో పలు జలాశయాలు ఉన్నాయి.
చిదంబరం ఆలయ ప్రాంగణంలో గోవిందరాజ పెరుమాళ్ స్వామి, ఆయన సతీమణి పుండరీగవల్లి తాయార్ విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఈ విగ్రహాన్ని 'తిల్లై తిరుచిత్రకూటం' అని అంటారు, ఇది 108 దివ్యదేశములు లేదా విష్ణువు యొక్క మూల విరాట్టులలో ఒకటి అని చెబుతారు, ఈ విగ్రహ ప్రతిష్ఠలను (మంగళ శాసనం) స్తోత్ర (నాలాయిర దివ్య ప్రబంధం) గానం చేస్తూ విష్ణువు యొక్క ప్రధాన ఉపాసకులు ( ఆళ్వారుల) చేస్తారు. తిల్లై చిత్రకూటాన్ని (ప్రస్తుతం గోవిందరాజ ఆలయంలో లేనిది) కులశేఖర ఆళ్వార్, తిరుమంగై మన్నన్ ఆళ్వార్ గానం చేశారు. ఇద్దరు ఆళ్వార్లు నమోదు చేసిన విషయప్రతిలో చిదంబర బ్రాహ్మణులు (దీక్షితార్లు) చిత్రకూటంలోని స్వామికి వేదానుసార, నిత్యపూజ (తమిళంలో "మురైయహ") లను ఆచరించేవారని తెలియజేశారు. అయితే, చాలా మంది యొక్క భావన ఏమనగా ఆళ్వార్లు సూచించిన చిత్రకూటం అనేది రాముడు, మహామునులైన విశ్వామిత్రుడు, అత్రి ఆశ్రమాల్లో గడిపిన కాలం నాటి UP లోనిదై ఉంటుందని భావించుట చేత, కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి. కానీ ఇవి నిరుపయోగమైన వాదన మాత్రమే, ఎందుకనగా అజ్హ్వార్ల మంగళ శాసనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, భౌగోళిక స్థానాన్ని ఆధారం చేసుకొని ఒక క్రమంలోనున్న విగ్రహాలను వెల్లడి చేస్తుంది అంటే మహాబలిపురం (మామళ్ళపురం), తిరువాయింద్రపురం (కద్దలూర్ దగ్గరున్నది), చిదంబరం (తిల్లై చిత్రకూటం) సీర్గాజ్హి (కాజ్హిచిరమ విన్నాగరం), తిరునంగుర్ మొదలైనవి. వైష్ణవుల చారిత్రాత్మక వాదన ప్రకారం ఈ ఆలయం ప్రథమతః శ్రీ గోవిందరాజ స్వామి యొక్క నిలయం అని అంటారు ఎందుకనగా పరమ శివుడు, ఆయన సతీమణితో కలసి శ్రీ గోవిందరాజ స్వామి వద్దకు వచ్చి వారిరువురి మధ్య జరిపిన నృత్య పోటీకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించమని వేడుకొన్నారు. శ్రీ గోవిందరాజస్వామి ఇందుకు అంగీకరించగా, వారిరువురి మధ్య జరిగిన నృత్య పోటీలో ఇద్దరూ సమవుజ్జీలుగా ఒకరి కొకరు తీసిపోకుండా నాట్యం చేస్తున్న సమయంలో, శివుడు, తాను గెలుచుటకు సలహా కొరకు శ్రీ గోవిందరాజస్వామిని సమీపించగా, శివుడిని కాలు ఎత్తి పెట్టి నిలిపి ఉంచుకొమ్మని ఉపాయం చెప్పాడు. కానీ నాట్య శాస్త్రం ప్రకారం ఈ భంగిమ స్త్రీలకు నిషేధించబడుట వలన పరమశివుడు చివరికి ఆ భంగిమలోనే నిలుచుట చేత పార్వతి తన యొక్క ఓటమిని అంగీకరిస్తుంది, అందు వలన ఆ ప్రదేశంలో పరమశివుడు ఆ నాట్య భంగిమలో కొలువై ఉన్నాడు. నాట్య వేదిక లేదా బహిరంగ ప్రదేశాన్ని సాధారణంగా అంబళం అని పిలుస్తారు. శ్రీ గోవిందరాజస్వామి న్యాయనిర్ణేతగా వ్యవహిరించడమే కాక పోటీకి సాక్షి కూడా. కానీ వీరశైవ రాజులైన కిరుమి కంద చోళుడు (2వ కులోతున్గన్ అని కూడా అంటారు) మున్నగువారు సాంస్కృతిక దాడి చేసిన తరువాత ఈ ప్రదేశం శైవుల పుణ్యక్షేత్రంగా మరింత ఖ్యాతికెక్కింది. దీక్షితులను బలవంతంగా శైవులుగా మార్పించారు (అప్పటి దాకా వైదిక వ్యవస్థను అనుసరిస్తున్న దీక్షితులు, శైవ ఆగమనాన్ని తెలుసుకోలేకపోయారు ఎందుకనగా శైవ ఆగమం వైదిక వ్యవస్థలో లేనిది, కానీ స్వతహాగా బ్రాహ్మణులు అగుట చేత, బ్రాహ్మణ ప్రతిపత్తిని వదులుకోకుండా భగవస్స్వరూపాన్ని మార్చుట చేత సరిపుచ్చుకున్నారు, అందుకని కేవలం దీక్షితుల వర్గం మాత్రమే శివాలయంలో వైదిక వ్యవస్థను అనుసరిస్తారు).
ఆలయ స్థాపత్యం (నిర్మాణశిల్పం), ఆవరణ యొక్క అమరిక జ్ఞాన సంబంధమైన భావాలతో సంపూర్ణమైనది.
తమిళనాడులోని ఆలయాలలోకెల్లా చిదంబరం ఆలయ రథం ఎంతో అందమైనది. ఏడాదిలో రెండు సార్లు నటరాజస్వామి ఊరేగే ఈ రథాన్ని, ఉత్సవాల సమయంలో వేలాది భక్తులు లాగుతారు.
ఆగమ సూత్రాల ప్రకారంగా సశాస్త్రీయమైన శివాలయానికి ఐదు ప్రాకారాలు ఉండి ఒకదానిని మరోకటికి కలుపుతూ గోడలు ఉంటాయి. అంతర్గతంగానున్న ప్రాకారం తప్ప వెలుపలి ప్రాకారాలు ఆకాశానికి బహిర్గతమవుతాయి. అంతర్గతంగా ఉన్నదానిలో మూల విగ్రహం, ఇతర విగ్రహాలు కొలువై ఉన్నాయి. చెక్క లేదా రాయితో చేయబడిన పెద్ద ధ్వజ స్తంభం సరిగ్గా మూల విరాట్టుకి అభిముఖంగా ఉంటుంది.
అంతర్గత ప్రాకారంలో గర్భగుడి (తమిళంలో కరువరై) నెలకొని ఉంది. అందులో పరమశివుడు కొలువై ఉన్నాడు.
శివాలయం యొక్క నిర్మాణం వెనుకనున్న ప్రతీకాత్మకత
చిదంబరం ఆలయం, దాని ప్రతీకాత్మకత
చిదంబరంతో పెనవేసుకుపోయిన పుణ్య పురుషుడైన తిరుమూలర్ పురాణాన్ని, అతని తిరుమంతిరంలో చెబుతాడు.
திருமந்திரம்
తెలుగులోకి అనువదిస్తే:
అర్ధం: "మానవ శరీరం యొక్క స్వరూపమే శివలింగం; అలాగే చిదంబరం; అలాగే సదాశివం; , అలాగే అతని దివ్య నృత్యం".
నటరాజ స్వామి ప్రతీకాత్మకత
చిదంబరంలో పూజించబడే పరమశివుడు నిరాకార స్వరూపుడై సాక్షాత్కారిస్తాడు. స్వామి తన సతీమణి శక్తి లేదా శివగామితో కలసి ఆద్యంతరహితమైన చిద్విలాసంతో "ఆనంద తాండవ" నృత్యాన్ని నిరంతరంగా చేస్తుంటాడు. ఈ ప్రదేశాన్ని కప్పి ఉంచే తెరని తొలగించగా వ్రేలాడదీసిన బంగారు 'బిల్వ' పత్రాల వరుసలు స్వామి యొక్క సమక్షాన్ని సూచిస్తూ కనబడతాయి. తెరకి బైట వైపు నల్లగా ఉండి (అజ్ఞానాన్ని సూచిస్తుంది), లోపలి వైపు ప్రకాశవంతమైన ఎరుపులో ఉండి (జ్ఞానాన్ని, ఆనందాన్ని సూచిస్తుంది).
రోజు వారీ క్రతువులలో, ఆ రోజు ప్రధాన పూజారి, తనని తాను భగవత్స్వరూపుడిగా - శివోహం భవ (శివ - దైవం, సంధి రూపంలో - శివో-, అహం – నేను /మనం, భావ - మనస్థితి), భావిస్తూ తెరని తొలగించుట, అజ్ఞానాన్ని పారద్రోలుటను, ప్రదేశాన్ని వెల్లడి చేస్తూ స్వామి సమక్షాన్ని సూచిస్తుంది.
చిదంబర రహస్యం అనగా, ఆ సమయంలో భగవంతుడికి పూర్తిగా లొంగి, ఆయనను మనలో లీనం చేసుకొని, అజ్ఞానాన్ని తొలగించుకొని, భగవంతుడి సమక్షాన్ని 'చూసి, అనుభవించి' అందువలన కలిగే బ్రాహ్మానందాన్ని పొందుతారు.
ఆలయం నిర్వహణ, పరిపాలన చేసేది చిదంబరం దీక్షితార్ అనువంశీయులు - వైదిక బ్రాహ్మణులలోని ఒక తరగతి వారు, ప్రముఖులు చెప్పినదాని ప్రకారం, ముఖ్యంగా చిదంబరం ఆలయం లోని రోజువారి ఆచార వ్యవహారాలకు, నిర్వహణ కొరకు, వారిని పుణ్య పురుషుడైన పతంజలి, కైలాస్ మఠం నుంచి ఇక్కడకు తీసుకు వచ్చారు.
దీక్షితార్ల సంఖ్య 3000 వుండవలసినది ( 2999 కచ్చితంగా, భగవంతునితో కలిపి మొత్తం 3000), వారిని తిల్లై మూవయరం అని పిలుస్తారు. ప్రస్తుతం వారి సంఖ్య సుమారు 360. పరమేశ్వరుని పూజించే విషయంలో ఈ దీక్షితార్లు వైదిక క్రతువులను పాటిస్తారు, శివచారియర్స్ లేదా ఆధిశైవర్స్ ఆగమ క్రతువులను పాటిస్తారు. ఆలయంలో పాటించే క్రతువులు వేదాల నుంచి తీసుకున్నారు, వాటిని ఏర్పరచినది పతంజలి, పరమేశ్వరుని, నటరాజ స్వామిగా ఆరాధించమని దీక్షితార్లను ఏర్పరచినది ఆయనే అని చెప్పబడుతుంది.
సాధారణంగా, వివాహం అయిన దీక్షితార్ల వంశములోని పురుషులకు, ఆలయంలోని క్రతువులను నిర్వహించే అవకాశం వరుసలో వస్తుంది, ఆరోజుకు వారే ప్రధాన అర్చకులు. వివాహమైన దీక్షితార్లకు ఆలయ ఆదాయంలో భాగం లభిస్తుంది. ఆలయానికి వున్న దరిదాపు 5,000 ఎకరాలు (20 కి.మీ2) సారవంతమైన భూమి మాన్యాన్ని, శతాబ్దాలుగా వివిధ రాజులు పోషిస్తూ వచ్చారు, ప్రస్తుతం మాన్యాన్ని, దాదాపుగా స్వంత వ్యక్తులే నిర్వహిస్తున్నారు.
ఆ రోజుకి ప్రధాన అర్చకుడుగా వున్న వ్యక్తి, తనను తాను పరిశుభ్రం చేసుకొనే క్రతువులను పాటించి, తనను తాను శివునికి అర్పించు కొంటున్నాను అనే భావంతో, ఆలయ ప్రవేశం చేసి, రోజువారి క్రతువులను చేయాలి. రోజు ప్రారంభంలో, స్వామి పాదుకలను పల్లియరై (లేదా శయన మందిరం) నుంచి ఉదయం 7 గంటలకు గర్భ గుడికి, భక్తుల మేళతాళాలతో పల్లకిలో తీసుకు వస్తారు. పూజారి రోజువారి క్రతువులను యజ్ఞంతో, 'గోవు పూజతో' (ఆవును, దూడతో సహా పూజించడం) ప్రారంభిస్తారు.
రోజుకి 6 సార్లు పూజ చేస్తారు. ప్రతి పూజకి ముందు, స్ఫటిక లింగం - 'ఆరు ఉరువ' లేదా పరమ శివుడి యొక్క అర్ధరూప స్థితికి నెయ్యి, పాలు, పెరుగు, బియ్యం, గంధం,, భస్మంతో అభిషేకిస్తారు. దీని తరువాత స్వామికి నైవేద్యం సమర్పించి, వేద మంత్రోచ్చారణల మధ్య, పంచపురాణం (పన్నీరు తిరుమురై అని పిలువబడే తమిళంలోని 12 రచనల నుంచి తీసిన 5 పద్యాలు) చదువుతూ, వివిధ రకాల అలంకారం చేసిన దీపాలతో, దీపారాధన చేస్తారు. పూజారి గర్భగుడి యొక్క తెరను లాగి చిదంబర రహస్యాన్ని వెల్లడి చేయుటతో పూజ ముగుస్తుంది.
2వ పూజకి ముందు, క్రమం తప్పకుండా చేసే స్పటిక లింగ అభిషేకం కాకుండా, రత్న నటరాజ విగ్రహానికి (రతినసభాపతి) కూడా అభిషేకం చేస్తారు. 3వ పూజ సుమారుగా 12.00 గంటలకు ఉండగా, దాని తరువాత ఆలయం మధ్యాహ్నం 4:30pm వరకు మూసి ఉంచుతారు. 4వ పూజ 6.00pm కి చేస్తారు, 5వ పూజ 8:00pm,, చివరి పూజ 10:00pm కి చేస్తారు, దాని తరువాత స్వామి యొక్క పాద రక్షలను ఆ రాత్రికి 'శయనించుటకు' ఊరేగింపుగా తీసుకు వెళతారు. రాత్రి చేసే 5వ పూజకి ముందు, పూజారి చిదంబర రహస్యంలోని యంత్రానికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించటం వంటి కొన్ని ప్రత్యేక క్రతువులను చేస్తాడు.
చిదంబరంలో, రోజులో చేసే చివరి పూజని అర్థజామ పూజ అని అంటారు, దీనిని అత్యంత భక్తిశ్రద్ధలతో చేస్తారు. రాత్రికి శయనించేటపుడు స్వామిలోకి విశ్వంలోని సమస్త దివ్య శక్తులు వచ్చి శయనిస్తాయని నమ్ముతారు.
ఈ ఆలయాన్ని తమిళనాడు ప్రభుత్వం T.N. HR & CE చట్టం యొక్క సెక్షన్ 45 క్రింద తన ఆధీనంలోకి తీసుకొంది. అయితే, పొదు దీక్షితార్లు దీనిని ప్రతిఘటించారు. మద్రాస్ హైకోర్టు 1951లో పొదు దీక్షితార్లను మతపరంగా ఒక వర్గమని గుర్తించింది. భారత రాజ్యాంగం యొక్క 26వ అధికరణం, T.N.HR & CE చట్టం యొక్క 107 సెక్షన్ ప్రకారం మతపరమైన వర్గాల యొక్క పాలనలోకి మధ్యవర్తిత్వం నిషేధించడమైనది కనుక ఈ వర్గానికి తమ పాలనను కొనసాగించే అర్హత ఉన్నదని విచారణలో తేలింది. ఈ వ్యాజ్యం ప్రస్తుతం (2010 ఏప్రిల్) సుప్రీం కోర్టు ముందర ఇంకా జరుగుతూ ఉంది. HR & CE కమీషనర్ నియమించిన కార్యనిర్వాహక అధికారికి బాధ్యతలను అప్పగించటానికి పొదు దీక్షితార్లు నిరాకరించారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలో కార్యనిర్వాహక అధికారి హుండీలను ఏర్పాటు చేసాడు. అతను ఎత్తైన ఆధునిక దీపాలను కూడా ఈ స్థలంలో ఏర్పాటు చేశాడు. అతను అర్చన టిక్కెట్లు, దర్శన టిక్కెట్లను ప్రవేశ పెట్టుటకు ఆలోచన చేస్తున్నాడు. ఇట్టి చర్యలు అన్నింటినీ పొదు దీక్షితార్లు, భక్తులు వ్యతిరేకిస్తున్నారు. అయితే, నిత్య క్రతువుల యొక్క నిర్వహణని ఇంకా దీక్షితార్లు కొనసాగిస్తున్నారు.
మానవులకు సంబంధించిన పూర్తి ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు. కేవలం ఒక రోజులో 6 పూజలు మాత్రమే గర్భగుడిలో చేస్తారు, సంవత్సరానికి ఒకసారి 6 అభిషేకాలు ప్రత్యేక రోజులలో ప్రధాన దేవతైన నటరాజ స్వామికి చేస్తారు. అవి మర్ఘజ్హి తిరువాధిరై (డిసెంబరు - జనవరి లో) మొదటి పూజని సూచిస్తుంది, నెలవంక తరువాత 14 వ రోజు (చతుర్దశి) మాసి నెలలో (ఫిబ్రవరి - మార్చి) రెండవ పూజను సూచిస్తుంది, చిట్టిరై తిరువోణం (ఏప్రిల్ - మే లో) మూడవ పూజను లేదా ఉచి కాలాన్ని సూచిస్తుంది, ఉతిరం అఫ్ ఆని (జూన్ - జూలై), ఆని తిరుమంజనం అని కూడా పిలువబడుతుంది, సాయంత్రాన్ని లేదా నాలుగవ పూజను సూచిస్తుంది, ఆవనిలో చతుర్దశి (ఆగస్టు - సెప్టెంబరు) ఐదవ పూజను సూచిస్తుంది, పురటసి నెలలోని చతుర్దశి (అక్టోబరు - నవంబరు) ఆరవ పూజ లేదా అర్తజమను సూచిస్తుంది.
వీటిలో మర్ఘజ్హి తిరువాధిరై (డిసెంబరు-జనవరి), ఆని తిరుమంజనం (జూన్ -జూలై) చాలా ముఖ్యమైనవి. వీటిని కీలక ఉత్సవంగా నిర్వహిస్తారు, దీనిలో ముఖ్యమైన దేవత విగ్రహాన్ని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బయటకు తీసుకు వచ్చి, రథంలో ఊరేగించి, తరువాత అభిషేకిస్తారు. లక్షలాది ప్రజలు గుంపుగా ఆలయానికి వచ్చి, అభిషేకం ఉత్సవాన్ని, విగ్రహాన్ని తిరిగి గర్భగుడిలోకి తీసుకువెళ్ళేటప్పటి దేవుని ఆగమ ప్రధానమైన నృత్యాన్ని చూస్తారు. ఉమాపతి శివం యొక్క 'కున్చితాన్గ్రిస్తావం' లో మాసి ఉత్సవంలో కూడా దేవుని ఊరేగిస్తారని పేర్కొన్నారు కాని ఈ రోజులలో దానిని పాటించడం లేదు.
దక్షిణ భారతదేశంలో వున్న చాలా ఆలయాలు సజీవ స్మారక కట్టడాలు, అనగా, ప్రారంభమైన నాటినుంచి ప్రార్థనలు జరుగుతూ వున్నాయి, భక్తులు క్రమం తప్పకుండా దర్శిస్తూ వుంటారు, క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటారు.
పురాణాల (చరిత్ర మాటల ద్వారా పయనించి తరువాత వ్రాయబడ్డది) ప్రకారం దైవ సమానుడగు పులికాల్మునివర్, సిమ్మవర్మన్ రాజు ద్వారా విశేషమైన ఆలయ నిర్మాణాలు గావించాడు. పల్లవ రాజులలో, సిమ్మవర్మన్ పేరుతొ ముగ్గురు రాజులు కలరు (275-300 క్రీశ, 436-460 క్రీశ, 550-560 క్రీశ). కవి-పుణ్య పురుషుడగు తిరునావుక్కరసర్ కాలం నాటికే ఈ ఆలయం ప్రాచుర్యం పొందినది. (అతని కాలం అటు ఇటుగా సుమారు 6 శతాబ్దం), సిమ్మవర్మన్ జీవించినది బహుశ క్రీశ 430-458 అనగా సిమ్మవర్మన్ II. పట్టయం లేదా కొత్త్రవంకుడి లోని రాగి రేకుల మీది శాసనాలు దీనిని ధ్రువపరుస్తున్నాయి. అయితే పల్లవ కాలంనాటి తన్దంతోట్ట పట్టయం, ఇతర పట్టయంల ద్వారా సిమ్మవర్మన్ కు చిదంబరం ఆలయంనకు అనుబంధం ఉంది. అందువలన, సిమ్మవర్మన్ పల్లవ రాజని, తరువాత రాజరికాన్ని వదలి చిదంబరం వచ్చి నివసించాడని నమ్ముతారు. పులికాల్మునివర్, సిమ్మవర్మన్ లు సమకాలీలు అగుటచే, ఈ ఆలయనిర్మాణం ఆ కాలంలో జరిగి ఉంటుందని భావిస్తూవుంటారు.
అయితే, నిజం ఏమిటంటే, కవి-పుణ్య పురుషుడగు తిరునావుక్కరసర్ కంటే చాలా కాలంముందే, కవి-పుణ్య పురుషుడగు మణిక్కవసాగర్ నివసించి, చిదంబరంలోనే పరమానందాన్ని పొందాడు, నటరాజ స్వామి విగ్రహం, అసమానమైన భంగిమ, ఆకారం, ఆ కాలం నాటి ఇతర పల్లవుల పనులతో పోల్చలేనిది, సిమ్మవర్మన్ కాలం నుండి ఆలయం వున్నది, తరువాతి కాలంలో పులికాల్మునివర్ పేరుతొ ఇంకొక పుణ్య పురుషుడు ఉండడానికి అవకాశం ఉంది.
నియమిత కాల వ్యవధులలో (సాధారణంగా 12 సంవత్సరంలకు ఒకసారి), పెద్ద మరమ్మత్తులు, పునర్నిర్మాణాన్ని చేబడతారు, కొత్త వసతులను ఏర్పరచి, సమర్పిస్తారు. చాలా పురాతన ఆలయాలు కాలం గడిచేకొద్దీ, ఆలయ బాధ్యత తీసుకొన్న రాజుల వలన పెరిగి, కొత్త వసతులను, ఎక్కువ బయటి వసారాలను, కొత్త గోపురాలను (పగోడాలు) ఏర్పరుచుకొంటాయి. ఈ ప్రక్రియలు ఆలయాలను, పురావస్తు, చారిత్రిక కట్టడాలుగా మాత్రమే కాకుండా, సజీవ పూజ్య స్థలాలుగా ఉంచడానికి దోహదం చేశాయి, ఉద్దేశ్యపూర్వకంగా చేయనప్పటికీ, ఈ పునర్నిర్మాణాల ఆలయ ప్రణాళికతో అసలు కట్టడాలు సరితూగకపోతే, కొంత అసలు కట్టడం నాశనం కావచ్చు.
ఈ సాధారణ పోకడకు, చిదంబరం ఆలయం కుడా మినహాయింపు కాదు. మూలాలు, ఆలయ అభివృద్ధి గురించిన సమాచారం చాలా భాగం, సాహిత్యం, కవిత్వం యొక్క రచనల నుంచి రాబట్టినవి, తరతరాలుగా దీక్షితార్ సమాజంలో నోటితో చెప్పబడిన విషయాల ద్వారా, కొంత భాగం, ఇప్పటికీ వున్న శాసనాలు, చేతి వ్రాతల రచనల ద్వారా తెలుస్తుంది.
ఈ పురాతన పుణ్య క్షేత్రానికి చోళులు గొప్ప భక్తులని సంగం సాహిత్యం ద్వారా మనకు తెలుస్తుంది. తిల్లై బంగారు మందిరంలో చోళ రాజు సుభదేవన్, కమలాదేవి పూజ చేసిన తరువాతనే చోళ రాజు కోచెంగన్నాన్ జన్మించినట్లు చెబుతారు. అందువలన ఆలయంలో వున్న బంగారు మందిరం వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నట్లుగా చెబుతారు.
ఆ ఆలయ స్థాపత్యం, ముఖ్యంగా గర్భగుడి గోపురం చోళుల, పాండ్యుల, పల్లవుల ఇతర ఆలయాల లాగా వుండదు. కొంతవరకు, ఈ నిర్మాణం చేర రాజుల ఆలయాలను పోలి వుంటుంది, కాని చేర రాజ్యవంశం, కవి-పుణ్య పురుషుడగు సుందరర్ (సుమారు 12 వ శతాబ్దం) కాలం నాటిదని ఇప్పటివరకు లభించిన ఆధారాల ద్వారా తెలుస్తోంది. చిదంబరం ఆలయానికి సంబంధించిన పనుల వివరాలు దురదృష్టవశాత్తు 10 వ శతాబ్దం తరువాతనుంచి మాత్రమే లభిస్తున్నాయి.
గుడిలో చాలా శాసనములు లభించాయి, చిదంబరం గుడి గురించిన శాసనాలు చుట్టూ ప్రక్కల ప్రదేశాలలో ఉన్నాయి.
చాలా శాసనాలు క్రింది కాలానికి సంబంధించినవి:
(ప్రపంచాన్ని పాలించుటకు పుట్టినవాడు, గొప్ప రాజ్య సింహం దేవుడు)
దక్షిణ గోపురం ను నిర్మించినది ఒక పాండ్య రాజు. దీనికి గుర్తు, గోపుర పైభాగాన చెక్కబడిన పాండ్య రాజుల చేప చిహ్నం. చరిత్ర ప్రకారం, ఒక వేళ పాండ్య రాజులు గోపురాన్ని పూర్తిగా నిర్మిస్తే రెండు చేపలు ఎదురెదురుగా వుండునట్లు చెక్కిస్తారు (, గోపుర నిర్మాణం అసంపూర్తిగా వున్నట్లయితే ఒక చేప మాత్రమే వుంటుంది). దక్షిణ గోపురం పాండ్యుల రెండు చేపల చిహ్నాన్ని కలిగి వుంటుంది.
తదుపరి, మొదటి అంతస్తును వుంచి, పల్లవ రాజైన కోపెరున్సిన్గాన్ సా. శ, I 1216-1242 గోపురాన్ని తిరిగి నిర్మించాడు. ఈ గోపురం సోక్కసీయాన్ తిరునిలై ఎజ్హు గోపురం అని పిలువబడుతుంది.
పడమటి గోపురం ను నిర్మించినది జడవర్మన్ సుందర పాండ్యన్ సా. శ, I 1251-1268
ఉత్తర గోపురం ను నిర్మించినది విజయనగర రాజైన కృష్ణ దేవరయర్ సా. శ, 1509-1529
మొదట తూర్పు గోపురం ను నిర్మించినది పల్లవ రాజైన కోపెరున్సిన్గాన్ సా. శ, II 1243-1279
తదుపరి మరమ్మత్తులు చేయించినది ప్రముఖ దాత పచయప్ప ముదలియార్ అత్తగారైన సుబ్బంమల్ . పచయప్ప ముదలియార్, అతని భార్య ఇయలంమల్ విగ్రహాలను తూర్పు గోపురం మీద చెక్కించారు. గుడిలో జరిగే అనేక ఉత్సవాలను పచయప్ప ట్రస్ట్ నిర్వహిస్తుంది, గుడి రథాన్ని పోషిస్తుంది.
చిట్ సభ పై కప్పుకు బంగారు పూత పూయించినది చోళ రాజైన పరంతక I (907-950 క్రీశ) అని చెప్పబడుతుంది ("తిల్లైయంబలత్హుక్కు ఫోన్ కూరై వెఇయ్న్థ తేవన్") . ఈ గుడికి ముఖ్య దాతలు అని చెప్పబడ్డ రాజులు: పరంథక II రాజు, రాజరాజ చోళ I, కులోతుంగా చోళ I. రాజరాజ చోళుని కుమార్తె అగు కుందవై II కూడా ఈ ఆలయమునకు బంగారం, ధనమును సమర్పించినది అని చెప్పబడుతుంది. తరువాత చోళ రాజైన విక్రమ చోళుడు (క్రీశ 1118-1135), ప్రతి రోజు ధూప, దీప నైవేద్యాల కొరకు అనేక దానాలను చేసాడు.
గుడికి, బంగారం, ఆభరణాలను విరాళంగా ఇచ్చిన దాతలలో అనేక రాజులు, పాలకులు, రక్షకులు కలరు, వారిలో పుదుకోట్టై మహారాజు, శ్రీ సేతుపతి (పచ్చల హారం విగ్రహానికి ఇప్పటికీ అలంకరించబడుతోంది), బ్రిటిష్ మున్నగువారు.
ఉత్తర భారతం లోని అనేక గుడులు చాలా మంది విదేశీ దండయాత్రదారుల చేత నాశనం చేయబడ్డాయి, వాటితో పోలిస్తే దక్షిణ భారతంలోని ఆలయాలు శతాబ్దాల నుంచి ప్రశాంతంగా ఉన్నాయి. ఆలయాలు దక్షిణ భారతదేశంలో వికసించడానికి అది ఒక ముఖ్యకారణం. అయితే, ప్రశాంత చరిత్ర, చిన్న చిన్న యుద్ధాలు లేకుండా లేదు. కొన్ని చారిత్రిక ప్రసక్తుల ప్రకారం, క్రీశ 1597 లో విజయనగర రాజ్య సైనికాధికారి గోవిందరాజ ఆలయమును విస్తరించినప్పుడు, చాలా మంది గుడి దీక్షితార్లు ఎత్తైన గుడి గోపురంలనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వారి పూజనీయమైన, ప్రియతమ ఆలయం నాశనం చేయబడటం చూడటం కంటే చావే నయమనుకున్నారు. దీనిని గ్రంథస్తం చేసినది యూదుల పూజారైన యాత్రికుడు ఫాదర్ పిమెంత.
చాలా సందర్భాలలో, దండయాత్రలనుంచి రక్షించుకొనడం కొరకు, దీక్షితార్లు, ఆలయాన్ని మూసివేసి, విగ్రహాలను చాలా రక్షణతో కేరళ లోని అలపుజ్హకు తీసుకోని వెళ్ళేవారు. దండయాత్ర భయం తగ్గగానే తిరిగి వచ్చేవారు.
ది త్రివవదుతురై అధీనం, సరస్వతి మహల్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్, తిరువవదుతురై, తమిళ్ నాడు, ఇండియా 609803.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.