From Wikipedia, the free encyclopedia
దాసరి రామతిలకం (1905-1952) సంగీత, నృత్య కళాకారిణి, రంగస్థల నటి, తొలి తరపు తెలుగు సినిమా నటి. తొలినాటి సినిమాల్లో కూడా నటించి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ నటి గిరిజ ఈమె కుమార్తె. రామతిలకం చింతామణి చిత్రంలో చింతామణి పాత్రను పోషించారు. తెలుగు తెరపై వేశ్య పాత్ర పోషించిన తొలి కథానాయిక ఈమే.[1]
ఆమె నివాసస్థలం బెజవాడ. ఆమె తండ్రి ఆంధ్ర దేశంలో మృదంగ వాద్యమునందు ప్రసిద్ధిగాంచినవారిలో నొకరగు పువ్వుల వెంకటరత్నం గారు. స్వజాతీయుడగు పువ్వుల నారాయణగారి వద్ద ఈమె సంగీతం నేర్చుకున్నది. సంగీతంలో కచ్చేరిచేయుటకు తగినంత జ్ఞానం సంపాదించింది. కొన్నిచోట్ల కచ్చేరీలు కూడా చేసి బహుమతులు పొంది ప్రశంసింపబడ్డది.
మైలవరం కంపెనీ మేనేజరుగారైన కీ. శే. కొమ్మూరు పట్టాభిరామయ్యగారు స్థాపించిన లక్ష్మీవిలాస సభ లోను, అనంతరం కపిలవాయి రామనాథశాస్త్రిగారి బాలభారతి నాట్యమండలియందును, చింతామణి, చిత్రాంగి, సత్యభామ, అహల్య, సొనిత్రి మొదలైన వేషాలు వేసింది. 1932 నవంబరులో కలకత్తా ఈస్టు ఇండియా కంపెనీవారిచే తయారుచేయబడిన సావిత్రి (ఈస్టిండియా) తెలుగు టాకీ ఫిల్మునందు సావిత్రిపాత్ర ధరించి అఖండకీర్తి ప్రతిష్టలుగాంచినది. 1933 మార్చిలో కలకత్తా మదన్ ఫిలింకింపెనీవారి తెలుగు చింతామణి టాకీయందు చింతామణిపాత్ర ధరించినది.
సంవత్సరము | సినిమా | భాష | పాత్ర |
1933 | సావిత్రి | తెలుగు | సావిత్రి |
1933 | రామదాసు (ఈస్టిండియా) | తెలుగు | |
1933 | రామదాసు (కృష్ణా ఫిలిమ్స్) | తెలుగు | |
1933 | చింతామణి | తెలుగు | చింతామణి |
1935 | శ్రీ కృష్ణ లీలలు | తెలుగు | యశోద |
1936 | ద్రౌపదీ వస్త్రాపహరణం | తెలుగు | సత్యభామ |
1937 | మోహినీ రుక్మాంగద | తెలుగు | |
1937 | బాల యోగిని | తెలుగు | |
1941 | తెనాలి రామకృష్ణ | తెలుగు | |
1942 | హానెస్ట్ రోగ్ | తెలుగు | |
1946 | వరూధిని | తెలుగు | వరూధిని |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.