1946 సినిమా From Wikipedia, the free encyclopedia
వరూధిని, 1946లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది యస్.వి.రంగారావు తొలి చిత్రము. ప్రఖ్యాత తెలుగు ప్రబంధము మనుచరిత్రములోని "వరూధిని" పాత్ర ఈ సినిమాలో ప్రధాన పాత్ర. ఇందులో ప్రవరాఖ్యునిగా ఎస్.వి. రంగారావు, వరూధినిగా దాసరి తిలకం నటించారు.
వరూధిని (1946 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.వి.రామానందం |
---|---|
నిర్మాణం | నాగుమల్లి నారాయణమూర్తి, బి.వి.రామానందం |
రచన | తాండ్ర సుబ్రహ్మణ్యశాస్త్రి |
తారాగణం | యస్.వి.రంగారావు, ఎ.వి.సుబ్బారావు, దాసరి తిలకం, దాసరి కోటిరత్నం, చిత్తజల్లు కాంతామణి, రాఘవకుమారి, అంజనీకుమారి, కుంపట్ల, రావులపర్తి |
సంగీతం | కె.భుజంగరావు |
నిర్మాణ సంస్థ | అనంద పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఈ చిత్రం తయారవుతున్న సమయంలో రూపవాణిలో వచ్చిన వార్త ఇలా ఉంది [1] - "ప్రొడ్యూసర్స్ శ్రీ నాగుమిల్లి నారాయణరావు గారు, శ్రీ రామానందంగారు నవనిధులను తృణాలుగా ఖర్చుపెట్టి ఈ చిత్రాన్ని ఈ సంవత్సరమునకు అమూల్యమైన కానుకగా అందిచడానికి రాత్రింబగళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ బి.వి. రామానందంగారి దర్శకత్వంలో విద్యావంతులైన నటీనటులు, విజ్ఞాన సంపన్నులైన టెక్నీషియన్లు, మృదుమధురమైన సంభాషణలు, ఆశ్చర్యకరమగు ట్రిక్కులు, దేశీయమగు భరత నాట్యాలు - సర్వతోముఖంగా వరూధిని తెలుగువారి మన్ననలు పొందడానికి వస్తుంది."
ఎస్.వి రంగారావు
ఎ.వి.సుబ్బారావు
దాసరి రామతిలకం
దాసరి కోటిరత్నం
చిత్తజల్లు కాంతామణి
రాఘవకుమారి
అంజనీకుమారి
కుంపట్ల
రావులపర్తి
శేషమాంబ
అరుణాదేవి
దర్శకుడు: బి.వి . రామానందo
సంగీతం: కె.భుజంగరావు
నిర్మాతలు: నాగుమల్లి నారాయణ మూర్తి , బి.వి.రామానందo
నిర్మాణ సంస్థ: ఆనంద్ పిక్చర్స్
రచన: తాండ్ర సుబ్రహ్మణ్యశాస్త్రి
నేపథ్య గానం: దాసరి కోటిరత్నం, దాసరి తిలకం
విడుదల:1947: జనవరి:11.
1. కృష్ణా నీకు వచ్చిందా.,.. రాలేదండి, గానం. దాసరి కోటి రత్నం
2. ఈ నిరాశా విడరా భువి మనరా చీకటి చనదా వెలుగురాదా, గానం. దాసరి కోటి రత్నం
3.ఏరీతి నీ విరహాగ్ని వ్యధ సహింపజాలుదూనో, గానం.దాసరి తిలకం
4.ఘుమ ఘుమ పరిమళ మొలకా, గానం.దాసరి తిలకం బృందo
5 . చాల్ బడాయి చాల్ బడాయి చాలును లేవోయి..
6.దోరే స్వరోచి రాజే స్వరోచి జే జేలంటూ ఆడండి,,
7.నా ప్రేమసఖా ఇటురావో ఓ మధురగాయకా వినిపింపుమా,
8.పాడవే కోకిలా ప్రేమగీతము నింపుగా, గానం.దాసరి తిలకం
9.ప్రణయ జీవితభగ్న వీణా నినాదమిక వీనులకు వినిపించినా ,
పద్యాలు
10.అండజయాన నీ వోసగునట్టి సపర్యలు మాకు నచ్చే,
11.ఇంత కన్నులుండ తెరునెవ్వరినేడేద భూ సురేంద్రా,
గానం.దాసరి తిలకం
12.ఈ పాండిత్యము నీకు దక్క మరియేందే కంటివి,,
13.ఎందేడెందం కందళించు రహీచే నేకాగ్రతన్ , గానం.దాసరి తిలకం
14.దాన జపాగ్నిహోత్రి పరతంతుడనేని భవ ,
15.వారి కంటెన్ నీ మహత్యంబు ఘనమే ,
16. వెలి నెట్టిరే బాడబులు పరాశరుబట్టి దాస కన్యాకేళిత , గానం.దాసరి తిలకం .
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.