దారా సింగ్
భారతదేశ నటుడు, మల్లయోధుడు / From Wikipedia, the free encyclopedia
దారా సింగ్ రణ్‌ధావా (జననం దీదార్ సింగ్ రాంధవా ; 1928 నవంబరు 19 - 2012 జూలై 12) ఒక భారతీయ ప్రొఫెషనల్ రెజ్లర్, నటుడు, రాజకీయవేత్త . అతను 1952 లో నటించడం ప్రారంభించాడు. రాజ్యసభకు నామినేట్ అయిన మొదటి క్రీడాకారుడు. [1] అతను హిందీ, పంజాబీ చిత్ర నిర్మాత, దర్శకుడు, రచయితగా పనిచేశాడు. అతను సినిమాలతో పాటు, టెలివిజన్‌లో కూడా నటించాడు. బజరంగ్బలి (1976) చిత్రంలోను, రామానంద్ సాగర్ యొక్క రామాయణంలోనూ హనుమంతుడి పాత్రతో అతడు ప్రాచుర్యం పొందాడు. [2] .2018 లో WWE అతన్ని హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి తీసుకుంది.
త్వరిత వాస్తవాలు దారా సింగ్ రణ్‌ధావా, జననం ...
దారా సింగ్ రణ్‌ధావా | |
---|---|
![]() దారా సింగ్ రణ్‌ధావా | |
జననం | దీదార్ సింగ్ రణ్‌ధావా (1928-11-19)1928 నవంబరు 19 పంజాబ్ |
మరణం | 2012 జూలై 12(2012-07-12) (వయసు 83) |
ఇతర పేర్లు | దారా |
వృత్తి | మల్లయోధుడు, నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1962 – 2012 |
పిల్లలు | ప్రుదుమాన్ సింగ్ రణ్‌ధావా విందు దారా సింగ్ అమ్రిక్ సింగ్ |
మూసివేయి