తిరువనంతపురం జిల్లా
కేరళ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
తిరువనంతపురం జిల్లా, భారతదేశం, కేరళ రాష్ట్రంలోని దక్షిణాన ఉన్న జిల్లా.[3] ఈ జిల్లా 1949లో ఏర్పడింది. తిరువనంతపురం దీని ప్రధాన కార్యాలయం . ఇది కేరళ రాష్ట రాజధాని నగరం. ప్రస్తుత జిల్లా 1956లో కన్యాకుమారి జిల్లాను ఏర్పాటుచేయడానికి పూర్వ జిల్లా నుండి నాలుగు దక్షిణ తాలూకాలు వేరుచేయడం ద్వారా సృష్టించబడింది. తిరువనంతపురం నగరాన్ని రాష్ట్ర సమాచార సాంకేతిక రాజధాని అని కూడా అంటారు. ఈ నగరంలో 1990లో భారతదేశం లోని మొట్టమొదటి అతిపెద్ద ఐటి పార్క్, టెక్నోపార్క్ స్థాపించబడ్డాయి. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 9% కంటే ఎక్కువ మంది ఈ జిల్లాలో ఉన్నారు.[4] జిల్లా వైశాల్యం 2,192 చదరపు కిలోమీటర్లు (541,655 ఎకరం) లో విస్తరించి ఉంది. 2011 జనాభా లెక్కలప్రకారం, ఇది 33,01,427 జనాభాను కలిగి ఉంది.[5][6] ఇది మలప్పురం జిల్లా తర్వాత కేరళలో రెండవ అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా నిలిచింది.[7] ఇది కేరళ రాష్ట్రంలో జనసాంద్రత అత్యధికంగా ఉన్న నగరం.ప్రతి చ.కి.మీ విస్తీర్ణంలో 1509 మంది జనసాంద్రత కలిగి ఉంది.[8] జిల్లాను తిరువనంతపురం, చిరాయింకీజు, నెయ్యట్టింకర, నెడుమంగడు, వర్కల, కట్టకడ అనే ఆరు ఉపజిల్లాలుగా విభజించబడింది. జిల్లాలోని పట్టణ సంస్థలు తిరువనంతపురం నగరపాలక సంస్థ, వర్కాల, నెయ్యట్టింకర, అట్టింగల్, నెడుమంగడ్ అనే పురపాలకసంఘాలు ఉన్నాయి.[9] నగరంలో చుట్టుపక్కల యాభైకి పైగా గుర్తింపు పొందిన ఆయుర్వేద కేంద్రాలు ఉన్నాయి. నగరం ప్రపంచ స్థాయి ఆధునిక ఆసుపత్రులను అందిస్తుంది.
తిరువనంతపురం జిల్లా
Trivandrum district | |||||||
---|---|---|---|---|---|---|---|
District of Kerala | |||||||
Clockwise from top: Niyamasabha Mandiram, Kovalam Beach, Attingal, Poovar beach, Varkala underpass, and Anchuthengu Fort. | |||||||
Coordinates: 8.48°N 76.94°E / 8.48; 76.94 | |||||||
Country | India | ||||||
రాష్ట్రం | Kerala | ||||||
ముఖ్యపట్టణం | Thiruvananthapuram | ||||||
Subdistricts |
| ||||||
Government | |||||||
• Lok Sabha constituencies | 2 | ||||||
• Vidhan Sabha constituencies | 14 | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 2,192 కి.మీ2 (846 చ. మై) | ||||||
జనాభా (2011) | |||||||
• Total | 33,01,427 (male: 15,81,678; female: 15,69,917) | ||||||
• Urban | 55.75% | ||||||
Demographics | |||||||
• Literacy | 93.02%[1] | ||||||
Vehicle registration | KL-01 Thiruvanthapuram, KL-16 Attingal, KL-19 Parassala, KL-20 Neyyattinkara, KL-21 Nedumangad, KL-22 Kazhakoottam, KL-74 Kattakkada, KL-81 Varkala | ||||||
Major highways | NH 66 | ||||||
HDI (2005) | 0.773[2] ( High) | ||||||
Average annual precipitation | 1,700 mm |