From Wikipedia, the free encyclopedia
తాళం అనేది పాటకు సక్రమమైన చక్రం లాంటిది. ఇది పాటకు వాయిద్య రూపంలో అందే సహకారం. అఖండమైన కాలాన్ని, ఖండాలుగా చేసి హెచ్చు తగ్గులు లేకుండా నికరంగా జోడించి, శ్రోతలను తన్మయుల్ని చేయించగలిగేది తాళము. రాగము, తాళము మన కర్ణాటక సంగీతం యొక్క ప్రాణములు, ఐరోపా సంగీతములో మన సంగీతములో కల పలువిధములైన తాళములు ఉన్నాయి.
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016) |
|
"తాళము" అనగా సంగీతమును కొలుచు కొలతబద్ద. ఒక వస్త్రమును అర్థ గజము, పావుగజము, రెండు, మూడు గజములు మొదలైన కొలతలతో ఎట్లు మనం కొలబద్దతో కులుచు చున్నామో, అట్లే సంగీత గానమును కూడా చాలా విధములైన తాళములచే వాటివాటిని వేరువేరుగా కొలుచుచున్నాము. తాళములు ఏడు, ముప్పదిఐదు, నూట ఎనిమిది రకములుగా వ్యవహరించుట గలదు. పూర్వీకులు ఎన్ని రకములైన తాళములు కనుగొన్ననూ ప్రస్తుతం 35 రకాల తాళములు అందుబాటులో ఉన్నాయి.
సంగీత ప్రపంచమున కంతయు సప్తస్వరము లెట్లు వునాదియో అట్లే తాళ లోకమునకు సప్త తాళములు పునాది. అవి ధ్రువతాళము, మఠ్య తాళము, రూపక తాళము, ఝంపె తాళము, త్రిపుట తాళము, ఆట తాళము, ఏక తాళము. ఈ తాళముల గూర్చి క్రింది శ్లోకములో చూడవచ్చు.
“ | ధృవమఠ్యారూపకశ్చ ఝంపాత్రిపుట యేవచ అటతాళే కతాళేచ సప్త తాళ ప్రకీర్తితః |
” |
ఈ సప్త తాళములు వారము యొక్క సప్త దినములలో పుట్టినట్లును సప్త నక్షత్రములలో సప్త రంగులు కలవి యైనట్లును పూర్వీకులు వ్రాసిన శ్లోకముల వల్ల తెలియుచున్నవి. వీటి వివరణములు విస్తారముగా తెలుసుకుందాం.
తాళమునకు ముఖ్యంగా ఆరు అంగములున్నవి. వాటికి షడంగములు అని పేరు.
ఈ ఆరు అంగములలో మొదటి అంగములో మొదటి మూడు అంగములు అయిన లఘువు, దృతము, అనుదృతము అనునవి మాత్రము పై ఏడు తాళములలో ఉపయోగింపబడుచున్నవి.
దృతము యొక్కయు అనుదృతము యొక్కయు అక్షర కాల నిర్ణయము నిర్ణయింపబడింది. అక్షర కాలమనగా ఒక్క హ్రస్వ అక్షరమును పలుకు కాలపరిమితి. దృతము రెండక్షరాల విలువ, అనుదృతము ఒక అక్షరము విలువ కలవిగా నిర్ణయించబడినవి. దృతము పూర్ణ సున్నగాను (౦), అనుదృతము అర్థ చంద్రాకృతి గాను (ں) సంకేతమున చూపబడుచున్నవి. తాలము వేయునపుడు దృతము, చేతితో ఒక దెబ్బయు, ఒక విసరుతోను, అనుదృతము చేతితో ఒక్క దెబ్బ మాత్రముతోనూ చూపబడును. చేతివిసరునకు "విసర్జితము" అని పేరు.
లఘువును ఒక చిన్న నిలువు గీతతో సంకేతములో చూపబడును. లఘువులో రెండు భాగములున్నవి.
కూర్చుని తాళమును వేయునపుడు కుడి తొడపై కుడి అరచేతితో తాళము వేయవలెను.
చిటికెన వ్రేలితో మొదలుపెట్టి బొటన వ్రేలి వైపు ఒక్కొక్క వ్రేలుగా ఎంచవలెను. ఆరు ఏడు తొమ్మిది మొదలైన ఐదు కంటే ఎక్కువ వ్రేళ్ళు ఎంచవలసినపుడు మరల చిటికెన వ్రేలుతో ప్రారంభించి బొటన వ్రేలి వైపు ఎంచవలెను.
లఘువు యొక్క అక్షర విలువ, ఆయా లఘువు యొక్క జాతులపై ఆధారపడును. లఘువు అను అంగమునకు ఐదు జాతులున్నవి. హిందూ అన్న పదములో బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర అను ఎట్లు నాలుగు జాతులున్నవో అట్లే లఘువునలు త్రిశ్ర, చతురశ్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ అను ఐదు జాతులున్నవి. కనుక పై జాతులు కల లఘువులు త్రిశ్ర లఘువు, చరురశ్ర లఘువు, ఖండ లఘువు, మిశ్రలఘువు, సంకీర్ణ లఘువు అని పిలువబడుచున్నవి. త్రిశ్ర అనగా మూడు కనుక త్రిశ్ర లఘువు అనగా ఆ లఘువునకు 3 అక్షరముల విలువయని అర్థము. ఈ ఐదు జాయుల లఘువులను సంకేతము వ్రాయునపుడు.
వాటి వాటి అక్షర కాల విలువ లఘువు సంకేతమైన చిన్న నిలువు గీత భాగమున చిన్న అంకెలుగా వ్రాయవలెను.
లఘువు యొక్క జాతి | సంకేతము | అక్షర విలువ | ఎంచవలసిన పద్ధతి |
త్రిశ్ర లఘువు | I3 | 3 అక్షరములు | 1 దెబ్బ + 2 వ్రేళ్ళను ఎంచుట |
చతురశ్ర లఘువు | I4 | 4 అక్షరములు | 1 దెబ్బ + 3 వ్రేళ్ళను ఎంచుట |
ఖండ లఘువు | I5 | 5 అక్షరములు | 1 దెబ్బ + 4 వ్రేళ్లను ఎంచుట |
మిశ్ర లఘువు | I7 | 7 అక్షరములు | 1 దెబ్బ + 6 వ్రేళ్ళను ఎంచుట |
సంకీర్ణ లఘువు | I9 | 9 అక్షరములు | 1 దెబ్బ + 8 వ్రేళ్ళను ఎంచుట |
లఘువుపై ఏడు తాళములలో ముఖ్యమైన అంగము. దృతము ఏక తాలములో లేదు. అనుదృతము ఝ్ంపె తాళములో తప్ప మరి యే తాళము లోనూ లేదు. లఘువు మాత్రము ప్రతి తాలములోను ఉండి తీరవలసిన అంగము. మిగిలిన మూడు అంగములు అనగా గురువు, ప్లుతము, కాక పాదములు 108 తాలములలో కాననగును. 108 తాళములు కొన్ని నాట్యములకు ఉపయోగింపబడుచున్నవి. అరుణగిరి నాథర్ అను ఆరవ వాగ్గేయ కారుడు తన భక్తి గీతములగు తిరుప్పగళ్ అను వాటిని ఈ 108 తాళములతో కూర్చి యున్నాదు. పై చెప్పిన సప్త తాలములు మాత్రము లఘువు, దృతము, అనుదృతములతోనే తృప్తిపడినవి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.