From Wikipedia, the free encyclopedia
వర్ణము అభ్యాసగాన రచనలలోచాలా ముఖ్యమైన రచన. ఈ రచన నేర్చుకొనుటకు, పరిపూర్ణ పరిపక్వముతో పాడుటయు చాల కష్టము. వర్ణమును బాగుగా నేర్చిన యెడల యితర రచనలు అతి సులభ సాధ్యము అగును. వాద్య పాఠకులు వర్ణమును పఠించి వాద్యముపై వాయించుటచే సంగీత కళను సంపూర్ణంగా వాద్య స్వాధీనము చేసుకొనవచ్చును. గాత్ర పాఠకులకు గాత్రమునందు యెటువంటి సంచారమైననూ అవలీలగా పాడుటకు వీలగును.
|
వర్ణమును రచించుట కష్ట సాధ్యము. కృతుల సంఖ్య కంటే వర్ణముల సంఖ్య చాలా కొద్ది. వర్ణము రచించుటకు రాగము యొక్క లక్షణములు పరిపూర్ణముగా తెలిసికొని ఆ రాగములో వర్ణమును రచింపవలయును.
వర్ణమునకు రెండు భాగములు, పూర్వ భాగము,ఉత్తర భాగము. పల్లవి, అనుపల్లవి, ముక్తాయిస్వరములు గల భాగము పూర్వభాగము. చరణము,చరణ స్వరములు కల భాగము ఉత్తర భాగము.
పూర్వ భాగమున పల్లవి, అనుపల్లవి, ముక్తాయీ స్వరము యిమిడి యున్నవి. పల్లవి, అనుపల్లవులకు సాహిత్యము ఉంది. ముక్తాయీ స్వరమునము సాహిత్యముండదు. రచించిన రాగములో ఏ ఏ విశేష సంచారములు వచ్చుటకు వీలున్నవో, రాగ రంజక ప్రయోగము లేవో అన్ని రకములైన సంచారములను వర్ణనములో కాననగును. ఒక భాష నేర్చికొనుటకు, నిఘంటువును ఎట్లు ఉపయోగించుదుమో ఒక రాగము లోని వర్ణము ఆ రాగము యొక్క్ లక్షణమునకు అంత ఉపయోగించుదురు.
వర్ణములో సాహిత్యము చాల కొద్ది అక్షరములు కలిగి యుండును. సాధారనముగా శృంగార రసము గాను, భక్తిని దెల్పునదిగాను, లేక ఒక రాజపోషకు స్తుతీ గాను ఉండును.
ఉత్తర భాగములో చరణము, చరణ స్వరములు ఇమిడి ఉన్నాయి. చరణమునకు ఉపపల్లవనియు, ఎత్తుగడ పల్లవి అనియు, చిట్ట పల్లవి అనియు పేర్చు. సాధారణముగా మొదటి స్వరము దీర్ఘ స్వరముగా నుండును. 4 లేక 5 చరనములతోనే వర్నమును రచించుట వాడుక. చరణ స్వరము పాడి, మరల చరణమును అందుకొనుట ఆచారము. కొన్ని వర్ణములకు రెండువ పల్లవులుండును.
వర్ణములు రెండు విధములు
ఈ రెండు రకాల వర్నముల లక్షణములు పైన తెలుపబడినవే. తానవర్ణము పల్లవి, అనుపల్లవి చరణములకు మాత్రము సాహిత్యము కలిగి తక్కిన భాగములు స్వరములు మాత్రమే కలిగి యుండును.పద వర్ణములు చౌకముగా పాడవలయును కాన వీటిని చౌక వర్ణములని వాడుటయు ఉంది. తాన వర్ణములు సంగీత మభ్యసించువారు నేర్చుకొనుటకును, గాన సభలలో కచేరీలు ప్రారంభించుటకును ఉపయోగపడుచున్నవి. పదవర్ణములు నృత్యమాలకుపయోగ పడుచున్నవి. అభినయంతో సాహిత్యములోని భావమును ప్రదర్శించవలెను.
ఆది,అట తాళ వర్ణాలు ఇంకా పదవర్ణాలు ఉంటాయి. తానా వర్ణాలకు రాగ,లయ ప్రధానంగా ఉంటాయి. సాధారణంగా పల్లవి, అనుపల్లవి, చరణాలకి మాత్రమే సాహిత్యం ఉంటుంది. వర్ణాలు సాధారణంగా 8 గతులు లేదా 14 గతులతో ఉంటాయి. కాబట్టి తాళం వేసేటప్పుడు ఒకే వేలుని రెండు సార్లు ఆడిస్తూ తాళం వేస్తారు. దీనిని చౌక తాళం అంటారు. పదవర్ణాలు నృత్యానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి సంగీత,సాహిత్య ప్రధానంగా ఉంటాయి.
రాగమాలిక వర్ణములు కొన్ని గలవు. అనగా వేరువేరు ఆంగములు వేరు వేరు రాగములలో ఉండుట. నవరాగమాలిక, దినరాగ మాలిక మొదలగునవి ఉత్తమ ఉదాహరణములు. నక్షత్రమాలిక అను 27 రాగములలో ఒక రాగమాలికా వర్ణములు ఉన్నాయి.ఒక్కొక్క ఆవర్తములో లఘువు ఒక రాగము రెండ్ దృతములు ఒక రాగము గాను, రచించ బడినవి.
వర్ణాన్ని మొదటి గతిలో పల్లవి నుంచి ముక్తాయి స్వరం వరకు పాడతారు. ముక్తాయి స్వరానికి సాధారణంగా సాహిత్యం ఉండదు. వర్ణాన్ని పాడేవారు పల్లవి, అనుపల్లవులను కేవలం సాహిత్యాన్ని మాత్రమే పాడతారు. మొదటి కాలంలో ముక్తాయి వరకు పాడిన తర్వాత, రెండవ కాలంలో మళ్ళీ పల్లవి నుంచి ముక్తాయి వరకు పాడి ఆపు స్వరంతో ముగిస్తారు. తర్వాత చరణం, చిట్టస్వరం మొదటి కాలంలో పాడుతారు. మళ్ళీ అవే రెండో కాలంలో పాడతారు. ఈ పద్దతిలోనే అన్ని చిట్టస్వరాలనూ పాడతారు. చరణానికి సాహిత్యం ఉంటుంది. [1] విద్వాంసులు వాళ్ళ స్వరకల్పనను జతచేసి వర్ణాన్ని కచేరీలలో పడతారు.
ఆది తాళ వర్ణాలు
అట తాళ వర్ణాలు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.