న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, కోచ్ From Wikipedia, the free encyclopedia
డేనియల్ లూకా వెట్టోరి (జననం 1979, జనవరి 27) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, కోచ్, న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టు తరపున ఆడాడు. న్యూజీలాండ్ తరఫున టెస్ట్ క్రికెట్ క్యాప్ గెలిచిన 200వ ఆటగాడు. నార్తర్న్ కాన్ఫరెన్స్ క్రికెట్ జట్టు తరపున దేశీయ క్రికెట్ ఆడాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | డేనియల్ లూకా వెట్టోరి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆక్లాండ్, న్యూజీలాండ్ | 1979 జనవరి 27|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | మార్తా, హ్యారీ పాటర్[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 3 అం. (1.91 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 200) | 1997 6 February - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2014 26 November - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 101) | 1997 25 March - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2015 29 March - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 11 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 25) | 2007 12 September - Kenya తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2014 5 December - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1996/97–2014/15 | Northern Districts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003 | Nottinghamshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006 | Warwickshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | Delhi Daredevils | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009/10 | Queensland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2012 | Royal Challengers Bangalore | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12–2014/15 | Brisbane Heat | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2015 | Jamaica Tallawahs | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2016 13 February |
1997 ఫిబ్రవరిలో 18 సంవత్సరాల వయస్సులో టెస్టు క్రికెట్లో న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. 2007 - 2011 మధ్యకాలంలో న్యూజీలాండ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. 112 టెస్ట్ క్యాప్‌లు, 291 వన్డే క్యాప్లతో న్యూజీలాండ్‌లో అత్యధికంగా ఆడిన టెస్ట్ క్రికెటర్, వన్ డే ఇంటర్నేషనల్ క్రికెటర్ గా నిలిచాడు. బౌలింగ్ ఆల్ రౌండర్ గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో 300 వికెట్లు తీయడంతోపాటు 3,000 పరుగులు చేసిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు.
స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. వెట్టోరి 2015 క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.[2]
2007లో కెప్టెన్‌గా మారడానికి ముందు, వన్డే క్రికెట్లో న్యూజీలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రారంభ ట్వంటీ20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో న్యూజీలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.[3] ఆ తర్వాత అన్ని ఫార్మాట్లలో జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.[4]
2011 ప్రపంచ కప్ తర్వాత వన్డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 క్రికెట్ ప్రపంచ కప్ కోసం వన్డే జట్టులోకి తిరిగి పిలిపించబడ్డాడు.[5] ఆ సమయానికి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. 2014 నవంబరులో పాకిస్తాన్‌తో చివరి టెస్ట్ మ్యాచ్ జరిగింది.
2014 నుండి 2018 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. 2019 జూలైలో, యూరో టీ20 స్లామ్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి సీజన్లో డబ్లిన్ చీఫ్స్‌కు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాడు.[6] తర్వాత టోర్నమెంట్ రద్దు చేయబడింది. అదే నెలలో, బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్ అయ్యాడు.[7] 2021 ఆగస్టులో కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ బార్బడోస్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాడు.[8] వెట్టోరి ఆస్ట్రేలియాకు సహాయకుడిగా, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.[9]
2023 ఆగస్టులో, వెట్టోరి సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు.[10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.