![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4b/Tenzing_Norgay_%2528cropped%2529.jpg/640px-Tenzing_Norgay_%2528cropped%2529.jpg&w=640&q=50)
టెన్సింగ్ నార్కే
నేపాల్ కి చెందిన షెర్పా పర్వతారోహకుడు / From Wikipedia, the free encyclopedia
టెన్సింగ్ నార్కే (జ.మే 29, 1914 - మే 9, 1986) నేపాల్ కి చెందిన ఒక పర్వతారోహకుడు. ఆయన జన్మనామం "నామ్గైల్ వాంగ్డీ ". ఆయన ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి వ్యక్తులలో ఒకరు. ఆయన సహచరుడు అయిన ఎడ్మండ్ హిల్లరీతో కలసి ఎవరెస్టు శిఖరాన్ని మే 29, 1953లో అధిరోహించి చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచారు.[1]. టైమ్ మ్యాగజిన్ ప్రచురించిన 20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రాచుర్యం పొందిన 100 మంది ప్రముఖులలో ఒకరిగా పేరు పొందారు.
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, బాల్యనామం ...
![]() ఎడ్మండ్ హిల్లరీ తో టెన్సింగ్ నార్కే | |
వ్యక్తిగత సమాచారం | |
---|---|
బాల్యనామం | నామ్గైల్ వాంగ్డీ |
ప్రధాన రంగం | పర్వతారోహకుడు |
జననం | మే 1914 కుంబూ, నేపాల్ రాజ్యం |
మరణం | 1986 మే 9(1986-05-09) (వయసు 71) డార్జిలింగ్, భారత దేశము |
జాతీయత | నేపాలీ, భారత దేశం |
వృత్తి జీవితం | |
ప్రారంభ వయస్సు | 19 సంవత్సరాలు |
ప్రారంభ రంగం | Porter |
గుర్తించదగిన ఆధిరోహణలు | First ascent Mount Everest −1953 |
ప్రసిద్ధ భాగస్వామ్యాలు | Edmund Hillary |
కుటుంబం | |
జీవిత భాగస్వామి | డవ ఫుటి, ఆంగ్ లాహ్ము, డక్కు |
పిల్లలు | పెమ్పెం , నిమా, జామ్లింగ్, నోర్బు. |
మూసివేయి
1953 లో నేపాల్ రాజు త్రిభువన్ ఆర్డర్ ఆఫ్ ది స్టార్ పురస్కారాన్ని ప్రకటించాడు. 1959 లో ఈయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది.