From Wikipedia, the free encyclopedia
టిబెట్, మధ్య ఆసియా లోని పీఠభూమి ప్రాంతం. ఇది భారతీయ సంతతికి చెందిన టిబెట్ వాసుల నివాసప్రాంతం. ప్రాచీనులు దీనిని త్రివిష్టపము అని పిలిచేవారు. సముద్రమట్టానికి దీని సగటు ఎత్తు 4,900 మీటర్లు లేదా 16,000 అడుగులు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంగా, "ప్రపంచపు పైకప్పు"గా ప్రసిద్ధి చెందింది. భౌగోళికంగా యునెస్కో, ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా[1] ల ప్రకారం ఇది మధ్య ఆసియా ప్రాంతం, కానీ చాలా విద్యాసంఘాలు దీనిని దక్షిణాసియా ప్రాంతంగా గుర్తిస్తాయి.
టిబెట్ కాందిశీకుల దావా ప్రకారం చారిత్రక టిబెట్ | |||||||||
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) వారి టిబెట్ ప్రాంతాలు | |||||||||
టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతం (యథార్థ అధీనం) | |||||||||
భారతదేశం చే క్లెయిమ్ చేయబడ్డ ప్రాంతం అక్సాయ్ చిన్ | |||||||||
PRC చే క్లెయిమ్ చేయబడ్డ (TAR) టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతం | |||||||||
టిబెట్ సాంస్కృతిక ప్రాంతాల, చారిత్రాత్మక ఇతర ప్రదేశాలు |
బర్మా - టిబెట్ సమూహానికి చెందిన టిబెటన్, ఇక్కడి వాడుక భాష. ఈ భాష అర్థం చేసుకోవడానికి వీలుకాని పలు యాసలతో వాడుకలో ఉంది. ఇది టిబెట్ అంతటా, భూటాన్, నేపాల్ లోని కొన్నిప్రాంతాలు, ఉత్తర భారతంలోని సిక్కిం వంటి కొన్ని ప్రాంతాలలో వాడుకలో ఉంది. లాసా, ఖాం, అండో, సమీపంలోని కొన్ని ప్రాంతాలతో కూడిన మద్య టిబెట్‌లో టిబెటన్ యాసలు వాడుకలో ఉన్నాయి. మిగిలినవి డ్జొగ్ఖ, సిక్కిమీస్, షెప్ర, లడఖి భాషలు వాడుకలో ఉన్నాయి. గ్రేటర్ టిబెట్‌లో వాడుకలో ఉన్న టిబెటన్ తరహా భాషలన్నీ టిబెటన్ భాషల జాబితాలోకి చేర్చబడ్డాయి. 1,50,000 ప్రజలకు వాడుకలో ఉన్న టిబెట్ భాష మాట్లాడే ప్రజలు టిబెట్, భారత్, ఇతర దేశాలలో నివసిస్తున్నారు.
టిబెటన్ వ్యవహార భాష ప్రాంతాలవారిగా వేరుపడుతుంది. వ్రాత భాష సంప్రదాయ రీతిలో ఉంటుంది. వ్రాత భాష దీర్ఘకాలం నిలిచి ఉన్న టిబెటన్ భాషా ప్రభావితమై ఉంది. ప్రస్తుతం టిబెట్ భాష విస్తరించి ఉన్న ప్రాంతం మొత్తం ఒకప్పుడు టిబెట్ సామ్రాజ్యంలో ఉండేది. పురాతన టిబెట్ పశ్చిమంలో ఉత్తర పాకిస్థాన్, తూర్పున యున్నన్, సిచుయాన్, ఉత్తరంలో క్వింఘై సరసు, దక్షిణంలో భూటాన్ ఉన్నాయి. టిబెట్ భాషకు టిబెటన్ లిపి ఉంది. దీనిని భారతీయ బ్రహ్మీ లిపికి చెందిన లడకి, డొంగ్ఖ భాషలను వ్రాయడానికి ఉపయోగిస్తారు. [2] 2001లో ప్రాంతీయ సంజ్ఞా భాష ప్రారంభించబడింది.
టిబెట్ సామ్రాజ్యం 7వ శతాబ్దంలో స్థాపించబడింది. తరువాత ఇది వివిధ భూభాగాలుగా విభజించబడింది. పశ్చిమ, మద్య టిబెట్ కలిపి లాసా, షిగాత్సే సమీప ప్రాంతాలను కలిపి పలువురు పాలించారు. టిబెట్ పాలకులను ఓడించి పలుమార్లు మంగోలియన్లు, చైనీయులు ఈ ప్రాంతాన్ని పాలించారు. తూర్పు భూభాగాలలోని ఖాం, అంబో ప్రాంతాలు పలువురు స్థానికుల స్వాధీనంలో పలు సంస్థానాలుగా, గిరిజన ప్రాంతాలుగా ఉండేవి. తరువాత ఇవి చైనీయుల ఆధీనంలో సిచౌన్, క్వింఘై భూభాగాలుగా మారాయి. ప్రస్తుత టిబెట్ సరిహద్దులు 18వ శతాబ్దంలో స్థిరీకరించబడ్డాయి.[3]
7 వ శతాబ్దం సాంగ్ త్సాన్ గాంపో రాజు కాలంలో టిబెట్‌లోని చాలా ప్రాంతాలు ఏకీకృతం చేయబడ్డాయి. 1751 లో చైనాను 1644, 1912 ల మధ్య ఏలిన ఖింగ్ ప్రభుత్వం దలైలామాను టిబెట్ ఆధ్యాత్మిక రాజకీయ నాయకుడిగా నియమించింది, ఇతను ప్రభుత్వాన్ని ('కషాగ్') నడిపాడు.[4] 17వ శతాబ్దంనుండి 1951 వరకు దలైలామా, అతని అధికారులు రాజపాలన, ధార్మిక పాలనాధికారాలను సాంప్రదాయిక టిబెట్, రాజధాని లాసా పై కలిగి ఉండిరి.
1862లో క్వింగ్ పాలనకు వ్యతిరేకంగా క్సింహై తిరుగుబాటు తరువాత క్వింగ్ సైనికులు నిరాయుధులుగా టిబెట్ లోని యు- త్సాంగ్ ప్రాంతం వదిలి వెళ్ళారు. తరువాత 1913లో టిబెట్ ప్రాంతం స్వతంత్రం ప్రకటించుకుంది (రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం గుర్తింపు లేకుండా). [5] తరువాత క్సికాంగ్ పశ్చిమ ప్రాంతాన్ని లాసా స్వాధీనం చేసుకుంది. 1951 వరకు ఈ ప్రాంతం స్వతంత్రంగా ఉంది. చందో యుద్ధం తరువాత టిబెట్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో విలీనం చేయబడింది. 1959 తిరుగుబాటు విఫలం అయిన తరువాత టిబెట్ ప్రభుత్వం రద్దు చేయబడింది. .[6] ప్రస్తుతం చైనా పశ్చిమ, మద్య టిబెట్‌ను " టిబెట్ అటానమస్ రీజియన్ "గా పాలిస్తోంది. తూర్పు టిబెట్ లోని క్వింఘై, సిచుయన్, సమీప ప్రాంతాలు ప్రస్తుతం స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. [7] వారసత్వ సంతతి బృందాలు ప్రస్తుతం దేశం వెలుపల ప్రవాసంలో ఉన్నాయి.[8] టిబెటన్ తిరుగుబాటుదారులు ఖైదుచేయబడడం, హింసకు గురైయ్యారు. .[9]
టిబెట్టు దేశస్థులు మంగోలియా జాతికి చెందుతారు. వీరికి మతమంటే అమితమయిన గౌరవము, మూఢ విశ్వాసము కూడా. ప్రతీ ప్రదేశంలోనూ భూతాలు సంచరిస్తుంటాయని వారినమ్మకం. వాటిని ప్రారద్రోలటానికి ఓం మణి పద్మేహం అని మంత్రోచ్చారణ చేస్తారు. ఈమంత్రం వారి ప్రార్థన యొక్క బీజం. ఇక్కడ మత గురువుల్ని లామా లంటారు. ప్రధాన మతాధికారి దలైలామా. ఇతనే సర్వాధికారి, రాజ్యపాలన యందు కూడా, దలైలామా అంటే టిబెట్టు వారికి చాలాగౌరవము. ఒక దలైలామా మరణించిన తరువాత, సర్వాధికారము వహించడానికి తగిన శిశువును మతాధికారులు వెదకి దలైలామాగా ఎన్నుకుంటారు. మరణించిన దలైలామా యొక్క ఆత్మ ఈశిశువులో ప్రవేశిస్తుందని వీరి నమ్మకం. ఆ రోజు నుంచి ఆ శిశువుకు సర్వ విద్యలను నేర్పడం మొదలుపెడతారు. దలైలామా టిబెట్టు ముఖ్య పట్టణమయిన లాసా లో ఉంటారు. లాసా పట్టణం బ్రహ్మపుత్రానది (సాన్-పొ) లోయకు ఉత్తరంగా ఉంది. దలైలామా నివసించే భవనాన్ని పొటాలా అంటారు. ఇది 900 అడుగుల యెత్తు ఉండి, విశాలంగా ఉంటుంది.
టిబెట్టు వారికి మొదట్లో విదేశీయులంటే అనుమానం. వారి మతాన్ని, దేశాన్ని సర్వ నాశనంచేసి, దేవతలు సంచరించే ఆ ప్రదేశాల్ని అపవిత్రం చేస్తారని అపోహ పడేవారు. 18వ శతాబ్దాన్న వారెన్ హేస్టింగ్స్ కొంతమంది పాశ్చాత్యుల్ని లాసా పంపాడు, టిబెట్టు వారితో మైత్రికోరుతు. అది అంతగా ఫలించలేదు. తరువాత 1904లో సర్ ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ నాయకత్వం మీద బ్రిటీషు దళం లాసా చేరబోయింది. టిబెట్టు సైనికులు ఎదుర్కొన్నారు. బ్రిటీషువారు అగ్ని వర్షం కురిపించడంతో టిబెట్టు సైనికులు చెల్లా చెదురై, కల్నల్ యంగ్ హస్బెండ్ కి దారి ఇచ్చేసారు. కల్నల్ లాసాచేరి పొటాలా భవనం మీదనుంచి ఒకసాయంత్రం మంచు శిఖరాల అలలలో మునిగిపోతున్న సూర్యుణ్ణి అవలోకిస్తుంటే, తనలో యేదో హఠాత్తుగా మార్పు వచ్చి జ్ఞాన సంబంధమయిన అనుభవాన్ని పొంది తాను చేసిన పనికి పశ్చాతాపం పడ్డట్టు అతని అనుభవాలలో రాసుకున్నాడు. అప్పట్నుంచి టిబెట్టు వారు పాశ్చాత్యుల్ని అనుమతిస్తున్నారు అని చెబుతారు. 1933సం.లో 13వ దలైలామా చనిపోయాక ఇప్పటి 14వ దలలామాని టిబెట్టు మత గురువులు ఎన్నుకొన్నారు. హిమాలయాలు ఖనిజాలకు ఆటపట్టు. టిబెట్టులో బంగారం గనులు విశేషముగా ఉన్నాయి.
సా.శ.1వ శతాబ్దంలో యూఎచీ అనే జాతి వారు మధ్య ఆసియా నుంచి భారతదేశంపైకి దండెత్తి వచ్చి దేశంలో స్థిరపడ్డారు. వారిలో ఒక తెగకు చెందిన కుషాన్ వంశస్థులు భారతదేశ చక్రవర్తిత్వాన్ని పొందారు. వీరిలో ఒకరు భారతీయ చక్రవర్తుల్లో అగ్రగణ్యుడైన కనిష్కుడు మధ్య ఆసియాలోని కాష్ ఘర్, యార్ ఖండ్ మొదలైన ప్రాంతాలను జయించారు. ఆయన మతాభిమానంతోనే మధ్యఆసియాలో మహాయాన బౌద్ధమతం విస్తరణ చెందింది. అక్కడ నుంచే బౌద్ధం చైనాకు చేరింది[10].
టిబెటన్ పీఠభూమిలో మానవులు 21,000 సంవత్సరాల మునుపు నుండి నివసిస్తున్నారు.[11] 3,000 సంవత్సరాల ముందు నియోలిథికల్ ప్రజలు పురాతన స్థానికులను ఈ ప్రాంతం నుండి తరిమివేసి ఇక్కడ స్థిరపడ్డారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో ఇప్పటికీ పాలియో లిథిక్ స్థానికులు సమకాలీన టిబెట్ ప్రజలతో నివసిస్తూ ఉన్నారు.[11]
పశ్చిమ టిబెట్‌లోని ప్రస్తుత గూగ్ ప్రాంతంలో పురాతన చారిత్రక ఝాంగ్ ఝుంగ్ సస్కృతికి చెందిన లిఖితపూరిత ఆధారాలు లభించాయి. ఝాంగ్ ఝుంగ్ ప్రజలు అంబొ ప్రాంతం నుండి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. .[12] ఝాంగ్ ఝుంగ్ ప్రజలు బోన్ మతం స్థాపకులని భావిస్తున్నారు. [13] క్రీ.పూ మొదటి శతాబ్దం టిబెట్ పొరుగున ఉన్న యార్లంగ్ లోయలో సామ్రాజ్య స్థాపన చేయబడింది. ఝాంగుల పురోహితుని యార్లాంగ్ ప్రాంతం నుండి బహిష్కరించడం ద్వారా యార్లాంగ్ రాజు డ్రిగుం త్సెంపొ ఝాంగ్ ఝుంగ్ ప్రజల ప్రాబల్యం తగ్గించడానికి ప్రయత్నించాడు.[14] యార్లాంగ్ హత్యకు గురైన తరువాత ఈ ప్రాంతంలో ఝాంగ్ ఝుంగ్ ఆధిక్యత కొనసాగింది. తరువాత 7వ శతాబ్దంలో సాంగ్ట్సెన్ గంపొ ఈ ప్రాంతాన్ని తమతో విలీనం చేసుకున్నారు. సాంగ్ట్సెన్ గంపొ విలీనం చేసుకొనక ముందు టిబెట్ రాజు వాస్తాలకంటే పౌరాణిక విశ్వాసాల మీద విశ్వాసం అధికంగా ఉంది. అయినప్పటికీ ఈ ప్రజల ఉనికి గురించిన ఆధారాలు తగినంతగా లభించలేదు.[15]
సమైక్య టిబెట్ చరిత్ర " సంగ్త్సన్ గాంపొ " పాలనా కాలం (604-650) నుండి లభిస్తుంది. యర్నాంగ్ త్సంగ్పొ నదీ లోయాప్రాంతాన్ని సమైక్యం చేసి టిబెట్ సామ్రాజ్యస్థాపన చేసాడు. ఆయన సామ్రాజ్యంలో పలు సంస్కరణలు చేసి టిబెట్ శక్తిసామర్ధ్యాలు వ్యాపింపజేసి శక్తివంతమైన టిబెట్ సామ్రాజ్యం స్థాపన చేసాడు. ఆయన మొదటి భార్య భ్రికుతి నేపాల్ రాజకుమార్తె. అందువలన ఆమె టిబెట్ సామ్రాజ్యంలో బౌద్ధమత స్థాపన, వ్యాప్తిచెందడంలో ప్రధాన పాత్ర వహించింది. 640 లో ఆయన వెంచెంగ్ రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. వెంచెంగ్ రాజకుమార్తె చైనీస్ చక్రవర్తి తైజాంగ్ ఆఫ్ తాంగ్ చినల్ మేనకోడలు.[16]
తరువాత టిబెట్‌ను పాలించిన రాజుల పాలనలో బౌద్ధమతం రాజ్యాంగ మతంగా స్థాపించబడింది. తరువాత టిబెటన్ శక్తి మద్య ఆసియా వరకూ వ్యాపించింది. 763 నాటికి తాంగ్ సామ్రాజ్యం రాజధాని చంగన్ (ప్రస్తుత క్సియాన్) వరకు బౌద్ధమతం వ్యాపించింది.[17] తరువాత తాంగ్, కూటమికి చెందిన ఉఘూర్ ఖంగనాతే సైన్యాలు టిబెట్‌ను ఓడించిన తరువాత 15 రోజులలోపు టిబెట్ పూర్తిగా ఆక్రమించబడింది.
750-794 నంఝాయో సామ్రాజ్యం (యునాన్, పొరుగు ప్రాంతాలు) టిబెట్ ఆధీనంలో ఉంది. తరువాత వారు టిబెట్ మీద తిరుగుబాటు ప్రకటించిన తరువాత వారికి చైనీయులు సహకరించడంతో టిబెట్ ఘోరపరాజయం పాలైంది.[18]
747లో టిబెట్ జనరల్ గాయో క్సియాంజితో చేసిన యుద్ధంలో ఓడిపోయింది. గాయో క్సియాంజి మద్య ఆసియా, కాశ్మీర్ మధ్య సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. 750 నాటికి టిబెట్ మద్యాసియా ప్రాంతాల మీద ఆధిపత్యం దాదాపు పూర్తిగా కోల్పోయింది. తరువాత తాంగ్ రాజవంశం మద్య ఆసియా మీద ఆధిపత్యం దక్కించుకుంది. తరువాత గాయో క్సియాంజి 751లో తలాస్ యుద్ధంలో అబ్బాసిద్, కార్లుక్స్ చేతిలో ఓడిపోయాడు. 755 జరిగిన అంతర్యుద్ధం తరువాత ఈ ప్రాంతంలో చైనీయుల ప్రభావం తగ్గి టిబెటన్ల ఆధిక్యత పునఃస్థాపించబడింది.
780-790 నాటికి టిబెట్ సామ్రాజ్య ప్రాభవం శిఖరాగ్రానికి చేరుకుంది. ఆసమయంలో ఆధినిక ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, బర్మా, చైనా, ఇండియా, నేపాల్, పాకిస్థాన్, కజకిస్థా, తజకిస్థాన్ భూభాగం కూడా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.
821-822 టిబెట్, చైనా శాంతి ఒప్పందం మీద సంతకం చేసాయి. ద్విభాషలలో లిఖించబడిన ఈ ఒప్పందపత్రాలలో ఇరుదేశాల సరిహద్దుల గురుంచిన వివరాలు ఒక రాయి స్తంభం మీద చక్కబడి ఉన్నాయి. అది లస్సాలోని జాఖంగ్ ఆలయం వెలుపల ఉంది.[19] 9 వ శతాబ్దం వరకు టిబెట్ మద్య ఆసియా సామ్రాజ్యంగా కొనసాగింది. తరువాత వారసత్వ అధికారం కొరకు జరిగిన అంతర్యుద్ధం తరువాత సామ్రాజ్యం చిన్న చిన్న భాగాలుగా విడివడింది. ఈ యుగాన్ని రాజకీయంగా " ఫ్రాగ్మెంటేషన్ యుగం " అని వర్ణించారు. తరువాత టిబెట్ ప్రాంతీయ భూస్వాములు, యుద్ధవీరుల ఆధిక్యానికి గురంది. తరువాత కేంద్రీకృత పాలన స్థాపించబడలేదు.
యువాన్ సామ్రాజ్యం బుద్ధిస్ట్, టిబెటన్ అఫైర్స్ (క్సుయాన్ యువాన్) అత్యున్నత స్థాయి పాలనా వ్యవస్థను స్థాపించాయి.వీరిలో డ్పాన్ - చెన్ (ప్రధాన నిర్వాహకుడు) ను లామా నియమించగా బీజింగ్‌లోని మంగోలియన్ చక్రవర్తి ఆమోదముద వేస్తాడు.[20] శాఖ్యలామ ఈ ప్రాంత రాజకీయాలను అధికంగా ప్రభావితం చేసాడు. డ్పాన్- చెన్ సైనిక, నిర్వహణాధికారం కకిగి ఉండేవాడు. చైనా ప్రధానభూమి నుండి టిబెట్‌ను ప్రత్యేకించి మంగోలియన్లు ఈ ప్రాంతపాలన సాగించారు. శాఖ్యలామా, డ్పాన్- చెన్ మద్య కలతలు అధికం అయినప్పుడు డ్పాన్ - చెన్ ఈ భూభాగంలో చైనా సౌనికులను ప్రవేశపెట్టాడు. .[20]
మంగోలియన్లు నిర్మాణత్మకమైన నిర్వహణాధికారం కలిగిన సమయంలో టిబెట్ అధికారం ఈ ప్రాంతం మీద నామమాత్రంగా ఉండేది.[21] సైనికాధికారం ప్రవేశపెట్టిన తరువాత ఈ ప్రాంతంలో యువాన్ ఆధిపత్యం, మంగోలియన్ల ఆధిపత్యం కలగలసిన ధ్వంధపరిపాలన కొనసాగింది.[20] 1240లో శాఖ్య లామా మార్గదర్శకత్వంలో శాఖ్య లామా స్వస్థానం కేంద్రంగ మంగోలియన్ రాకుమారుడు ఖుడెన్ ఈ ప్రాంతం మీద తాత్కాలిక ఆధిపత్యం సాధించాడు.
మింగ్ వశస్థులు మంగోలియన్లకు వ్యతిరేకంగా పోరాడి యువాన్, తాయ్ సితు చంగ్చుబప్బ్లను తొలగించి ఈ ప్రాతం మీద ఆధిపత్యం సాధించారు.[22] తరువాత తాయ్ సితు చంగ్చుబ్ గ్యాల్స్టెన్ ఫగ్మొద్రుపా సామ్రాజ్యాన్ని స్థాపించి టిబెట్ ప్రాంతంలో టిబెటన్ సంప్రదాయం, రాజకీయాల మీద యువాన్ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడు.[23]
1346, 1354 తాఇ సుతు చంగ్చుబ్ జియాల్త్సెన్ శాఖ్య లామాను పక్కకు తప్పించి ఫహ్మొద్రుపా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తరువాత 80 సంవత్సరాలలో జే త్సాంగ్ఖప శిష్యులు గ్లెగ్ స్కూల్స్ (యెల్లో హాఋస్) స్థాపన చేసి లాసా వద్ద ప్రత్యేకమైన గండెన్, డ్రెపంగ్, సెరా స్తూపాలను స్థాపించారు. అయినప్పటికీ రాజకీయ, మత విభేదాలు, భూస్వాముల ఆధిక్యత కారణంగా ఈ ప్రాంతంలో తలెత్తిన వరుసగా అంతర్యుద్ధలు జరిగాయి. 1435లో పశ్చిమ టిబెట్‌లో ఉన్న యు- త్సంగ్ లో నివసుస్తున్న రిపుంగ మంత్రి కుటుంబం రాజికీయంగా ఆధిక్యత సాధించింది. 1565లో వారిని త్సంగ్ప వంశస్థులు వారిని తొలగించి సామ్రాజ్యస్థాపన చేసారు. వారు టిబెట్ పరిసరప్రాంతాలకు రాజ్యవిస్తరణ చేసి కొన్ని దశాబ్ధాల వరకు ఆధిక్యత సాధించారు. వారు కర్మకగ్యూ సిద్ధాంతాన్ని అనుసరించారు.
1578 లో తుండ్ మంగోలుకు చెందిన ఆల్టన్ ఖాన్‌కు 3వ దలై లామా అయ్యాడు.[24]
5వ దలై లామా టిబెటన్ గెల్గ్ స్కూల్స్ ఆధీనంలో తన ప్రత్యర్థులైన కహయి, జొనాగ్ సిధ్హాంతాలను, లౌకిక మతపాలకుడైన త్సంగా రాకుమారుని అధిగమిస్తూ టిబెటన్ మద్యప్రాంతాన్ని ఏకీకృతం చెయ్యడానికి ప్రయత్నించాడు. గుషి ఖాన్, ఒరియట్ నాయకుడు ఖొషత్ సహకారంతో దలైలామా ప్రయత్నాలు కొంతవరకు ఫలించాయి.
క్వింగ్ రాజవంశం1724లో అండో ప్రాంతాన్ని వశపరచుకున్నారు. 1728లో పొరుగున ఉన్న తూర్పు ఖాం భూభాగం చైనాలో విలీనం చేయబడింది.[25] అదే సమయం క్వింగ్ ప్రభుత్వం లాసాకు ఒక కమీషనర్‌ను పంపింది. 1750లో లాసాలో అంబన్లు, హాన్ చైనీయులలో అత్యధికులు, మంచూలు 1750 లాసా తిరుగుబాటులో చంపబడ్డారు. తరువాత సంవత్సరం లాసాలో ప్రవేశించిన క్వింగ్ సైన్యం తిరుగుబాటును అణిచివేసింది. తరువాత క్వింగ్ సామ్రాజ్యానికి చెందిన మంచూలు సైన్యంలో ఆధిక్యత, ప్రాంతీయ పాలానలో సాధించారు. ఈ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి అంతస్తు ఇవ్వబడింది. క్వింగ్ కమాండర్ అనేక తిరుగుబాటుదారులను వధింపజేసాడు. 1723-1728 మధ్యాకాలంలో రాజకీయంగా పలుమార్పులు సంభవించాయి. క్వింగ్ దలై లామాను పాలకునిగా, కషంగ్ పేరుతో అధికారిగా నియమించింది.[26] అయినప్పటికీ అంబన్ను తొలగించి టిబెట్ రాజకీయాలలో నేరుగా జోక్యం చేసుకుంటూ తమ ఆధిక్యత చాటుకుంది.క్వింగ్ తన అధికారం నిలబెట్టుకోవడానికి కీలకపదవులలో తమకు అనూలమైన అధికారులను నియమించింది.[27]
తరువాత కొన్ని దశాబ్ధాలు టిబెట్ ప్రాంతంలో ప్రశాంత పరిస్తుతి నెలకొన్నది. 1792లో క్విలాంగ్ చక్రవర్తి టిబెట్‌కు పెద్ద సైన్యాన్ని పంపి నేపాలీయులను వెలుపలికి పంపడానికి ప్రయత్నించాడు. ఇది టిబెట్‌లోని క్వుంగ్ రీఆర్గనైజేషన్ సంస్థకు ప్రేరణ కలిగించింది. వారు " టిబెట్‌లో ఉత్తమ ప్రభుత్వ స్థాపనకు 29 క్రమబద్ధీకరణ సూత్రాలు " పేరుతో లిఖితపూర్వక ప్రణాళికను రూపొందించారు. తరువాత క్వింగ్ బృందాలతో విస్తరించబడిన క్వింగ్ సౌన్యం నేపాల్ సరిహద్దులో నిలబెట్టబడింది.[28] 18వ శతాబ్దంలో టిబెట్ మీద మంచూలు ఆధిక్యత సాగించారు. 1792 తరువాత క్వింగ్ సామ్రాజ్య సవరణలు శిఖరానికి చేరుకున్నాయి. తరువాత ఈ ప్రాంతం మీద క్వింగ్ రాజప్రతినిధుల ఆధిక్యత కొనసాగింది. .[29]
1834లో సిక్కు సామ్రాజ్యం టిబెట్ మీద దండ యాత్రాచేసి స్వతంత్ర రాజ్యంగా ఉన్న టిబెట్‌లోని కొంత ప్రాంతాన్ని లడక్‌తో విలీనం చేసింది. 7 సంవత్సరాల తరువాత జనరల్ జొర్వార్ సింగ్ నాయకత్వంలో సిక్కు సేనలు సినో - సిఖ్ యుద్ధంలో పశ్చిమ టిబెట్ మీద దండయాత్రచేసాయి. క్వింగ్- టిబెటన్ సైన్యం దండయాత్రదారుల మీద దాడి చేసి వారిని లడక్ వరకు తరిమికొట్టాయి. చైనా, సిక్కు సామ్రాజ్యాల మద్య చేసుకున్న చుషుల్ - ఒప్పందంతో యుద్ధం ముగింపుకు వచ్చింది. .[30]
క్వింగ్ సామ్రాజ్యం పతనం అయిన తరువాత టిబెట్ కూడా క్రమంగా పతనావస్థకు చేరుకుంది. 19 శతాబ్ధానికి టిబెట్ ప్రభావం క్షీణించింది. 19వ శతాబ్దంలో టిబెట్ ప్రాంతంలో క్వింగ్ ఆధిక్యత మరుగున పడింది.[31][32][33][34].[35]
తరువాత టిబెట్ జెసూయిట్లు, కాపూచున్లతో కొన్ని సంబంధాలను కలిగిఉంది. 1774 లో స్కాటిష్ ప్రముఖుడు దూతగా టిబెట్‌కు పంపబడ్డాడు. ఆయన షిగాస్తెకు చేరుకుని బ్రిటిష్ ఈస్టుండియా కంపెనీ తరఫున వ్యాపార అవకాశాలను పరిశీలించాడు.[36] 19వ శతాబ్దం నాటికి టిబెట్‌కు విదేశీయులరాక అధికం అయింది. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం ఉత్తర సరిహద్దులో ఉన్న హిమాలయాల వరకు విస్తరించింది. ఆఫ్ఘనిస్తాన్ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యం మధ్య ఆసియా వరకు విస్తరించబడ్డాయి. సామ్రాజ్య శక్తుల దండయాత్ర ప్రభావం టిబెట్ మీద అధికంగానే ఉంది.
1904లో రష్యా సామ్రాజ్య విస్తరణచేస్తూ టిబెట్‌ను సమీపిస్తున్న తరుణంలో బ్రిటిషు ప్రభుత్వం టిబెట్ యాత్రచేసి దలైలామాతో విజయవంతంగా ఫలవంతమైన చర్చలు చేసింది.[37][38] 1906లో చైనా ప్రాతినిధ్యం వహిస్తున్న టిబెట్‌కు బ్రిటన్‌కు మద్య "లాసా ఒప్పందం కుదిరింది" [39] దీని మీద ఐర్లాండ్ బ్రిటన్, యునైటెడ్ బ్రిటన్, చైనా సంతకాలు చేసాయి. 1910 లో క్వింగ్ ప్రభుత్వసేనలు జాహో ఎర్ఫెగ్ నాయకత్వంలో టిబెట్ మీద దాడి చేసిన సమయంలో దలైలామా టిబెట్ నుండి బ్రిటన్ ఇండియాకు పారిపోయాడు. జాహో ఎర్ఫెగ్ సైన్యం టిబెట్ సైన్యాలను ఓడించి దలైలామా సైన్యాలను ఈ భూభాగం నుండి తరిమికొట్టాయి. తరువాత జాహో ఎర్ఫెగ్ సాగించిన ప్రజావ్యతిరేక చర్యలు, ప్రాంతీయ సంప్రదాయాలను అవమానించడం వంటి కార్యజ్రమాలతో జాహో ఎర్ఫెగ్ టిబెట్ ప్రజల అభిమానాన్ని కోల్పోయాడు.
క్సిన్హై తిరుగుబాటు (1911-12) తరువాత క్వింగ్ సౌన్యం టిబెట్ నుండి వైదొలగింది. సరికొత్తగా అవతరించిన " రిపబ్లిక్ ఆఫ్ చైనా " క్వింగ్ చర్యలకు టిబెట్‌కు సంజాయిషీ చెప్పి దలైలామాను తిరిగి తన స్థానంలో నిలిపింది.[40] అయినప్పటికీ దలైలామ చైనా బిరుదును తిరస్కరించి స్వయంగా టిబెట్ పాలకుడిగా (1912-1915) ప్రకటించుకున్నాడు.[41] 1913లో టిబెట్, మంగోలియా (1911- 1919) పరస్పరం గుర్తించుకుంటూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి.[42] తరువాత 36 సంవత్సరాలు టిబెట్‌లో 13వ దలైలామాల పాలన సాగింది. ఈ సమయంలో టిబెట్ టిబెట్ సాంస్కృతిక నగరాలైన క్సికాంగ్, అంబో, క్వింఘై మీద ఆధిక్యత సాధించడానికి దలైలామా చైనాతో యుద్ధం చేసాడు.[25]1914లో బ్రిటన్ - టిబెట్ మద్య జరిగిన " సిమ్లా ఒప్పందం(1914)" తరువాత టిబెట్ దక్షిణ టిబెట్ ప్రాంతాన్ని బ్రిటన్ ఇండియాకు స్వాధీనపరచింది. చైనా ప్రభుత్వం ఈ ఒప్పందం చట్టవిరుద్ధమని ప్రకటించింది.[43][44]1930 - 1940 రాజప్రతినిధులు నిర్వహణలో చేసిన అలక్ష్యం కారణాంగా చైనా ప్రభుత్వం టిబెట్ భూభాగాన్ని కొంత ఆక్రమించుకుంది.[45]
1950లో చైనా అంతర్యుద్ధం తరువాత " పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా " ఆధ్వర్యంలో చైనా రిపబ్లిక్ రూపొందించబడింది. 14వ దలైలామా చైనా సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ 17 అంశాలు కలిగిన శాంతి ఒప్పందం మీద సంతకం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసాడు. టిబెట్‌కు స్వయంప్రతిపత్తి ఇవ్వబడింది. 14వ దలైలామా దేశం నుండి బహిష్కరించిన తరువాత ఒప్పందాన్ని వ్యతిరేకించాడు.[46][47]
దలైలామా తరువాత, ప్రభుత్వాన్ని కూడా భారతదేశంలోని ధర్మశాలకు తరలించాడు. 1959 తిరుగుబాటు సమయంలో టిబెట్ కేంద్రప్రభుత్వం స్థాపించబడింది. తరువాత బీజింగ్‌లో ఉన్న వెలువరించిన ఒప్పదం తరువాత సాంఘిక, రాజకీయ సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి.[48]గ్రేట్ లీప్ ఫార్వార్డ్ సమయంలో 2,00,000 - 10,00,000 మంది టిబెటన్లు చనిపోయారు.[49] సాంస్కృతిక తిరుగుబాటు సమయంలో దాదాపు 6,000 బౌద్ధారామాలు ధ్వంసం చేయబడ్డాయి.[50] 1962లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ విషయమై చైనా, ఇండియాల మద్య "ఇండో - చీనా యుద్ధం" తరువాత వివాదాలు ముగింపుకు వచ్చాయి. యుద్ధంలో చైనాకు విజయం లభించినప్పటికీ చైనా సైనిక బృందాలు మెక్‌మహాన్ రేఖ నుండి ఉత్తరానికి వైదొలగాయి.[44]
1980 లో జనరల్ సెక్రెటరీ, సంస్కర్త హు యావోబాంగ్ టిబెట్‌ను సందర్శించి టిబెట్‌లో రాజకీయ, సాంఘిక, ఆర్థిక సంస్కరణల గురించి వివరించాడు.[51] దశాబ్ధం చివరి కాలం నాటికి డ్రిపంగ్ బౌద్ధారామం, సెరా బౌద్ధారామం సన్యాసులు 1989లో స్వతంత్రం ప్రకటించారు (తియనాన్మెన్ స్క్వేర్ నిరసన). ప్రభుత్వం సంస్కరణలను నిలిపివేసి ప్రత్యేక రాజ్య వ్యతిరేక యుద్ధం ఆరంభించింది.[51] 2008 లో ఆరామాలు, నగరాలలో ప్రత్యేకరాజ్య ఉద్యమం ఆరంభమైన సమయంలో దేశంలో నెలకొన్న అస్థిరతను తొలగించడానికి బీజింగ్ మానవహక్కుల సంరక్షణ సంస్థ, లాసా ప్రభుత్వం టిబెట్ మానహక్కుల సంరక్షణ సంస్థను కలుసుకున్నది.
టిబెట్‌తో కూడిన ఆధునిక చైనా ఆసియాలో భాగంగా ఉంది. .[52] కొన్ని యూరేపియన్ చారిత్రక ఆధారాలు టిబెట్‌లోని కొన్ని ప్రాంతాలు మద్య ఆసియాలో భాగమని తెలియజేస్తున్నాయి. సెంట్రల్ చైనా మైదానానికి టిబెట్ పశ్చిమ భూభాగంలో ఉంది. టిబెట్ క్సిబులోభాగమని భావిస్తున్నారు. చైనా మాద్యమం కూడా టిబెట్‌ను పశ్చిమ చైనాగా వర్ణిస్తుంటాయి.
టిబెట్‌లో ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రంపంచ ఏత్తైన 10 శిఖరాల జాబితాలో ఉన్నాయి. నేపాల్ సరిహద్దులో ప్రంపంచంలో అత్యంత ఎత్తైన పర్వతంగా భావించబడుతున్న ఎవరెస్ట్ పర్వతం ఉంది. టిబెటన్ పీఠభూమిలో (ప్రస్తుత క్వింఘై భూభాగం) లో పలు నదులు జన్మించి ప్రవహిస్తున్నాయి. వీటిలో యంగ్జె, యెల్లో, ఇండస్, మెకాంగ్, గంగా, సల్వీన్, యర్లంగ్, బ్రహ్మపుత్ర నదులు ప్రధానమైనవి.[55] యర్లాంగ్ త్సంగ్పొ నది ప్రవాహం వెంట ఉన్న యర్లంగ్ త్సంగ్పొ గ్రాండ్ కేనియన్ ప్రంపంచంలో లోతైన, పొడవైన కేనియన్లో ఒకటిగా గుర్తించబడితుంది.
టిబెట్ ఆసియా వాటర్ టవర్గా గుర్తించబడుతుంది. టిబెట్ వాటర్ ప్రాజెక్టుల కొరకు చైనా భారీగా పెట్టుబడి పెడుతుంది.[56][57]
సింధు నది, బ్రహ్మపుత్ర నదులు టిబెట్ పశ్చిమంలోని సరసు (టిబెట్: త్సొ మహం) నుండి జనిస్తున్నాయి. ఇది కైలాష్ పర్వతం సమీపంలో ఉంది. కైలాసపర్వతం హిందువులకు, టిబెటన్లకు పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉంది. హిందువులు కైలాస పర్వతాన్ని శివస్వరూపంగా భావిస్తుంటారు. ట్జిబెటియన్లు కైలాష్ పర్వతాన్ని ఖంగ్ రింగ్పొచే అంటారు. టిబెట్‌లో పలు సరసులు (టిబెటియన్లో త్సొ లేక కొ అంటారు) ఉన్నాయి. వీటిలో క్వింఘై, మానసరోవర్, నంత్సొ, పంగొంగ్ త్సొ, యండ్రొక్, సిలింగ్ కొ, లామొ ల- త్సొ, లూమజంగ్డాంగ్ కొ, పైకు, రక్షస్తా, డగ్జే కొ, డొంగ్ కొ ప్రధానమైనవి. క్వింఘై సరసు (కొకొ నొర్) చైనాలోని పెద్ద సరసుగా గుర్తించబడుతుంది.
టిబెట్‌లో సంవత్సరంలో 9 మాసాల కాలం పొడివాతావరణం నెలకొని ఉంటుంది. సరాసరి వార్షిక హిమపాతం 18 అంగుళాలు (46 అంగుళాలు) ఉంటుంది. రెయిన్ షాడో ఎఫెక్ట్ కారణంగా పశ్చిమ ప్రాంతంలో హిమపాతం తక్కువగా ఉంటుంది. అందువలన సంవత్సరం అంతా ప్రయాణానికి అనువుగా ఉంటుంది. పశ్చిమభూభాగంలో నెలకొని ఉండే స్వల్ప ఉష్ణోగ్రత కారణంగా అత్యధికంగా నిర్జనమైన ప్రాంతం చిన్న పొదలు కాక వృక్షజాలం తక్కువగా ఉంటుంది. తూర్పు టిబెట్ ప్రాంతంలో భారతీయ ౠతుపవనాల ప్రభావం ఉంటుంది. ఉత్తర భూభాగంలో వేసవి మిక్కిలి వేడిగానూ శీతాకాలాలు అత్యంత శీతకంగానూ ఉంటాయి.
సస్కృతిక టిబెట్‌లో పలు భూభాగాలు ఉన్నాయి.
టిబెట్‌లో 800 స్థావరాలు ఉన్నాయి. టిబెట్ సంప్రదాయ, స్వయంప్రతిపత్తి కలిగిన టిబెట్ రాజధాని లాసా. లాసాలో పలు ప్రఖ్యాత ఆలయాలు, జొఖంగ్, రమొచే ఆలయం మొదలైన బౌద్ధారామాలు ఉన్నాయి. లాసాకు పశ్చిమంలో ఉన్న షిగత్సే టిబెట్‌లో రెండవ అతిపెద్ద నగరంగా గుర్తించబడుతుంది. పెద్ద నగరాల వరుసలో గ్యాంత్సే, క్వాండొ నగరాలు ఉన్నాయి.
టిబెట్‌లోని ఇతర నగరాలు షిక్యుయాంహే (అలి), నగ్చు, బంద, రుతాగ్, న్యింగ్చి, నెడాంగ్, చొక్వెన్, బార్కం, శాక్య, గర్త్సె, పెల్బార్, లత్సే, తింగ్రి ప్రధానమైనవి. సిచుయాన్లో కంగ్డింగ్ (డార్ట్సెడో), క్వింఘై, జ్యెకుండో (యుషు), మచెన్, గొల్ముద్ ఉన్నాయి. భారతదేశంలో తవంగ్,లెహ్, గంగ్తక్ ఉన్నాయి.
టిబెట్ చైనా ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగి ఉంది. ఇది పీపుల్స్ గవర్నమెంట్ ఆఫ్ చైనా చేత చైర్మన్ నాయకత్వంలో పాలించబడుతుంది. చైర్మన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా బ్రాంచ్ సెక్రెటరీ సాబార్డినేట్. చైర్మన్ టిబెటన్ సంప్రదాయానికి చెందని వాడై ఉంటాడు.[59]
చైనా పాలనకు ముందు టిబెట్ దలైలామా పాలనలో ఉండేది. 4 సభ్యులు కలిగిన కౌన్సిల్ 400-500 అధికారులతో పాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. అధికారులు సంప్రదాయ టిబెటన్ కులీన వ్యవస్థ, కదం, గెలుక్ లకు చెందిన టిబెట్ బౌద్ధారామాలు, లాసాకు చెందిన మద్యతరగతి కుటుంబాల నుండి ఎన్నిక చేయబడతారు.[60]
టిబెటన్ ఆర్థికరంగాన్ని వ్యవసాయం ఆధిక్యత వహిస్తుంది. వ్యవసాయ యోగ్యమైన భూమి స్వల్పంగా ఉన్నందున ఆర్థికరంగంలో తరువాత స్థానంలో పశుపోషణ ఉంది. గొర్రెల పెంపకం, ఆవులు, బర్రెలు, మేకలు, యాక్, ఒంటెలు, డ్జొ, గుర్రాల పెంపకం పశుపోషణలో భాగంగా ఉన్నాయి. ప్రధాన పంటగా బార్లి, గోధుమలు, బక్ వీట్, ర్యే, ఉర్లగడ్డలు, పండ్లు, కూరగాయలు పండించబడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సూచిక అనుసరించి మానవాభివృద్ధి సూచికలో చైనాలోని 31 భూభాగాలలో టిబెట్ చివరి స్థానంలో ఉంది.[61] .[62] సమీప కాలంలో కొన్ని సంవత్సరాల నుండి టిబెటన్ బుద్ధిజాంపట్ల ఆసక్తి అధికం అయినందున పర్యాటకరంగం కూడా అభివృద్ధి చెందింది. అధికారవర్గం పర్యాటక రంగానికి సహకారం అందిస్తుంది.[63] పర్యాటకరంగం హాస్థకళాఖండాల విక్రయానికి సహకరిస్తుంది. హాస్థకళాఖండాలలో టిబెటన్ టోపీలు, కొయ్య వస్తువులు, దుస్తులు, వస్త్రాలు, టిబెటన్ రగ్గులు, కార్పెట్లు ప్రాధాన్యత వహిస్తున్నాయి. కేంద్ర పీపుల్స్ ప్రభుత్వం టిబెట్‌కు పన్ను రాయితీ సౌకర్యం కల్పించి టిబెట్ ప్రభుత్వ నిర్వహణకు 90% నిధులు అందిస్తుంది. .[64][65][66][67] అయినప్పటికీ పెట్టుబడిలో అధికశాతం వలస శ్రామికులకు అందించవలసి వస్తుంది. వారు దేశం వెలుపల స్థిరపడినందున ఆదాయంలో అధికం దేశం వెలుపలకు పంపబడుతుంది.. [68] గ్రామీణ ఆదాయంలో 40% కార్డిసెప్స్ విక్రయం ద్వారా లభిస్తుంది. కార్డిసెప్స్ విక్రయం ద్వారా దేశానికి 1.8 బిలియన్ల యుయాన్లు (225 అమెరికన్ డాలర్లు) లభిస్తున్నాయి. [69]
టిబెట్, క్వింఘై లను క్వింగ్జాంగ్ రైల్వే అనుసంధానించే రైలు మార్గం 2006లో ప్రారంభించబడింది.[70][71][72]
2007లో టిబెటన్ మైదానగర్భంలో పెద్ద మొత్తంలో ఖనిజాల నిల్వలు ఉన్నట్లు చైనా ప్రభుత్వం నివేదిక వెలువరించింది.[73] పరిశోధనలు ఖనిజాల విలువ 128 బిలియన్ల అమెరికండాలర్లు ఉండవచ్చని నివేదిక వివరించింది. దీని ద్వారా చైనా జింక్, రాగి, సీసం నిలువలు రెండు రెట్లు అధికరించగలవని భావిస్తున్నారు. ఖనిజ నిలువలను వెలికి తీయడం ద్వారా చైనా ప్రభుత్వం విదేశీ ఖనిజ దిగుమతులకు వెచ్చించే విదేశీమారక వ్యయం తగ్గించాలని భావిస్తుంది. విమర్శకులు మాత్రం విస్తారమైన ఖనిజసంపద వెలికితీయడంలో టిబెట్ పర్యావరణం, సంస్కృతి దెబ్బతింటాయని భావిస్తున్నారు.[73]
2009 జనవరి 15న ఆగ్నేయ లాసా నగరంలో చైనా టిబెట్ ఎక్స్‌ప్రెస్ వే, 37.9 కి,మీ పొడవైన కంట్రోల్డ్ - యాక్సెస్ - హైవే నిర్మించనున్నట్లు ప్రకటించింది. ప్రాజెక్టు విలువ 1.55 బిలియన్ చైనా యువాన్లు.[74]
2010 జనవరి 10-20 మద్య జరిగిన టిబెట్, టిబెటియన్లు నివసిస్తున్న చైనా లోని సిచుయాన్, యున్నన్, గంసు, క్వింఘై ప్రాంతాల అభివృద్ధి పధకాన్ని ప్రకటించింది. కాంఫరెంస్‌లో హూ జింటాయో, వెన్ జియాబాఒ, జియా క్విన్లిన్, లీ చాంగ్‌చున్, క్సి జింపింగ్, లీ కెక్వియాంగ్, హే గ్యుయోక్వియాంగ్, ఝౌ యాంగ్కాంగ్ జనరల్ సెక్రెటరీలు సి.పి.సి పొలిట్ బ్యూరో కమిటీ మొత్తం సభ్యులు హాజరైయ్యారు. ఈ పధకం ప్రధాన ఉద్దేశం టిబెటన్ గ్రామీణ ఆదాయం 2020 నాటికి జాతీయ స్థాయికి అభివృద్ధి చేయడం, గ్రామీణ టిబెటన్ పిల్లలకు ఉచిత విద్య అందించడం మొదలైనవి ప్రధానాంశాలుగా ఉన్నాయి. 2001 నుండి టిబెట్‌లో చైనా 310 బిలియన్ల యుయాన్లు పెట్టుబడులు పెట్టింది. 2009 నాటికి టిబెట్ జి.డి.పి 43.7 బిలియన్లు యుయాన్లు చేరుకుంటుందని భావించారు.[75]
టిబెట్ స్టేట్ కౌంసిల్ టిబెట్ లాసా ఎకనమిక్, టెక్నలాజికల్ డెవెలెప్మెంటు జోన్‌కు స్టేట్ కౌంసిల్ అంగీకారం తెలిపింది. ఇది టిబెట్ రాజధాని లాసా పశ్చిమ శివార్లలో ఉంది. ఇది " గొంగర్ విమానాశ్రయానికి 50కి.మీ దూరంలోనూ, లాసా రైల్వే స్టేషన్ నుండి 2కి.మీ దూరంలోనూ , జాతీయరహదారికి 2 కి.మీ దూరంలోనూ ఉంది.
ఈ జోన్ వైశాల్యం 5.46 చ. కి.మీ.. ఇది రెండు జోన్లుగా విభజింపబడి ఉంది. జోన్ ఏ 2.51 చ.కి.మీ. చదునైన ఈ జోన్ సహజ డైనేజ్ విధానం కలిగి ఉంది.[76]
టిబెట్‌లో టిబెటన్ బౌద్ధమతం అధికంగా ఆచరించబడుతుంది. తరువాత స్థానాలలో ఇస్లాం, క్రైస్తవ మతాలు ఉన్నాయి.
టిబెటన్లకు మతం ప్రధానం. టిబెటన్ల జీవితంలో మతం అత్యంత ప్రభావం చూపుతుంది. టిబెట్ పురాతన మతమైన బాణ్ మతం టిబెటన్ బుద్ధిజం వలన మరుగున పడింది. బుద్ధ సంస్కృతిలో ఉత్తర భారతంలో ఉన్నట్లు మహాయానం, వజ్రయానం ఆచరణలో ఉన్నాయి.[77] టిబెటన్ బుద్ధిజం టిబెట్‌లోనే కాక మంగోలియా , ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాలలో, బురియత్ రిపబ్లిక్, తువా రిపబ్లిక్ , కల్మీకియా రిపబ్లిక్ , చైనా లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఆచరించబడుతుంది. సంస్కృతిక విప్లవంలో రెడ్ గార్డులు దాదాపు టిబెట్ బౌద్ధారామాలన్నింటినీ దోచుకుని ధ్వంశం చేసారు.[78][79][80] 1980 కొన్ని బౌద్ధారామాలు పునర్నిర్మించబడ్డాయి (మితమైన చైనా మద్దతుతో). తరువాత మతస్వాతంత్రం ఇచ్చినప్పటికీ అది పరిమితమైనది. సన్యాసులు తిరిగి ఆరామం చేరుకున్నారు. తరువాత ఆశ్రమవాస విద్యకూడా కొనసాగించబడింది. అయినప్పటికీ సన్యాసుల నియామకం అత్యంత పరిమితంగా ఉంటుంది.[78][81][82]1950 కంటే ముందు టిబెటన్ పురుషులలో 20% సన్యాసులుగా ఉండేవారు.[83] టిబెటన్ బుద్ధిజంలో 4 ప్రధాన శాఖలు ఉన్నాయి.
గెలగ్ , వే ఆఫ్ వర్చ్యూ (యెల్లో హ్యాట్) ల గురువు గండెన్ త్రిపా , దలైలామా. దలైలామాలు 17- 20 శతాబ్ధాల మద్య టిబెట్ ప్రాంతాన్ని విజయవంతంగా పాలించారు. కదంప సంప్రదాయం ఆధారంగా " జే త్సొంగ్ఖప " 14 -15 శతాబ్ధాలలో ఈ విధానాన్ని స్థాపించాడు. జే త్సొంగ్ఖప పాండిత్యానికి, ధర్మపాలనకు ఖ్యాతిగాంచాడు. దలైలామా గెలుగ్గా విద్యాలయాల్లో శిక్షణ తీసుకుంటాడు. వీరిని బోధిసత్వుని ప్రతిరూపాలుగా గౌరవిస్తారు.[84]
కగ్యూ ఓరల్ లైనేజ్ ఓరల్ లైనేజ్ (వాచక మార్గం). ఇందులో ఒక ప్రధాన ఉప శాఖ, ఒక చిన్న ఉపశాఖ ఉంటాయి. గంపొపా శైలిలో మొదటిసారిగా డొంగ్పొ కగ్యూ పాఠశాల ఆరంభించబడింది. డొంగ్పొ కంగ్యూలో 4 ప్రధాన ఉపశాఖలు ఉంటాయి. అవి కర్మా కగ్యూకు కర్పా ప్తానినిథ్యం వహిస్తాడు. త్సల్పా కగ్యూ, బారోం కగ్యూ, పగ్త్రు కగ్యూ.ఒకప్పుడు నిగూఢంగా ఉన్న షంగ్మ కగ్యూను 20వ శతాబ్దంలో కలు రింపొచే బోధించి గుర్తింపు తీసుకువచ్చాడు. రింపొచే భారతీయ గురువు వద్ద శిష్యరికం వహించాడు. నరోపా మార్గానికి మూలం కగ్యూ. ఈ వాచక మార్గం ధ్యానంతో అనుసంధానించి ఆచరించబడుతుంది. 11వ శతాబ్ధానికి చెందిన మార్మికమైన మిలరెపొ ఇందుకు ప్రధాన ఆధారంగా ఉంది.
న్యింగ్మ ఇది పురాతనమైనది. ఇది పద్మసంభవ స్థాపించిన అసలైనది, పురాతనమైనది.
శాక్య శాఖకు గ్రే ఎర్త్ ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇది గొప్ప అనువాదకుడైన డ్రొక్మి లోత్సవా శిష్యుడు ఖాన్ కొంచంగ్ గ్యాల్పొ చేత స్థాపించబడింది. శాక్య పండిత క్రీ.పూ 1182-1251 ఖాన్ కొంచంగ్ గ్యాల్పొ మనుమడు. ఈ పాఠశాల విద్యార్థి వేతనాలను మంజూరు చేస్తుంది.
8-9 శతాబ్ధాల నుండి టిబెట్‌లో ముస్లిములు నివసిస్తున్నారు. టిబెట్ నగరాలలో కచీ (కచే) పేరుతో చిన్నచిన్న ముస్లిం సమూహాలు ఉన్నాయి. వీరు వారి స్వస్థలం నుండి వలసప్రజలుగా ఇక్కడ నివసిస్తున్నారు. వీరిలో కాశ్మీరీలు (కచీ యు), లడక్, టర్కీ, పర్షియాల నుండి వచ్చున వారు ఉన్నారు. 1959 టిబెటన్ ముస్లిములు భారతీయ పౌరసత్వం కావాలని కేసు వేసారు. వారు కాశ్మీర్ ప్రాంతానికి చెందిన వారు కనుక వారికి భారతపౌరసత్వం కావాలని కోరారు. తరువాత అదే సంవత్సరం భారతప్రభుత్వం టిబెటన్ ముస్లిములందరూ ముస్లిములని ప్రకటించింది. .[85] ఇతర ముస్లిములు సంప్రదాయ సమూహానికి చెందిన వారు. వీరు హుయి ప్రజలు, సలర్ ప్రజలు, డోంగ్ క్సియాంగ్ ప్రజలు, బొనాలు ఉన్నారు. వీరు చైనా ముస్లిములు (గ్యా కాచీ) అని భావిస్తున్నారు. హుయీ ముస్లిముల పూర్వీకం చైనా అని విశ్వసిస్తున్నారు.
టిబెట్‌లో లభించిన ఆధారాలను అనుసరించి టిబెట్‌లో మొదటిసారిగా నెస్టోరియన్ క్రైస్తవులు ప్రవేశించారు. 1256లో వారు మొంగ్కే ఖాన్ రాజసభలో కర్మాకగ్యూ గురువు కర్మా పక్షీతో వివాదంలో పాల్గొన్నారని భావిస్తున్నారు.[86][87]1716లో లాసా చేరిన దెసిదేరి ఆర్మేనియన్, రష్యన్ వ్యాపారులను చూసాడు.[88]
రోమన్ కాథలిక్ జెసూయిట్స్, కాపూచిన్లు ఐరోపా నుండి 17-18 శతాబ్ధాలలో టిబెట్ చేరారు. పోర్చుగీస్ మిషనరీలు జెసూయిట్ ఫాదర్ అంటోనియో డీ ఆంధ్రడే, బ్రదర్ మేన్యుయేల్ మార్క్విస్ 1624లో పశ్చిమ టిబెట్‌లో గెలూ రాజ్యంలో చేరారు. మేన్యుయేల్ మార్క్విస్‌కు రాజకుటుంబం స్వాగతం పలికింది. తరువాత రాజకుటుంబం మేన్యుయేల్ మార్క్విస్‌కు చర్చి నిర్మించడానికి అనుమతి లభించింది.[89][90]1627 నాటికి గుగే రాజ్యంలో 100 కాంవెంటు స్కూల్స్ ఉన్నాయి. [91] తరువాత రుడాక్, లడక్, త్సంగ్ లలో క్రైస్తవమతం పరిచయం చేయబడింది. త్సాంగ్ రాజ్య పాలకుడు ఆంధ్రడే, ఆయన అనుయాయులు 1626లో సింగస్తే వద్ద ఒక జెసూయిట్ ఔట్ పోస్ట్ స్థాపించారు.[92]
1661లో సినింగ్ నుండి నేపాల్ పోయే మార్గంలో జెసూయిట్ జాన్ గ్రుయేబర్ టిబెట్‌ను దాటి లాసా చేరుకుని ఒక మాసకాలం ఉన్నాడు.[93] లాసాలో చర్చిని నిర్మించిన వారు ఆయనను అనుసరించారు. వారిలో జెసూయిట్ ఫాదర్ లిప్పోలిటో దెసిదెరి 1761-1721 ఉన్నాడు. ఆయనకు టిబెటన్ భాష, సంస్కృతి, బుద్ధిజం, వివిధ కాపూచిన్లు (1707–1711, 1716–1733 నుండి 1741–1745) గురించిన లోతైన అవగాహన ఉంది.[94] 17వ శతాబ్దంలో టిబెటన్ రాజులు, వారి సభలు, కర్మప సెక్ట్ లామాలు గెలుగ్ప సెక్ట్ లామాల ప్రభావాన్ని ఎదుర్కొనడానికి క్రైస్తవాన్ని వాడుకున్నారు. 1745లో లామాల సూచనతో టిబెట్ నుండి మిషనరీలు అందరూ బహిస్కరించబడ్డారు. .[95][96][97][98][99][100]
1877లో చైనా లోని మిషన్‌కు చెందిన ప్రొటెస్టెంట్ జేంస్ చొంగ్క్వింగ్ నుండి బతంగ్, సిచుయాన్ భూభానికి టిబెటన్ ప్రజల కొరకు ఒక సువార్తను తీసుకుని వచ్చాడు. 20వ శతాబ్దం ఆరంభంలో యున్నన్ లోని డిక్వింగ్లో అధికంగా లిసు ప్రజలు, కొంతమంది యీ,నూ ప్రజలు క్రైస్తవమతానికి మార్చబడ్డారు. ప్రొటెస్టెంట్లలో జేంస్ ఓ ఫ్రాసర్, ఆల్ఫర్డ్ జేంస్ బ్రూంహల్, ఇసోబెల్ కుహ్న్ (చైనా ఇన్లా మిషన్) గుర్తింపు కలిగి ఉన్నారు.[101][102]
1949 నుండి చైనాలో మతప్రచారాన్ని చట్టవిరుద్ధం చేసారు. 2013లో చైనా అనుమతితో పలు క్రైస్తవ మిషనరీలు టిబెట్‌లో చైతన్యవంతం అయ్యాయి. వారు టిబెటన్ బౌద్ధులకు క్రైస్తవ మిషనరీలు పోటీగా ఉంటారని కాని లేక ప్రాంతాన్ని ఆర్థికంగా బలపరచడానికి ఈ అనుమతి మంజూరు చేసారని భావిస్తున్నారు.[103]
టిబెటన్ కళలు అంతర్గతంగా టిబెటన్ బుద్ధిజం ఆధారితమై ఉంటాయి. సాధారణంగా బుద్ధిజం ప్రధానదైవం బుద్ధుని విభిన్నరూపాలలో ప్రదర్శించబడుతుంటాయి. వివిధ కాంశ్య బౌద్ధరూపాలు, మందిరాల ద్వారా టిబెటన్ కళలు ప్రదర్శించబడుతుంటాయి. టిబెటన్ కళలలో తంగ్క పెయింటింగ్స్, మండలం చోటుచేసుకుంటాయి.
టిబెటన్ నిర్మాణకళలో చైనా, భారతీయ ప్రభావం ఉంటుంది. అందులో లోతైన బుద్ధిజం ప్రభావం ప్రతిబింబిస్తుంది. రెండు డ్రాగన్లతో కూడిన ధర్మచక్రం ప్రతి టిబెటన్ గొంపా ఆలయంలో చోటు చేసుకుంటాయి. టిబెటన్ చొరేన్ ఖాంలో వర్తులాకార గోడలు, లడక్‌లో చదరంగా నలుచదపు గోడలతో వైవిధ్యం కలిగి ఉంటాయి. టిబెటన్ నిర్మాణకళలో ప్రధానాంశం ఏమిటంటే అత్యధిక నివాసగృహాలు, బౌద్ధారామాలు దక్షిణ ముఖంతో గాలి వెలుతురు అందుతున్న ప్రదేశంలో నిర్మించబడి ఉన్నాయి. ఇవి తరచుగా మిశ్రితం, వైవిధ్యం కలిగిన రాళ్ళు, కొయ్య, సెమెంటు, మట్టి కలిపి నిర్మించబడ్డాయి. వేడి చేయడానికి, వెలుతురు సృష్టించడానికి అవసరమైన చమురు స్వల్పంగా లభ్యం ఔతుంటుంది కనుక తక్కువ వేడిని తీసుకునే చదునైన పైకప్పు, వెలుతురును ఇవ్వడానికి పలు కిటికీలతో ఇక్కడ నిర్మాణాలు నిర్మించబడి ఉన్నాయి. ఇక్కడ పర్వతప్రాంతాలలో తరచూ భూకంపం సంభవిస్తూ ఉంటుంది కనుక దానిని తట్టుకునేలా ముందుజాగ్రత్తతో లోపలి వైపుగా 10 డిగ్రీలు వంగి ఉండేలా ఇక్కడ నిర్మాణాలు నిర్మించబడి ఉన్నాయి.
117 మీ ఎత్తు 360 మీటర్ల వెడల్పు కలిగి ఉన్న పోతల రాజభవనం టిబెటన్ నిర్మాణకళకు ప్రధాన ఉదాహరణ. మునుపు దలైలామా నివాసం అయిన ఈ 13 అంతస్తుల భవనంలో వేలాది గదులు, పూర్వపు దలైలామాలు నివసించిన నివాసగృహాలు, బుద్ధుని శిల్పాలు ఉంటాయి. వెలుపల ఉండే శ్వేతభవనంలో నిర్వహణా కార్యాలయాలు ఉంటాయి. లోపల ఉండే ఏర్రని భవనాలలో లామాల అసెంబ్లీ హాలు, ప్రార్థనా మందిరాలు, 10,000 ఆలయాలు, విస్తారమైన బౌద్ధ సాహిత్య గ్రంథాలు ఉన్న గ్రంథాలయం ఉన్నాయి. పోతల రాజభవనం ప్రపంచవారసత్వ సంపదలలో ఒకటిగా గుర్తించబడుతుంది. ఇది గత దలైలామా నార్బులింగ్క వేసవి విడిదిగా ఉండేది.
టిబెట్ సంగీతం మీద అధికంగా హిమాలయ సంప్రదాయం, సంసృతుల ప్రభావం ఉంటుంది. అంతేకాక టిబెటన్ సంగీతం మీద లోతైన టిబెటన్ బౌద్ధమత ప్రభావం ఉంటుంది. టిబెటన్ సంగీతం, మంత్రపఠనం తరచుగా టిబెటన్, సంస్కృత భాషలలో ఉంటాయి. మంత్రాలలో పవిత్ర మతసాహిత్య పారాయణం చోటు చేసుకుంటుంది. యంగ్ మంత్రోచ్చారణ కాలపరిమితి లేని పారాయణరూపంలో ఉంటుంది. ఇవి పండుగ, ఉత్సవాలలో చోటుచేసుకుంటాయి. యాంగ్ మంత్రోచ్చారణతో డ్రమ్ములు శబ్ధాలు, తక్కువగా ఉండే మాటలు ఉంటాయి. బౌద్ధశిక్షణాలయాలలో ఇతర సంగీతరీతులలో శిక్షణ ఇవ్వవడుతుంది. గెలుగ్పా పాఠశాలలో సంప్రదాయ సంగీర శిక్షణ ఉంటుంది. న్యింగ్మప, సక్యప, కగ్యుప పాఠశాలలో ప్రేమావేశపూరిత సంగీతశిక్షణ ఉంటుంది.[104]
సంగీతంతో కూడిన నంగ్మ నృత్యం ప్రత్యేకంగా టిబెటన్ నగరప్రాంతం లాసా, కరయోకెలో ప్రాబల్యత కలిగి ఉంది. ప్రబలమైన ఇతర సంగీతాలలో గార్ సంగీతం ఒకటి. ఇది మతాచారాలు, కుటుంబ వేడుకలో చోటుచేసుకుంటుంది. లూ సంగీతం గ్లోట్టల్ వైబ్రేషన్లు, హైపిచ్‌తో ప్రదర్శించబడుతుంది. గెసర్ సంగీతంలో టిబెటన్ కావ్యకథానాయకుల చరిత్ర గానం చేయబడుతుంది.
టిబెట్‌లో సంవత్సరం అంతా బుద్ధుని ఆరాధించే పలు ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి. టిబెటన్ కొత్తసంవత్సర వేడుకను లోసర్ అంటారు. ఈ పండుగలో ఇంటి ఇలవేల్పుకు ప్రత్యేక నివేదనలు సమర్పించపడుతుంటాయి. పండుగ సందర్భంలో టిబెట్ ప్రజలు మతచిహ్నాలతో ద్వారబంధాలకు వర్ణం వేయడం, శ్రమతోకూడిన పలు ఏర్పాట్లు చేస్తుంటారు. టిబెటియన్లు కొత్తసంవత్సర సందభంలో సాయంకాలపు వేళ కుటుంబసభ్యులతో కలిసి గుథుక్ (బార్లూ నూడిల్ సూప్) తీసుకుంటరు. తరువాత టిబెటన్ మొదటి మాసంలో 4-11 తారీఖుల మద్య మాన్లం ప్రార్థనా పండుగ జరుపుకుంటారు. ఈ పండుగలో నృత్యాలు, క్రీడా పోటీలు వంటి వేడుకలు చోటుచేసుకుంటాయి. అలాగే సామూహిక విహారయాత్రలు చేస్తారు. ఈ పండుగ 1049లో పంచేన్ లామాకు చెందిన వాడు, దలైలామా విధాన స్థాపకుడు అయిన త్సాంగ్ ఖప చేత ఆరంభించబడింది.
టిబెట్‌లో ప్రధానంగా బార్లీ పండిస్తారు. త్సంపా అంటే బార్లీ పిండి. ఇక్కడి ప్రజలకు ఇది ప్రధాన ఆహారం. దీనిని నూడిల్స్‌గా గాని, ఆవిరిలో ఉడికించిన మోమోలుగా కాని తయారు చేసుకుంటారు. యాక్, మేకలను తరచుగా ఎండబెట్టిన మాంసంలా లేక మసాలలతో చేర్చి ఉర్లగడ్డలతో కలిపి వండికాని తింటారు. టిబెట్‌లో ఆవాలు పండిస్తారు. అందువలన టిబెటన్ల ఆహారంలో ఆవాలు అధికంగా చోటుచేసుకుంటాయి. పెరుగు, వెన్న చీజ్ తరచుగా తీసుకుంటారు. బటర్ టీకి టిబెట్‌లో చాలా ప్రాధాన్యత ఉంది. చక్కగా యోగర్ట్ తయారుచేయడం టిబెట్ ప్రజలు ప్రతిష్ఠాకరంగా భావిస్తుంటారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.