ఆగ్నేయ తూర్పు ఐరోపా మరియు పాశ్చాత్య ఆసియా దేశాల దేశము From Wikipedia, the free encyclopedia
టర్కీ (Turkish: Türkiye), అధికారికంగా టర్కీ గణతణత్రం (జమ్ హూరియత్-ఎ-తుర్కీ) అని వ్యవహరిస్తారు. ఇది ఒక యూరేషియా దేశం. అనగా ఇటు ఆసియా లోనూ అటు ఐరోపా లోనూ విస్తరించియున్నది. అనటోలియా ద్వీపకల్పంలోనూ, పశ్చిమాన ఆసియా, రుమేలియా (బాల్కన్ ప్రాంతం) లోనూ వ్యాపించి యున్నది. టర్కీకి 8 పొరుగుదేశాల సరిహద్దులు గలవు. ఈశాన్యంలో బల్గేరియా, పశ్చిమాన గ్రీసు, వాయవ్యంలో జార్జియా, తూర్పున ఆర్మీనియా, అజర్బైజాన్, ఇరాన్, ఆగ్నేయంలో ఇరాక్, సిరియాలు గలవు. దక్షిణాన మధ్యధరా సముద్రము, సైప్రస్, ఏగియన్ సముద్రము, ద్వీపసమూహములు పశ్చిమాన, ఉత్తరాన నల్ల సముద్రము గలవు.
రెండు ఖండాలైన ఆసియా, ఐరోపా ల మధ్య ఉండడము వలన ఈ దేశపు సభ్యత తూర్పు పడమరల కలయిక అయినది. టర్కీ ప్రజాస్వామిక, సెక్యులర్, యూనిటరి, రాజ్యాంగ గణతంత్రంగా ప్రకటించుకుంది, దీని రాజకీయ విధానము 1923 లో ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్ ఆధ్వర్యంలో స్థాపించబడింది. అప్పటి నుండి టర్కీ పశ్చిమదేశాలతో సన్నిహితంగానూ, తూర్పుదేశాలతో మౌనంగానూ వుంటూ వస్తూంది. టర్కీ పై కూడా ఇతర పశ్చిమ దేశాల వలె మానవ హక్కుల ఉల్లంఘనల పైన విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు టర్కీలో కుర్దులపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని అనేక కుర్దు జాతీయ సంస్థలు విమర్శిస్తున్నాయి.
టర్కీ ప్రాంతంలో పాలియో లిథిక్ కాలం నుండి మానవనివాసాలు ఉన్నాయి.[1] ఈ ప్రాంతం పురాతన అనటోలియన్లు, అస్సిరియన్లు, గ్రీకులు, థ్రాసియన్లు, ఫ్రిజియన్లు, ఉరాటియన్లు, ఆర్మేనియన్లు నివసించారు. [2][3][4] అలెగ్జాండర్ మాహావీరుడు ఈ ప్రాంతాన్ని జయించిన తరువాత ఈ ప్రాంతం హెలెనైజేషన్ చేయబడి రోమన్ సామ్రాజ్యంలో భాగం చేయబడింది. తరువాత ఈ ప్రాంతం బైజాంటైన్ సామ్రాజ్యంలో భాగం అయింది.[3][5] 11 వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి సెల్జుక్ టర్కీలు వలస వచ్చారు. తరువాత ఈ ప్రాంతంలో టర్కిఫికేషన్ ఆరంభం అయింది. 1071లో " బాటిల్ ఆఫ్ మాంజికర్ట్ " యుద్ధంలో సెల్జుక్ టర్కీలు బైజాటైనుల మీద విజయం సాధించిన తరువాత టర్కీల ఆధిక్యత స్థిరపడింది.[6] మంగోలియన్లు అనటోలియా మీద విజయం సాధించే వరకు అనటోలియాను " సెల్జుక్ సుల్తానేట్ ఆఫ్ రుం " పాలించింది.[7] 14 వ శతాబ్దం మద్యకాలానికి ఓట్టమన్లు అనటోలియాను సమైక్యం చేస్తూ ఆగ్నేయ ఐరోపా, పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలను కలుపుకుని సామ్రాజ్యం ఏర్పాటు చేసి ఆధునిక కాలం ఆరంభంలో ఆఫ్రికా, యురేషియాలో ప్రాధానశక్తిగా మారారు. 16 వ శతాబ్దంలో ప్రత్యేకంగా సులేమాన్ ది మెగ్నిఫిసెంట్ (1520 - 1566) కాలంలో సామ్రాజ్యం అత్యున్నత స్థానం చేరుకుంది.1683లో వియన్నాల్ సెకండ్ ఓట్టమన్ సైజ్ ఆఫ్ వియన్నా, 1699 గ్రేట్ టర్కిష్ యుద్ధం తరువాత ఓట్టమన్ సామ్రాజ్యం దీర్ఘపతనం మొదలైంది. 19వ శతాబ్దంలో ఓట్టమన్ సామ్రాజ్యం ఆధినికీకరణలో భాగంగా తాంజిమత్ సంస్కరణలు ఆరభించారు. సంస్కరణలు ఓట్టమన్ సామ్రాజ్యం పతనం నుండి రక్షించడంలో విఫలం అయ్యాయి.[8]
1878లో రెండవ సుల్తాన్ అద్బుల్ హమీద్ " ఫస్ట్ కాంసిట్యూషనల్ ఎరా ", ఓట్టమన్ కాంసిట్యూషన్ (1876), జనరల్ శాసనసభ ఆఫ్ ది ఓట్టమన్ ఎంపైర్, సెకండ్ కాంసిట్యూషనల్ ఎరా, యంగ్ టర్క్ రివల్యూషన్ 1908 మొదలైన సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. అయినప్పటికీ 1913 ఓట్టమన్ తిరుగుబాటు దేశాన్ని తీవ్రంగా కదిలించింది.తరువాత ఓట్టమన్ ముగ్గురు పషాస్ నియంత్రణలోకి మారింది. ఓట్టమన్ రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించడానికి తీసుకున్న నిర్ణయంలో వీరు ప్రధానపాత్ర వహించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో (1914- 1918) ఓట్టమన్ సెంట్రల్ పవర్ పక్షంలో చేరింది. యుద్ధంలో సెంట్రల్ పవర్ అలైస్ ఆఫ్ వరల్డ్ వార్ || చేతిలో ఓటమిచవి చూసింది.
రెండవప్రపంచ యుద్ధం సమయంలో ఓట్టమన్ ప్రభుత్వం అమెరికన్ సంతతి, అస్సిరియన్ సంతతి, గ్రీక్ సంతతి ప్రజలకు వ్యతిరేకంగా సంప్రదాయ పరంగా జాతిహత్యలకు పూనుకున్నది. మరొకవైపు ఓట్టమన్ ముస్లిములు (ప్రత్యేకంగా టర్కీ ప్రజలు) పరిసర రాజ్యాలలో జాతి హత్యలకు గురయ్యారు. ఫలితంగా పెద్ద సంఖ్యలో టర్కీ ముస్లిములు అనటోలియాకు తరలి వచ్చారు.[9] యుద్ధానంతరం ఓట్టమన్ సామ్రాజ్యం పలు చిన్న రాజ్యాలుగా విడిపోయాయి.[10]
ముస్తాఫా కెమల్, అతని సహచరులు కలిసి అనటోలియాలో అటాతక్ టర్కీ స్వతంత్ర పోరాటం (1919 - 1922) ఆరంభించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో సంకీర్ణ దళాల ఆక్రమణకు వ్యతిరేకగా స్వతంత్ర పోరాటం ప్రారంభం అయింది. ఫలితంగా 1922లో సుల్తానేట్ తొలగించబడి 1923లో " రిపబ్లిక్ ఆఫ్ టర్కీ " స్థాపించబడింది. టర్కీ సామ్రాజ్యానికి అటాతుక్ మొదటి అధ్యక్షుడయ్యాడు.[11] టర్కీ అధికారిక భాష టర్కిష్. టర్కిష్ భాషను దేశంలో 84.5% ప్రజలకు వాడుక భాషగా ఉంది.[12] 78.1%, 81.3% పౌరులు తమను టర్కిష్ ప్రజలుగా నమోదుచేసుకున్నారు.[12] టర్కీలో ఆర్మేనియన్లు, గ్రీకులు, యూదులు, కుర్ధీలు, సర్కాసియన్లు, అరబ్స్, అల్బేనియన్లు, బోస్నియాకులు, జార్జియన్లు అల్పసంఖ్యాకులుగా చట్టబద్ధంగా నమోదుచేయబడ్డారు.[12] అల్పసంఖ్యాకులలో కుర్ధీలు అధికంగా ఉన్నారు.[13][14] దేశంలో అత్యధికంగా సున్నీ ముస్లిము, అలెవిసులతో కలిసి సంఖ్యాపరంగా ఆధిక్యతలో ఉన్నారు.[13] టర్కీ యునైటెడ్ నేషంస్ చార్టర్ సభ్యత్వం కలిగి ఉంది, నాటో ఆరంభ సభ్యత్వం కలిగి ఉంది, " ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో- ఆపరేషన్ అండ్ డెవెలెప్మెంట్ (ఒ.ఇ.సి.డి), ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో ఆపరేషన్ ఇన్ యూరప్ (ఒ.ఎస్.సి.ఇ), ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (ఒ.ఐ.సి) , జి 20 లలో ఫండింగ్ మెంబర్‌గా ఉంది.1949 లో " మెంబరు స్టేట్స్ ఆఫ్ ది కౌంసిల్ ఆఫ్ ఐరోపా " సభ్యత్వం పొందిన తరువాత టర్కీ 1963 లో " యురేపియన్ ఎకనమిక్ కమ్యూనిటీ అసోసియేట్ సభ్యత్వం పొందింది. 1987లో పూర్తి స్థాయి ఇ.ఇ.సి. సభ్యత్వం కొరకు అభ్యర్థించింది. 1995లో " టర్కీ యురేపియన్ యూనియన్ కస్టంస్ యూనియన్ " చేరింది. 2005 లో యురేరియన్ యూనియన్‌తో కలిసి " అసోసియేషన్ నెగోషియేషన్ " స్థాపించింది.[15] అభివృద్ధి చెందిన ఆర్థికాభివృద్ధి, దౌత్య సంబంధాలు టర్కీని రీజనల్ పవర్‌గా మార్చింది.[16][17][18][19]
టర్కీ అనే పేరు ఇక్కడ టర్కిష్ ప్రజలు నివసించిన కారణంగా వచ్చింది. 8వ శతాబ్దంలో మొదటిసారిగా మద్య ఆసియాలో కనిపించిన శిలాశాసనాలలో " గోక్టర్క్స్ " అనే పేరు ఆధారంగా (పురాతన టర్కిక్ అక్షరాల) టర్కీ అనేపేరు మొదటిసారిగా నమోదు అయిందని భావిస్తున్నారు.[20] ఆంగ్లనామం " టర్కీ " మొదటిసారిగా 14వ శతాబ్దంలో మెడీవల్ లాటిన్ " టర్చియా " ఆధారంగా ఏర్పడింది.[21] భారతీయ రచనల్లో ఈ దేశాన్ని తురుష్క దేశం అని వ్యవహరిస్తారు. గ్రీకులు ఈ ప్రాంతాన్ని టర్కియా అని పేర్కొన్నారు. బైజాంటైన్ చక్రవర్తి, కవిపండితుడైన ఏడవ కాంస్టాంటైన్ వ్రాసిన " డీ ఆడ్మినిస్ట్రాండో ఇంపీరియో "లో ఈప్రాంతాన్ని టౌప్కియాగా పేర్కొన్నాడు.గ్రీకు పేర్కొన్న టర్కియా అనే పేరు బైజాంటైన్ చక్రవర్తి , కవి - పండితుడు అయిన " ఏడవ కంస్టాంటైన్ " వ్రాసిన " డీ అడ్మినిస్ట్రేండో ఇంపీరియో " పుస్తకంలో పేర్కొన్నాడు.[22][23] ఆయన తరచుగా టర్కులను " మగ్యారులు " అని పేర్కొన్నాడు.[24] అలాగే మెడీవల్ సామ్రాజ్యంలో నల్ల సముద్రం , కాస్పియన్ సముద్రం తీరప్రాంతాన్ని బైజాంటిన్ వనరులను అనుసరించి టౌర్కియా (టర్కుల భూమి) అని పేర్కొన్నాడు.[25] ఓట్టమన్ సామ్రాజ్యం కొన్ని సార్లు తమ మ్యాపులలో (వివరణాచిత్రాలు) తమ సమకాలీన సామ్రాజ్యంగా టర్కీసాంరాజ్యాన్ని పేర్కొన్నారు. [26]
అర్మేనియాతో టర్కీ కుదుర్చుకున్న అలెగ్జాండ్రోపోల్ ఒడంబడికలో తమ దేశాన్ని తుర్కియేగా పేర్కొన్నారు. అంతర్జాతీయ పత్రాల్లో ఆ పదాన్ని పేర్కొన్న మొదటి సందర్భం అదే. ఆఫ్ఘనిస్తాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో డెవ్లెట్-ఆలియ్యే-తుర్కియ్యే అని పేర్కొన్నారు.[27]2022 మే 31 న టర్కీ విదేశాంగ మంత్రి, ఐక్యరాజ్య సమితికీ, ఇతర అంతర్జాతీయ సంస్థలకూ రాసిన లేఖలో తమ దేశాన్ని తుర్కియే గా వ్యవహరించాలని కోరాడు. ఐరాస దాన్ని అంగీకరించి వెంటనే అమలు పరచింది. [28][29] అమెరికా విదేశాంగ శాఖ కూడా 2023 జనవరి నుండి తుర్కియే అనే వాడుతోంది. [30]
అనటోలియన్ ద్వీపకల్పంలో ఉన్న ఆధునిక టర్కీ ప్రాంతం ప్రపంచంలోని పురాతన శాశ్వత మానవ నివాసాలలో ఒకటి. పలు పురాతన అనటోలియన్ సంప్రదాయ ప్రజలు నియోలిథిక్ కాలం నుండి హెలెనిస్టిక్ కాలం వరకు అనటోలియాలో నివసించారు.[3] వీరిలో అనేకమందికి అనటోలియన్ భాషలు (ఇండో - యురేపియన్ భాషాకుటుంబానికి చెందిన భాషలు) వాడుకగభాషలుగా ఉన్నాయి.[33] ఇండో - యురేపియన్ భాష అయిన హిట్టిటే , ల్యూవియన్ భాషలకు పురాతన అంతస్తు లభించింది. కొంత మంది పరిశోధకులు అనటోలియాను హిపొతిటికల్ కేంద్రంగా (ఇండో - యురేపియన్ భాషల జన్మస్థానంగా ) ప్రతిపాదించారు.[34] టర్కీలోని యురేపియన్ భూభాగాన్ని " తూర్పు త్రాంస్ " అంటారు. ఈ ప్రాంతంలో 40,000 సంవత్సరాలకు పూర్వమే మానవులు నివసించారు. క్రీ.పూ 6,000 సంవత్సరాలకు ముందు ఇక్కడ నియోలిథిక్ శకం ఆరంభం అయింది.[4]" గోబెకీ తపే " మందిరం అతి పురాతన మానవనిర్మిత మతసంబంధిత మందిరమని భావిస్తున్నారు. [35] కాటల్‌హోయుక్ అతి పెద్ద నియోలితిక్ ప్రదేశంగా భావించబడుతుంది. దక్షిణ అనటోలియాలో ఉన్న చాల్కోలితిక్ సెటిల్మెంట్ క్రీ.పూ. 7,500 నుండి క్రీ.పూ. 5,700 వరకు ఉనికిలో ఉంది. ఈ ప్రదేశం ఇప్పటికీ సరక్షించబడుతూ ఉంది. ఇది అతిపెద్ద నియోలితిక్ ప్రాంతంగా భావించబడుతుంది. 2012లో ఇది " యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ "గా గుర్తించింది.[36] నియోలితిక్ కాలంలో మొదలైన " ట్రాయ్ " సెటిల్మెంట్ " ఇనుపయుగం " వరకు కొనసాగింది.[37] అనటోలియాలో నమోదుచేయబడిన మానవవజాతులలో హట్టియన్లు, హుర్రియన్లు, నాన్ - ఇండో - యురేపియన్లు మద్య, తూర్పు అనటోలియా ప్రాంతంలో క్రీ.పూ 2,300 లో నివసించారు. ఇండో - యురేపియన్ హిట్టీలు అనటోలియాకు వచ్చారు. హట్టియన్లు, హుర్రియన్లు క్రీ.పూ. 2,000 - 1,700 వరకు ఈ ప్రాంతంలో కలిసి జీవించారు. హిట్టియన్లు ఈ ప్రాంతంలో మొదటి సామ్రాజ్యం సాధించి క్రీ.పూ 18 వ శతాబ్దం నుండి 13 వ శతాబ్దం వరకు పాలించారు.అస్సిరియన్లు ఈ ప్రాంతాన్ని జయించి టర్కీ ఈశాన్య భాగంలో నివాసాలు ఏర్పరుచుకుని క్రీ.పూ 1950 నుండి 612 వరకు నివసించారు.[38][39] క్రీ.పూ 9 వ శతాబ్దంలో ఉరతూలు ఈ ప్రాంతంలో తిరిగి ప్రవేశించినట్లు అస్సిరియన్ (వీరు శక్తివంతమైన అస్సిరియన్ శతృవులుగా ఎదిగారు) వ్రాతలు తెలియజేస్తున్నాయి. [40] క్రీ.పూ 1180 లో హిట్టిటీ సామ్రాజ్యం పతనం తరువాత ఫ్రిగియన్లు, ఇండో - యురేపియన్లు అనటోలియాలో రాజ్యాలు స్థాపించారు. వారి రాజ్యాలను క్రీ.పూ 7 వ శతాబ్దంలో చిమ్మరియన్లు పడగొట్టారు.[41] క్రీ.పూ 714 లో ఆరంభమైన ఉరతూ రాజ్యం క్రీ.పూ 590 నాటికి ముగింపుకు వచ్చింది. [42] ఉరుతూలను మెడేస్ ఓడించారు. ఫ్రిగ్రియాలకు తరువాత లిబియా, కరియా, లిసియా రాజ్యాలు ఏర్పడ్డాయి.
క్రీ.పూ. 1200లో అనటోలియా సముద్రతీర ప్రాంతంలో అత్యధికంగా ఎయియోలియన్లు, లోనియన్లు పురాతన గ్రీకు ప్రజలు స్థిరపడ్డారు.ఈ వలస ప్రజలు మిలెటస్, ఎఫెసస్, స్మిర్నా (ప్రస్తుతం ఇజ్మిర్), బైజాంటియం (ఇస్తాంబుల్) మొదలైన పలు ప్రధాన నగరాలను స్థాపించారు. తరువాత క్రీ.పూ. 657 లో గ్రీకులు మెగరా నగరాన్ని స్థాపించారు. ఆర్మేయన్ల (ఒరొంటిడ్ రాజవంశం) చేత స్థాపించబడిన మొదటి రాజ్యాన్ని ఆర్మేనియా అని పొరుగున ఉన్న ప్రజలు పిలిచారు. క్రీ.పూ 6 వ శతాబ్దంలో ఆర్మేనియన్లు టర్కీ తూర్పుభూభాగాలను తమ రాజ్యంలో విలీనం చేసుకున్నారు. వాయవ్య టర్కీ ప్రాంతంలో గిరిజనప్రజల చేత " ఒడ్రిసియన్ " రాజ్యం స్థాపించబడింది.[43] క్రీ.పూ 6 వ శతాబ్దంలో ఆధునిక టర్కీ ప్రాంతం అంతటినీ " అచమెనిద్ సాంరాజ్యం " జయించింది.[44] క్రీ.పూ. 499 లో పర్షియన్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసిన కారణంగా " గ్రీకో - పర్షియన్ " యుద్ధం మొదలైంది.క్రీ.పూ. 334 లో టర్కీప్రాంతాన్ని మహావీరుడు అలెగ్జాండర్ స్వాధీనం చేసుకున్నాడు.[45] ఈ సంఘటన ఈ ప్రాంతంలో సాంస్కృతిక స్వజాతీయత, హెలెనైజేషన్ అధికంచేసింది. [3] క్రీ.పూ 323 లో అలెగ్జాండర్ మరణించిన తరువాత అంటోలియా పలు చిన్న హెలెనిస్టిక్ సంకృతిక రాజ్యాలుగా విడిపోయింది. క్రీ.పూ 1 వ శతాబ్దం మద్యకాలానికి రోమన్ రిపప్లిక్లో భాగం అయ్యాయి.[46] అలెగ్జాండర్ విజయం తరువాత ఆరంభమైన హెలెనైజేషన్ సంస్కృతి రోమన్ పాలనలో వేగవతంతం అయింది. క్రీస్తు తరువాత ఆరంభ శతాబ్ధాలలో సంస్కృతులు అంతరించి ఆ స్థానాన్ని పురాతన గ్రీక్ భాష, సంస్కృతి ఆక్రమించాయి.[5][47] క్రీ.పూ 1 వ శతాబ్దం నుండి సా.శ. 3 వ శతాబ్దం వరకు ఆధునిక టర్కీలోని అత్యధికభాగం తరచుగా సంభవించిన " రోమన్ - పార్తియన్ " యుద్ధాల కారణంగా రోమన్, పార్ధియన్ సామ్రాజ్యం పోటీలమద్య చిక్కుకు పోయింది.
సా.శ. 324 లో బెంజాంటియం రోమన్ సామ్రాజ్యానికి రాజధానిని చేసి " న్యూ రోం " అని పేరు మార్చారు.సా.శ. 394 లో " మొదటి తియోడోసియస్ " మరణం తరువాత రోం సామ్రాజ్యాన్ని ఆయన కుమారులిద్దరికీ విభజించి ఇవ్వబడింది. తూర్పు రోం సామ్రాజ్యానికి కాంస్టాటినోపుల్ రాజధానిని చేసారు. తరువాత చరిత్రకారులు దీనిని బైజాంటిన్ సామ్రాజ్యంగా పేర్కొన్నారు. ఆధునిక టర్కీలో అత్యధిక భాగం మద్యయుగం వరకు వీరి ఆధీనంలో కొనసాగింది.[48] తూర్పు టర్కీ 7 వ శతాబ్దం సగం వరకు సస్సానియన్ల వశంలో ఉండేది. బైజాంటైన్ - సస్సనిద్ యుద్ధాలు, శతాబ్దాలు కొనసాగిన " రోమన్ - పర్షియన్ యుద్ధాలు " సంభవించాయి.
సెల్ఝుక్ రాజవంశం కినిక్ లోని ఒకశాఖ.[50] 10 వ శతాబ్దంలో సెల్ఝుకులు వారి స్వస్థానం అయిన పర్షియాకు వలసపోవడం మొదలైంది. తరువాత ఇది గ్రేట్ సెల్ఝుక్ సామ్రాజ్యానికి కేంద్రం అయింది. [51] 11 వ శతాబ్దం మద్యకాలంలో సెల్ఝుక్ టర్కీలు " మెడీవల్ ఆర్మేనియా ", అనటోలియా తూర్పు భూభాగంలోకి చొచ్చుకుపోవడం ప్రారంభం అయింది. 1071లో " మంజీకెర్ట్ యుద్ధంలో " సెల్ఝుకులు బైజాంటిన్లను ఓడించారు. తరువాత ఈప్రాంతంలో టర్కిఫికేషన్ మొదలైంది. ఆర్మేనియా, అనటోలియా ప్రాంతాలలో టర్కిష్ భాష, ఇస్లాం మతం పరిచయం చేయబడ్డాయి. క్రమంగా ఇవి ఈ ప్రాంతం అంతటా వ్యాపించాయి. క్రైస్తవం, గ్రీకు భాష ప్రధానంగా ఉన్న అనటోలియా ప్రాంతంలో ముస్లిం, టర్కిష్ భాష ప్రాధాన్యత సంతరించుకున్నాయి.[52] క్రమంగా అంటోలియా ప్రాంతం అంతటా టర్కిఫికేషన్ చేయడంతో సాంస్కృతికంగా కూడా పర్షియనైజేషన్గా మారింది.[53] తరువాత అంటోలియా ప్రాంతం ఓట్టమిన్ సామ్రాజ్యంలో భాగం అయింది.[54][55]
1243లో సెల్ఝుక్ సైన్యాన్ని " మంగోల్ " సైన్యం ఓడించింది. ఫలితంగా సెల్ఝుక్ శక్తి క్రమంగా విడిపోయింది. తరువాత టర్కిష్ రాజ్యాలను మొదటి ఒస్మాన్ పాలించాడు. తరువాత రూపొందిన ఓట్టమన్ సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని 200 సంవత్సరాలు పాలించింది. 1453లో బైజాంటిన్ రాజధాని కాంస్టాటినోపుల్ను స్వాధీనం చేసుకుని ఓట్టమిన్లు తమ విజయయాత్రను పూర్తిచేసుకున్నారు.[56]
1514లో సుల్తాన్ రెండవ సలీం (1512 - 1520) సఫావిద్ రాజవంశానికి చెందిన రెండవ ఇస్మాయిల్‌ను " చల్దిరన్ యుద్ధం "లో ఓడించడం ద్వారా సాంరాజ్యాన్ని దక్షిణ , తూర్పు సరిహద్దులను విజయవంతంగా విస్తరించాడు. 1517లో మొదటి సలీం ఓట్టమన్ సాంరాజ్యాన్ని అల్జీరియా , ఈజిప్ట్ (ఓట్టమన్ - మమ్లక్ యుద్ధం 1516-1517) వరకు విస్తరించాడు. ఎర్ర సముద్రంలో నౌకలు ప్రవేశపెట్టాడు.తరువాత హిందూమహాసముద్రంలో ఆధిక్యత కొరకు ఓట్టమన్ , పోర్చుగీస్ సాంరాజ్యాల మద్య పోటీ కొనసాగింది. హిందూమహాసముద్రంలో ప్రాణం చేస్తున్న ఓఓటమన్ నౌకలను అడ్డగినచడానికి ఎర్రసముద్రం, అరేబియన్ సముద్రం , పర్షియన్ గల్ఫ్ ప్రాంతాలలో పలు నౌకాయుద్ధాలు సంభవించాయి. హిందూమహాసముద్రంలో పోర్చుగీస్ నౌకలు సంచారం పురాతన తూర్పు ఆసియా , పశ్చిమ ఐరోపా వ్యాపారమార్గాలలో (తరువాత ఇది సిల్క్ రోడ్ అని పిలువబడింది) ఓట్టమన్ ఏకాధిపత్యానికి బెదిరింపుగా మారింది. 1488లో " బర్టోలోమ్యూ డియాస్ " అనే అణ్వేషకుడు పోర్చుగీసు వారు ఆఫ్రికా చుట్టూ పయనించే నౌకా మార్గం కనుగొన్న తరువాత హిందూమహాసముద్రంలో ఓట్టమన్న్ ఏకాధిపత్యం రాజీమార్గంలో పయనించింది.[59]
ఓట్టమన్ సామ్రాజ్యం శక్తి , గౌరవం 16 వ , 17 వ శతాబ్దంలో (సులేమాన్ మహాద్భుతపాలనలో ) శిఖరాగ్రానికి చేరుకుంది. సులేమాన్ స్వయంగా సాంఘిక, విద్య, పన్నువిధింపు , క్రిమినల్ లా మొదలైన చట్టాలలో ప్రధానమార్పులు చేపట్టాడు. ఓట్టమన్ సామ్రాజ్యం మద్య ఐరోపాలో స్థిరంగా ముందుకు సాగుతున్న " పవిత్ర రోమన్ సామ్రాజ్యం " , దక్షిణప్రాంతంలోని " పోలిష్ - లిథ్యుయానియన్ కామంవెల్త్ " లతో విభేదిస్తూ ఉండేది.[60] సముద్రంలో ఓట్టమన్ నౌకాదళం హోలీ లీగ్ 1538, హోలీ లీగ్ 1571, హోలీ లీగ్ 1684 , హోలీ లీగ్ 1717 మొదలైన పలు పవిత్ర లీగ్‌లతో (హబ్స్బర్గ్ స్పెయిన్, జెనీవా రిపబ్లిక్, వెనిస్ రిపబ్లిక్, సెయింట్ జాన్ నైట్స్,పాపల్ స్టేట్స్, తస్కానీ గ్రాండ్ డచీ , సవాయ్ డచీ) లతో మధ్యధరా సముద్రంలో ఆధిక్యత కొరకు పోటీ పడింది. ఓట్టమన్ తూర్పు భాగంలో పర్షియాకు చెందిన సఫావిద్ రాజవంశంతో భూభాగ వివాదాలు , మతపరమైన విభేదాల కారణంగా పలు యుధాలను ఎదుర్కొన్నది.[61]
తరువాత ఓట్టమన్ సామ్రాజ్యం జాంద్ రాజవంశం, అఫ్షరిద్ రాజవంశం , క్వాజర్ రాజవంశాలతో యుద్ధాలు ( " ఓట్టమన్ - పర్షియన్ యుద్ధాలు " ) చేసింది. " ఓట్టమన్ - పర్షియన్ యుద్ధం 1821 - 1823 (19 వ శతాబ్దం మద్య) " వరకు సఫావిదులు ఇరాన్ పాలకులుగా ఉన్నారు. 16 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దం ఆరంభం వరకు ఓట్టమన్ సామ్రాజ్యం రష్యాల మద్య యుద్ధాలు (రష్యా త్సార్డం యుద్ధం , రష్యాసామ్రాజ్యంతో యుద్ధం) సంభవించాయి. ఇవి ఓట్టమన్ టెర్రిటోరియల్ విస్తరణకు , దక్షిణ , తూర్పు ఐరోపా సమైక్యపరచడానికి సహకరించాయి. " రుస్సో - టర్కిష్ యుద్ధం (1768 - 1774) " ఓట్టమన్ సామ్రాజ్యం స్వీయరక్షణ బాధ్యత అవసరం అయింది. ఉత్తర భూభాగాలలో రష్యన్లు చొచ్చుకు వచ్చి ఓట్టమన్ భూభాగాలను (నల్ల సముద్రం) ఆక్రమించుకుంది. 18 వ శతాబ్దం - 20 వ శతాబ్దం మద్యకాలంలో ఓట్టమన్, పర్షియన్ , రష్యా సాంరాజ్యాలు ఇరుగుపొరుగు సాంరాజ్యాలుగా శతృత్వంతో కొనసాగాయి.
18 వ శతాబ్దం రెండవ అర్ధభాగంలో ఓట్టమన్ సామ్రాజ్యం పతనం మొదలైంది. 19 వ శతాబ్దంలో ఓట్టమన్ పశ్చిమప్రాంతంలో సామ్రాజ్యం ఆధునికీకరణ కొరకు సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. కానీ ఈ సంస్కరణలు ఓట్టమన్ సాంరాజ్య పతనం అడ్డుకోవడానికి సరిపోలేదు.[8] " ఓట్టమన్ ఆర్థిక సంక్షోభం 1975 " తరువాత ఓట్టమన్ సామ్రాజ్యం వైశాల్యపరంగా, సంపద పరంగా , సైకపరంగా క్షీణించింది.[62] ఇది బల్కన్ తిరుగుబాటుకు దారితీసింది. ఫలితంగా " రుస్సో - టర్లికీ యుద్ధం 1877 - 1878 " యుద్ధం సంభవించింది. బల్కిన్ ముస్లిములు ఓట్టమన్ కేంద్రం నుండి అనటోలియాకు తరలివెళ్ళారు.[63][64]" రష్యా - సర్కాసియన్ యుద్ధంలో " రష్యన్లు విజయం సాధించిన తరువాత సర్కాసియన్లు కూడా ఈ ప్రాంతం వదిలి వెళ్ళారు.
ఓట్టమన్ క్షీణదశ ఆరంభం అయిన తరువాత ప్రజలలో జాతీయభావాలు అధికం అయ్యాయి. దేశంలో జాతివైషమ్యాలు అధికమై కొన్ని సమయాలలో హింసాత్మకచర్యలకు (హమిడియన్లు ఆర్మేనియన్లను మూకుమ్మడిగా హత్య చేయడం) దారితీసింది.[65] 1908లో " యంగ్ టర్క్ రివల్యూషన్ " రెండవ రాజ్యాంగ శకం ఆరంభం అయింది. మొదటి ఓట్టమన్ రాజ్యాంగం 1876 (మొదటి రాజ్యాంగశకం) , ఓట్టమన్ సాంరాజ్య జనరల్ అసెంబ్లీని 30 సంవత్సరాల ముందుగా 1878లో సుల్తాన్ రెండవ అబ్దులు హమీద్ రద్దు చేసాడు. 1913లో ఓట్టమన్ తిరుగుబాటు తరువాత దేశం " త్రీ పాషాల నియంత్రణ లోకి " మారింది. ఫలితంగా సుల్తాన్ ఐదవ మహ్మద్ , సుల్తాన్ ఆరవ మహ్మద్ రాజకీయ శక్తిరహితమైన అలంకార నాయకులుగా మారారు. ఓట్టమన్ సామ్రాజ్యం సెంట్రల్ పవర్ పక్షంలో చేరి రెండవ ప్రపంచయుద్ధంలోకి ప్రవేశించింది. యుద్ధంలో చివరికి ఓట్టమన్ మద్దతిచ్చిన పక్షం ఓడిపోయింది. తరువాత ఆరంభమైన ఆర్మేనియన్ మూకుమ్మడి జాతిహత్యల కారణంగా ఓట్టమన్ సామ్రాజ్యంలో ఉన్న ఆర్మేయన్లు సిరియా పంపబడ్డారు. ఈ సంఘర్షణలలో 8,00,000 నుండి 15,00,000 మంది ఆర్మేనియన్లు చంపబడ్డారు.[66][67][68][69]
టర్కీ ప్రభుత్వం ఆర్మేనియన్ జాతిహత్యలను అంగీకరించలేదు. ప్రభుత్వం ఆర్మేనియన్లు మాత్రమే తూర్పు యుద్ధభూమి నుండి తరలించబడ్డారని పేర్కొన్నది. [70] సామ్రాజ్యంలో సంభవించిన గ్రీకు , అస్సిరియన్ మూకుమ్మడి హత్యలకు ప్రతిగస్ సామ్రాజ్యం ఈ పెద్ద ఎత్తున మూకుమ్మడి హత్యలకు పూనుకొనడానికి కారణమని భావిస్తున్నారు.[71][72][73] 1928 అక్టోబరు 30న ముద్రోస్ యుద్ధవిరమణ తరువాత విజయవంతమైన మొదటి ప్రపంచయుద్ధం సంకీర్ణదళాలు " " సెవర్స్ ఒప్పందం 1920 " ద్వారా ఓట్టమన్ సామ్రాజ్య విభజనను కోరుకుంది.[56]
మొదటి ప్రపంచయుద్ధం తరువాత సంకీర్ణదళాల ఇస్తాంబుల్ ఆక్రమణ, ఇజ్మిర్ ఆక్రమణ ప్రేరణతో " టర్కిష్ జాతీయోద్యమం " ఆరంభం అయింది.[74] స్వతంత్ర సమరానికి గల్లిపొలి యుద్ధంలో కమాండర్‌గా పనిచేసిన ముస్తాఫా కమల్ పాషా నాయకత్వం వహించాడు.[75]1922 సెప్టెంబరు 18 న ఆక్రమణదారులు తొలగించబడ్డారు. [76] తరువాత అంకారా ఆధారిత టర్కిష్ పాలన మొదలైంది. 1920 ఏప్రిల్ 23న నూతనంగా రూపొందించబడిన టర్కీ తనకుతానే చట్టపూర్వక హోదాను ప్రతిపాదించుకుంది. తరువాత ప్రభుత్వం పాత ఓట్టమన్ చట్టాల స్థానంలో కొత్త రిపబ్లికన్ పొలిటికల్ సిస్టం రూపొందించబడింది. 1922 నవంబరు 1 న అంకారాలోని టర్కీ పార్లమెంటు చట్టపూర్వకంగా సుల్తానేటును తొలగించింది. అంతటితో 623 సంవత్సరాల ఓట్టమన్ ఏకఛత్రాధిపత్యం ముగింపుకు వచ్చింది. 1923 జూలై 24 న లౌసన్నే ఒప్పందం తరువాత దేశానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 1923 అక్టోబరు 29 న అంకారాలో రిపబ్లిక్ అధికారికంగా ప్రకటినచబడింది. కొత్త రిపబ్లిక్కు అంకారా రాజధాని అయింది.[77] లాసన్నే ఒప్పందం అనుసరించి టర్కీ, గ్రీకు దేశాలు పరస్పరం ప్రజలను మార్చుకున్నారు. 11 లక్షల మంది గ్రీకు ప్రజలు టర్కీని వదిలి గ్రీకు వెళ్ళారు బదులుగా 3,80,000 మంది ముస్లిములు గ్రీకు నుండి టర్కీలో ప్రవేశించారు. [78] టర్కీ రిపబ్లిక్ మొదటి అధ్యక్షునిగా " ముస్తాఫా కమల్ " నియమించబడ్డాడు.తరువాత టర్కీలో పాత మత ఆధారిత విభిన్నసంస్కృతుల సమ్మేళితమైన ఓట్టమన్ రాజరిక వ్యవస్థ (1876 ఓట్టమన్ రాజరిక రాజ్యాంగ వ్యవస్థ) నుండి ఆధునిక రిపబ్లిక్ తరహా లౌకికవాద వ్యవస్థను (పార్లమెంటరీ రిపబ్లిక్) స్థాపించడానికి అవసరమైన సంస్కరణలు చేపట్టబడ్డాయి.[79] టర్కీ ప్రభుత్వం 1934లో " సర్నేం ఆఫ్ లా " ప్రవేశపెట్టింది. అలాగే ముస్తాఫా కమల్‌కు " అతాతర్క్ " (టర్కీ పిత) అని గౌరవనామం బహూకరించి సత్కరించింది. [75]
టర్కీ " సెకండ్ కైరో కాంఫరెంస్ " (మధ్యస్థంగా నిలవడం) విధానం అనుసరించి రెండవ ప్రపంచయుద్ధంలో అధికభాగం మద్యస్థంగా నిలిచి చివరి స్థాయిలో 1945 ఫిబ్రవరి 23న సంకీర్ణదళాలకు మద్దతుగా నిలిచింది. 1945 జూన్ 26న టర్కీ ఐక్యరాజ్యసమితి చార్టర్ సభ్యత్వదేశం అయింది.[80] గ్రీకు అంతర్యుద్ధాన్ని అరికట్టిన తరువాత సోవియట్ యూనియన్ టర్కిష్ జలసంధి సమీపంలో మిలటరీ బేస్ నిర్మించాలని నిర్భంధించిన సమయంలో టర్కీ ప్రభుత్వం గ్రీకుప్రభుత్వం నుండి సమస్యలను ఎదుర్కొన్నది. ఈ సంఘటనలు కలిగించిన ప్రేరణతో యు.ఎస్. ప్రభుత్వం 1947లో " ట్రూమన్ డాక్టరిన్ " వెలువరించింది.డాక్టరిన్ అనుసరించి అమెరికన్ ప్రభుత్వం టర్కీ, గ్రీకు దేశాలకు రక్షణకల్పించింది. ఫలితంగా టర్కీ దేశానికి యు.ఎస్. ప్రభుత్వం నుండి బృహత్ప్రణాళికలో యు.ఎస్. సైనిక సహాయం, ఆర్థికసహాయం అందాయి. రెండు దేశాలు 1948లో మార్షల్ ప్లాన్, ఆర్గనైజేషన్ ఫర్ యురేపియన్ ఎకనమిక్ కో- ఆపరేషన్‌లో (ఒ.ఇ.సి.డి)చేర్చబడ్డాయి.[81] తరువాత 1961లో ఆర్గనైజేషన్ ఫర్ యురేపియన్ ఎకనమిక్ కో- ఆపరేషన్ ఫండిగ్ సభ్యదేశాలుగా మారాయి.[82] ఐక్యరాజ్య సమితి సైన్యంతో కలిసి కొరియా యుద్ధంలో పాల్గొన్న తరువాత 1952లో టర్కీ "నాటో" భాగస్వామ్యం వహించింది. తరువాత నాటోతో కలిసి మధ్యధరా సముద్రంలో రష్యావిస్తరించడాన్ని నిరోధించడంలో కృషిచేసింది. తరువాత దశాబ్ధంలో సైప్రియాట్ జాతి కలవరం, 1974 జూలైలో సైప్రియాట్ తిరుగుబాటు తరువాత సైప్రస్ అధ్యక్షుడు మూడవ మకారియోస్ను తొలగించి నిక్సన్ శాంప్సన్‌ను నియంతగా నియమించింది. 1974 జూలై 20 న టర్కీ సైప్రస్ మీద దండయాత్ర చేసింది. [83] 9 సంవత్సరాల తరువాత " టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తెన్ సైప్రస్ " స్థాపించబడింది. అయినా దీనిని టర్కీ మాత్రమే గుర్తించింది. [84]
1945లో టర్కీలో ఏకపార్టీ రిపబ్లిక్ విధానం ముగింపుకు వచ్చింది. తరువాత కొన్ని దశాబ్ధాల వరకు టర్కీలో మల్టీ పార్టీ డెమాక్రసీ ఆరంభం అయింది. 1960, 1980, 1980 సైనిక తిరుగుబాటు అలాగే 1997లో సైనిక మెమొరాండం వంటి అంతరాయాలు సంభవించాయి.[85][86] " 1984 లో కుర్ధిస్థాన్ వర్కర్స్ పార్టీ " కుర్ధిష్ ప్రత్యేకవాదులు కుర్ధిష్లు టర్కిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. కుర్ధిష్ టర్కిష్ పోరాటంలో 40,000 మంది మఋఅణించారు.[87] 3,000 మంది కంటే అధికమైన గ్రామీణప్రజలు సెక్యూరిటీ సైనికులచేత కాల్చివేయబడ్డారు. వేలాది మంది కుర్ధిషులు స్థలమార్పిడి చేయబడ్డారు.[88] కుర్ధిష్ రాజకీయపార్టీలు రద్దుచేయబడ్డాయి. [89] 2012లో శాంతిచర్చలు ప్రయత్నాలు మొదల్సియ్యాయి.[90][91] అయినా సురుక్ - బాంబింగ్ తరువాత కుర్ధిష్ - టర్కీ సంఘర్ణలు తిరిగి ఆరంభం అయ్యాయి.[92] 1980 నుండి టర్కీ ప్రభుత్వం ఆర్థికస్వాతంత్ర్యం ప్రకటించిన తరువాత స్థిరమైన ఆర్థికాభివృద్ధి, గొప్ప రాజకీయ స్థిరత్వం సంభవించింది.[93] 2013 దేశమంతటా వ్యాపించిన నిరసనలు తలెత్తాయి. టర్కీ అంతటా ప్రభుత్వ వ్యతిరేక భావాలు వ్యాపించాయి. [94] 2016 జూలై 15-16 టర్కిష్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చేసిన తిరుగుబాటు విఫలం అయింది.[95]
టర్కీలో పాలనా నిర్వహణ కేంధ్రీకృత అధికారం ఆధారంగా ఉంటుంది. టర్కిష్ ప్రపాలనా నిర్వహణలో కేంద్రీకృత అధికారం ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడీషియరీ శక్తులు పరిగణలోకి తీసుకుని పాలన నిర్వహించబడుతుంది. కేంద్రప్రభుత్వానికి నిర్వహణాధికారం అధికంగా ఉంటుంది. ప్రాంతీయ నిర్వాహకుల అధికారం స్వల్పంగా ఉంటుంది. టర్కీలో ఫెడరల్ విధానం అమలులో లేదు. ప్రాంతాలు కేంద్రం ఆధీనంలో ఉంటాయి. ప్రజలకు సేవలను చేరవేయడం కొరకు ప్రాంతీయ అధికారులు పనిచేస్తుంటారు. ప్రభుత్వప్రతినిధులు గవర్నర్లుగా, నగర గవర్నర్లుగా నియమించబడి పాలనా బాధ్యతలు నిర్వహిస్తుంటారు. గర్నర్లు, నగర గవర్నర్లతో ఇతర ఉన్నత ప్రభుత్వాధికారులు ప్రభుత్వంచే నియమించబడుతుంటారు. వీరిని మేయర్లు కాని ప్రజలచే ఎన్నికైన ప్రతినిధులుగాని నియమించరు. [96] టర్కీ నిర్వహణా సౌలభ్యం కొరకు 81 ప్రాంతాలుగా విభజించబడింది. ఒక్కో ప్రాంతం తిరుగి డిస్ట్రికులు (జిల్లాలు) గా విభజించబడ్డాయి. టర్కీలో మొత్తం 923 డిస్ట్రికులు ఉన్నాయి. [97] టర్కీ గణాంకాలు, ఆర్థిక సౌలభ్యం కొరకు 7 జియోగ్రాఫికల్ రీజన్లుగా, 21 ఉపవిభాగాలుగా విభజించబడ్డాయి. [98]
టర్కీ ట్రాంస్ కాంటినెంటల్ (రెండు కండాలలో),[99] యురేషియన్ దేశం. దేశంలో 97% ఆయియన్ టర్కీ (అసియన్ ఖండం)లో ఉంది. దీనిని మర్మరా సముద్రం, బాస్పరస్ పర్వతాలు యురేపియన్, ది డార్డనెల్లెస్ టర్కీతో వేరుచేస్తున్నాయి. యురేపియన్ టర్కీ దేశంలోని 3% భూభాగం ఉంటుంది. [100] టర్కీ భూభాగం పొడవు 1,600, 800 కి.మీ వెడల్పు ఉంటుంది. దేశం దాదాపు దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది.[101] దేశం 35 - 43 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 25 - 45 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. టర్కీ వైశాల్యం (భూభాగం, సరోవరాలు) 7,83,562 చ.కి.మీ.[102] ఇందులో 7,55,688 చ.కి.మీ. నైరుతీ ఆసియాలో ఉంది, ఐరోపాలో 23,764 చ.కి.మీ. ఉంది.[101] వైశాల్యపరంగా టర్కీ ప్రపంచంలో 37వ స్థానంలో ఉంది. టర్కీ మూడువైపులా సముద్రం (పశ్చిమంలో ఏజియన్ సముద్రం, ఉత్తరంలో నల్లసముద్రం, దక్షిణంలో మధ్యధరా సముద్రం) ఉంటుంది. టర్కీ వాయవ్యంలో మర్మరా సముద్రం ఉంది.[103]
యురేపియన్ టర్కీ " ఈస్ట్ త్రాస్ " బకంస్ ద్వీపకల్పంలో తూర్పు తీరంలో ఉంది. యురేపియన్ టర్కీ సరిహద్దులలో గ్రీకు, బల్గేరియా దేశాలు ఉన్నాయి. ఆసియన్ టర్కీలోని అత్యధిక భూభాగం అనటోలియా ద్వీపకల్పంలో భాగంగా ఉంది. ఇందులో మద్యభాగంలో పీఠభూమి, ఇరుకైన సముద్రతీర మైదానాలు (ఉత్తరణ్లో కొరుగు పర్వతశ్రేణి, పొంటిక్ పర్వతశ్రేణి మద్య, దక్షిణంలో టౌరస్ పర్వత శ్రేణి సమీపంలో) ఉన్నాయి. తూర్పు టర్కీ ఆర్మేనియన్ హైలాండ్ పశ్చిమ పీఠభూమిలో ఉంది. ఇది పర్వతమయంగా ఉండి యూఫ్రేట్స్, టిగ్రిస్, అరాస్ మొదలైన నదులకు పుట్టినిల్లుగా ఉంది. ఇందులో టర్కీలోని అత్యున్నత ప్రాంతమైన " మౌంట్ అరారత్ " (137 మీ) ఉంది. [105] అంతేకాక ఇక్కడ టర్కీలో అత్యంత పెద్దదైన వ్యాన్ సరోవరం ఉంది.[104]
నైరుతీ అనటోలియా ప్రాంతం " అప్పర్ మెసపటోమియా " ఉత్తర మైదానంలో ఉంది.టర్కీ 7 ప్రాంతాలుగా విభజించబడింది: మర్మరా ప్రాంతం, ఏజియన్ ప్రాంతం, నల్లసముద్రం ప్రాంతం, మద్య అనటోలియా ప్రాంతం, తూర్పు అనటోలియా ప్రాంతం, నైరుతీ అనటోలియా ప్రాంతం, మధ్యధరా సముద్ర ప్రాంతం.పొడవైన ఇరుకైన బెల్టులా ఉండే ఉత్తర అనటోలియన్ భూభాగం నల్లసముద్రం తీరం వెంట ఉంటుంది.ఇది టర్కీ మొత్తం భూభాగంలో 6వ వంతు ఉంటుంది.[103]
టర్కీ వైద్యమైన భూభాగం వివిధ ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుంది. భౌగోళిక వైరుధ్యం కారణంగా టర్కీ తరచుగా భూకంపాలు, అప్పుడప్పుడూ అగ్నిపర్వతాలు జ్వలించడం వంటి వైపరీత్యాలకు గురి ఔతూ ఉంటుంది. బాస్ఫరస్, డార్డనెల్లెస్ ఫాల్ట్ భౌగోలిక ఉపస్థితి నల్లసముద్రం ఏర్పడడానికి కారణమయ్యాయి. దేశం ఉత్తర భాగంలో ఉన్న అంటోలియా ఫాల్ట్ వెంట తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. సమీపకాలంగా 1999 లో ఇజ్మిత్ భూకంపం సంభవించింది.
అసాధారణమైన టర్కీ పర్యావరణం వైవిధ్యమైన వృక్షజాలం జీవించడానికి అనుకూలంగా ఉంటుంది.[106]
అనటోలియా పలు వృక్షజాతులకు నిలయంగా ఉంది. వీటిలో పలు మొక్కలు వ్యవసాయం ఆరంభిననాటి నుండి సాగుచేయబడుతున్నాయి. అడవి మొక్కలుగా ఉన్న పలు మొక్కలు టర్కీలో ఇప్పటికీ మానవులకు ఆహారం అందిస్తూ ఉన్నాయి. టర్కీ వృక్షజాలం కంటే జంతుజాలం చాలా వైవిధ్యభరితమైనది. ఐరోపాలో మొత్తం 60,000 జంతుజాలం ఉండగా టర్కీలో మాత్రమే 80,000 జంతుజాలం (ఉప జాతులన్నీ కలిపి 1,00,000 జంతుజాతులు) ఉన్నాయి.[107]
" ది నార్తెన్ అనటోలియన్ కోనిఫర్ అండ్ డెసిడ్యుయస్ " ఉత్తర టర్కీలోని పొంటిక్ పర్వతాలలో అత్యధికభాగం విస్తరించి ఉన్నాయి. ఈ పర్వతశ్రేణి తూర్పు తీరంలో " కౌకాసస్ మిశ్రిత అరణ్యాలు " విస్తరించి ఉన్నాయి. ఈప్రాంతంలో " యురేషియన్ స్ప్రావావ్క్, గోల్డెన్ ఈగల్, ఈస్టర్న్ ఇంపీరియల్ ఈగిల్, లెస్సర్ స్పాటెడ్ ఈగల్, కౌకాసియన్ బ్లాక్ గ్రూస్ అండ్ వాల్ క్రీపర్ వంటి చెట్లు అధికంగా ఉంటాయి.[108] పొంటిక్ పర్వతాలు , నల్ల సముద్రం మద్య ప్రాంతం " యుక్సిన్ - కొల్చిక్ డెసిడస్ ఫారెస్ట్ " లో ప్రంపంచంలో స్వల్పంగా ఉన్న ఉష్ణమండల వర్షారణ్యాలు ఉన్నాయి. [109] టర్కీలో కనిపించే " టర్కిష్ పైన్ " చెట్లు ఇతర మద్యధరా దేశాలలో కూడా ఉన్నాయి. తులిప్ వంటి అడవిపుష్పాలను అనటోలియా ప్రపంచానికి పరిచయం చేసింది.16వ శతాబ్ధంలో ఓట్టమన్ సాంరాజ్యం నుండి తీసుకువచ్చిన తులిప్ పుష్పాలను అనటోలియా పశ్చిమయూరప్లో పరిచయం చేసింది.[110][111] టర్కీలో 40 నేషనల్ పార్కులు, 189 నేచుర్ పార్కులు, 31 అభయారణ్యాలు, 80 వన్యమృగ సంరక్షణ ప్రాంతాలు , 109 పర్వతాలు ఉన్నాయి. నేషనల్ పార్కులలో " గల్లిపొలి పెనెంసులా హిస్టారికల్ నేషనల్ పార్క్, మౌంట్ నెంరుత్ నేషనల్ పార్క్, ఏంషియంట్ టయోటా నేషనల్ పార్క్, ఒలుడెనిజ్ నేచుర్ పార్క్, పొలోనెజ్కొయ్ నేషనల్ పార్క్ ప్రాధానమైనవి.[112]
టర్కీ రాజధాని అంకారా. టర్కిష్ అంగొరా క్యాట్, అంగోరా రాబిట్, అంగోరా గోట్. టర్కీలో నేషనల్ క్యాట్ జాతి " వ్యాన్ క్యాట్ " మరొకటి.కుక్క జాతులలో అనటోలియన్ షెప్పర్డ్, కంగల్ డాగ్, అక్సరాయ్ మలక్లిసి డాగ్, అక్బాష్ డాగ్ ప్రధానమైనవి.[113] " ది పర్షియన్ కౌకాసియన్ లెప్పర్డ్ " ఈశాన్య టర్కీ, వాయవ్య టర్కీలలో స్వల్పంగా కనిపిస్తున్నాయి.[114][115] " ది కాస్పియన్ టైగర్ " (సైబీరియన్ టైగర్ జాతికి సమీపంగా ఉంటుంది) టర్కీ తూర్పు తీరంలో ఉంటుంది. ఇది 20 వ శతాబ్దం రెండవ అర్ధభాగం వరకు జీవించి ఉండి 1970 ఫిబ్రవరిలో (ఉలుడెరెలో) మరణించిందని నిర్ధారించబడింది.[114][116] యురేషియన్ లింక్స్,యురేపియన్ విల్డ్ క్యాట్ ఇతర జాతులు టర్కీ అడవులలో కనిపిస్తుంటాయి.
ఏగియన్ సముద్రం, మద్యధరా సముద్రం తీరాలలో ఉన్న టర్కీ సముద్రతీరప్రాంతాలలో వేడి, పొడి వేసవి, స్వల్పమైన చల్లని శీతాకాలాలతో కూడిన సమశీతోష్ణ మద్యధరా వాతావరణం నెలకొని ఉంటుంది.[117] నల్ల సముద్రతీరప్రాంత టర్కీలో వెచ్చని, తడి వేసవి, చలి నుండిశీతల తడితో కూడిన శీతాకాలంతో కూడిన సమశీతోష్ణ ఓషనిక్ వాతావరణం నెలకొని ఉంటుంది. [117] నల్ల సముద్రతీరప్రాంత టర్కీప్రాంతం అత్యధిక వర్షపాతం అందుకుంటుంది. సంవత్సరమంతా వర్షపాతాన్ని అందుకుంటున్న టర్కీ ప్రాంతంగా ఇది ప్రత్యేకత సంతరించుకుంది.[117] తూర్పుతీర టర్కీ ప్రాంతంలో వర్షపాతం 2200 మి.మీ ఉంటుంది. టర్కీలో అత్యధిక వర్షప్రాంతం అందుకుంటున్న ప్రాంతం ఇదే.[117] మర్మరా సముద్రతీరప్రాంత టర్కీప్రాంతం మరొకవైపు ఏగియన్ సముద్రప్రాంతం, నల్ల సముద్రప్రాంతం ఉన్నాయి. ఈప్రాంత వాతావరణం సమశీతోష్ణ మద్యధరాప్రాంత వాతావరణం నుండి సమశీతోష్ణ ఓషనిక్ సముద్రవాతావరణానికి మారుతూ ఉంటుంది.ఈ ప్రాంతంలో వెచ్చదనం నుండి వేడి, స్వల్పమైన పొడిగా ఉండే వేసవి, చలి నుండి శీతలంగా ఉండే శీతాకాలాలు ఉంటాయి.[117] ప్రతిశీతాకాలం మర్మరా సముద్రం, నల్ల సముద్రం తీర ప్రాంతాలలో హిమపాతం సంభవిస్తూ ఉంటుంది. అయినా మంచు త్వరగానే కొన్ని రోజులలోనే కరుగుతూ ఉంటుంది.[117] ఏగియన్ సముద్రతీరప్రాంతం, మద్యధరా సముద్రతీరప్రాంతాలలో శ్చాలా అరుదుగా హిమపాతం సంభవిస్తూ ఉంటుంది.[117] సముద్రతీరంలోని పర్వతశ్రేణి కారణంగా లోతట్టు అనటోలియన్ పీఠభూమి ప్రాంతంలో ఖండాంతర వాతావరణం (కాంటినెంటల్ క్లైమేట్) నెలకొని వైవిధ్యమైన సీజన్ వాతావరణ మార్పులు సంభవిస్తూ ఉంటుంది.[117] తూర్పు భూభాగంలో శీతాకాలం తీవ్రంగా ఉంటుంది.[117] తూర్పు అనటోలియాలో 30-40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది.[117] సంవత్సరంలో 120 రోజులు మంచు నిలిచి ఉంటుంది.[117] పశ్చిమ భూభాగంలో ఉష్ణోగ్రత సరాసరిగా 34 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుంది.[117] వేసవి పొడి, వేడి వాతావరణం నెలకొని సరాసరి ఉష్ణోగ్రత 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.[117] సరాసరి వార్షిక వర్షపాతం 400 మి.మీ ఉంటుంది. అయినప్పటికీ ఉష్ణోగ్రత సముద్రమట్టం నుండి భూభాగ ఎత్తు అనుసరించి ఉంటుంది. కొన్యా, మలత్యా ప్రాంతాలు చాలాపొడిబారిన ప్రాంతాలుగా ఉంటాయి. ఇక్కడ వర్షపాతం సరాసరిగా 300 మి.మీ. ఉంటుంది. మే మాసం అత్యంత తడిగానూ జూలై, ఆగస్టు మాసాలు అత్యంత పొడిబారిన మాసాలుగా ఉంటాయి.[117]
Tayyip Erdoğan President of Turkey |
Binali Yıldırım Prime Minister of Turkey |
టర్కీలో పార్లమెంటరీ ప్రాతినిధ్యం వస్తున్న ప్రజాస్వామ్యం ఉంది. 1923లో టర్కీ స్థాపించినప్పటి నుండి టర్కీ లౌకికవాద దేశంగా కొనసాగుతూ ఉంది. [118] టర్కీలో చట్టవిధానాలను టర్కీ రాజ్యాంగం రూపొందిస్తూ ఉంది. అది టర్కీ ప్రభుత్వ విధానాలు, టర్కీని సమైకృత అధికార కేంద్రీకృత దేశంగా చేయడానికి అవసరమైన విధానాలను తయారుచేసింది.దేశానికి అధ్యక్షుడు నాయకత్వం వహిస్తాడు. అయినా అధ్యక్షుడు అధికంగా అలంకారప్రాయమైన పాత్ర వహిస్తాడు.అధ్యక్షుడు 5 సంవత్సరాల కాలం పదవి వహిస్తాడు. అధ్యక్షుడు ఓటింగ్ ద్వారా ఎన్నిక చేయబడతాడు. టర్కీ మొదటి అధ్యక్షునిగా " రిసెప్ టయ్యిప్ ఎర్డోగన్ " ప్రత్యక్ష ప్రజా ఓటింగ్ ఎన్నిక చేయబడ్డాడు.
ప్రధానమంత్రికి పాలనాధికారం అధికంగా ఉంటుంది. మంత్రిమండలి ప్రభుత్వపాలనా వ్యవహారాలకు బాధ్యత వహిస్తుంది. చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది.[119] పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. అధికంగా ఆధిక్యత కలిగిన పార్టీ అధ్యక్షుడు ప్రధానమంత్రిగా ఎన్నిక చేయబడుతుంటాడు.
1933 నుండి టర్కీ అంతటా స్త్రీపురుషులిద్దరికీ సారస్వతక ఓటుహక్కు అమలులో ఉంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి టర్కీ పౌరుడు ఓటు హక్కును కలిగి ఉంటాడు. పార్లమెంటు సభ్యులసంఖ్య 550. వీరి పదవీకాలం 4 సంవత్సరాలు. పార్లమెంటు సభ్యులను 85 జిల్లాల నుండి ఎన్నుకుంటారు.లైకికవాదానికి వ్యతిరేకంగా చర్యలు వ్యవహరించే పార్టీల మీద ఆర్థికపరమైన నిషేధం విధించబడుతుంది.[120][121]
టర్కీలో మానవహక్కులు వివాదాస్పదమై అంతర్జాతీయంగా ఖండించబడుతూ ఉంది. 1998, 2008 " యురేపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ " టర్కీకి వ్యతిరేకంగా 1,600 మానవహక్కుల ఉల్లంఘన సంబంధిత తీర్పులను (ప్రత్యేకంగా జీవించే హక్కు, హింస నుండి విముక్తి ) ఇచ్చింది. కుర్దిష్ హక్కులు, స్త్రీ హక్కులు, ఎల్.జి.బి.టి. హక్కులు, ప్రెస్ హక్కులు వివాదాస్పదమయ్యాయి. టర్కీ మానవహక్కుల ఉల్లంఘన వివాదాలు భవిష్యత్తు యురేపియన్ యూనియన్ సభ్యత్వానికి గణనీయమైన ఆటంకంగా మారింది. [122] టర్కీ ప్రభుత్వం టెర్రరిజం, దేశద్రోహచర్యల కేసులను ఉపయోగించి జర్నలిస్టులను ఖైదుచేసింది. తర్కిష్ ప్రజలను కించపరిస్తున్నారని, ఇస్లాంను అవమానపరుస్తున్నారని ఖైదుచేయబడ్డారు.[123] 2012లో టర్కీలో 76 పత్రికావిలేఖరులు జైలుపాలయ్యారని సి.పి.జె గుర్తించింది. [123] 9 మంది సంగీతకారులు (వారి ప్రతిభ చైనా, రష్యా తరువాత మూడవ స్థానంలో వర్గీకరించబడిన కారణంగా) ఖైదుచేయబడ్డారని ఫ్రీ మౌస్ గుర్తించింది.[124] " యు.ఎస్. స్టేట్ డిపార్ట్మెంటు " స్పోక్స్‌మన్ " ఫిలిప్ జె. క్రౌలీ టర్కీలో పత్రికావిలేఖరులు ప్రభుత్వ బెదిరింపులకు గురౌతున్నారని యు.ఎస్ ప్రభుత్వం ఆందోళన చెందుతుందని తెలియజేసాడు.[125] ఫ్రీడం హౌస్ టర్కీని " నాట్ ఫ్రీ " గా వర్గీకరించింది..[126]
టర్కీలో చట్టం యూరప్ ఖండంలోని దేశాలలోని చట్టవధానాలను సమాహారంచేసి రూపొందించబడింది. ఉదాహరణకు టర్కిష్ సివిల్ చట్టం స్విట్జర్లాండ్ సివిల్ చట్టం అంశాల ఆధారంగా రూపొందించబడింది. కమర్షియల్ చట్టం జర్మనీ కమర్షియల్ చట్టం ఆధారంగా రూపొందించబడింది. ప్రభుత్వనిర్వహణ చట్టం ఫ్రెంచ్ రాజ్యాంగ చట్టం ఆధారంగా రూపొందించబడింది. పీనల్ కోడ్ ఇటలీ పీనల్ కోడ్ ఆధారంగా రూపొందించబడింది.[127] టర్కీ అధికార వికేంద్రీకరణ విధానాన్ని స్వీకరించి పరిపాలన కొనసాగిస్తుంది. ఈ విధానం అనుసరించి న్యాయవిధానం స్వేచ్ఛాయుతమైన న్యాయస్థానాల ఆధారంగా ప్రభుత్వం తరఫున అమలుపరచబడుతుంది. స్వేచ్ఛాయుతమైన న్యాయవ్యవస్థ, న్యాయాధికారులు , పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రక్షణ, న్యాయాధికాతుల వృత్తి , ప్రాసిక్యూటర్ బాధ్యత, న్యాయాధికారుల , పబ్లిక్ ప్రాదిక్యూటర్ల పర్యవేక్షణ, సైనిక న్యాయస్థానాలు , వారి సంస్థలు , ఉన్నత న్యాయస్థానం బాధ్యతలు , అధికారం మొదలైనవి టర్కిష్ రాజ్యాంగం క్రమబద్ధీకరణ చేయబడుతున్నాయి.[128] టర్కిష్ రాజ్యాంగం 142 ఆర్టికల్ ఆధారంగా సంస్థాగతమైన బాధ్యతలు , న్యాయస్థానాల న్యాయనిర్ణయవిధానం, వారి కార్యాచరణ , విచారణా విధానాలు మొదలైనవి చట్టాల ద్వారా క్రబద్ధీకరించబడుతుంటాయి. టర్కీరాజ్యాంగంలో పైన ఉదహరించిన అంశాలు , సంబంధిత చట్టాలు మూడు ప్రధాన వర్గాలుగా వర్గీకరించబడ్డాయి; అవి వరుసగా జ్యుడీషియల్ కోర్టులు, అడ్మినిస్ట్రేటివ్ కోర్టులు , మిలటరీ కోర్టులు (సైనిక న్యాయస్థానాలు). ఒక్కొక కోర్టుకు ఇంస్టెంస్ కోర్ట్ , హైకోర్టు ఉంటాయి.[128] టర్కీలో చట్టం అమలు బాధ్యత పలు డిపార్టుమెంట్లు (జనరల్ డైరెక్ట్ ఆఫ్ సెక్యూరిటీ , జెండర్మెరీ జనరల్ కమాండ్) , ఏజెంసీలు వహిస్తున్నాయి. " మినిస్టరీ ఆఫ్ ఫస్టిస్ " విడుదలచేసిన వివరణల ఆధారంగా 2008 నాటికి టర్కిష్ జైళ్ళలో 1,00,000 మంది ఖైదీలు ఉన్నారని అంచనా. 2000 లో ఖైదీల సంఖ్య 50,000 ఉండేది.[129]" జస్టిస్ అండ్ డిపార్ట్మెంటు పార్టీ " , " రిసెప్ టయ్యప్ ఎర్డోగన్ " పాలనలో (ప్రత్యేకంగా 2013) టర్కీ న్యాయవ్యవస్థను పలు సంస్థలు, పార్లమెంటేరియన్లు , పత్రికావిలేఖరులు టర్కీ లోపల , వెలుపల సందేహాలు వెలిబుచ్చుతున్నారు; జడ్జీలు , ప్రాసిక్యూటర్ల పనిలో ప్రభుత్వబాధ్యత అన్న ముసుగులో రాజకీయ జోక్యం అధికమైంది అని భావిస్తున్నారు.[130][131][132][133] యురేపియన్ కమీషన్ వెలువరించిన టర్కీ 2015 నివేదిక " టర్కీలో న్యాయవ్యవస్థ అధికార వికేంద్రీకరణను గౌరవించడం నిర్లక్ష్యానికి గురిచేయబడుతున్నాయి. న్యాయాధికారులు, ప్రాసిక్యూటర్ల కార్యాచరణ మీద బలమైన రాజకీయ వత్తిడి ఉంది. " అని తెలియజేస్తుంది
" ది టర్కిష్ ఆర్మ్డ్ ఫోర్స్ " లో టర్కిష్ లాండ్ ఫోర్స్, టర్కిష్ నావల్ ఫోర్స్, టర్కిష్ ఎయిర్ ఫోర్స్ అనే మూడు విభాగాలు ఉన్నాయి.దేశంలో శాంతి నెలకొని ఉన్న సమయంలో ది టర్కిష్ జెండర్మేరీ , ది టర్కిష్ కోస్ట్ గార్డ్ మిసిస్టరీ ఆఫ్ ఇంటర్నల్ అఫెయిర్ " మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. యుద్ధసమయంలో వరుసగా ఇవి ఆర్మీ, నేవీ ఆధ్వర్యంలో పనిచేద్తాయి.[135] " టర్కిష్ జనరల్ స్టాఫ్ చీఫ్ " అధ్యక్షునిచేత నియమించబడి ప్రధానినేతృత్వంలో పనిచేస్తాడు. మంత్రులు పార్లమెంటు ఆధ్వర్యంలో దేశరక్షణబాధ్యత వహిస్తారు. అలాగే దేశరక్షణకు అవసరమైన సైనికదళాలలను ఏర్పాటుచేస్తారు.అయినప్పటికీ అథారిటీ ఆదేశాలను అనుసరించి టర్కిష్ ఆర్మీ విదేశీసైన్యంతో కలిసి యుద్ధంచేయడానికి నియమినబడుతుంది అలాగే విదేశీసైన్యంతో కలిసి స్వదేశంలో యుద్ధంచేస్తుంది.[135] నాటోలో అత్యధిక సభ్యులను కలిగి ఉన్న దేశాలలో టర్కీ ద్వితీయస్థానంలో (మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ) ఉంది.2011 నాటో గణాంకాల ఆధారంగా నాటోసైన్యంలో టర్కీ 4,95,000 సైనికులను నియమించింది. [136]" న్యూక్లియర్ షేరింగ్ " సభ్యదేశాలలో టర్కీ బెల్జియం, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్దేశాలతో కలిసి పనిచేస్తుంది. [137]" ఇంసర్లిక్ ఎయిర్ బేస్" వద్ద ఉన్న 90 అణుబాంబులలో 40 టర్కీ ఎయిర్ ఫోర్స్ ఆధీనంలో ఉన్నాయి.అణుయుద్ధం సంభవిచిన సమయంలో నాటో ఆదేశంతో టర్కీ వీటిని ఉపయోగించడానికి అనుమతి [138] టర్కీలోని అర్హత కలిగిన పురుషులందరూ సైన్యంలో చేరి కనీసం సంవత్సరానికి మూడువారాలైనా పనిచేయాలి.[139]
ప్రపంచంలో అతిపెద్ద జి.డి.పి. కలిగిన దేశాలలో టర్కీ జి.డి.పి. 17వ స్థానంలో ఉంది.[141] అలాగే అతిపెద్ద నామినల్ జి.డిపి కలిగిన దేశాలలో టర్కీ 18వ స్థానంలో ఉంది.[142] ఒ.ఇ.సి.డికి నిధులు సమకూరుస్తున్న (ఫండింగ్) దేశాలలు, ది జి 20 దేశాలలో టర్కీ ఒకటి.[143][144]
1995లో " ది యురేపియన్ యూనియన్ - టర్కీ కస్టంస్ యూనియన్ " సభ్యత్వం టర్కీదేశానికి పన్నువిధింపులో స్వేచ్ఛను కలిగిస్తూ టర్కీ విదేశీవాణిజ్య విధానంలో మైలురాయిగా నిలిచింది.[145] 2011 గణాంకాలను అనుసరించి టర్కీ ఎగుమతులు 143.5 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఉండగా 2012లో 163 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది. 2012లో టర్కీదేశంతో జర్మనీ 8.6%, ఇరాక్ 7.1%, ఇరాన్ 6.5%, యునైటెడ్ కింగ్డం 5.7%, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 5.4% వాణిజ్యభాగస్వామ్యం వహిస్తుంది. అయినప్పటికీ అత్యధికంగా అభివృద్ధి చేసిన దిగుమతులు 229 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది. 2012 దిగుమతులలో రష్యా 11.3%, జర్మనీ 9%, చైనా 9%, యునైటెడ్ స్టేట్స్ 6%, ఇటలీ 5.6% భాగస్వామ్యం వహించింది.[13]
టర్కీలో గుర్తించతగినంత బృహత్తర " ఆటోమొబైల్ ఇండస్ట్రీ " ఉంది. 2015లో 1.3 మిలియన్ల మోటర్ వాహనాలను తయారుచేసింది. టర్కీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రపంచంలో 14వ స్థానంలో ఉంది.[146]2011లో టర్కిష్ నౌకానిర్మాణ రంగం ఎగుమతులు 1.2 బిలియన్ల అమెరికండాలర్లు ఉందని అంచనా.[147] టర్కీ ఉత్పత్తులు మాల్టా, మార్షల్ ద్వీపాలు, పనామా, యునైటెడ్ కింగ్డం దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి.టర్కీ షిప్ యార్డులో 15 ఫ్లోటింగ్ డాక్స్ ఉన్నాయి.[147] తుజ్లా, యలోవా, ఇజ్మిత్ నౌకానిర్మాణకేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.[148] 2011 నాటికి 70 క్రియాశీలకమైన నౌకాశ్రయాలు ఉన్నాయి. 56 నిర్మాణదశలో ఉన్నాయి.[148] టర్కిష్ నౌకాశ్రయాలు కెమికల్, ఆయిల్ టాంకర్ల నిర్మాణం అంతర్జాతీయంగా గుర్తించబడుతుంది.[148]
టర్కిష్ బ్రాండ్లైన బెకో, వెస్టెల్ సంస్థలు కంస్యూమర్ ఎలెక్ట్రానిక్స్, హోం అప్లయంసీస్ ఉత్పత్తిలో ఐరోపాలో అతిపెద్ద సంస్థలుగా గుర్తించబడుతున్నాయి. అలాగే టర్కీ కంస్యూమర్ ఎలెక్ట్రానిక్స్, హోం అప్లయంసీస్ రంగంలో పరిశోధన, అభివృద్ధి కొరకు తగినంత వ్యయం చేస్తుంది. [149][150][151]
టర్కీ ఆర్థికరగంలో అదనంగా బ్యాంకింగ్, నిర్మాణరంగం, హోం అప్లయంసీస్, ఎలెక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఆయిల్ రిఫైనింగ్, పెట్రో కెమికల్ ప్రొడక్ట్స్, ఫుడ్, మైనింగ్, ఇరన్ అండ్ స్టీల్, మెషిన్ ఇండస్ట్రీ ప్రధానమైనవి. 2010లో వ్యవసాయరంగం నుండి 9% జి.డి.పి లభించింది. ఇండస్ట్రియల్ రంగం నుండి 26% జి.డి.పి లభించగా సేవారంగం నుండి 65% లభించింది.[13] అయినప్పటికీ వ్యవసాయరంగం 25% ఉపాధి సౌకర్యం కల్పిస్తుంది.[152] 2012లో స్త్రీ ఉద్యోగుల శాతం 30% ఉంటుందని అంచనా.[153] స్త్రీ ఉద్యూగుల శాతంలో ఒ.ఇ.సి.డి. దేశాలు దిగువన ఉన్నాయి.[154]
2012లో " ఫారెన్ డైరెక్ట్ ఇంవెస్ట్మెంట్ " (ఎఫ్.డి.ఐ) 8.3 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది. 2015లో ఇది 15 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది. [155] 2012లో ఫిచ్ గ్రూప్ టర్కీ క్రెడిట్ శాతాన్ని పెట్టుబడుల శాతాన్ని 18 సంవత్సరాల తరువాత అభివృద్ధి స్థాయికి తీసుకువచ్చింది. [156] కొనసాగింపుగా 2013 మే మూడీస్ సంస్థ మరికొంత అభివృద్ధికి దోహదం చేసింది. [157][158]
టర్కీ రిపబ్లిక్ ఆరంభకాలంలో స్థాపించబడిన " టర్కీ ఈస్ బ్యాంకసి " (1924), " సనయీ వె మాదిన్ బ్యాంకసి (1925), ఎమ్లాక్ వె ఈతాం బ్యాంకసీ (1926), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ టర్కీ బ్యాంకసీ (1930), సుమర్ బ్యాంక్ (1933), ఇల్లర్ బ్యాంకసి (1933), ఎతిబ్యాంక్ (1935), డెనిజ్బ్యాంక్ (1937), హాక్ బ్యాంకసి (1938) మొదలైన బ్యాంకులు ప్రభుత్వానికి స్వంతమైనవి. టర్కీలో ప్రైవేట్ పరిశ్రమలు తక్కువగా ఉన్న కారణంగా ప్రభుత్వం పరిశ్రమలకు వివిధ ప్రోత్సాహకాలు , రాయితీలు కల్పించింది. 1920-1950 మద్యకాలంలో పారిశ్రామికవేత్తలు న్యూరీ డెమిరాగ్, వెహ్బి కాక్, హసి ఒమర్ సబాంసి , నెజత్ ఎక్జాసిబాసి ప్రైవేటుకు స్వంతమైన ఫ్యాక్టరీలను స్థాపించారు. వీటిలో కొన్ని బృహత్తర పరిశ్రమలుగా విస్తరించి టర్కీ ఆర్ధికరంగంలో ఆధిఖ్యత సాధించాయి. బృహత్తర పరిశ్రమలలో కాక్ హోల్డింగ్, సబాంసి హోల్డింగ్ , ఎక్జాసిబాసి హోల్డింగ్స్ ప్రధానమైనవి.
టర్కిక్ రిపబ్లిక్ మొదటి ఆరు దశాబ్ధాలలో (1923-1983) కేంద్రీకృత అధికారవిధానంలో పరిపాలన కొనసాగించింది. టర్కీ ప్రభుత్వం కఠినమైన ప్రణాళికాబద్ధమైన ఆర్ధికవిధానాలను అనుసరించింది. ప్రభుత్వం విదేశీవాణిజ్యం, విదేశీమారకం, విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు , ప్రైవేట్ భాగస్వామ్యం(మాధ్యమప్రసారాలు, టెలికమ్యూనికేషంస్, విద్యుత్తు ఉత్పత్తి, గనులు) మీద పరిమితులు విధించింది. అయినప్పటికీ 1983 లో ప్రధానమంత్రి " టర్గుత్ క్వజాల్ " ప్రైవేటిజం , మార్కెట్ ఎకనమీకి ప్రోత్సాహం కల్పిస్తూ వరుస ఆర్ధిక సంస్కరణలు మొదలుపెట్టాడు.[93] సంస్కరణల కారణంగా విస్తారంగా లభించిన విదేశీౠణ సాయంతో టర్కీ ఆర్ధికరంగం వేగవంతంగా అభివృద్ధిచెందింది. అయినప్పటికీ 1994 - 1999 -2001 మద్య కాలంలో అంతర్జాతీయంగా సంభవించిన ఆర్ధికసంక్షోభం , 1999లో సంభవించిన ఇజ్మిత్ భూకంపం ప్రభావం టర్కీ ఆర్ధికరంగం మీద కూడా ప్రభావం చూపింది.[159][160] 1981 -2003 మద్య టర్కీ వార్షిక జి.డి.పి. అభివృద్ధి 4%.[161] అదనపు సంస్కరణల కొరత కారణంగా పబ్లిక్ సెక్టర్, ప్రభుత్వ బడ్జెట్ లోటు , దేశమంతటా వ్యాపించిన లంచగొండితనం ఫలితంగా ద్రవ్యోల్భణం అధికరించడం, బ్యాంకింగ్ రగం బలహీనపడడం , మైక్రో ఎకనమిక్ ఊగిసలాట వంటి సమస్యలు ఎదురయ్యాయి.[162]
2001 లో టర్కీలో ఆర్ధికసంక్షోభం సంభవించిన తరువాత అప్పటి ఆర్ధికమంత్రి కెమల్ డర్విస్ ఆర్ధిక సంస్కరణలు చేపట్టాడు. ఫలితంగా దశాబ్ధాల తరువాత ద్రవ్యోల్భణం మొదటిసారిగా 2005 లో 8% చేరుకుంది. పెట్టుబడిదారుల ఆత్మవిశ్వాసం , విదేశీపెట్టుబడులు అధికరించాయి. అలాగే నిరుద్యోగం 2005 నాటికి 10% నికి చేరుకుంది. [163] సంస్కరణలతో టర్కీ మార్కెట్ క్రమంగా కోలుకున్నది. ప్రైవేట్ పరిశ్రమలు , విదేశీభాగస్వామ్య పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులు , విదేశీవాణిజ్యం మీద ప్రభుత్వ నియంత్రణ తగ్గుముఖంపట్టింది.[164] 2001 లో " డెబ్ట్ - టు - జి.డి.పి. శాతం శిఖరాగ్రం (75.9%) చేరుకుంది. 2013 నాటికి అది 26.9 చేరుకుంటుందని భావించారు.[165] 2002-2007 మద్య సరాసరి జి.డి.పి శాతం 6.8%.[166] ఈ సమయంలో టర్కీ ఆర్థికరంగం ప్రపంచంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికరంగాలలో ఒకటిగా మారింది. అయినప్పటికీ 2008 నాటికి అభివృద్ధి 1% తగ్గింది. 2009 లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా టర్కీ ఆర్థికరంగం 5% తిరోగమనంలో పయనించింది.2010 నాటికి టర్కీ ఆర్థికరంగం 8% అభివృద్ధి సాధించింది.[13] 2011 యూరోస్టాట్ డేటా ఆధారంగా టర్కిష్ సరాసరి జి.డి.పి యురేపియన్ యూనియన్ సరాసరి జి.డి.పి.లో 52% ఉంటుందని అంచనా.[167]
21 వ శతాబ్దం అత్యధికస్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం నియంత్రణలోకి తీసుకురాబడింది. తరువాత 2005లో ఆర్థికమాంద్యం తొలగించి, ఆర్థికరంగాన్ని స్థిరపరచడానికి " టర్కిష్ న్యూ లిరా " ప్రవేశపెట్టడానికి దారితీసింది.[168] 2009లో " టర్కిష్ న్యూ లిరా " 4 సంవత్సరాలు చలామణి తరువాత టర్కిష్ న్యూ లిరా బ్యాంక్ నోట్లు, నాణ్యాలు రద్దు చేయబడ్డాయి. అయినప్పటికీ టర్కిష్ లిరా " ఐ.ఎస్.ఒ. 4217 " కోడ్ ఇప్పటికీ విదేశీమార్కెట్‌లో ఉపయోగంలో ఉంది.
టర్కీలో పర్యాటకం గత 2 దశాబ్ధాలలో వేగవంతంగా అభివృద్ధి చెందింది. టర్కీ ఆర్థికవనరులలో పర్యాటకరంగం ప్రముఖపాత్ర వహిస్తుంది.ప్రస్తుతం " ది టర్కిష్ మినిస్టరీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం " పర్యాటకరంగం " టర్కీ హోం " పేరుతో నిర్వహించబడుతుంది. 2013లో టర్కీని 37.8 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారు. " వరల్డ్ టూరిజం "వర్గీకరణలో సంఖ్యాపరంగా విదేశీపర్యాటకుల వరుసలో టర్కీ అంతర్జాతీయంగా 16వ స్థానంలో ఉంది. 2011 గణాంకాల ఆధారంగా టర్కీ దేశీయ ఆదాయంలో పర్యాటటకరగం నుండి 27.9 అమెరికండాలర్లు లభించాయి.[169]2012 లో టర్కీని సందర్శించిన పర్యాటకులలో జర్మనీ నుండి 15%, రష్యా 11%, యునైటెడ్ కింగ్డం 8%,బల్గేరియా 5%, జార్జియా, నెదర్లాండ్ , ఇరాన్ నుండి తలసరి 4%, ఫ్రాంస్ నుండి 3% , సిరియా , యునైటెడ్ స్టేట్స్ తలసరి 2% , ఇతర దేశాల నుండి 40% పర్యాటకులు ఉన్నారు.[170] యునెస్కో జాబితాలో టర్కీ 13వ స్థానంలో (ఇస్తాంబుల్ లోని చారిత్రక ప్రదేశాలు, కప్పడోషియా లోని రాక్ సైట్స్, కాతల్హోక్ నియోలిథిక్ సైట్, హత్తుసా, రాజధాని హిట్టిటే, ట్రాయ్ లోని పురాతత్వ ప్రదేశాలు, పెర్గమన్ మల్టీ లేయర్డ్ లాండ్స్కేప్, హెయిరాపోలిస్ - పముక్కలే , నెర్ముత్ పర్వతం) ఉంది.[171] అలాగే " 51 టర్కీ లోని ప్రపంచవారసత్వ ప్రదేశాలు " జాబితాలో చారిత్రక పురాతత్వ ప్రదేశాలు లేక పురాతన నగర కేంద్రాలలో గోబెక్లి తెపె, గోర్డియాన్, ఎఫెసస్, అఫ్రోడిసియాస్, పెర్గా, లిసియా,ంసగలాసస్, అయిజనోయి, జెయుగ్మా, అని, హర్రన్, మర్దిన్, కొన్యా , అలన్యా ప్రాంతాలు చోటుచేసుకున్నాయి.[172] పురాతన ప్రపమంచ ఏడు అద్భుతాలలో రెండు టర్కీలో ఉన్నాయి ; మౌసోలియం (హలికర్నాసస్) , ఆర్టెమిస్ ఆలయం (ఎఫెసస్). [173]
2013నాటికి టర్కీలో 98 విమానాశ్రయాలు ఉన్నాయి.[180] వీటిలో 22 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. [181] 2015 నాటికి ఇస్తాంబుల్ విమానాశ్రయం ప్రయాణికుల సంఖ్యాపరంగా ప్రంపంచంలోని అత్యంత రద్దీ అయిన విమానాశ్రయాలలో 11వ స్థానంలో ఉందని భావిస్తున్నారు. " ఎయిర్ పోర్ట్ కౌంసిల్ ఇంటర్నేషనల్ " నివేదికల ఆధారంగా 2014 లో జనవరి , జూలై మాసాల మద్య ఇస్తాంబుల్ విమానాశ్రయం నుండి 3,18,33,324 మంది ప్రయాణీకులు పయనించారని అంచనా.[182] ఇస్థాబుల్ లోని సరికొత్తది , మూడవది అయిన " ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఆఫ్ ఇస్తాబుల్ " ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయంగా భావించబడుతుంది. ఇది వార్షికంగా 150 మిలియన్ల ప్రయాణీకులకు సేవచేయగలిగిన సమర్ధత కలిగి ఉంది.[183][184][185] టర్కిష్ ఎయిర్లైంస్, ఫ్లాగ్ కారియర్ ఆఫ్ టర్కీ సంస్థ (1933) లను స్కైట్రాక్స్ యూరప్ యూరప్ బెస్ట్ ఎయిర్ లైన్‌గా వరుసగా 2011,2012,2013, 2014 , 2015 లలో ఎన్నిక చేసింది.[175][176][186] టర్కిష్ ఎయిర్ లైన్ 435 గమ్యస్థానాలకు (51 దేశీయ , 384 అతర్జాతీయ) విమానసేవలు అందిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 126 దేశాలకు పయనించడానికి ప్రయాణీకులకు వసతి కల్పిస్తుంది. 2016 నాటికి అత్యధిక దేశాలకు విమానప్రయాణ వసతి కలిగిన దేశంగా టర్కీ గుర్తింపొ పొందింది.[177]
2014 నాటికి టర్కీలో మొత్తం రహదారి పొడవు 65,623 కి.మీ.[187]2008నాటికి దేశంలోని మొత్తం రైలుమార్గం పొడవు 10,991 కి.మీ.ఇందులో 2,133 కి.మీ విద్యుదీకరణ (ఎలెక్ట్రిఫైడ్) చేయబడింది. అలాగే 457 కి.మీ హై స్పీడ్ ట్రాక్ చేయబడింది.[188][189]" ది టర్కిష్ స్టేట్ రైల్వే " 2003 లో హైస్పీడ్ రైలుమార్గం నిర్మాణం ఆరంభించింది. 2011 నాటికి " ది అంకారా- కొన్యా హైస్పీడ్ రైల్వే " ఉపయోగానికి సిద్ధం చేయబడింది. 2014 నాటికి " అంకారా- ఇస్తాంబుల్ హై స్పీడ్ రైల్వే " ఉపయోగానికి సిద్ధం చేయబడింది. [189]
2013 లో " ది మర్మరే టన్నెల్ " ప్రారంభం చేయబడింది. ఇది రైల్వే , ఇస్తాంబుల్ మెట్రో మార్గాలను (ఇస్తాంబుల్ యురేపియన్ , ఆసియన్ వైపు) అనుసంధానం చేద్తుంది. యురేషియా టన్నెల్ సమీపంలో మోటర్ వాహనాల కొరకు అండర్ సీ రహదారి మార్గం నిర్మించబడింది." ది బాస్ఫోరస్ బ్రిడ్జ్ " (1973), ఫతీహ్ సుల్తాన్ మెహ్మెత్ బ్రిడ్జ్ (1988) , " యవుజ్ సుల్తాన్ సెలిం వంతెన" (2016) వంటి సస్పెంషన్ వంతెనలు బాస్ఫరస్ జలసంధి తీరంలోని యురేపియన్ , ఆసియన్ తీరాలను అనుసంధానం చేస్తూ ఉన్నాయి. " ది ఉస్మాన్ గజీ బ్రిడ్జ్ " (2016) గల్ఫ్ ఆఫ్ ఇజ్మిత్ ఉత్తర , దక్షిణ తీరాలను అనుసంధానం చేస్తూ ఉంది. " కనక్కలే సస్పెంషన్ బ్రిడ్జ్ " డర్డనెల్లెస్ జసంధి తీరంలోని యురేపియన్ , ఆసియా తీరాలను అనుసంధానం చేసేలా రూపొందించబడుతుంది.
2008 లో దేశంలో 7,555 కి.మీ పొడవైన సహజవాయువు పైప్ లైన్ , 3,636 కి.మీ పొడవైన పెట్రోలియం పైప్ లైన్ నిర్మించబడింది.[188] 2005 మే 10న ప్రారంభించబడిన ది - బకు - తిబిలిసి - సెహాన్ పైప్‌లైన్ ప్రపంచంలో రెండవ ఆయిల్ పైప్‌లైన్‌గా గుర్తించబడుతూ ఉంది.[190] ది బ్లూ స్ట్రీం, బ్లాక్ సీ గ్యాస్ పైప్ లైన్ రష్యా నుండి సహజవాయువును టర్కీకి చేరవేస్తుంది. వార్షికంగా 63 క్యూబిక్ మీటర్ల శక్తితో పనిచేస్తున్న ఈ పైప్ లైన్ టర్కీకి రష్యన్ సహజవాయువును యురేపియన్ దేశాలకు విక్రయించే సౌకర్యం కల్పిస్తుంది.[191]
2013 లో టర్కీ 240 బిలియన్ల కిలోవాట్ హవర్స్ విద్యుత్తును ఉపయోగించింది.[192] 2013 లో టర్కీ 72% విద్యుత్తును దిగుమతి చేసుకుంది. దిగుమతులను తద్దించడానికి టర్కీ అణువిద్యుత్తు కర్మాగారల స్థాపనచేయాలని నిర్ణయించింది.[192] 2033 నాటికి అణువిద్యుత్తు కర్మాగారాలు నిర్మాణం పూర్తికాగలదని విశ్వసిస్తున్నారు.[192] జియో ధర్మల్ ఉత్పత్తి , ఉపయోగంలో టర్కీ అంతర్జాతీయంగా 5వ స్థానంలో ఉంది.[193] ఇ.యు ఇనోగేట్ ఎనర్జీ ప్రోగ్రాంలో టర్కీ భాగస్వామ్యం వహిస్తుంది.[194]
టర్కీ మొదటి అణువిద్యుత్తు కర్మాగారాలను ఒకటి అక్కు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేరిట మెర్సిన్ ప్రాంతంలోని మధ్యధరా సముద్రతీరంలో నిర్మించాలని, మరొకటి ఇగ్నెడా జిల్లాలోని నల్లసముద్ర తీరంలో " సినో న్యూక్లియర్ ప్లాంటు (సినోప్ ప్రాంతం) " నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది.[195] జియోధర్మల్ విద్యుత్తును ఉత్పత్తిచేసి ఉపయోగిస్తున్న దేశాలలో టర్కీ అంతర్జాతీయంగా 5వ స్థానంలో ఉంది.[193] టర్కీ ఇ.యు. ఇగ్నోగేట్ విద్యుత్తు ఎనర్జీ ప్రోగ్రాంలో భాగస్వామ్యం వహిస్తుంది. ఇందులో ఎనర్జీ సెక్యూరిటీ, ఇ.యు. ఇంటర్నల్ ఎనర్జీ మార్కెట్ విధానాల ఆధారంగా ఎనర్జీ మార్కెట్ సభ్యదేశాలతో టర్కీ ఏకీభావం తెలియజేయడం, సస్టెయనబుల్ ఎనర్జీ డెవెలెప్మెంట్కు టర్కీ మద్దతు ఇవ్చడం , ఎనర్జీ ప్రాజెక్టులకు పెట్టుబడులను ఆకర్షించడం వంటి కార్యక్రమాలు ఉంటాయి.[194]
[196] టర్కీలో 35 మిలియన్ల మంది అంతర్జాలాన్ని ఉపయోగిస్తుంటారు. ఫ్రీడం హౌస్ ఇండెక్స్ టర్కీ అంతర్జాలాన్ని " పాక్షికంగా స్వేచ్ఛాయుతం " వర్గీకరించింది.[126]
టర్కీలో నీటిసరఫరా , పారిశుద్ధత సవాళ్ళు , సాధనలతో కూడి ఉంటుంది. గత దశాబ్ధాలలో త్రాగునీటి లభ్యత , పారిశుధ్యతలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 16 మునిసిపాలిటీలు , మహానగరాలలు స్వయం ప్రతిపత్తితో గణనీయంగా పౌరసౌకర్యాలు కల్పిస్తున్నాయి.2014 లో 61% మురుగునీరు శుధీకరణ చేయబడింది. లాభాపేక్షరహిత నీటిసరఫరా, పారిశుద్ధ కార్యక్రమాలు గ్రామీణప్రాంతాలకు విస్తరించడం , మురుగునీటి శుద్ధీకరణ అభివృద్ధి చేయడం మొదలైన సవాళ్ళు మాత్రం మిగిలి ఉన్నాయి. ఈ రంగాలలో అధికమైన పెట్టుబడులు కోరబడుతున్నాయి. ఇ.యు. స్థాయిలో పారిశుద్ధత సాధించడానికి (ప్రత్యేకంగా మురుగునీటి శుద్ధీకరణ) వార్షికంగా 2 బిలియన్ల యూరోలు వ్యయం చేయవలసిన అవశ్యకత ఉంది. ప్రస్తుతం అందులో సగం మాత్రమే వ్యయం చేయబడుతుంది.[197]
ఆభివృద్ధి చెందుతున్న టర్కీ సైన్సు అండ్ టెక్నాలజీ రంగానికి " సైన్ అండ్ టెక్నాలజీ రీసెర్చి కౌంసిల్ ఆఫ్ టర్కీ " ప్రధాన ఏజెంసీగా ఉంది.[199] టర్కీలో సైన్సు అభివృద్ధి కొరకు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్న " టర్కిష్ అకాడమీ ఆఫ్ సైంసెస్ " స్థాపించబడింది.[200] టర్కీలోని అధికారిక అణువిద్యుత్తు విద్యాసంస్థ "టి.ఎ.ఇ.కె.". ఆణుసాంకేతికతను శాతియుత ప్రయోజనాలకు ఉపయోగించడానికి ఈ విద్యాసంస్థ సహకారం అందిస్తుంది.[201] మిలటరీ టెక్నాలజీస్ పరిశోధన అభివృద్ధి కొరకు ఏర్పాటుచేసిన టర్కిష్ ప్రభుత్వసంస్థలలో " టర్కిష్ ఎయిరోస్పేస్ ఇండస్ట్రీస్, అసెల్సన్, హేవెల్సన్, రాకెట్సన్, మెకానికల్ అండ్ కెమికల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ (ఎం.కె.ఇ) ప్రధానమైనవి.అలాగే స్పేస్ క్రాఫ్ట్ ఉత్పత్తి , టెస్టింగ్ ఫెసిలిటీ కొరకు టర్కిష్ శాటిలైట్ అసెంబ్లీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ సెంటర్ (యు.ఎం.ఇ.టి) స్థాపించబడింది. ఇది " మినిస్టరీ ఆఫ్ నేషనల్ డిఫెంస్ " స్వంతమైనది. టర్కీలో ఉపగ్రహాన్ని రోదసీలో ప్రవేశపెట్టే సాంకేతికను అభివృద్ధి చేయడానికి " టర్కిష్ స్పేస్ లంచ్ సిస్టం " స్థాపించబడింది.ఇది ఉపగ్రహ నిర్మాణం, ఉపగ్రహ రోదసీప్రవేశం , రిమోట్ ఎర్త్ స్టేషన్లు కార్యక్రమాలను చేపడుతుంది.[202][203][204]2015 లో యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో " పనిచేస్తున్న టర్కిష్ ప్రొఫెసర్ " అజిజ్ శాంకర్ " తోమస్ లిండాహి, పౌల్ మోడ్రిచ్లతో రసాయనశాస్త్రంలో నోబుల్ బహుమతి అందుకున్నాడు. [205] ఇతర టర్కిష్ పరిశోధకులలో " బెహ్సెట్ డిసీస్ " కనుగొన్న హులుసి బెహ్సెట్, ఆర్ఫ్ ఇంవేరియంట్ వివరణ ఇచ్చిన చాహిత్ ఆర్ఫ్ ప్రధానమైనవారిగా గుర్తింపు పొందారు.
1945లో టర్కీ అఖ్యరాజ్యసమితి [206] ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో- ఆపరేషన్ అండ్ డెవెలెప్మెంట్ (1961) (ఒ.ఇ.సి.డి)[143] ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (ఒ.ఐ.సి.) (1969),[207] ది ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో - ఆపరేషన్ (ఒ.ఎస్.సి.ఇ) (19793)[208] ది ఎకనమిక్ కో - ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఇ.సి.ఒ) (1985)[209] ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది బ్లాక్ సీ ఎకనమిక్ కోపరేషన్ (బి.ఎస్.ఇ.సి) (1992),[210] ది డెవెలెపింగ్ 8 కంట్రీస్ (1997),,[211] జి- 20 (1999) లకు ఫండింగ్ సభ్యత్వం కలిగి ఉంది.[144] 1951-1952-1954-1955,1961, 2009-2010 లలో యునైటెడ్ నేషంస్ సెక్యూరిటీ సభ్యత్వదేశంగా ఉంది.[212] 2013 సెప్టెంబరు మాసంలో టర్కీ " ఏసియా కోపరేషన్ డైలాగ్ " (ఎ.సి.డి) సభ్యత్వదేశం అయింది.
టర్కీ విదేశాంగ వ్యవహారాలలో దేశ ఉపస్థితి, ఐరోపాతో సంబంధాలు కేంద్రంగా ఉన్నాయి. 1949లో టర్కీ యురేపియన్ కౌన్సిల్ సభ్యత్వదేశం అయింది. యురేపియన్ ఎకనమిక్ కమ్యూనిటీ (ఇ.ఇ.సి) (1959), అంకారా అగ్రిమెంట్ (1963) సభ్యత్వం కొరకు అభ్యర్థించింది. 1987లో దశాబ్ధాల రాజకీయ రాజీప్రయత్నాల తర్వాత టర్కీ ఇ.ఇ.సి. పూర్తిస్థాయి సభ్యత్వం కొరకు అభ్యర్థించి 1992లో వెస్టర్న్ యురేపియన్ యూనియన్ అసోసియేట్ సభ్యత్వదేశం అయింది. తరువాత 1995లో " యురేపియన్ యూనియన్ కస్టంస్ యూనియన్ " చేరింది.[15] ప్రస్తుతం ఇ.యు. సభ్యత్వం టర్కీ రాజ్యాంగ విధానం, టర్కీ వ్యూహాత్మక లక్ష్యం అని భావించబడుతుంది. [213] సైప్రస్ వివాదంలో టర్కీ ఉత్తర సైప్రస్‌కు మద్దతుగా నిలవడం టర్కీ, ఇ.యు సంబంధాల మద్య విభేదాలు తలెత్తాయి. [214] టర్కీ విదేశీ విధానాలలో దీర్ఘకాలంగా యునైటెడ్ స్టేట్స్తో వ్యూహాత్మక సంబంధాలు కలిగి ఉండడం ప్రధానమైనది.[215][216]
రష్యాతో కొనసాగిన విభేదాలు ఇరుదేశాల మద్య కొనసాగిన " కోల్డ్ వార్ " కారణంగా టర్కీ నాటో సభ్యదేశంగా మారడానికి దారితీసింది. అలాగే వాషింగ్టన్ డి.సి.తో పరస్పర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఫలితంగా టర్కీ దేశానికి యునైటెడ్ స్టేట్స్ నుండి రాజకీయ, ఆర్థిక, దౌత్యసంబంధిత సహకారం లభించింది. [217] కోల్డ్ వార్ తరువాత టర్కీ భౌగోళికంగా మిడిల్ ఈస్ట్, కౌకాసస్, బల్కాంస్ సమీపంలో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. [218]
1991లో టర్కిక్ రాజ్యాలకు సోవియట్ యూనియన్ నుండి స్వతంత్రం లభించిన తరువాత టర్కీ ఆదేశాలతో సాంస్కృతిక, భాషాసంబంధిత వారసత్వంలో పాలుపంచుకుంది. తరువాత టర్కీ సంబంధాలు ఆర్థికంగా, రాజకీయంగా మద్య ఆసియా వరకు విస్తరించాయి.[219] సంబంధాలు మరింతగా మెరుగుపడిన కారణంగా టర్కీలోని సేహాన్ నుండి అజర్బైజాన్ లోని బకు వరకు " మల్టీ - బిలియన్ అమెరికన్ డాలర్ల ఆయిల్ - నేచురల్ గ్యాస్ పైప్ లైన్ నిర్మించడానికి మార్గంసుగమం అయింది. " ది బకు - త్బిల్లిసి - సేహాన్ " పైప్ లైన్ టర్కీని పశ్చిమదేశాల విదేశాంగవిధానాలలో వ్యూహాత్మకమైన మధ్యవర్తిగా చేసింది. [220]" జస్టిస్ అండ్ డెవెలెప్మెంట్ " (ఎ.కె.పి) ప్రభుత్వపాలనలో మునుపటి ఓట్టమన్ సాంరాజ్యంలోని భూభాగాలలో (మిడిల్ ఈస్ట్) , బల్కాంస్ ప్రాంతాలలో టర్కీ ప్రభావాన్ని అభివృద్ధి అయింది.[221][222] 2010 డిసెంబరు మాసంలో " అరబ్ తిరుగుబాటు " సమయంలో టర్కీ ప్రభుత్వవ్యరేక బృందాలకు (సిరియా తిరుగుబాటు బృందాలు , 2013 లో ఈజిప్ట్ తిరుగుబాటు బృందాలు) సహకరించిన కారణంగా టర్కీ , కొన్ని అరేబియన్ దేశాలమద్య ఉద్రిక్తలు తలెత్తాయి.[223][224]
2016 గణామాకాల ఆధారంగా టర్కీ దేశానికి సిరియా , ఈజిప్ట్ దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు ఏర్పరుచుకోలేదు. [225][226] 2010 లో " గాజా ఫ్లోటిల్లా రెయిడ్ " తరువాత ఇజ్రాయిల్ తో దౌత్యసంబంధాలు తెగిపోయాయి. అయినా 2016 జూన్‌లో సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి.[227] ఈ రాజకీయ విబేధాలు టర్కీ , ఈస్ట్ మధ్యధరా ప్రాంతాలలో సంబంధాలు ఏర్పడ్డాయి.[228][229]2015 లో టర్కీ, సౌదీ అరేబియా , కతర్ వ్యూహాత్మకంగా సంకీర్ణంగా ఏర్పడి సిరియన్ అధ్యక్షుడు " భాషర్ అల్ అస్సద్ " నితో వ్యతిరేకంగా పనిచేసాయి.[230][231]
ఐఖ్యరాజ్యసమితి ఆధ్వర్యంలో టర్కీ ఇంటర్నేషనల్ మిషన్లు , నాటో (1950), శాంతిస్థాపన దళం (సోమాలియా) , మునుపటి యుగోస్లేవియా లలో భాగస్వామ్యం వహించింది. " ఫస్ట్ గల్ఫ్ వార్ " సంకీర్ణదళాలకు సహకారం అందించిది. నార్తన్ టర్కీలో 36,000 మంది సైనికులను నిలిపింది. అయినప్పటికీ వారి ఉనికి వివాదాస్పదం అయింది. [232] ఇరాకీ కుర్దిస్థాన్‌కు సహకరించింది.[233] " యునైటెడ్ స్టేట్స్ స్టెబిలైజేషన్ ఫోర్స్ " లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ , ఐఖ్యరాజ్యసమితి ఆధర్యంలో నాటో నాయకత్వంలో " ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అసిస్టెంస్ ఫోర్స్ " (ఐ.ఎస్.ఎ.ఎఫ్) (2001) లలో సైనికబృందాలను నియమించింది. [234] 2003 టర్కీ " యూరోకార్ప్స్ " , " యురేపియన్ యూనియన్ బాటిల్ గ్రూప్ " సైనికపరమైన భాగస్వామ్యం వహించింది.[235]
సంవత్సరం | జనాభా | ±% p.a. |
---|---|---|
1927 | 1,35,54,000 | — |
1930 | 1,44,40,000 | +2.13% |
1940 | 1,77,28,000 | +2.07% |
1950 | 2,08,07,000 | +1.61% |
1960 | 2,75,06,000 | +2.83% |
1970 | 3,53,21,000 | +2.53% |
1980 | 4,44,39,000 | +2.32% |
1990 | 5,51,20,000 | +2.18% |
2000 | 6,42,52,000 | +1.54% |
2010 | 7,30,03,000 | +1.29% |
2012 | 7,56,27,000 | +1.78% |
Source: Turkstat[236] |
2011 టర్కీలో " అడ్రెస్ బేస్డ్ పాపులేషన్ రికార్డింగ్ సిస్టం " గణాంకాల ఆధారంగా టర్కీ జనసంఖ్య 74.7 మిలియన్లు.[238] వీరిలో నాల్గింట మూడుభాగాల ప్రజలు నగరప్రాంతాలలో నివసిస్తున్నారు. వార్షికంగా టర్కీ జసంఖ్య 1.35% అభివృద్ధి చెందుతూ ఉంది. టర్కీ జనసాంధ్రత చ.కి.మీ. కి 97 మంది. మొత్తం జనాభాలో 15-64 మద్య వయస్కులు 67.4%. 0-14 మద్య వయస్కులు 25.3%. 65 వయసుకు పైబడిన వారు 7.3%.[239] 1927 లో రిపబ్లిక్ టర్కీలో మొదటిసారిగా గణాంకాలు సేకరించబడ్డాయి. మొదటి గణాంకాలలో టర్కీ రిపబ్లిక్ జనసఖ్య 13.6%.[240] టర్కీలో అతిపెద్ద నగరం ఇస్తాంబుల్ ". వైశాల్యపరంగా ఇస్తాంబుల్ ఐరోపాలో మూడవ స్థానంలో ఉంది.[241][242] టర్కీ పౌరసత్వం కలిగిన వారిని టర్కీ సంప్రదాంగా భావిస్తుంటారు.[243] టర్కీలోని టర్కీ సంప్రదాయ ప్రజలు 70-75 శాతం ఉన్నారు.[13] టర్కిష్ గణాంకాలలో సంప్రదాయ ఆధారిత గణాంకాలు అందుబాటులో లేవు కనుక విశ్వసనీయమైన సంప్రదాయ ప్రజల గణాంకాలు లభించడం లేదు.[244] " లాసన్నే ఒప్పందం "లో పేర్కొన్న ముగ్గురు అల్పసంఖ్యాక ప్రజలలో ఆర్మేనియన్లు, గ్రీకులు , యూదులు ఉన్నారు. అధికారికంగా గుర్తించబడని సంప్రదాయక అల్పసంఖ్యాకులలో అల్బేనియన్లు, అరబ్బులు, అస్సిరియన్లు, అజెరీలు, బోస్నియాకులు, సర్కాసియన్లు, జార్జియన్లు, లాజ్ ప్రజలు, పర్షియన్లు, యజీదీలు , రోమన్లు ఉన్నారు.[245][246]
నాన్ - టర్కీలలో కుర్దీలు సంఖ్యాపరంగా అధికంగా ఉన్నారు. కుర్దీలు 18-25% ఉన్నారు.[13][247] కుర్దీలు టర్కీ తూర్పు ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. వీరిని " టర్కిష్ కుర్ధీస్థానీలు " అంటారు. కుర్దీలు అధికంగా టంసెల్ ప్రాంతం, బింగోల్, మస్ ప్రాంతం, అగ్రి ప్రాంతం, ఇగ్దిర్ ప్రాంతం, ఎలాజిగ్ ప్రాంతం, డియార్బకిర్ ప్రాంతం, బాత్మన్ ప్రాంతం, సిర్నాక్ ప్రాంతం, బిట్లిస్ ప్రాంతం, వ్యాన్ ప్రాంతం, మర్దిన్ ప్రాంతం, సీర్త్ ప్రాంతం , హక్కరీ ప్రాంతం సాన్లిరుఫా ప్రాంతం (47%) , అధికసంఖ్యలో కార్స్ (20%) ఉన్నారు.[248] అదనంగా ఇతరప్రాంతాలలో స్థిరపడిన కుర్దీలు కేంద్ర , పశ్చిమ టర్కీ నగరాలలో (ప్రత్యేకంగా ఇస్తాంబుల్‌లో) నివసిస్తున్నారు. ఈప్రాంతంలో దాదాపు 3 మిలియన్ల కుర్దీలు ఉన్నారు. ప్రపంచంలో కుర్దిషులు అత్యధికంగా నివసిస్తున్న నగరంగా ఇస్తాంబుల్ గుర్తించబడుతుంది.[249]
కుర్దీలు కాని అల్పసంఖ్యాకుకు 7-12% ఉన్నారు.[13] అధికారికంగా గుర్తించబడిన మూడు అల్పసంఖ్యాక సంప్రదాయాల కాక ఇతర అల్పసంఖ్యాకులకు అల్పసంఖ్యాక హక్కులు వర్తించవు. టర్కీలో అల్పసంఖ్యాక వర్గం అనేది సున్నితవిషయంగా మారింది.సాధారణంగా అల్పసంఖ్యాకుల పట్ల టర్కీవైఖరి విమర్శలకు గురౌతూ ఉంటుంది. [250] టర్కీ ప్రభుత్వం అల్పసంఖ్యాకులను గుర్తింపు లభించినప్పటికీ టర్కిష్ ప్రభుత్వనిర్వహణలో నడుస్తున్న టర్కిష్ రేడియో అండ్ టెలివిషన్ కార్పొరేషన్ (టి.ఆర్.పి) అల్పసంఖ్యాక భాషాకార్యక్రమాలను ప్రసారం చేస్తూ ఉంది.[251][252] కొన్ని ప్రాథమిక పాఠశాలలో అల్పసఖ్యాక భాషలను అధ్యయనం చేయడానికి అవకాశం కల్పించబడుతుంది.[253] టర్కీలో అంతర్జాతీయ వలసప్రజల సంఖ్య 2.5% ఉంది.[254] టర్కీ అత్యధిక సంఖ్యలో శరణార్ధులకు ఆశ్రయం ఇస్తూ ఉంది. 2015లో టర్కీ 2.2 మిలియన్ల సిరియన్ శరణార్ధులకు ఆశ్రయం ఇచ్చింది.[255][256][257] దేశం అధికారిక భాష టర్కిష్ భాష 85.54% ప్రజలకు మాతృభాషగా వాడుకలో ఉంది.[258] 11.97 % ప్రజలకు " కుర్మంజి " భాషాకుటుంబానికి చెందిన కుర్దిష్ వాడుకభాషగా ఉంది.[258] అరబిక, జాజా భాషలు 2.39% ప్రజలకు వాడుకభాషగా ఉన్నాయి. పలు ఇతర భాషలు అల్పసంఖ్యాకులకు మాతృభాషలుగా ఉన్నాయి.[258] టర్కీలోని అంతరించి పోతున్న భాషలలో అబజా భాష, అబ్ఖజ్ భాష, అడిఘే భాష, కప్పడోసియన్ గ్రీకు, గగుజ్ భాష, హర్టెంవిన్, హోంషెత్స్మ, కబర్డ్-చెర్క్స్, జుడాయో స్పానిష్ , వెస్టర్న్ ఆర్మేనియన్ ప్రధానమైనవి.[259]
టర్కీ అధికారిక మతవాద అంతస్తులేని లౌకికవాద దేశం. టర్కీ రాజ్యాంగం ప్రజలకు మతస్వాతంత్ర్యం కల్పిస్తూ ఉంది.[261][262] టర్కీలో ఇస్లామిస్ట్ పార్టీలు రూపొందిన తరువాత దేశంలో మతంపాత్ర వివాదాస్పదంగా మారింది.[263] పలు దశాబ్ధాలుగా పాఠశాలలు , ప్రభుత్వభవనాలలో హిజాబ్ (హెడ్‌స్కార్ఫ్) ధరించడం నిషేధించబడింది. ఇది ఇస్లాం రాజకీయ చిహ్నంగా భావించడమే ఇందుకు ప్రధాన కారణం. అయినప్పటికీ 2011 నుండి విశ్వవిద్యాలయాలలో , 2013 నుండి ప్రభుత్వ భవనాలలో ఈ నిషేధం తొలగించబడింది.[264] తరువాత 2014 నుండి పాఠశాలలలో కూడా ఈ నిషేధం తొలగించబడింది.[265]
టర్కీలో ఇస్లాం మతం ఆధిక్యత కలిగి ఉంది. దేశంలో 99.8% ప్రజలు ముస్లిములుగా నమోదు చేసుకున్నారు.[13][266] అయినప్పటికీ కొన్ని వనరులు ముస్లిముల శాతం 96.4%గా సూచిస్తున్నాయి.[246] టర్కీలో సున్నీ ఇస్లాం అత్యంత ప్రబలమైన ఇస్లాం తెగగా భావిస్తున్నారు. ఉన్నత మతాధికార సంస్థగా " ప్రెసిడెన్సీ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్ " (హనాఫీ స్కూల్ ఆఫ్ లా) పనిచేస్తుంది. ఇది దేశంలో నమోదు చేయబడిన 80,000 మసీదులలో ప్రాంతీయ ఇస్లాం సిబ్బంది నియామకం , నిర్వహణ పనులను నియత్రిస్తుంటుంది.[267] విద్యావేత్తలు అలెవి సంఖ్య 15-20 మిలియన్లు ఉన్నారని భావిస్తున్నారు. అయినప్పటికీ అలెవి- బెక్తసి ఫెడరేషన్ 25 మిలియన్లు ఉన్నారని వాదిస్తుంది.[268][269] అక్సియాన్ పత్రిక ఆధారంగా షియా ఇస్లాం (అలెవీస్ మినహాయించి ట్వెల్వర్లు) ప్రజల సంఖ్య 3 మిలియన్లు (4.2%) ఉంటుందని అంచనా.[270] టర్కీలో సుఫీ ముస్లిములు కూడా ఉన్నారు.[271] ప్రత్యేకంగా శాఖానిర్ణయం చేయబడని ముస్లిములు 2% ఉన్నారు.[272]
టర్కీలో ముస్లిమేతరులు 1914లో 19% ఉండగా 1927 నాటికి వీరి శాతం 2.5% చేరుకుంది.[274] ఆర్మేనియన్ జాతి హత్యలు , గ్రీకు - టర్కీల మద్య పరస్పర ప్రజల తరలింపు సంఘటనలు గణాంకాలమీద గుర్తించతగినంతగా ప్రభావం చూపాయి.[275] లెవెంటీలు, ఆర్మేనియన్లు, యూదులు దేశం విడిచి విదేశాలకు (అధికంగా ఐరోపా , అమెరికా) వలసపోవడం కూడా గణాంకాలమీద ప్రభావంచూపాయి. వలసలు అధికంగా 19 వ శతాబ్దం చివర , 20 వ శతాబ్దం ఆరంభంలో సంభవించాయి. మొదటిప్రపంచయుద్ధం , టర్కిష్ స్వతంత్ర సమరం తరువాత వలసలు అధికంగా జరిగాయి.[276] 1942లో ముస్లిమేతరుల మీద వర్లిక్ వర్గిసి (ఆస్తి పన్ను) విధించబడుతుంది. 1948 తరువాత టర్కిష్ యూదులు టర్కీ నుండి ఇజ్రాయిల్‌కు వలస వెళ్ళారు. సైప్రస్ వివాదం కారణంగా టర్కీ , గ్రీకు మద్య సంబంధాలలో చిక్కులు ఏర్పడ్డాయి. ఇతర ప్రధాన సంఘటనలు టర్కీలో ముస్లిమేతరుల సంఖ్య క్షీణించడానికి కారణం అయింది.
ప్రస్తుతం టర్కీలో వివిధశాఖలకు చెందిన 1,20,000 మంది క్రైస్తవులు ఉన్నారని అంచనా. టర్కీ జనసంఖ్యలో ఇది 0.2%.[277] క్రైస్తవులలో 80,000 " ఓరియంటల్ ఆర్థడాక్స్ " ఉన్నారు.[278] 35,000 మంది రోమన్ కాథలిక్కులు ఉన్నారు.[279] వీరిలో 18,000 మంది ఆంటియోచైన్ గ్రీకులు ఉన్నారు.[280] 5,000 మంది గ్రీకు ఆర్థడాక్స్ ఉన్నారు.[278] స్వల్పసంఖ్యలో ప్రొటెస్టెంట్లు ఉన్నారు.[281] ప్రస్తుతం క్రైస్తవుల ఆరాధన కొరకు 236 చర్చీలు ఉన్నాయి.[282] 4 వ శతాబ్దం నుండి ఇస్తాంబుల్‌లో " ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చి " ప్రధానకార్యాలయం ఉంది.[283][284]
టర్కీలో 26,000 యూదులు ఉన్నారు. వీరిలో సెఫర్ధి యూదులు అధికంగా ఉన్నారు.[285] క్రీ.పూ. 5 వ శతాబ్దం నుండి రోమానియేట్లు ఉన్నారు. 15 వ శతాబ్దంలో స్పెయిన్ నుండి పంపబడి ఓట్టమన్ సామ్రాజ్యం చేత సాదరంగా ఆహ్వానించబడిన సెఫర్దిక్ యూదులు (స్పానిష్ , పోర్చుగీసు) ఉన్నారు.ఆధునిక టర్కీలో స్వల్పసంఖ్యలో యూదులు నివసిస్తున్నారు.[286]
2010 యూరో బారోమీటర్ పోల్ ఆధారంగా 94% టర్కీ ప్రజలు దేవునిపట్ల విశ్వాసం కలిగి ఉన్నారని కేవలం 1% మాత్రమే దేవునిపట్ల విశ్వాసరహితంగా ఉన్నారని అంచనా. ఏదీ వ్యక్తం చేయని వారు 5% ఉన్నారు.[287] అయినప్పటికీ మరొక పోలింగ్ (కె.ఒ.ఎన్.డి.ఎ) ఫలితాల ఆధారంగా 2.9% అథిస్టులు ఉన్నారని అంచనా.[288]
టర్కీ చాలా వైద్యమైన సంస్కృతి కలిగిన దేశం. టర్కీలో ఒగుజ్ టర్కిక్ సంస్కృతి, అనటోలియా, ఓట్టమన్ (గ్రీకో - రోమన్ , ఇస్లామిక్ సంస్కృతి పొడిగింపు) , పశ్చిమ సంస్కృతి సంప్రదాయాలు (ఓట్టమన్ సామ్రాజ్యం వెస్ట్రనైజేషన్ ప్రక్రియ) ఇప్పటికీ కొనసాగుతుంది. మద్య ఆసియా నుండి పశ్చిమ ప్రాంతాలకు వలసమార్గంలో మజిలీగా టర్కీ ఉండడం వైవిధ్యమైన మిశ్రితసంస్కృతికి ఒక కారణంగా ఉంది.[290][291] టర్కీ ఒక వైపు సంప్రదాయం, మతం , చారిత్రక విలువలను కాపాడుకుంటూ ఆధునిక పశ్చిమదేశాల సంస్కృతిని అలవరుచుకుంటున్న దేశాలలో టర్కీ ఒకటి.[290]
19 వ శతాబ్దం మద్యకాలానికి టర్కీలో పశ్చిమదేశాల శైలికి చెందిన టర్కిష్ పెయింటింగ్స్ ఆరంభమై అభివృద్ధి చెందాయి. మొదటిసారిగా ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయంలో పెయింటింగ్ పాఠాలు ఆరంభం (1793 అధికంగా సాంకేతికత సంబంధితమైనవి) అయ్యాయి.[292] 19వ శతాబ్దంలో "ఒస్మాన్ హండి బే" పెయింటింగ్స్‌లో మొదటిసారిగా మానవ ఆకారాలు చిత్రించబడ్డాయి. తరువాత " హలిల్ పాసా " చిత్రాలలో సమకాలీన శైలి ప్రతిబింబించడం మొదలైంది. 1926లో ఐరోపాకు పంపబడిన యువచిత్రకారులు సమాలీన ఫ్యూవిజం, క్యూబిజం, భావవ్యక్తీకరణ (ఇప్పటికీ ఐరోపాను ప్రభావితం చేస్తూ ఉంది) లతో ప్రభావితులై తిరిగి వచ్చారు. తరువాత అబిదిన్ డినో, సెమల్ టొల్లు, ఫికర్ట్ మౌలా, రాకుమారి ఫహ్రెలెంస్సా జియిద్, బెద్రి రహ్మి యుబొగ్లు, అబనన్ కోకర్, బుర్హన్ డోగన్కే మొదలైన కళాకారులు పరిచయం చేసిన చిత్రకళారీతులు పశ్చిమప్రాంతంలో మూడుదశాబ్ధాల కంటే అధిక కాలం నుండి కొనసాగుతుంది. టర్కిష్ చిత్రకళా రంగంలో 1930లో టర్కీలో " యెనిలర్ గ్రుబు " (నూతనకళాకారుల బృందం);1940లో " అన్లర్ గ్రుబు " (10 మంది బృందం); 1950లో యేని దల్ గ్రుబు; (న్యూ బ్రాంచ్ గ్రూప్);, 1960 " సియా కాలెం గ్రుబు " (బ్లాక్ పెన్ గ్రూప్) ప్రధానమైనవిగా గుర్తించబడుతున్నాయి.[293]
టర్కీ సంగీతం, టర్కీ సాహిత్యం మీద టర్కీ మిశ్రిత సంస్కృతి సంప్రదాయాల ప్రభావం అధికంగా ఉంది. టర్కీ సంప్రదాయం ఓట్టమన్ సామ్రాజ్యం, ఇస్లాంలతో కలిసిన ఐరోపా సంప్రదాయం మిశ్రితమై ఉంటుంది. ఈ మిశ్రిత సంస్కృతి టర్కీ సంగీతం, సాహిత్యం మీద కూడా ప్రభావం చూపుతుంది.[295]
టర్కిష్ సాహిత్యం ఓట్టమన్ శకమంతా పర్షియన్, అరబిక్ సాహిత్యాలతో ప్రభావితమై ఉంటుంది. నవల, కథాసాహిత్యంలో తంజిమత్ సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. తంజీమత్ కాలంలో రచయితలు పలు సాహిత్యప్రక్రియలు పరిచయం చేసారు. కవి " నమిక్ కమల్ " 1876లో ఇంతిబా (మేలుకొలుపు) అనే నవల వ్రాసాడు. పత్రికావిలేఖరి " ఇబ్రహీం సినాసి " రచయితగా కూడా గుర్తింపు పొందాడు. 1860లో మొదటి ఆధునిక టర్కిష్ నాటకం హాస్యప్రధాన " ఏకపాత్రాభినయం " నాటకం " సైర్ ఎవ్లెన్మెసీ " (కవి వివాహం) వ్రాయబడింది. 1896-1923 మద్యకాలంలో పలు ఆధునిక టర్కిష్ సాహిత్యం రచిచించబడింది. ఈ సమయంలో " ఎబెబియ్యత్ - ఐ - సెడిడే " (సరికొత్త సాహిత్య ఉద్యమం) (న్యూ లిటరేచర్), " ఫెక్ర్ - ఐ- అతి " భవిష్యత్ ఉదయం, (డాన్ ఆఫ్ ది ఫ్యూచర్), " మిల్లి ఎడెబియ్యత్ " (జాతీయ సాహిత్యం ఉద్యమం) అనే మూడు సాహిత్య ప్రక్రియలు ప్రవేశపెట్టబడ్డాయి. 20వ శతాబ్దంలో " నజీం హిక్మత్ రాన్ " పరిచయం చేసిన " ఫ్రీ వర్స్ " శైలి సాహిత్యంతో సరికొత్త ఆధునిక సాహిత్య శకం ఆరంభం అయింది. " గారిప్ ఉద్యమంతో " 1941 నుండి మరొక సాహిత్యవిప్లవం మొదలైంది. టర్కీ మిశ్రమసంస్కృతి నాటకీయం చేయబడింది.[296]
టర్కీ ప్రత్యేక టర్కిష్ నృత్యం (జానపద నృత్యం) సంస్కృతిని కలిగి ఉంది.ఈ స్ట్ థ్రేశ్ హోరా నృత్యం ప్రదర్శించబడుతుంటుంది. మద్య అనటోలియా, మర్మరా ప్రాంతం, ఎగీన్ ప్రాంతంలో " జేబెక్ నృత్యం వాడుకలో ఉంది. " తెకే " నృత్యం మధ్యధరా ప్రాంతంలో వాడుకలో ఉంది. " కాసిక్ ఒయున్లరి " , " కర్సిలామా " నృత్యాలు మద్య అనటోలియా, నల్ల సముద్రప్రాంతం, మర్మరాప్రాంతం , మధ్యధరా ప్రాంతంలో వాడుకలో ఉంది. " హొరన్ " నృత్యం నల్లసముద్రప్రాంతంలో వాడుకలో ఉంది. హలే నృత్యం తూర్పు అనటోలియా, మద్య అనటోలియా ప్రాంతాలలో వాడుకలో ఉంది. బార్ , లెజ్గింకా ఈశాన్య అనటోలియా ప్రాంతంలో వాడుకలో ఉంది. [297]
సెల్జుక్ ఆర్కిటెక్చర్ మద్య ఆసియాలోని పర్షియన్ ఆర్కిటెక్చర్ , అరబ్ ఆర్కిటెక్చర్ , బైజాంటిన్ ఆర్కిటెక్చర్ సమ్మిశ్త్రిత అంశాలను కలిగి ఉంటుంది. సెల్జుక్ ఆర్కిటెక్చర్ నుండి ఓట్టమన్ ఆర్కిటెక్చర్ ఆవిర్భావం " బర్సా" లో నిదర్శనంగా కనిపిస్తుంది. బర్సా 1335, 1413 మద్యకాలంలో ఓట్టమన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. 1453లో కాంస్టాంటినోపుల్ " (ఇస్తాంబుల్) పతనం తరువాత ఓట్టమన్ ఆర్కిటెచర్ మీద బైజాంటిన్ ఆర్కిటెక్చర్ ప్రభావం పడింది. ఓట్టమన్ సాంప్రదాయ నిర్మాణాలకు తొప్కపి ప్రదేశం ఉదాహరణగా ఉంది. ఇది 400 సంవత్సరాలకు ముందు ఓట్టమన్ సుల్తానులకు నివాసంగా ఉంది.[298] ఓట్టమన్ సంస్కృతి విలసిల్లిన కాలంలో (1489-1588) మైమర్ సినాన్ ఆర్కిటెక్చర్ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉండేది. 16వ శతాబ్దంలో ఓట్టమన్ సామ్రాజ్యంలోని పలుప్రాంతాలలో నిర్మించబడిన 374 నిర్మాణాలకు మైమర్ సినాన్ చీఫ్ ఆర్కిటెక్ట్‌గా ఉన్నాడు. [299] 18వ శతాబ్దం నుండి టర్కీ ఆర్కిటెక్చర్‌ను యూరేపియన్ ఆర్కిటెక్చర్ ప్రభావితం చేసింది. ఇస్తాంబుల్‌లో ఉన్న తంజిమత్ శకంలో నిర్మించబడిన డోలిమబాసె, సిరాగన్, ఫెరియె సరయ్లరి, బెలెబెయి, కుసుక్సు, ఇహ్లముర్ , యిల్దిజ్ భవనాలకు ఓట్టమన్ సభాభవనాల డిజైన్లను నిర్మించిన బల్యాన్ కుటుంబ సభ్యులు రూపకల్పన చేసారు.[300] ఓట్టమన్ శకంలో బాస్ఫరస్ తీరంలో సంప్రదాయ ఓట్టమన్ , యురేపియన్ ఆర్కిటెక్చురల్ శైలి " వాటర్ ఫ్రంట్ గృహాలు " (జలాశయతీర గృహాలు) నిర్మించబడ్డాయి. 20వ శతాబ్దంలో " ది ఫస్ట్ నేషనల్ ఆర్కిటెచురల్ మూవ్మెంటు " సమయంలో సెల్జుక్ , ఓట్టమన్ ఆర్కిటెచర్ ఆధారిత సరికొత్త ఆర్కిటెక్చర్ రూపొందించమని కోరబడింది.[301] ఈ ఉద్యమంలో ""వేదత్ టెక్ " (1873-1942), మైమర్ కెమలెద్దిన్ బే (1870-1927),అరిఫ్ హికెత్ కొయునొగ్లు (1888 - 1982), గియులియో మొంగెరి (1873 - 1953) మొదలైన ప్రముఖ ఆర్కిటెచర్లు ఉన్నారు.[302] ఈ సమయంలో నిర్మించబడిననిర్మాణాలలో గుర్తించతగినవి ""గ్రాండ్ పోస్ట్ ఆఫీస్ " (ఇస్తాంబుల్) (1905-1909), తయ్యారే అపార్ట్మెంటుస్ (1919-1922),[303] ఇస్తాంబుల్ 4వ ఒకిఫ్ హాన్ (1911-1926),[304] స్టేట్ ఆర్ట్ అండ్ స్కల్ప్చర్ మ్యూజియం (1927 - 1930). [305] ఎత్నోగ్రఫీ మ్యూజియం ఆఫ్ అంకారా (1925-1928),[306] " ది జిర్రత్ బ్యాంక్ ప్రధానకార్యాలయం " (1925-1929),[307] " ది ఫస్ట్ టర్కి ఈజ్ బంకాసి " హెడ్ క్వార్టర్స్ (1926-1929), [308] బెబక్ మసీదు (ఇస్తాంబుల్)[309], కమర్ హతున్ మసీదు. [310][311] మొదలైనవి ప్రధానమైనవి.
టర్కిష్ ఆహారం శైలి ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. టర్కీ ఆహారసంస్కృతి మీద ఓట్టమన్ సామ్రాజ్య ఆహార విధానం ప్రభావం ఉంది. టర్కీ ఆహారం ప్రాబల్యత సంతరించుకొనడానికి టర్కీ పర్యాటకరగం ప్రధానకారణం. ఇది అధికంగా ఓట్టమన్ ఆహార సాంస్కృతిక వారసత్వం కలిగి ఉంది. ఇందులో మద్య ఆసియా, కౌకాసియన్, మిడిల్ ఈస్ట్, మధ్యధరా, బాల్కన్ ఆహారసంస్కృతులు మిశ్రితమై ఉన్నాయి. [314] టర్కీ తూర్పి, మధ్యధరా మద్య ఉపస్థితమై ఉండడం కారణంగా ప్రధాన వాణిజ్యమార్గాల మీద ఆధిక్యత కలిగిఉండడానికి సహకరించింది. అలాగే పర్యావరణం అనుకూలంగా ఉండడం చెట్లు, జంతువుల సుసంపన్నతకు కారణం అయింది. 1400 మద్య కాలంలో టర్కిష్ ఆహారం చక్కగా ప్రాబల్యత సంతరించుకుంది. ఓట్టమన్ సామ్రాజ్య 6 శతాబ్ధాల పాలనలో యోగర్ట్ సలాడ్స్,ఆలివ్ ఆయిలో వేసిన చేపలు, స్టఫ్డ్, రాప్డ్ కూరగాయలు టర్కిష్ ప్రధాన ఆహారాలుగా మారాయి. సామ్రాజ్యం చివరకు ఆస్ట్రియా నుండి ఉత్తర ఆఫ్రికా వరకు విస్తరించిన కారణంగా భూమార్గం, జలమార్గం ద్వారా విదేశీ ఆహారదినుసులు లభ్యం కావడానికి అనుకూలం అయింది. 16వ శతాబ్దంలో ఓట్టమన్ సామ్రాజ్యం రాజ్యసభ 1400 మంది వంటవారిని నియమించి తాజా ఆహార తయారీకి అవసరమైన చట్టలను రూపొందించింది. మొదటి ప్రపంచయుద్ధం (1914-1918) తరువాత ఓట్టమన్ సామ్రాజ్యం పతనమై 1923లో టర్కిష్ రిపబ్లిక్ స్థాపించబడింది. ఆధునిక టర్కిష్ రిపబ్లిక్ ఆహారశైలిలో ఫ్రెంచ్ హోలాండైస్ సాస్, పాశ్చాత్య శైలి ఫాస్ట్ ఫుడ్స్ మొదలైన ఆహారాలు ప్రవేశించాయి.[315]
టర్కీలో వందలాది టి.వి. చానల్స్, వేలాది జాతీయ, ప్రాంతీయ రేడియో ప్రసారాలు, పలు డజన్లకొద్దీ వార్తాపేపర్లు, లాభదాయకమైన టర్కీ చలనచిత్రాలు, వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాలం టర్కీ మాధ్యమాన్ని ఫలవంతం చేసాయి.[316] 2003లో 257 టెలివిజన్ స్టేషన్లు, 1100 రేడియో స్టేషన్లకు అనుమతి లభించింది. మిగిలిన వారు అనుమతి లేకుండా నిర్వహించబడుతున్నాయి. అనుమతి లభించిన 16 టెలివిజన్ చానెళ్ళు, 36 రేడియో స్టేషన్లు జాతీయస్థాయిలో అభిమానులకు చేరువయ్యాయి.[317] ప్రభుత్వ నిర్వహణలో పనిచేస్తున్న టర్కిష్ రేడియో అండ్ టెలివిజన్ కార్పొరేషన్, నెట్వర్క్ శైలి చానెళ్ళు, కానల్ డి, షో టి.వి, ఎ.టి.వి (టర్కీ, స్టార్ టి.వి. (టర్కీ) టర్కీ వాసులకు అభిమానపాత్రంగా ఉన్నాయి. శాటిలైట్ డిషెస్ వంటి ఆకర్ష్నీయమైన కార్యక్రమాలతో " బ్రాడ్కాస్ట్ మీడియా " ప్రజలలోకి చొచ్చుకుపోయింది. దేశమంతటా కేబుల్ టెలివిజన్ ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి.[317] ప్రభుత్వ ప్రతినిధుల నిర్వహణలో " రేడియో అండ్ టెలివిషన్ సుప్రీం కౌంసిల్ " ప్రసార మాధ్యమాలను పర్యవేక్షణ బాధ్యత వహిస్తుంది.[317] సంఖ్యాపరంగా పోస్టా (వార్తాపత్రిక),హుర్రియత్, సోజ్కు, సబాహ్, హబెర్టర్క్. [318] " టర్కిష్ టెలివిషన్ డ్రామా " టర్కీ సరిహద్దులు దాటి ప్రజాభిమానం పొంది దేశేగుమతులలో ప్రాధాన్యత సంతరించుకుని లాభకరంగా ఉంది.[319] ఒక దశాబ్ధంగా మిడిల్ ఈస్ట్ టెలివిజన్ మార్కెట్ ఆధిక్యత సంతరించుకున్న తరువాత 2016లో డజన్లకొద్దీ దక్షిణ అమెరికా, మద్య అమెరికా దేశాలలో టర్కీ షోలు ప్రదర్శించబడ్డాయి. [320] " ఫ్రీడం హౌస్ " టర్కీ మాధ్యమాన్ని " పాక్షిక స్వేచ్ఛాయితం " జాబితాలో చేర్చింది. [126]
" ది మినిస్టరి ఆఫ్ నేషనల్ ఎజ్యుకేషన్ " ప్రి- టర్టియరీ ఎజ్యుకేషన్ బాధ్యత వహిస్తుంది.[322] టర్కీలో 4 సంవత్సరాల ప్రాథమిక విద్య, 4 సంవత్సరాల మాద్యమిక విద్య, 4 సంవత్సరాల ఉన్నత పాఠశాల విద్య నిర్భంధవిద్య అమలులో ఉంది.[323] 25-34 సంవత్సరాల లోపు వారిలో సగంకంటే తక్కువగా కనీసం ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసినవారు ఉన్నారు.[324] మాద్యమిక పాఠశాల ప్రవేశపరీక్ష ఫలితాల ఆధారంగా ఉన్నత నైపుణ్యం కలిగిన విద్యావకాశాలు కల్పించబడుతుంటాయి. ఈ స్థాయి తరువాత కొంతమంది విద్యార్థులు తమ 10 సంవత్సరాల వయసు నుండి ప్రైవేట్ పాఠశాలలను ఎంచుకుని విద్యాభ్యాసం కొనసాగించవచ్చు.[325] 2011 గణాంకాల ఆధారంగా అక్షరాస్యత 94.1%. పురుషుల అక్షరాస్యత 97.9% స్త్రీల అక్షరాస్యత 90.3%.[326] 2011 గణాంకాల ఆధారంగా టర్కీలో 166 విశ్వవిద్యాలయాలు ఉన్నాయని అంచనా.[327] " స్టూడెంట్ సెలెక్షన్ ఎజ్యుకేషన్ " (ఒ.ఎస్.ఎస్) ఆధారంగా ఉన్నత విద్యావకాశం ఆధారపడి ఉంటుంది.2008లో అనుమతించబడిన విద్యార్థుల సంఖ్య 6,00,000.2007 ఒ.ఎస్.ఎస్. పరీక్షకు హాజరైన వారి సంఖ్య 17,00,000.[328] ఒ.ఎస్.ఎస్ పరీక్షల నిర్వహణా బాధ్యత " అనడోలు విశ్వవిద్యాలయం " వహిస్తుంది (ఓపెన్ ఎజ్యుకేషన్ ఫ్యాకల్టీ మినహాయింపు). ఫలితాల ఆధారంగా విద్యార్థులకు విశ్వవిద్యాల ప్రవేశం అనుమతించబడుతుంది.[329] 2012-2013 గణాంకాలు అనుసరించి " టైంస్ హైయర్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకిగ్ "లో అంతర్జాతీయంగా అత్యున్నత విశ్వవిద్యాలయాలలో టర్కీలోని " మిడిల్ ఈస్ట్ టెక్నాలజీ యూవివర్శిటీ " 201 225వస్థానంలో ఉండగా బిల్కెంట్ , కె.ఒ.సి విశ్వవిద్యాలయాలు 226-250 వ స్థానాలలో ఉన్నాయి, ఇస్తాంబుల్ టెక్నికల్ యూనివర్శిటీ , బొగొజిసి యూనివర్శిటీ 276-300 స్థానాలలో ఉన్నాయి.[330]
టర్కీ ఆరోగ్యరక్షణ కేంద్రప్రభుత్వ ఆధీనంలో " ఆరోగ్య మంత్రిత్వశాఖ " ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 2003లో టర్కీ ప్రభుత్వం ఆరోగ్యసంస్కరణలు ప్రవేశపెట్టింది. ఆరోగ్యసేవలు ప్రైవేట్ రంగం నుండి ప్రభుత్వరంగానికి మళ్ళించడానికి అలాగే ఆరోగ్యసేవలు అధిఖసంఖ్యాక ప్రజలకు అందించడానికి సంస్కరణలు రూపొందించబడ్డాయి.2014లో " టర్కిష్ స్టాటిస్టికల్ ఇంస్టిట్యూట్ " 76.3 బిలియన్ టర్కిష్ లిరా ఆరోగ్యరక్షణ కొరకు వ్యయయం చేయబడ్డాయని పేర్కొన్నది. ఇందులో 79.6% " సోషల్ సెక్యూరిటీ ఇంస్టిట్యూట్ " కొరకు వ్యయం చేయబడ్డాయి. 15.4% నేరుగా రోగులకొరకు వ్యయం చేయబడ్డాయి.[331] 2012లో టర్కీలో 29,960 మెడికల్ ఇంస్టిట్యూషన్లు ఉన్నాయని అంచనా. [332] టర్కీలో సరాసరిగా 583 మంది ప్రజలకు ఒక వైద్యుడు ఉన్నాడు. [333] 1000 మంది ప్రజలకు 2.65 పడకలు ఉన్నాయి.[332] ప్రజల సరాసరి ఆయుఃప్రమాణం 73.2 సంవత్సరాలు. స్త్రీల సరాసరి వయసు 75.3% పురుషుల సరాసరి వయసు 71.1% సంవత్సరాలు. [334]
టర్కీలో ప్రాబల్యత సంతరించుకున్న క్రీడ " అసోసియేషన్ ఫుట్ బాల్ "(సాకర్).[335] 2000లో " గలతసారే ఎస్.కె. (ఫుట్‌బాల్)" యు.ఇ.ఎఫ్.ఎ. కప్ (2000) , యు.ఇ.ఎఫ్.ఎ. సూపర్ కప్ పోటీలలో విజయం సాధించింది.[336] " ది టర్కిష్ నేషనల్ టీం " ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్ (2002) , ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. కాంఫిడరేషన్ కప్ (2003) కాంశ్యపతకం సాధించింది. అలాగే యు.ఇ.ఎఫ్.ఎ. యూరో కప్ (2008) పోటీలో సెమీ- ఫైనల్‌కు చేరుకుంది.[337]
టర్కీలో ప్రజాదరణ కలిగిన ఇతరక్రీడలలో బాస్కెట్ బాల్ మరిన్యు వాలీ బాల్ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. " ది టర్కిష్ మెంస్ నేషనల్ బాస్కెట్ బాల్ టీం " ఎఫ్.ఐ.బి.ఎ. వరల్డ్ కప్ (2010) , యూరో బాస్కెట్ బాల్ (2001) (రెండింటికీ టర్కీ ఆతిథ్యం ఇచ్చింది) పోటీలలో రజితపతకం సాధించింది. ఈ బృందం 1987-2013 పోటీలలో బంగారుపతకం సాధించింది. 1971 పోటీలో రజితపతకం , మధ్యధరా గేంస్‌లో 1967-1983-2009 పోటీలలో మూడుమార్లు కాంశ్యపతకం సాధించింది. టర్కిష్ బాస్కెట్ బాల్ క్లబ్ అనడోలు ఎఫెస్ ఎస్.కె. ( 1995-1996 ) ఎఫ్.ఐ.బి.ఎ. కొరాక్ కప్ సాధించింది. అలాగే ఎఫ్.ఐ.బి.ఎ. యురేపియన్ కప్ (1992-1993), ఎఫ్.ఐ.బి.ఎ. సపోర్టా కప్ సాధించింది. యూరో లీగ్ బాస్కెట్ బాల్ , ఎఫ్.ఐ.బి.ఎ. సుప్రో లీగ్ (2000-2001) పోటీలలో ఫైనల్‌కు చేరుకుంది.[338][339] " బెసిక్తాస్ మెంస్ బాస్కెట్ బాల్ టీం" ఎఫ్.ఐ.బి.ఎ. యూరో చాలెంజ్ (2011-2012) పోటీలో విజయం సాధించింది.[340] గలతసారె ఎస్.కె. (మెంస్ బాస్కెట్ బాల్ ) యూరోకప్ బాస్కెట్ బాల్ (2015-2016) పోటీలో విజయం సాధించింది. యూరోలీగ్ వుమన్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలో ఫైనల్స్ రెండు టర్కిష్ బృందాలు (గలరతసారె వుమంస్ బాస్కెట్ బాల్ , ఫెనెర్బహ్సె వుమంస్ బాస్కెట్ బాల్) మద్య జరిగింది. ఈ పోటీలలో గలతసారె బృందం విజయం సాధించింది.[341]
" టర్కీ వుమంస్ నేషనల్ వాలీబాల్ టీం" వుమంస్ వాలీబాల్ చాంపియంషిప్ (2003) పోటీలో విజయం సాధించింది. అలాగే వుమంస్ యురోపియన్ వాలీబాల్ చాంపియన్ షిప్ (2003) పోటీలో రజితపతకం, వుమంస్ యురేపియన్ వాలీబాల్ చాంపియంషిప్ (2011) పోటీలో కాంశ్య పతకం , ఎఫ్.ఐ.వి.బి. వరల్డ్ గ్రాండ్ ప్రిక్స్ (2012) పోటీలో కాంశ్యపతకం సాధించింది. ఈ బృందం 2005 లో బంగారు పతకం, 1987,1991, 1997,2001,2009,2013 సంవత్సరాలలో ఆరు రజత పతకాలు సాధించిది.ఈ బృందం " మధ్యధరా గేంస్ " (1993) పోటీలో కాంశ్యపతకం సాధించింది.[342] ఫెనెర్బహ్సె అసిబడెం, ఎక్జబసి ఇస్తాంబుల్ , వకిఫ్బ్యాంక్ కులుబు పలుమార్లు యురేపియన్ చాంపియంషిప్ టైటిల్స్ , పతకాలు సాధించారు. " ఫెనెర్బహ్సే వుమంస్ వాలీబాల్ " ఎఫ్.ఐ.వి.బి. వుమంస్ క్లబ్ వరల్డ్ చాంపియంషిప్ , సి.ఇ.వి. వుమంస్ చాంపియంస్ లీగ్ (2012) పోటీలలో విజయం సాధించింది. " యురోపియన్ వాలీబాల్ కాంఫిడరేషన్ " సి.ఇ.వి. వుమంస్ చాంపియంస్ లీగ్ (2012-2013) పోటీలో విజయం సాధించింది. వకిఫ్బ్యాంక్ " ఎఫ్.ఐ.వి.బి. వుమంస్ క్లబ్ వరల్డ్ చాంపియంషిప్ (2013)" పోటీలో విజయం సాధించి ప్రపంచవిజేతగా నిలిచింది.[343][344][345]
ఓట్టమన్ కాలం నుండి " ఆయిల్డ్ రెస్ట్లింగ్ (యగ్లి గురెస్)" క్రీడ టర్కీ సంప్రదాయ క్రీడగా గౌరవించబడుతుంది.[346] ఎడిర్నె నగరం " కిర్క్పినర్ ఆయిల్డ్ రెస్ట్లింగ్ " క్రీడలకు 1361 నుండి ఆతిథ్యం ఇస్తుంది.[347] " ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆస్ అసోసియేటెడ్ రెస్ట్లింగ్ స్టైల్స్ " ప్రాతినిధ్యంలో ఫ్రీ స్ట్రైల్ రెస్ట్లింగ్, గ్రీకో - రోమన్ రెస్ట్లింగ్ మొదలైన అంతర్జాతీయ మల్లయుద్ధ శైలి క్రీడలు యురేపియన్ వరల్డ్, ఒలింపిక్ చాంపియంషిప్ పోటీలలో పలు టైటిల్స్ సాధించడం ద్వారా ప్రాబల్యత సంతరించుకుంది.[348]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.