From Wikipedia, the free encyclopedia
జిహాద్ (Jihad) అనగా ఆశయ సాధన కోసం శక్తివంచన లేకుండా నిర్విరామంగా కృషి చేయడం, పోరాడటం. దీన్ని కొంతవరకూ స్ట్రగుల్ అనే ఆంగ్ల పదంతో పోల్చవచ్చు. ఇంకా విస్తృతంగా చెప్పాలంటే నిరంతరం ఆశయాన్నే దృష్టిలో పెట్టుకొని దాని కోసం పధకాలు రూపొందిచడం, వాక్కు, వ్రాతల ద్వారా ప్రచారం చేయడం, అందుబాటులో ఉండే వనరులన్నీ వినియోగించుకోవడం, అనివార్యమైతే ఆయుధం చేపట్టి పోరాడటం, అవసరమైతే ఆ మార్గంలో ప్రాణాలు సైతం ధారబోయడం - ఇవన్నీ జిహాద్ క్రిందికే వస్తాయి. దైవ ప్రసన్నత పొందే సత్సంకల్పంతో ధర్మ పరిరక్షణ కోసం హింసా దౌర్జన్యాలను అరికట్టేందుకు చేసే ఇలాంటి పోరాటాన్ని 'జిహాద్ ఫీ సబిలిల్లాహ్' (దైవ మార్గంలో పోరాటం) అంటారు.[1] ఇస్లాం మతంలో నాల్గవ స్తంభము జిహాద్. దీనిని గురించి పవిత్ర ఖురాన్ లో ఈ క్రింది విధంగా చెప్పబడింది.
జిహాద్ (ఆంగ్లం :Jihad : అరబ్బీ :جهاد ), ఒక ఇస్లామీయ పదజాలము (అరబ్బీ పదజాలము). జిహాద్ లో పాల్గొనువారిని "ముజాహిద్" (ఏకవచనం) లేదా "ముజాహిదీన్" (బహువచనం) అని పిలుస్తారు.
జిహాద్ అనే పదము ముస్లిం సమాజములో ఒక సాధారణ పదము, కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ పదము ఇస్లాం కొరకు "పవిత్ర యుద్ధం" (holy war on behalf of Islam) అనే భావంతో ఉపయోగింపబడుచున్నది.[2] విశాల దృష్టితో చూసిన యెడల, ఈ పదము, హింస, అహింస అనే రెండు భావనలనూ కలిగివున్నది. దీని సాధారణ అర్థం " దైనందిన జీవితంలో చెడు, అన్యాయం, అణగార్పుకు వ్యతిరేకంగా పోరాడుతూ, ఇస్లామిక్ విలువలతో గూడిన స్వచ్ఛమైన సాధారణ జీవితం గడిపే విధము" [3] అయిననూ ఈ పదము చర్చనీయాంశముగానూ వివాదాస్పదం గానూ ఉంది.
తైమూర్ లంగ్, 14వ శతాబ్దానికి చెందిన టర్కో-మంగోల్ దండయాత్రలు చేపట్టిన వాడు. పశ్చిమ, మధ్యాసియా ప్రాంతాలను జయించాడు. ఇతను తనకు తాను "గాజీ" (పవిత్రయుద్ధం చేసేవాడు) అని ప్రకటించుకున్నాడు. కానీ ఇతను కేవలం తన రాజ్యకాంక్షను పూర్ణం చేసుకొనుటకు చెంగిజ్ ఖాన్ లా ఘోరమైన దండయాత్రలు చేపట్టాడు. ఇతను దండయాత్రలు చేపట్టిన రాజ్యాలు దాదాపు ముస్లింల రాజ్యాలే. అయిననూ ఇతను తన దండయాత్రలకు జిహాద్ అనే పేరు పెట్టుకుని ముస్లింలనే మట్టుబెట్టే మారణహోమం సృష్టించాడు.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.