జనగామ జిల్లా
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
జనగామ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. 2016 అక్టోబరు 11న ఈ జిల్లా కొత్తగా అవతరించింది.[1]
ఈ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 13 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. ఇందులో 12 మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి కాగా, ఒక మండలం పూర్వపు నల్గొండ జిల్లాలోనిది. జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్‌ను కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేశారు.[2]