From Wikipedia, the free encyclopedia
చింతకాయల ఆయ్యన్న పాత్రుడు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. అతను 2024 జూన్ 21న ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[1][2][3]
చింతకాయల అయ్యన్న పాత్రుడు | |||
పదవీ కాలం 1996-98 | |||
ముందు | కొణతాల రామకృష్ణ | ||
---|---|---|---|
తరువాత | గుడివాడ గురునాథరావు | ||
నియోజకవర్గం | అనకాపల్లి | ||
పదవీ కాలం 1983-89 | |||
నియోజకవర్గం | నర్సీపట్నం | ||
ఆంధ్రప్రదేశ్ సాంకేతికశాఖామత్యుడు | |||
పదవీ కాలం 1984-86 | |||
పదవీ కాలం 1994-96 | |||
నియోజకవర్గం | నర్సీపట్నం | ||
పదవీ కాలం 2014- ప్రస్తుతం | |||
నియోజకవర్గం | నర్సీపట్నం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ | 1957 సెప్టెంబరు 4||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | పద్మావతి,, ,,.... | ||
సంతానం | ఇద్దరు కుమారులు - పెద్దకుమారుడు విజయ్ , చిన్నకుమారుడు రాజేష్... | ||
నివాసం | విశాఖపట్నం | ||
మతం | హిందూ |
చింతకాయల అయ్యన్న పాత్రుడు 1957 సెప్టంబరు 04న విశాఖ జిల్లాలోని నర్సిపట్నంలో జన్మించాడు. ఇతడి తండ్రి వరహలు దొర.
ఇతదు కాకినాడలోని పి.ఆర్ కళాశాలలో బి.ఎ. పట్టా పొందాడు.
ఇతడు1983 జూన్1న పద్మావతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు.
అయ్యన్న పాత్రుడు 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024 శాసనసభ ఎన్నికలలో 7 సార్లు తెలుగుదేశం పార్టీ తరుపున నర్సీపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యాడు. 1984-1986 లో సాంకేతిక విద్యా మంత్రిగా ఉన్న సమయంలో అయ్యన్న స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటుకు కృషిచేశారు. దీంతో పాటు ప్రభుత్వ సాంకేతిక శిక్షణ సంస్థ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు.[4]
1994-96 లో రహదారులు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశాడు. అప్పట్లో నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామాల పరిధిలోని వందల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్డును ఆర్అండ్బీకి బదలాయించి, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు.
1996 లో 11వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం తరుపున అనకాపల్లి లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలో వచ్చిన తరువాత అయ్యన్న అటవీశాఖ మంత్రి పదవిలో కొనసాగాడు. ఆ సమయంలో నియోజకవర్గం లోని పెడిమికొండ నర్సరీ, ఆరిలోవ జౌషధ మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయించారు.
2004 ఎన్నికల్లో అయ్యన్న ఎమ్మెల్యేగా విజయం సాధించినా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఖాళీగా ఉన్నారు.
2014 ఎన్నికలలో శాసనసభ్యునిగా విజయం సాధించి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.[5] అతను 1989, 2009, 2019లో అదే శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయాడు. అతను 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశాడు.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ 16 శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[6][7] తెలంగాణ విభజించిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ స్పీకరుగా 2024 జూన్ 22న ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
అయన్నపాత్రుడు 1996 భారత సార్వత్రిక ఎన్నికలలో, అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి 11వ లోక్సభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు.[8]
సంవత్సరం | నియోజకవర్గం | విజేత పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | మెజారిటీ |
---|---|---|---|---|---|---|---|---|
1983 | నర్సీపట్నం | చింతకాయల అయ్యన్న పాత్రుడు | తెలుగుదేశం పార్టీ | 38490 | రామచంద్ర రాజు శ్రీ రాజ సాగి | కాంగ్రెస్ పార్టీ | 37498 | 992 |
1985 | నర్సీపట్నం | చింతకాయల అయ్యన్న పాత్రుడు | తెలుగుదేశం పార్టీ | 43218 | శ్రీరామ మూర్తి వేచలపు | కాంగ్రెస్ పార్టీ | 42407 | 811 |
1989 | నర్సీపట్నం | కృష్ణమూర్తిరాజు రాజ సాగి | కాంగ్రెస్ పార్టీ | 53818 | చింతకాయల అయ్యన్న పాత్రుడు | తెలుగుదేశం పార్టీ | 42863 | 10955 |
1994 | నర్సీపట్నం | చింతకాయల అయ్యన్న పాత్రుడు | తెలుగుదేశం పార్టీ | 62385 | కృష్ణమూర్తిరాజు రాజ సాగి | కాంగ్రెస్ పార్టీ | 41206 | 21179 |
1999 | నర్సీపట్నం | చింతకాయల అయ్యన్న పాత్రుడు | తెలుగుదేశం పార్టీ | 59853 | కృష్ణమూర్తిరాజు రాజ సాగి | కాంగ్రెస్ పార్టీ | 51294 | 8559 |
2004 | నర్సీపట్నం | చింతకాయల అయ్యన్న పాత్రుడు | తెలుగుదేశం పార్టీ | 60689 | వెంకట సూర్యనారాయణ రాజు దాట్ల | స్వతంత్ర అభ్యర్థి | 36759 | 23930 |
పెట్ల రామచంద్ర | కాంగ్రెస్ పార్టీ | 15453 | ||||||
2009 | నర్సీపట్నం | బోలెం ముత్యాల పాప | కాంగ్రెస్ పార్టీ | 65465 | చింతకాయల అయ్యన్న పాత్రుడు | తెలుగుదేశం పార్టీ | 57718 | 7747 |
రుత్తల యెర్ర పాత్రుడు | ప్రజారాజ్యం పార్టీ | 18917 | ||||||
2014 | నర్సీపట్నం | చింతకాయల అయ్యన్న పాత్రుడు | తెలుగుదేశం పార్టీ | 79726 | పెట్ల ఉమా శంకర్ గణేష్ | వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ | 77388 | 2388 |
నేతల నాగేశ్వరరావు (షెడ్యూల్ కులం) | బహుజన్ సమాజ్ పార్టీ | 2721 | ||||||
2019 | నర్సీపట్నం | పెట్ల ఉమా శంకర్ గణేష్ | వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ | 93818 | చింతకాయల అయ్యన్న పాత్రుడు | తెలుగుదేశం పార్టీ | 70452 | 23366 |
2024[9] | నర్సీపట్నం | చింతకాయల అయ్యన్న పాత్రుడు | తెలుగుదేశం పార్టీ | 99849 | పెట్ల ఉమా శంకర్ గణేష్ | వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ | 75173 | 24676 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.