కొబ్బరి బొండాం
1991 సినిమా / From Wikipedia, the free encyclopedia
కొబ్బరి బోండాం 1991 లో కాట్రగడ్డ రవితేజ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో రాజేంద్రప్రసాద్, నిరోషా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మొదటిసారిగా కథ, చిత్రానువాదం, సంగీతం అందించిన ఎస్. వి. కృష్ణారెడ్డి తర్వాత దర్శకుడిగా మారి అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించాడు. రాజేంద్రుడు గజేంద్రుడు ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా మొదటి సినిమా. ఒక పిరికి వాడైన కథానాయకుడిని ఒక ప్రొఫెసరు ఆత్మవిశ్వాసం కలిగేలా చేసి అతని ఇబ్బందులు తొలగేలా చేయడం ఈ చిత్ర కథాంశం.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
కొబ్బరిబోండాం (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రవితేజ కాట్రగడ్డ |
---|---|
నిర్మాణం | కె. అచ్చిరెడ్డి, వి. జి. సరోజ (సహ నిర్మాత) |
రచన | దివాకర్ బాబు (మాటలు), ఎస్. వి. కృష్ణారెడ్డి (కథ, చిత్రానువాదం) |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, నిరోషా |
సంగీతం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
ఛాయాగ్రహణం | ఎన్. సుధాకర్ రెడ్డి |
కూర్పు | కె. రాంగోపాల్ రెడ్డి |
నిర్మాణ సంస్థ | మనీషా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
మూసివేయి