భారతదేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ From Wikipedia, the free encyclopedia
భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం: Indian National Congress) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు ఉన్నాయి) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ. 1885 డిసెంబరు 28 న స్థాపితమైన ఈ పార్టీ ఆసియా, ఆఫ్రికాల్లో విస్తరించిన బ్రిటిషు సామ్రాజ్యంలో ఉద్భవించిన తొట్టతొలి ఆధునిక జాతీయవాద పార్టీ.[c][25] 1920 ల నుండి మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ భారత స్వాతంత్ర్యోద్యమంలో అగ్రభాగాన నిలిచి పోరాడింది.[26] భారతదేశానికి స్వాతంత్య్ర్యం సముపార్జించడమే కాకుండా,[d][28][e][30] బ్రిటిషు సామ్రాజ్యంలో వలసవాద వ్యతిరేక ఉద్యమాలకు ఊతమిచ్చింది.[f][25]
భారత జాతీయ కాంగ్రెస్ | |
---|---|
పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ | సోనియా గాంధీ[1] |
లోక్‌సభ నాయకుడు | ರಾಹುಲ್ ಗಾಂಧಿ ((ಲೋಕಸಭೆಯಲ್ಲಿ ವಿರೋಧ ಪಕ್ಷದ ನಾಯಕ)) |
రాజ్యసభ నాయకుడు | మల్లికార్జున్ ఖర్గే (రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు) |
స్థాపకులు | ఎ.ఒ. హ్యూమ్ డబ్ల్యు.సి.బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీ మనోమోహన్ ఘోష్ విలియం వాడర్బర్న్ దాదాభాయి నౌరోజీ బద్రుద్దీన్ త్యాబ్జీ ఫిరోజ్‌షా మెహతా దిన్షా వాచా మహదేవ్ రానడే[2] |
స్థాపన తేదీ | 28 డిసెంబరు 1885 |
ప్రధాన కార్యాలయం | 24, అక్బర్ రోడ్, న్యూఢిల్లీ-110001[3] |
పార్టీ పత్రిక | కాంగ్రెస్ సందేశ్ నేషనల్ హెరాల్డ్ |
విద్యార్థి విభాగం | నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా |
యువత విభాగం | ఇండియన్ యూత్ కాంగ్రెస్ |
మహిళా విభాగం | ఆలిండియా మహిళా కాంగ్రెస్ |
కార్మిక విభాగం | ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ |
రైతు విభాగం | కిసాన్ అండ్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్[4] |
రాజకీయ విధానం | |
రాజకీయ వర్ణపటం | Centre[17] |
International affiliation | ప్రోగ్రెసివ్ అలయన్స్[18] సోషలిస్ట్ ఇంటర్నేషనల్[19][20][21] |
రంగు(లు) | Saffron, white and green (official; Indian national colours)[a] Sky blue (customary)[b] |
ECI Status | జాతీయ పార్టీ[22] |
లోక్‌సభ స్థానాలు | 101 / 543 (513 MPs & 30 Vacant) |
రాజ్యసభ స్థానాలు | 29 / 245 (241 MPs & 4 Vacant)[23] |
శాసన సభలో స్థానాలు | 689 / 4,036
(4030 MLAs & 5 Vacant) (see complete list) |
Election symbol | |
Party flag | |
1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్న పార్టీ. భారత తొలి ప్రధానమంత్రి అయిన జవాహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సామ్యవాద విధానాలను అనుసరించి ప్రణాళికా సంఘాన్ని ఏర్పరచి, పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి అమలు చేసింది. నెహ్రూ తరువాత లాల్ బహదూర్ శాస్త్రి స్వల్పకాల పరిపాలన తరువాత, ఇందిరా గాంధీ పార్టీ నాయకత్వం చేపట్టింది.
స్వాతంత్ర్యం తరువాత కరిగిన 17 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు స్వయంగా మెజారిటీ సాధించగా, మరో మూడు సార్లు కూటమిని ఏర్పరచి అధికారానికొచ్చింది. మొత్తం 54 సంవత్సరాల పాటు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచింది. కాంగ్రెసు పార్టీ తరఫున మొత్తం ఆరుగురు ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించారు. జవాహర్ లాల్ నెహ్రూ తొలి ప్రధాని (1947–1964) కాగా, మన్మోహన్ సింగ్ పార్టీ తరఫున చివరి ప్రధాన మంత్రి (2004–2014). ప్రధానమంత్రిగా పూర్తికాలం పనిచేసిన తొట్టతొలి నెహ్రూ కుటుంబేతర కాంగ్రెసు పార్టీ నాయకుడు పి.వి.నరసింహారావు (1991–1996).
2024 ఏప్రిల్ నాటికి మల్లికార్జున ఖర్గే పార్టీకి అధ్యక్షుడిగా ఉండగా, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉంది. జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాల్లో అధికార కూటమిలో భాగస్వామిగా అధికారంలో ఉంది.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఏ.ఓ.హుమే, మాజీ బ్రిటిషు అధికారి 1885 డిసెంబరు 25న స్థాపన చేయాల్సిఉంది.కానీ ప్లేగు వ్యాధి కారణంగా డిసెంబరు 28 న స్థాపించబడింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్, మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారు.
1952 లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ 364 స్థానాలను గెలిచింది. తాను పోటీ చేసిన 479 స్థానాల్లో 76 శాతం గెలుచుకుంది.[31] పోలైన మొత్తం వోట్లలో 45 శాతం పొందింది.[32] 1971 ఎన్నికల వరకు పార్టీ వోటింగు శతం 40 కి తగ్గలేదు. 1977 ఎన్నికల్లో మాత్రం భారీ ఓటమి చవిచూసింది. 154స్థానాలను మాత్రమే గెలుచుకున్న ఆ ఎన్నికల్లో అనేకమంది పెద్ద నాయకులు ఓడిపోయారు.[33] 1980 సార్వత్రిక ఎన్నికల్లో 42.7 శాతం వోట్లతో 353 స్థానాల్లో గెలుపొంది మళ్ళీ అధికారానికి వచ్చింది. 1980 వరకు కాంగ్రెసు పార్టీ వోట్ల శాతం పెరుగుతూ వచ్చింది. 1984/85 నాటికి అది 48.1 శాతం రికార్డుకు చేరుకుంది. 1984 లో రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యాక ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. 1985 జనవరిలో జరగవలసిన ఎన్నికలు 1984 డిసెంబరు లోనే జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ 533 కు గాను 415 స్థానాలు సాధించి స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక మెజారిటీ సాధించింది.[34] ఆ ఎన్నికల్లో పంజాబ్ అస్సాంలలో 32.14% వోట్లు మాత్రమే సాధించినప్పటికీ మొత్తమ్మీద 48.1 శాతం వోట్లు సాధించింది.[32]
1989 నవంబరులో 9 వ లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి.[35] ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లోక్‌సభలో అత్యధిక స్థానాలు సాధించిన ఏఖైక పార్టీగా అవతరించినప్పటికీ, సంపూర్ణ మెజారిటీ సాధించలేకపోయింది. 39.5 వోట్లు సాధించింది. అప్పటి నుండి వోట్ల శాతంలో క్షీణత మొదలైంది. 13 వ లోక్‌సభ ఎన్నికలు 2004 అక్టోబరులో జరగాల్సి ఉండగా, అప్పటి ఎన్‌డిఎ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది. 2004 ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరిగాయి. అనుకోని విధంగా సోనియా గాంధీ నేతృత్వం లోని కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.[36] ఎన్నికల తరువాత కాంగ్రెస్, కొన్ని చిన్నపార్టీలతో కలిసి ఐక్య ప్రగతిశీల కూటమిని (యుపిఎ) ని ఏర్పాటు చేసి అధ్జికారం చేపట్టింది. దానికి బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, కేరళ కాంగ్రెస్, వామపక్ష ఫ్రంట్ లు బయటి నుండి మద్దతు నిచ్చాయి.[36] 1996, 2009 మధ్య జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 20% వోట్లను కోల్పోయింది.[37]
1వ లోక్‌సభ నుండి 18 వ లోక్‌సభ వరకూ సాధించిన స్థానాలు |
అత్యధిక స్థానాలు పొందిన సంవత్సరం:1984 అత్యల్ప స్థానాలు పొందిన సంవత్సరం:2014
|
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) వార్షిక జాతీయ సమావేశంలో రాష్ట్ర, జిల్లా పార్టీల నుండి వచ్చిన ప్రతినిధులు కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ఒక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) ఉంటుంది.[38] ఇది స్థానిక, రాష్ట్ర స్థాయిలలో రాజకీయ ప్రచారాలను నిర్వహించడానికి, పార్లమెంటరీ నియోజకవర్గాలలో ప్రచారం చేయడానికి ఇది బాధ్యత వహిస్తుంది.[39] ప్రతి పీసీసీకి ఇరవై మంది సభ్యులతో కూడిన కార్యవర్గం ఉంటుంది. వీరిలో ఎక్కువ మందిని పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ నాయకుడు, జాతీయ అధ్యక్షుడు ఎంపిక చేస్తారు. రాష్ట్రాల శాసనసభలలో సభ్యులుగా ఎన్నికైన వారు ఆయా సభలలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలను ఏర్పాటు చేస్తారు. వాటి ఛైర్‌పర్సనుగా ఎన్నికైన వారే సాధారణంగా ముఖ్యమంత్రి పదవికి పార్టీ అభ్యర్థిగా ఉంటారు. పార్టీలో వివిధ కమిటీలు, విభాగాలు కూడా ఉన్నాయి. ఇది నేషనల్ హెరాల్డ్ అనే దినపత్రికను ప్రచురిస్తుంది.[40] సంస్థాగత నిర్మాణంతో కూడిన పార్టీ అయినప్పటికీ, 1972 తర్వాత ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎటువంటి సంస్థాగత ఎన్నికలను నిర్వహించలేదు.[41] అయినప్పటికీ, 2004లో, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్, పార్టీ అధ్యక్షుడిగా ఉండని మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యాడు.[42]
ఎఐసిసి అనేది పిసిసిల నుండి వచ్చిన ప్రతినిధులతో కూడి ఉంటుంది.[40] ఈ ప్రతినిధులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో సహా సీనియర్ పార్టీ నాయకులు, ఆఫీస్ బేరర్లతో కూడిన కాంగ్రెస్ కమిటీలను ఎన్నుకుంటారు. ఎఐసిసి అన్ని ముఖ్యమైన కార్యనిర్వాహక, రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందిరా గాంధీ 1978లో కాంగ్రెస్ (ఐ)ని స్థాపించినప్పటి నుండి, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలే పార్టీ జాతీయ నాయకురాలిగా, సంస్థకు అధిపతిగా, వర్కింగ్ కమిటీకి, అన్ని ప్రధాన కాంగ్రెస్ కమిటీలకూ అధిపతిగా, ప్రధాన ప్రతినిధిగా, కాంగ్రెస్ తరఫున భారత ప్రధానిగా ఉంటూ వచ్చింది. రాజ్యాంగబద్ధంగా, అధ్యక్షుడిని పిసిసిలు ఎఐసిసి సభ్యులు ఎన్నుకుంటారు; అయితే, వర్కింగ్ కమిటీ తరచూ ఈ విధానాన్ని బైపాస్ చేసి, తన అభ్యర్థిని ఎన్నుకుంటోంది.[40]
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో (సిపిపి) లోక్‌సభ, రాజ్యసభలో ఎన్నికైన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) నేత కూడా ఉంటారు. సిఎల్‌పిలో ఆయా రాష్ట్రాల్లోని శాసనసభ్యులందరూ (ఎమ్ఎల్ఏలు) సభ్యులుగా ఉంటారు. కాంగ్రెస్ ఒక్కటే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎల్పీ నేతయే ముఖ్యమంత్రిగా ఉంటారు. పార్టీలోని ప్రత్యక్ష అనుబంధ శాఖలు ఇవి:
2021 నాటికి, భారత ఎన్నికల సంఘం ఆమోదించినట్లుగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చిహ్నం, "చెయ్యి". కుడి అరచేతి ముందువైపు దాని వేళ్లు ఒకదానితో ఒకటి ఆనుకుని ఉన్న చిత్రం అది.[46] ఇది సాధారణంగా త్రివర్ణ పతాకం మధ్యలో ఉంటుంది. 1977 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ (ఆర్) వర్గం నుండి విడిపోయి కొత్త కాంగ్రెస్ (ఐ)ని స్థాపించినప్పుడు ఇందిరా గాంధీ మొదటగా చేతి గుర్తును ఉపయోగించింది.[47] చేయి బలానికి, శక్తికి, ఐక్యతకూ ప్రతీక.
నెహ్రూ నాయకత్వంలో ఉండగా, పార్టీకి 'కాడిని మోస్తున్న ఎద్దుల జత' గుర్తు ఉండేది. ఇది ప్రధానంగా రైతులకు సూచిస్తూ ఉండేది.[48] 1969లో, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా, ఇందిరాగాంధీ విడిపోయి, సొంతంగా కాంగ్రెస్ (ఆర్) అనే పార్టీని స్థాపించింది. కొత్త పార్టీలో ఆమెకు మద్దతుగా మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేరారు. 1971-1977 కాలంలో ఇందిరా కాంగ్రెస్ (R) లేదా కాంగ్రెస్ (రిక్విజిషనిస్టులు) కు ఆవు దూడ గుర్తు ఉండేది.[49][50] లోక్‌సభలో పార్టీకి ఉన్న 153 మంది సభ్యులలో 76 మంది మద్దతు కోల్పోయిన తర్వాత ఇందిర, కొత్త రాజకీయ సంస్థ కాంగ్రెస్ (ఐ) లేదా కాంగ్రెస్ (ఇందిర) ను ఏర్పరచింది. అప్పుడు పార్టీకి చేతి గుర్తును ఎంచుకుంది.
కాంగ్రెస్ పార్టీతో సహా భారతదేశంలోని అనేక రాజకీయ పార్టీలలో వంశపారంపర్య పాలన చాలా సాధారణం.[51] కాంగ్రెసు పార్టీలో నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ఆరుగురు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు.[52] ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ కుటుంబం తన చిన్న కొడుకు సంజయ్ గాంధీతో పార్టీని నియంత్రించడం ప్రారంభించింది.[53] ఇది కుటుంబం పట్ల దాస్యంగా వర్ణించబడింది, ఇందిరా గాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ వారసత్వ నాయకుడిగా రావడానికి దారితీసింది. అలాగే అతని హత్య తర్వాత సోనియా గాంధీని రాజీవ్ వారసురాలిగా పార్టీ ఎన్నుకోగా ఆమె దానిని తిరస్కరించింది.[54] 1978లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ (ఐ)ని స్థాపించినప్పటి నుండి, 1991, 1998 మధ్య కాలంలో మినహా పార్టీ అధ్యక్షులందరూ ఆమె కుటుంబం నుండే వచ్చారు. లోక్‌సభకు జరిగిన గత మూడు ఎన్నికల్లో కలిపి, 37 శాతం మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వారసత్వంగా ఆ పదవుల్లోకి వచ్చినవారే.[55] అయితే, ఇటీవలి కాలంలో సంస్థను పునర్నిర్మించాలని పార్టీలో అంతర్గతంగా పిలుపులు వచ్చాయి. కాంగ్రెస్‌ను సంస్కరిస్తూ ఇతరులకు బాధ్యతలు అప్పగించాలని సీనియర్ నేతల బృందం పార్టీ అధ్యక్షుడికి లేఖ రాసింది. 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత అసంతృప్తి కూడా కనిపించింది. ఆ తర్వాత 23 మంది సీనియర్ నేతల బృందం పార్టీని పునర్నిర్మించాలని కాంగ్రెస్ అధ్యక్షుడికి లేఖ రాసింది.[56]
సంఖ్య | పేరు | చిత్తరువు | పదవీకాలం [57] | లోక్ సభ | నియోజకవర్గం | ||
---|---|---|---|---|---|---|---|
ప్రారంభం | ముగింపు | పదవీకాలం | |||||
1 | జవహర్లాల్ నెహ్రూ | 1947 ఆగస్టు 15 | 1964 మే 27 | 16 సంవత్సరాలు, 286 రోజులు | రాజ్యాంగ సభ | ||
1వది | ఫుల్పూర్ | ||||||
2 వ | |||||||
3వది | |||||||
తాత్కాలిక | గుల్జారీలాల్ నందా | 1964 మే 27 | 1966 జనవరి 11 | 13 రోజులు | సబర్కాంత | ||
2 | లాల్ బహదూర్ శాస్త్రి | 1 సంవత్సరం, 216 రోజులు | అలహాబాద్ | ||||
తాత్కాలిక | గుల్జారీలాల్ నందా | 1966 జనవరి 11 | 1966 జనవరి 24 | 13 రోజులు | సబర్కాంత | ||
3 | ఇందిరా గాంధీ | 1966 జనవరి 24 | 1977 మార్చి 24 | 15 సంవత్సరాలు, 350 రోజులు | ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ | ||
4వది | రాయ్ బరేలీ | ||||||
5వది | |||||||
1980 జనవరి 14 | 1984 అక్టోబరు 31 | 7వది | మెదక్ | ||||
4 | రాజీవ్ గాంధీ | 1984 అక్టోబరు 31 | 1989 డిసెంబరు 2 | 5 సంవత్సరాలు, 32 రోజులు | అమేథీ | ||
8వ | |||||||
5 | పి. వి. నరసింహారావు | 1991 జూన్ 21 | 1996 మే 16 | 4 సంవత్సరాలు, 330 రోజులు | 10వ | నంద్యాల | |
6 | మన్మోహన్ సింగ్ | 2004 మే 22 | 2014 మే 26 | 10 సంవత్సరాలు, 4 రోజులు | 14వ | అసోం నుంచి రాజ్యసభ ఎంపీ | |
15వ |
నం. | చిత్తరువు | పేరు
జీవిత కాలం |
పదవీకాలం | లోక్‌సభ | నియోజకవర్గం | ప్రధాన మంత్రి | ||
---|---|---|---|---|---|---|---|---|
పదవి ప్రారంభం | ముగింపు | పదవీ కాలం | ||||||
1 | వల్లభాయ్ పటేల్
(1875–1950) |
1947 ఆగస్టు 15 | 1950 డిసెంబరు 15 | 3 సంవత్సరాలు, 122 రోజులు | రాజ్యాంగ సభ | N/A | జవహర్లాల్ నెహ్రూ | |
2 | మొరార్జీ దేశాయ్
(1896–1995) |
1967 మార్చి 13 | 1969 జూలై 19 | 2 సంవత్సరాలు, 128 రోజులు | 4వ
( 1967 ) |
సూరత్
( లోక్‌సభ ) |
ఇందిరా గాంధీ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.