భారత పార్లమెంట్ దిగువసభ From Wikipedia, the free encyclopedia
భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత 1952 ఏప్రిల్ 17 న మొదటి లోక్సభ ఏర్పాటు చేయబడింది.1వ లోక్సభ పూర్తి ఐదేళ్ల పదవీకాలం కొనసాగింది 1957 ఏప్రిల్ 4న రద్దు చేయబడింది. ఈ లోక్సభ మొదటి సమావేశం 1952 మే 13 న ప్రారంభమైంది. లోక్సభ స్థానాలు మొత్తం 489.అప్పటికి అర్హత కలిగిన ఓటర్లు 17.3 కోట్లు. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్.సి) 364 సీట్లను గెలుచుకుంది. వారి తర్వాత ఇండిపెండెంట్లు మొత్తం 37 సీట్లను గెలుచుకున్నారు. భారత కమ్యూనిష్ఠ్ పార్టీ (సిపిఐ) 16 స్థానాలు, సోషలిస్ట్ పార్టీ (ఇండియా) 12 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ మొత్తం ఓట్లలో 45% ఓట్లను పొందింది. మొత్తం 479 స్థానాలలో పోటీ చేయగా, వాటిలో 364 స్థానాలను (76%) గెలుపొందింది. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 93 ప్రకారం, లోక్సభలో ఎన్నుకోబడిన, ఎన్నుకోబడని అధికారులు ఉంటారు. ఎన్నికైన సభ్యులు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అయితే ఎన్నికకాని సభ్యులు సచివాలయ సిబ్బంది ఉంటారు.[1]
మొదటి లోక్సభ | |||||
---|---|---|---|---|---|
| |||||
అవలోకనం | |||||
శాసనసభ | చట్టసభ | ||||
ఎన్నిక | 1951–52 భారత సార్వత్రిక ఎన్నికలు |
ఈ దిగువ వివరాలు 1వ లోక్సభ అధికారులు, ఇతర ముఖ్యమైన సభ్యులు.[2][3]
వ.సంఖ్య | స్థానం | పేరు | నుండి | వరకు | కార్యాలయంలో
పనిచేసిన రోజులు |
---|---|---|---|---|---|
01 | సభాపతి | గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ | 1952 మే 8 | 1956 ఫిబ్రవరి 27 | 1,390 |
ఎం.ఎ.అయ్యంగార్ | 1956 మార్చి 8 | 1957 మే 10 | 428 | ||
02 | ఉప సభాపతి | ఎం.ఎ.అయ్యంగార్, | 1952 మే 30
1956 మార్చి 20 |
1956 మార్చి 7
1957 ఏప్రిల్ 4 |
1,377
380 |
03 | సెక్రటరీ జనరల్ | ఎంఎన్ కౌల్ | 1952 ఏప్రిల్ 17 | 1957 ఏప్రిల్ 4 | 1,813 |
04 | సభా నాయకుడు | జవహర్లాల్ నెహ్రూ | 1952 ఏప్రిల్ 17 | 1957 ఏప్రిల్ 4 | 1,813 |
05 | ప్రతిపక్ష నాయకుడు * | ఎకె గోపాలన్ | 1952 ఏప్రిల్ 17 | 1957 ఏప్రిల్ 4 | 1,813 |
గమనిక:* (అధికారికంగా ప్రకటించబడలేదు) పార్లమెంట్ చట్టంలో ప్రతిపక్ష నాయకుల జీతం, అలవెన్సుల తర్వాత 1977లో మాత్రమే ప్రతిపక్ష నాయకుడి స్థానం గుర్తింపు పొందింది.[4]
భారత ఎన్నికల సంఘం [5] ప్రచురించిన భారత పార్లమెంట్ సభ్యుల జాబితా వివరాలు:[6]
1వ లోక్సభలో గెలుపొందిన రాజకీయ పార్టీల సభ్యులు సంఖ్యా వివరాలు.
వ.సంఖ్య | పార్టీ పేరు | కోడ్ | సభ్యుల సంఖ్య |
---|---|---|---|
1 | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | ఐ.ఎన్.సి | 364 |
2 | భారత కమ్యూనిస్టు పార్టీ | సిపిఐ | 16 |
3 | సోషలిస్ట్ పార్టీ | ఎస్.పి | 12 |
4 | కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ | కెఎంపీపి | 9 |
5 | పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ | పీ.డీ.ఎఫ్ | 7 |
6 | గణతంత్ర పరిషత్ | జీ.పి | 6 |
7 | శిరోమణి అకాలీ దళ్ | ఎస్.ఎ.డి | 4 |
8 | తమిళనాడు టాయిలర్స్ పార్టీ | టీ.ఎన్.టి.పి | 4 |
9 | అఖిల భారతీయ హిందూ మహాసభ | ఎ.బి.ఎచ్.ఎం | 4 |
10 | కామన్వెల్ పార్టీ | సీ.డబ్ల్యు.పి | 3 |
11 | అఖిల్ భారతీయ రామ్ రాజ్య పరిషత్ | ఆర్.ఆర్.పి | 3 |
12 | భారతీయ జన సంఘం | బి.జె.ఎస్. | 3 |
13 | విప్లవ సోషలిస్ట్ పార్టీ | ఆర్.ఎస్.పి | 3 |
14 | జార్ఖండ్ పార్టీ | జె.కె.పీ | 3 |
15 | షెడ్యూల్డ్ కులాల సమాఖ్య | ఎస్.సీ.ఎఫ్ | 2 |
16 | లోక్ సేవక్ సంఘ్ | ఎల్.ఎస్.ఎస్ | 2 |
17 | రైతులు, కార్మికుల పార్టీ ఆఫ్ ఇండియా | పీ.డబ్ల్యూ.పీ.ఐ | 2 |
18 | ఫార్వర్డ్ బ్లాక్ (మార్క్సిస్ట్) | ఎఫ్.బీ. (ఎం) | 1 |
19 | కృషికార్ లోక్ పార్టీ | కె.ఎల్.పి | 1 |
20 | చోటా నాగపూర్ సంతాల్ పరగణాల జనతా పార్టీ | సీ.ఎన్.ఎస్.పీ.జె.పి | 1 |
21 | మద్రాస్ స్టేట్ ముస్లిం లీగ్ పార్టీ | ఎం.ఎస్.ఎం.ఎల్.పి | 1 |
22 | ట్రావెన్కోర్ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ | టీ.టీఎన్.సి | 1 |
స్వతంత్రులు | 37 | ||
నామినేటెడ్ ఆంగ్లో-ఇండియన్స్ | 2 | ||
మొత్తం | 489 |
Seamless Wikipedia browsing. On steroids.