కస్బా వినాయక దేవాలయం
మహారాష్ట్రలోని పూణే నగర గ్రామదేవుడు From Wikipedia, the free encyclopedia
మహారాష్ట్రలోని పూణే నగర గ్రామదేవుడు From Wikipedia, the free encyclopedia
కస్బా వినాయక దేవాలయం, మహారాష్ట్రలోని పూణే నగరంలో ఉన్న వినాయక దేవాలయం. వినాయకుడు పూణే నగరానికి గ్రామదేవుడిగా పరిగణించబడుతున్నాడు.[1]
కస్బా వినాయక దేవాలయం | |
---|---|
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | మహారాష్ట్ర |
జిల్లా: | పూణే |
భౌగోళికాంశాలు: | 18°31′08″N 73°51′25″E |
పూణేలో వినాయకుడి విగ్రహం దొరికిందని దాదోజీ కొండేయో చెప్పడంతో జీజాసాహెబ్ ఈ దేవాలయాన్ని నిర్మించింది.[1] పూణేలో ప్రధానమూర్తి హోదాను బాల గంగాధర తిలక్ నిర్ణయించాడు.[2] 1630 సంవత్సరంలో మరాఠా కులీనుడు, సర్దార్ షాహాజీ భోసలే భార్య జిజాబాయి సాహెబ్ భోసలే మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో కలిసి పూణే నగరానికి చేరుకున్నాడు. ఈ సమయంలోనే, ఇతర ఏడు కుటుంబాలతోపాటు, థాకర్ కుటుంబం ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఇండి గ్రామం నుండి పూణేకు వలస వచ్చింది. వినాయక్ భట్ ఠాకర్ తన కుటుంబ దేవత అయిన వినాయకుడిని కూడా తన వెంట తీసుకెళ్ళాడు. ఈ కుటుంబాలన్నీ జిజాబాయి నివాసానికి సమీపంలో ఉన్న ప్రస్తుత కస్బా వినాయక దేవాలయం చుట్టూ నది ఒడ్డున స్థిరపడ్డాయి. జీజాబాయి దీనిని శుభ ముహూర్తంగా భావించింది, కస్బా వినాయక మందిరంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు.[3] అప్పటినుండి పూణే నగరంను గణేష్ నగరంగా కూడా పిలుస్తారు. పేష్వాలు గణేష్‌కు అత్యంత అనుచరులుగా ఉన్నారు. వారి హయాంలోనే శనివారవాడలో గణేశుడి వేడుకలు ఘనంగా జరిగాయి.[4] 1893లో భారత జాతీయవాద నాయకుడు బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాన్ని ప్రారంభించాడు. బ్రిటీష్ వారితో పోరాటం చేయడానికి ఆలోచనలను పంచుకునే వ్యక్తులను సేకరించడం ఈ ఉత్సవ ఉద్దేశం. అతను కేసరి వాడ అనే తన స్వంత ఇంటి నుండి గణేష్ ఉత్సవాలను జరుపుకోవడం ప్రారంభించాడు. ఆ తరువాత గణేష్ ఉత్సవం హిందువుల పండుగగా ప్రసిద్ధి పొందింది.[5] గణపతి ఉత్సవాల చివరిరోజు వినాయుడి నిమజ్జనం ఉంటుంది. బాలగంగాధర్ తిలక్ శత్రుత్వాన్ని పరిష్కరించి, పూణే నగర స్థానిక దేవత అయిన కస్బా వినాయకుడికి మొదటి నిమజ్జనంగా అధికారికంగా ప్రకటించాడు.[1]
1925 వరకు, కస్బా గణపతి మండలం దేవాలయ ప్రాంగణంలో ఉత్సవాలను జరుపుకున్నారు. 1926 నుండి పరివేష్టిత మండపంలో జరుపుకుంటున్నారు. పండుగ పది రోజులు స్థానిక కళాకారుల ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించబడుతాయి. ఈ పండుగకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. చివరిరోజు కస్బా వినాయక నిమజ్జన ఊరేగింపు జరుగుతుంది.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.