![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4d/Naradar_receiving_Kalaimamani_award_from_Honorable_Chief_Minister_of_Tamilnadu.jpg/640px-Naradar_receiving_Kalaimamani_award_from_Honorable_Chief_Minister_of_Tamilnadu.jpg&w=640&q=50)
కళైమామణి
From Wikipedia, the free encyclopedia
కళైమామణి (అధికారికంగా జయలలిత అవార్డ్) [1] తమిళనాడు రాష్ట్రంలో ప్రదానం చేయబడుతున్న ఒక పురస్కారం. ఈ పురస్కారాలను "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" (తమిళనాడు సాహిత్య సంగీత నాటక ఫోరమ్) సాహిత్య, సంగీత, నాటక కళా రంగాలలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చినవారికి ప్రకటిస్తున్నది. ఇంతవరకు 1450మందికి పైగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
త్వరిత వాస్తవాలు కళైమామణి, Awarded for ...
కళైమామణి | |
---|---|
Awarded for | కళలలో ఉత్తమ ప్రదర్శనకు |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్ |
మొదటి బహుమతి | 1954 |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4d/Naradar_receiving_Kalaimamani_award_from_Honorable_Chief_Minister_of_Tamilnadu.jpg/640px-Naradar_receiving_Kalaimamani_award_from_Honorable_Chief_Minister_of_Tamilnadu.jpg)
తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్కు కార్యదర్శిగా నర్తకి చిత్రా విశ్వేశ్వరన్ను, అధ్యక్షునిగా సినీసంగీత దర్శకుడు దేవాను నియమించింది.[2]