ఇండియన్ ప్రీమియర్ లీగ్
From Wikipedia, the free encyclopedia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అనేది పురుషుల ట్వంటీ20 (T20) క్రికెట్ లీగ్. దీన్ని భారతదేశంలో ఏటా నిర్వహిస్తారు. పది నగరాలకు చెందిన ఫ్రాంచైజీ జట్లు ఇందులో పోటీ చేస్తాయి. [1] దీనిని స్పాన్సర్షిప్పును అనుసరించి దీన్ని టాటా IPL అని కూడా పిలుస్తారు. 2007 లో బీసీసీఐ ఈ లీగ్‌ని స్థాపించింది. పోటీలు సాధారణంగా ప్రతి సంవత్సరం వేసవిలో మార్చి, మే నెలల్లో జరుగుతాయి. ఈ సీజనులో ప్రపంచవ్యాప్తంగా తక్కువ అంతర్జాతీయ క్రికెట్ పర్యటనలు జరుగుతున్నందున ICC ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో దీనికి ప్రత్యేకమైన విండో ఉంది.[2]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ | |
---|---|
దేశాలు | భారతదేశం |
నిర్వాహకుడు | బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) |
ఫార్మాట్ | ట్వంటీ20 |
తొలి టోర్నమెంటు | 2008 |
చివరి టోర్నమెంటు | 2023 |
తరువాతి టోర్నమెంటు | 2024 |
టోర్నమెంటు ఫార్మాట్ | రౌండ్ రాబిన్, ప్లే ఆఫ్ |
జట్ల సంఖ్య | 10 |
ప్రస్తుత ఛాంపియన్ | చెన్నై సూపర్ కింగ్స్ (2023) |
అత్యంత విజయవంతమైన వారు | చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ (చెరి 5 టైటిళ్ళు) |
అత్యధిక పరుగులు | విరాట్ కొహ్లి (7263) |
అత్యధిక వికెట్లు | యజువేంద్ర చాహల్ (187) |
ఐపిఎల్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్. 2014లో, సగటు హాజరు ప్రకారం చూస్తే స్పోర్ట్స్ లీగ్లన్నిటిలోకీ ఇది ఆరవ స్థానంలో ఉంది. [3] 2010లో, యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారమైన మొదటి క్రీడా ఈవెంట్‌గా IPL నిలిచింది. [4] [5] IPL భారీ విజయం నుండి స్ఫూర్తిగా అనేక దేశీయ క్రికెట్ లీగులు, ఇతర క్రీడల లీగ్‌లూ భారతదేశంలో ప్రారంభమయ్యాయి. [lower-alpha 1] [8] [9] [10] 2022లో ఈ లీగ్ బ్రాండ్ విలువ రూ 90,038 కోట్లు [11] BCCI ప్రకారం, 2015 సీజనులో ఐపిఎల్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ జిడిపికి రూ 1,150 కోట్లు అందించింది.[12] కన్సల్టింగ్ సంస్థ డి అండ్ పి అడ్వైజరీ నివేదిక ప్రకారం, 2022 డిసెంబరులో IPL విలువ US$10.9 బిలియన్లు. 2020 నుండి డాలర్ పరంగా 75% వృద్ధిని నమోదు చేసింది.[13] 2023 ఐపిఎల్ ఫైనల్‌ను 3.2 కోట్ల మంది వీక్షకులు చూసారు. ఇంటర్నెట్లో అత్యధిక వీక్షణలు పొందిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం అది.[14]
2023లో లీగ్ తన మీడియా హక్కులను 2023–2027 కాలానికి US$ 6.4 బిలియన్లకు Viacom18, స్టార్ స్పోర్ట్స్‌కు విక్రయించింది, [15] ఒక్కో మ్యాచ్^న్మి IPL, $13.4 మిలియన్లుగా విలువ కట్టింది.[16] 2023 వరకు టోర్నమెంటులో పదహారు సీజన్లు జరిగాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్, 2023 సీజన్లో విజేతగా, ప్రస్తుత ఛాంపియన్‌గా నిలిచింది. [17]