ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ
From Wikipedia, the free encyclopedia
ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఒక కృత్రిమ ఉపగ్రహం.భారతీయ అంతరిక్షపరిశోధన సంస్థ అయిన ఇస్రోతయారు చేసిన ఉపగ్రహం.ఇది భారతీయ నావిగేషన్ (మార్గనిర్దేశ వ్యవస్థకు సంబంధించిన) ఉపగ్రహం.నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థకు చెంది ఇప్పటికి ఇస్రో ఏడు ఉపగ్రహాలను ప్రయోగించింది.నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థకు చెంది మొదట్లో ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1A ఉపగ్రహంలోని రుబీడియం గడియారం పనిచెయ్యక పోవడంతో, 2017 ఆగస్టు 31 లో దాని స్థానాన్ని భర్తీ చెయ్యటానికి, పిఎస్ఎల్వి-సీ39 అనే ధ్రువీయ ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1హెచ్‌ను అంతరిక్షములోకి పంపారు.కాని దురదృష్టవశాత్తూ ఆ ప్రయోగం విఫలమైనది .ఉపగ్రహం చుట్టూ అమర్చిన ఉష్ణకవచం (heat shield) అనుకున్న విధంగా తెరచుకోక, అలాగే వుండి పోవడం వలన, ప్రయోగలక్ష్యం నెరవేరలేదు.సాధారణంగాఉపగ్రహం బయలు దేరిన రెండు నిమిషాలకు ఉష్ణకవచం వేరుపాడాలి. కాని 20 నిమిషాల తరువాత కక్ష్యలోకి ఉపగ్రహం చేరినను ఉష్ణ కవచం వేరుపడలేదు.ఇప్పటికి ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎచ్ నిరద్ధకంగా అంతరిక్షములో 507 కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు కొట్టుతున్నది.ఇప్పుడు పిఎస్ఎల్ వి-సీ41 అను ధ్రువీయ ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపుటకు ఇస్రో సర్వసన్నిద్ధమైనది.ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఉపగ్రహం నావిగేసన్ కు చెంది ఎనిమిదవ ఉపగ్రహం[3]
మిషన్ రకం | సముద్రయాన నిర్వహణ(navigation) |
---|---|
ఆపరేటర్ | ఇస్రో |
మిషన్ వ్యవధి | 10 సంవత్సరాలు |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
తయారీదారుడు | ఇస్రో |
లాంచ్ ద్రవ్యరాశి | 1425కిలోలు |
డ్రై ద్రవ్యారాశి | 600కిలోలు |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 11 ఏప్రిల్ 2018 [1] |
రాకెట్ | PSLV-XL C41 [2] |
లాంచ్ సైట్ | సతిష్ ధవన్ అంతరిక్ష కేంద్రం |
కాంట్రాక్టర్ | ఇస్రో |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | భూ కేంద్రీయ కక్ష్య |
రెజిమ్ | భూసమకాలిక కక్ష్య |