ఉర్దూ భాష
ఈ భాష పాకిస్తాన్ దేశంలో జాతీయ భాష, భారతదేశంలో కూడా మాట్లాడతారు. / From Wikipedia, the free encyclopedia
ఉర్దూ (Urdu ఉచ్ఛారణ (help·info)) లేదా స్థానికంగా లష్కరీ (لشکری) ఒక ఇండో-ఆర్యన్ భాష, భారత దేశంలో జన్మించిన భాష. భారతదేశపు 23 ఆధికారిక భాషల్లో ఒకటి. ఈ భాషకు మాతృక ఖరీబోలి లేదా హిందుస్తానీ. లష్కరి, రీఖ్తి దీనికి ఇతర నామాలు. అరబ్బీ (అరబిక్), బ్రజ్ భాష, పారశీకం (పర్షియన్), ఆంగ్లం మొదలగు భాషల సమ్మేళనం. ఉత్తర భారత దేశంలోని ముస్లింలు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లోని పట్టణ ప్రాంతాలలోని ముస్లింలు, పాకిస్తాన్ లోని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, తదితర నగరాలు, పట్టణాలలో ముస్లింలు మాత్రమే కాకుండా సింధీలు, సిక్కులు, హిందువులు కూడా ఉర్దూ ఎక్కువగా మాట్లాడుతారు.[2]
త్వరిత వాస్తవాలు ఉర్దూ (లష్కరీ) (لشکری) اُردو, అధికారిక స్థాయి ...
ఉర్దూ (లష్కరీ) (لشکری) اُردو | ||
---|---|---|
: | Urdu example.svg | |
ఉచ్ఛారణ: | "ఉర్-దూ" (లష్కరీ) | |
మాట్లాడే దేశాలు: | భారత దేశం, పాకిస్తాన్, యు.ఎ.ఇ., యు.ఎస్.ఎ., యు.కె., కెనడా, ఫిజీ | |
ప్రాంతం: | దక్షిణ ఆసియా (భారత ఉపఖండం) | |
మాట్లాడేవారి సంఖ్య: | 100–130 మిలియన్ స్థానికులు 250 మిలియన్ మొత్తం | |
ర్యాంకు: | 19–21 (స్థానికంగా మాట్లాడేవారు), ఇటాలియన్ , టర్కిష్ భాషలతో ఇంచుమించు సమానం | |
భాషా కుటుంబము: | ఇండో-ఇరానియన్ ఇండో-ఆర్యన్ సెంట్రల్ జోన్ ఉర్దూ (లష్కరీ) | |
వ్రాసే పద్ధతి: | ఉర్దూ అక్షరమాల (నస్తలీఖ్ లిపి) | |
అధికారిక స్థాయి | ||
అధికార భాష: | ![]() ![]() ![]() | |
నియంత్రణ: | జాతీయ భాషా ప్రాధికరణము, NCPUL, ఉర్దూ భాషాభివృద్ధి జాతీయ కౌన్సిలు[1] | |
భాషా సంజ్ఞలు | ||
ISO 639-1: | ur | |
ISO 639-2: | urd | |
ISO 639-3: | urd | |
Urdu_official-language_areas.png | ||
గమనిక: ఈ పేజీలో IPA ఫోనెటిక్ సింబల్స్ Unicodeలో ఉన్నాయి. |
మూసివేయి