ఉదయ్‌పూర్ రాజ్యం
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
భారత రిపబ్లికు ఏర్పడటానికి ముందు దీనిని ఉదయపూర్ రాష్ట్రం, మేవార్ రాజ్యం అని కూడా పిలిచారు.[6] ఇది వాయవ్య భారతదేశంలో ఒక స్వతంత్ర రాజ్యంగా ఉంది.
Mewar State or Udaipur State | |
---|---|
c. 734–1949 | |
నినాదం: "The Almighty protects the one who upholds righteousness" | |
Boundaries of Udaipur State in 1909 | |
రాజధాని | |
సామాన్య భాషలు | Mewari[3] |
మతం | |
ప్రభుత్వం |
|
చరిత్ర | |
• స్థాపన | c. 734 |
• Accession to the Union of India | 1949 |
విస్తీర్ణం | |
1901 | 33,030[4] కి.మీ2 (12,750 చ. మై.) |
1941 | 33,517[5] కి.మీ2 (12,941 చ. మై.) |
జనాభా | |
• 1941 | 1,926,698[5] |
శతాబ్దాల కాలంలో మేవారు భౌగోళిక సరిహద్దులు క్షీణించాయి.[7] 1941 నాటికి రాజ్యం వైశాల్యం 34,110 చదరపు కిలోమీటర్లు (సుమారుగా నెదర్లాండ్సు పరిమాణం).[8][9] 1818 లో బ్రిటీషు వారితో కుదుర్చుకున్న ఒప్పందం నుండి 1949 లో రిపబ్లికు ఆఫ్ ఇండియాలోకి ప్రవేశించడం వరకు ఉదయపూర్ రాజ్య సరిహద్దులుగా, ఉత్తరాన బ్రిటిషు జిల్లా అజ్మీరు - మెర్వారా, పశ్చిమసరిహద్దులో జోధ్‌పూర్, సిరోహి, నైరుతి సరిహద్దులో ఇదారు సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణసరిహద్దులో దుంగర్పూర్,బన్స్వార, ప్రతాప్‌గఢ్ జిల్లా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున బుంది, కోటా జిల్లాలు, ఈశాన్య సరిహద్దులో జైపూర్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.[10]
మేవారును బట్టా రావలు స్థాపించాడు. గతంలో చిత్తూరులోని మోరి ప్రజలకు అధిపతి ఉండేవాడు. సా.శ. 728 లో ఆయన చిత్తోరు మీద నియంత్రణను పొందాడు.[11] మేవారు మొదటి రాజధానిగా నాగ్దా ఉండేది. సా.శ. 948 పాలకుడు అల్లాతు రాజధానిని నాగ్డా నుండి అహరుకు మార్చాడు.[1]
1615 లో నాలుగు దశాబ్దాల వాగ్వివాదం తరువాత మేవారు, మొఘలులు ఒక ఒప్పందానికి అంగీకరించారు. దీని ఆధారంగా మొఘలుల ఆధీనంలో ఉన్న మేవారు భూభాగం తిరిగి రాజపుత్రుల స్వాధీనం అయింది. మేవారు యువరాజు రాజసభకు హాజరయ్యాడు. మేవారు రాజులు మొఘలులకు 1,000 మంది గుర్రపు సైనికులను అందించారు.[12]
1725 లో మేవార్ భూభాగంలోకి మొదటిసారిగా మరాఠీలు చొరబాటు చేసారు. తదనంతరం వారు మేవారు మీద మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న దుంగార్పూరు, బంసువ్రా, బుండి రాజ్యాలమీద కూడా ప్రభావం చూపారు.[13] మరాఠాలను ఎదుర్కోవటానికి మేవారుకు చెందిన మహారాణా జగతు సింగు 1734 లో హుర్దాలో రాజపుత్ర పాలకుల సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఒప్పందం కార్యరూపం దాల్చలేదు.[13] మరాఠా శక్తి పెరుగుతూనే ఉంది. ఈ శతాబ్దం మిగిలిన భాగంలో మరాఠాలు క్రమం తప్పకుండా మేవారు నుండి కప్పం అందుకున్నారు.[13]
1818 నాటికి హోల్కరు, సింధియా, టోంక్ సైన్యాలు మేవారుపై దాడిచేసి, దాని పాలకుడిని, ప్రజలను దోచుకున్నాయి.[7] 1805 లోనే మేవారుకు చెందిన మహారాణా భీం సింగు సహాయం కోసం బ్రిటిషు వారిని సంప్రదించినప్పటికీ 1803 లో సింధియాతో చేసుకున్న ఒప్పందం కారణంగా బ్రిటిషు వారు అతడి అభ్యర్థనను స్వీకరించలేక పోయారు.[7] కానీ 1817 నాటికి బ్రిటిషు వారు కూడా రాజపుత్ర పాలకులతో పొత్తులు పెట్టుకోవాలని ఆత్రుత ప్రదర్శించారు.1818 జనవరి 13 న ఈస్టు ఇండియా కంపెనీ (బ్రిటను తరపున), మేవారుల మధ్య స్నేహం, పొత్తులు, ఐక్యతతోఈ కూడిన ఒప్పందం కుదిరింది.[7][14]
ఈ ఒప్పందం ఆధారంగా మేవారు భూభాగాన్ని రక్షించడానికి బ్రిటిషు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి ప్రతిగా మేవారు బ్రిటిషు ఆధిపత్యాన్ని అంగీకరించింది. ఇతర రాజ్యాలతో రాజకీయ సంబంధాలకు దూరంగా ఉంటూ దాని ఆదాయంలో నాలుగవ వంతు 5 సంవత్సరాల పాటు బ్రిటిషు ప్రభుత్వానికి కప్పంగా ఇవ్వడానికీ, ఆ తరువాత ఎనిమిదింట మూడు వంతులు ఇవ్వడానికీ అంగీకరించింది.[14] 1947 మే 23 న ఉదయపూరు రాజ్యానికి రాజ్యాంగం ఆమోదించబడింది.[15] 1949 ఏప్రిల్ 7 న ఉదయపూరు రాజ్య చివరి పాలకుడు స్వతంత్ర భారతదేశంలోకి ప్రవేశించడానికి సంతకం చేశాడు.[16]
1303 వరకు మేవార్ పాలకులను 'మహారాణాలు అని పిలిచేవారు.[1] 1303 నాటికి అల్లావుద్దీను ఖిల్జీ చిత్తోరుగడును తొలగించిన సమయంలో మహారాణా రతను సింగు మరణించిన తరువాత హమీరు మేవార్ పాలకుడై తనను తాను 'మహారాణా' గా పేర్కొన్నాడు. 1949 లో రాజ్యం రద్దు అయ్యే వరకు దాని పాలకులను మహారాణా అని పిలిచారు.[1]
ఉదయపూరు శిశోడియా రాజపుత్ర రాజవంశం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
1984 నవంబరు 2 న భగవంతు సింగు మరణించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు; మహేంద్ర సింగు, అరవింద సింగు. భగవంతు సింగు తన మరణానికి ముందు, ఆయన మహారాణా మేవారు ఫౌండేషను అనే ట్రస్టును స్థాపించి దానిని నిర్వహించే బాధ్యతను చిన్న కుమారుడు అరవిందుకు అప్పగించాడు. అరవిందు ఉదయపూరు సిటీ ప్యాలెసులో నివసిస్తున్నాడు.[ఆధారం చూపాలి]
రాజ్యంలో వారి వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఈస్టు ఇండియా కంపెనీ చేత నియమించబడిన జేమ్స్ టాడ్, 1818 మార్చి నుండి 1822 వరకు పదవిలో ఉన్నారు. [ఆధారం చూపాలి] అలాన్ హోల్మె బ్రిటిషు రెసిడెంటు పదవీ బాధ్యతలు రెండు మార్లు నిర్వహించాడు (1911 - 1916 - 1919).[ఆధారం చూపాలి]
1901 జనాభా లెక్కల సమయంలో రాజ్యాన్ని 17 పరిపాలనా ఉపవిభాగాలుగా విభజించారు - 11 జిల్లలు, 6 పరగణాలు. జిల్లా, పరగణాల మధ్య వ్యత్యాసం ఏమిటంటే పరగణా వైశాల్యపరంగా పెద్దదిగా ఉండి మరింతగా ఉపవిభాగాలుగా విభజించబడింది.[17] ఇంకా 28 రాజాస్థానాలు, జాగీర్లు, 2 భూమాట్లు ఉన్నాయి.[18] ప్రతి జిల్లాను ఒక హకీం, ఒక రాజ్య అధికారి నియమించబడ్డాడు. ప్రతి తహసీలు (జిలా సబ్ డివిజన్) వద్ద సహాయక హకీం మద్దతుగా పనిచేసేవాడు.[3]
రాజ్యంలో భూభాగాలుగా ప్రధాన రూపాలు జాగీరు, భూం, సాసను, ఖల్సా అనే పేర్లతో పిలువబడ్డాయి. చక్రవర్తులు తమకు అందించిన రాజకీయ సేవకు గుర్తింపుగా భూమిని జాగీర్లుగా మంజూరు చేశారు. జాగీరుదార్లు సాధారణంగా వార్షిక ప్రాతిపదికన చాతుండు అని పిలువబడే స్థిర వార్షిక నివాళిని, కొత్త మహారాణాకు వారసత్వంగా నజరానాను చెల్లించేవారు. జాగీర్దారు మరణం తరువాత, దివంగత జాగీర్దారు వారసుడిని మహారాణా గుర్తించే వరకు జాగీరు మహారాణాకు తిరిగి వస్తుంది. భూమి యజమానిగా పదవీకాలంలో ఉన్నవారు ఒక చిన్న నివాళి లేదా నామమాత్రపు -అద్దె (భుం బరారు) చెల్లించారు. స్థానిక సేవ కోసం ఆహ్వానించబడతారు. సాసనుదారులు (మువాఫీ అని కూడా పిలుస్తారు). వీరు మహారాణాకు చెల్లింపులకు బాధ్యత వహించరు కాని వారి నుండి కొన్నిసార్లు పన్నులు పొందబడతాయి. ఖల్సా (ప్రభుత్వ భూములు) ఉన్నవారు సాగుదారులు. వారు భూమి ఆదాయాన్ని చెల్లించడం కొనసాగించినంత కాలం భూమి వారి ఆధీనంలో కొనసాగుతుంది.[19] 1912 నాటికి రాజ్య భూఆదాయంలో 38% ఖల్సా భూమి నుండి, మిగిలినవి ఇతర వనరుల నుండి లభించింది.[20]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.