![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/7/78/Actress-Amani-Saree-Stills-129ff01.jpg/640px-Actress-Amani-Saree-Stills-129ff01.jpg&w=640&q=50)
ఆమని
నటి / From Wikipedia, the free encyclopedia
ఆమని (జ. నవంబరు 16, 1973) తెలుగు, తమిళ సినిమా నటి.[1] ఈమె ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ సినిమా అత్యంత విజయవంతమైంది.[2]
ఆమని హజరత్ | |
![]() | |
జన్మ నామం | మంజుల |
జననం | (1973-11-16) 1973 నవంబరు 16 (వయసు 50)![]() ఆంధ్రప్రదేశ్ |
భార్య/భర్త | ఖాజా మొహియుద్దీన్ |
ప్రముఖ పాత్రలు | మిష్టర్ పెళ్ళాం శుభలగ్నం |
![TeluguFilmWallpaper AaNaluguru 2004](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/a/a8/TeluguFilmWallpaper_AaNaluguru_2004.jpg/640px-TeluguFilmWallpaper_AaNaluguru_2004.jpg)
బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకొన్నది. ఆ సినిమాలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా నంది బహుమతిని పొందింది.
ఈమె తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహియుద్దీన్ను పెళ్ళి చేసుకొని సినిమా రంగానికి దూరమైంది. అయితే 2003లో రాంగోపాల్ వర్మ చిత్రం మధ్యాహాన్నం హత్యతో ఈమె తిరిగి సినీ రంగప్రవేశం చేసింది. ఈమె భర్త నిర్మించిన చిత్రాలు విజయవంతము కాక ఆర్థిక ఇబ్బందులలో పడి 2005 జూలై 14న అత్మహత్యాప్రయత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులే ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కొంత కారణమని భావిస్తారు[3] ఈమె టి.వి రంగములో కుడా అడుగుపెట్టినది.