సినీ నటి From Wikipedia, the free encyclopedia
అంజలి (English: Anjali) తమిళ సినిమాలలో నటిస్తున్న ఒక భారతదేశ నటీమణి, మోడల్. అంజలి తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామంలో 1986 సెప్టెంబరు 11న జన్మించింది. ఈమెకు ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నైకు మకాం మార్చింది.[1]
ఈమె నటించిన పాత్రల్లో రెండు చిన్న తెలుగు సినిమాలో నటించిన సమయంలో 2007 సంవత్సరంలో కట్రదు తమిళ్ అనే తమిళ సినిమాతో పరిచయమైయ్యారు. ఆనంది అనే పాత్రలో చాలా అద్భుతంగా నటించడంతో ఉత్తమ నూతన నటిగా దక్షిణ ప్రాంత ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 2010లో అంగాడితెరు అనే సినిమాలో కనిగా నటించి ఆ సంవత్సరంలోని ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుల తరువాత అత్యుత్తమ యువ నటిగా తమిళ సినిమా ప్రపంచంలో గుర్తింపు పొందారు,[2] ప్రదర్శన ఆధారిత పాత్రలలో నటిస్తు ప్రసిద్ధి చెందుతున్నారు.[3][4][5]
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు | |
2006 | ఫోటో | స్వప్న | తెలుగు | ||
2007 | ప్రేమలేఖ రస | సంద్య | తెలుగు | ||
కత్తరదు తమిళ్ | ఆనంది | తమిళం | |||
2008 | హొంగనాసు | ఇంపానా | కన్నడ | ||
ఆయుధం సీవోం | మీనాక్షి | తమిళం | |||
2010 | అంగడి తేరు | సెర్మక్కని | తమిళం | ||
రెట్టైసుజి | సుశీల | తమిళం | |||
మాగిజ్చి | కుజాలీ | తమిళం | |||
2011 | పయ్యన్స్ | సీమ | మలయాళం | ||
తూంగా నగరం | కలైవాణి (రాధ/తేరు త్రిష) | తమిళం | |||
కరుంగళి | అముధానిల గుణశేఖరన్ | తమిళం | |||
కో | అంజలి | తమిళం | "ఆగ నాగ" పాటలో ప్రత్యేక పాత్ర | ||
మంకథ | సుచిత్ర సుమంత్ | తమిళం | |||
ఎంగేయుమ్ ఎప్పోతుమ్ | మణిమేగలై రామసామి | తమిళం | |||
తంబి వెట్టోటి సుందరం | లార్డ్ మేరీ | తమిళం | |||
మహారాజా | ప్రియా | తమిళం | |||
2012 | అరవాన్ | వాంచి | తమిళం | అతిధి పాత్ర | |
కలకలప్పు | మాధవి | తమిళం | |||
2013 | సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు | సీత | తెలుగు | ||
వాటికూచి | లీనా | తమిళం | |||
సెట్టై | శక్తి | తమిళం | |||
బలుపు | డా. అంజలి | తెలుగు | |||
సింగం II | అంజలి | తమిళం | "వాలే వాలే" పాటలో ప్రత్యేక ప్రదర్శన | [1] | |
మసాలా | సానియా / సరిత / సావిత్రి (చిత్రం) | తెలుగు | |||
2014 | గీతాంజలి | గీతాంజలి / ఉషాంజలి (ద్వంద్వ పాత్రలు) | తెలుగు | ||
2015 | రాణా విక్రమ | గౌరీ | కన్నడ | ||
సకలకళ వల్లవన్ | అంజలి | తమిళం | |||
శంకరాభరణం | దఖు రాణి మున్నీ | తెలుగు | అతిధి పాత్ర | ||
2016 | నియంత | కాత్యాయిని | తెలుగు | ||
మాప్లా సింగం | శైలజ | తమిళం | |||
సర్రైనోడు | సింతామణి | తెలుగు | "బ్లాక్ బస్టర్" పాటలో ప్రత్యేక ప్రదర్శన | ||
ఇరైవి | పొన్ని | తమిళం | |||
2017 | ఎనక్కు వైత ఆదిమైగల్ | సంధ్య | తమిళం | అతిధి పాత్ర | |
చిత్రాంగద | చిత్రాంగద | తెలుగు | |||
తారామణి | సౌమ్య | తమిళం | అతిధి పాత్ర | ||
బెలూన్ | జాక్వెలిన్ | తమిళం | |||
2018 | రోసాపూ | రేష్మి | మలయాళం | ||
కాళీ | వల్లి | తమిళం | |||
2019 | పేరంబు | విజయ లక్ష్మి "విజి" | తమిళం | ||
లిసా | లిసా | తమిళం | |||
సింధుబాద్ | వెన్బా | తమిళం | |||
2020 | నాడోడిగల్ 2 | సెంగోడి | తమిళం | ||
నిశ్శబ్ధం / | మహా లక్ష్మి "మహా" | తెలుగు | ద్విభాషా చిత్రం | ||
నిశ్శబ్దం | తమిళం | ||||
పావ కదైగల్ | జ్యోతి లక్ష్మి/ ఆది లక్ష్మి | తమిళం | నెట్ఫ్లిక్స్ ఆంథాలజీ; సెగ్మెంట్: లవ్ పన్నా ఉత్తరం | ||
2021 | వకీల్ సాబ్ | జరీనా | తెలుగు | ||
2022 | బైరాగీ | సంగీత ఉపాధ్యాయుడు | కన్నడ | ||
మాచర్ల నియోజకవర్గం | ఆమెనే | తెలుగు | "రా రా రెడ్డి ఐయామ్ రెడీ" సాంగ్ లో స్పెషల్ అప్పియరెన్స్ | ||
2023 | ఇరట్ట | మాలిని | మలయాళం | ||
2024 | గీతాంజలి మళ్ళీ వచ్చింది | గీతాంజలి / ఉషాఅంజలి (ద్విపాత్రాభినయం) | తెలుగు | ||
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి | రత్నమాల | తెలుగు | |||
గేమ్ ఛేంజర్ | తెలుగు |
సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|---|
2021 | నవరస | ముత్తులక్ష్మి | తమిళం | నెట్ఫ్లిక్స్ సిరీస్ విభాగం: తునింత పిన్ | |
2022 | ఝాన్సీ | ఝాన్సీ | తెలుగు | హాట్స్టార్ విడుదల | [6] |
2024 | బహిష్కరణ | తెలుగు | జి 5 తెలుగు వెబ్ సిరీస్ | [7] |
2013, ఏప్రిల్లో హైదరాబాద్లో ఉంటున్న హోటల్ నుంచి ఉన్నట్టుండి మాయమవడంతో కాస్త అలజడి సృష్టించింది అంజలి. తర్వాత పోలీసుల ముందు ప్రత్యక్షం కావడంతో అంతా వూపిరి పీల్చుకున్నారు. పిన్ని భారతీదేవి, దర్శకుడు కలాంజియం కలిసి తనను హింసిస్తున్నారంటూ మీడియాకు తెలిపింది. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.