ఆసియాలోని పర్వత శ్రేణి From Wikipedia, the free encyclopedia
హిమాలయాలు లేదా హిమాలయా పర్వతాలు (ఆంగ్లం : Himalaya Range) (సంస్కృతం : हिमालय,), లేదా ఆసియా లోని హిమాలయ పర్వతా పంక్తులు. ఈ పర్వత పంక్తులు భారత ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమిని వేరుచేస్తున్నాయి. ఈ పర్వత పంక్తులలో కారాకోరం, హిందూకుష్, తోబా కాకర్, చిన్న పర్వతశ్రేణులైన పామిర్ కోట్ వరకూ వ్యాపించి ఉన్నాయి. హిమాలయాలు అనగా సంస్కృతంలో "తత్పురుష" లేదా మంచుకు నెలవు.[1]
ఈ పర్వత పంక్తులు, ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిలో ఎవరెస్టు పర్వతం, కాంచనగంగ మొదలగు శిఖరాలున్నాయి. సుమారు నూరు శిఖరాలు 7,200 మీటర్ల ఎత్తుకు మించివున్నవి.[2]
ఈ హిమాలయాలు, ఆసియా లోని ఐదు దేశాలలో వ్యాపించి వున్నవి : భూటాన్, చైనా, భారతదేశం, నేపాల్, పాకిస్తాన్. ఇవి ప్రపంచంలోని అతి పెద్దనదులలో మూడు అయిన సింధు, గంగ-బ్రహ్మపుత్ర, యాంగ్ట్జీ నదులకు వనరులు. వీటి పరీవాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా ఉంది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కి.మీ.ల పొడవూ, 400 కి.మీ. వెడల్పు ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి.
శిఖరం పేరు | ఇతర పేర్లు, అర్థం | ఎత్తు (మీటర్లు) | ఎత్తు (అడుగులు) | మొదటి అధిరోహణ | వ్యాఖ్యలు/గమనికలు | అక్షాంశరేఖాంశాలు[3] |
---|---|---|---|---|---|---|
ఎవరెస్టు శిఖరం | సాగర్ మాతా, "ఆకాశ నుదురు", చోమోలాంగ్మా, "విశ్వమాత" | 8,848 | 29,029 | 1953 | ప్రపంచంలోని ఎత్తైన పర్వతం, నేపాల్/టిబెట్ సరిహద్దులో గలదు. | 27°59′17″N 86°55′31″E |
కే-2 | చోగో గాంగ్రి | 8,611 | 28,251 | 1954 | ప్రపంచంలోని 2వ ఎత్తైన పర్వతం, ఆజాద్ కాశ్మీరు, పాకిస్తాన్, చైనాలోని జింజియాంగ్ లో గలదు. | 35°52′53″N 76°30′48″E |
కాంచనగంగ | కాంగ్చెన్ డ్జోంగా, "మంచు యొక్క ఐదు ఖజానాలు" | 8,586 | 28,169 | 1955 | ప్రపంచములోని 3వ ఎత్తైన శిఖరం. సిక్కిం (భారత్), నేపాల్ లో గలదు. | 27°42′12″N 88°08′51″E * |
లోట్సే | "దక్షిణ శిఖరం" | 8,516 | 27,940 | 1956 | ప్రపంచంలోని 4వ ఎత్తైన శిఖరం. నేపాల్, టిబెట్ ల మధ్యలో గలదు, ఎవరెస్టు ఛాయలో గలదు | 27°57′42″N 86°55′59″E |
మకాలూ | "మహా నల్లనిది (The Great Black)" | 8,462 | 27,765 | 1955 | ప్రపంచలోని 5వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. | 27°53′23″N 87°5′20″E |
చో ఓయు | ఖోవోవుయాగ్, "నీలి (టర్కోయిస్ ఊదా రంగు) దేవత" | 8,201 | 26,905 | 1954 | ప్రపంచలోని 6వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. | 28°05′39″N 86°39′39″E |
ధవళగిరి | "తెల్లని పర్వతం" | 8,167 | 26,764 | 1960 | ప్రపంచలోని 7వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు. | 28°41′48″N 83°29′35″E |
మానస్లూ | కుటాంగ్, "ఆత్మ పర్వతం" | 8,156 | 26,758 | 1956 | ప్రపంచలోని 8వ ఎత్తైన శిఖరం. గూర్ఖా హిమాల్, నేపాల్ లో గలదు. | 28°33′00″N 84°33′35″E |
నంగా పర్వతం | దయామీర్, "నగ్న పర్వతం" | 8,126 | 26,660 | 1953 | ప్రపంచలోని 9వ ఎత్తైన శిఖరం. భారత్/పాకిస్తాన్ లో గలదు. | 35°14′14″N 74°35′21″E |
అన్నపూర్ణ | "పంటల దేవత" | 8,091 | 26,545 | 1950 | ప్రపంచలోని 10వ ఎత్తైన శిఖరం. మృత్యుకర పర్వతం. నేపాల్ లో గలదు. | 28°35′44″N 83°49′13″E |
గాషెర్బ్రమ్ I | "అందమైన పర్వతం" | 8,080 | 26,509 | 1958 | ప్రపంచలోని 11వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు. | 35°43′28″N 76°41′47″E |
విశాల శిఖరం | ఫైచాన్ కాంగ్రి | 8,047 | 26,401 | 1957 | ప్రపంచలోని 12వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు.. | 35°48′38″N 76°34′06″E |
గాషెర్బ్రమ్ II | - | 8,035 | 26,362 | 1956 | ప్రపంచలోని 13వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు.. | 35°45′28″N 76°39′12″E |
షిషాపాంగ్మా | జిజియాబాంగ్మా, "గడ్డిమైదానాలపై ఎత్తుప్రాంతం" | 8,013 | 26,289 | 1964 | ప్రపంచలోని 14వ ఎత్తైన శిఖరం. టిబెట్ లో గలదు.. | 28°21′12″N 85°46′43″E |
గాషెర్బ్రమ్ IV | - | 7,925 | 26,001 | 1958 | ప్రపంచలోని 17వ ఎత్తైన శిఖరం. అత్యంత సాంకేతిక అధిరోహణ. కారాకోరమ్ పాకిస్తాన్/చైనాలో గలదు. . | 35°45′38″N 76°36′58″E |
మషేర్బ్రం / K1 | మషెర్బ్రమ్ | 7,821 | 25,660 | 1960 | ప్రపంచలోని 22వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు. . | 35°38′28″N 76°18′21″E |
నందా దేవి | "ఆశీర్వదించు-దేవత" | 7,817 | 25,645 | 1936 | ప్రపంచలోని 23వ ఎత్తైన శిఖరం. భారత్ లోని ఉత్తరాఖండ్లో గలదు.. | 30°22′33″N 79°58′15″E |
రాకాపోషి | "మెరిసే కుడ్యము" | 7,788 | 25,551 | 1958 | శిఖరాల సముదాయము. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు. . | 36°08′33″N 74°29′22″E |
గాంగ్ఖర్ పుయెన్సుమ్ | గాంకర్ పుంజుమ్, "మూడు సోదర పర్వతాలు" | 7,570 | 24,836 | అధిరోహించలేదు | ప్రపంచంలో అధిరోహించని ఎత్తైన శిఖరం. భూటాన్లో గలదు.. | 28°02′50″N 90°27′19″E * |
అమా దబ్లామ్ | "తల్లి , ఆమె నెక్లేస్" | 6,848 | 22,467 | 1961 | ప్రపంచంలోనే చాలా అందమైన శిఖరం. నేపాల్ లోని ఖుంబూలో గలదు. . | |
హిమాలయాలలో హిందూ, బౌద్ధ ధర్మాలకు చెందిన అనేక ధార్మిక ప్రదేశాలు గలవు. హిందూ ధర్మంలో హిమవత్ శివుని భార్యయైన పార్వతి యొక్క తండ్రి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.