Remove ads
భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ఉన్న హిందూ దేవాలయం From Wikipedia, the free encyclopedia
అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. ఈ గుడి భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో ఉంది. హిమాలయాల్లో దక్షిణ కశ్మీర్ కొండల్లో 3,888 మీటర్ల ఎత్తులో జమ్మూ కాశ్మీర్ రాజధానికి 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి. హిందువులకు ఈ పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు వారు.[1][2] ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి అమర్నాథ్ కొండలు. ఆ కాలంలోనే వేలల్లో భక్తులు కొండలు ఎక్కి అమర్నాథ్ గుహను చేరుకుంటారు. ఈ గుహలో ఉండే శివుడు మంచు రూపంలో ఉంటాడు. ఈ మంచు శివలింగాన్ని చూసేందుకు ఎన్నో సవాళ్ళతో కూడిన ప్రయాణం చేస్తారు భక్తులు.
40మీటర్ల ఎత్తుండే అమర్నాథ్ గుహ లోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచు గడ్డ కడుతుంది.[3] పంచ భూతాల రూపాల్లో శివుడు ఉంటాడనే హిందువుల నమ్మకం. అందుకే ఇక్కడ శివుడు జలరూపంలో ఉన్నాడని భక్తులు అంత శ్రమకోర్చీ ఈ పుణ్యక్షేత్రానికి వస్తారు. మే నుంచి ఆగస్టు వరకు హిమాలయాలలో మంచు కరగడం వల్ల ఈ పుణ్యక్షేత్రం మంచు నుంచి బయటకు వచ్చి, సందర్శనకు వీలుగా ఉంటుంది.[4] ఈ లింగం వేసవిలో చంద్రుని కళల ప్రకారం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుందని విశ్వసిస్తారు హిందువులు.[5]
హిందూ పురాణాల ప్రకారం తన భార్య పార్వతీ దేవి కి ఈ గుహ దగ్గరే జీవితం గురించి వివరించాడని ప్రతీతి.[6][7] ఇక్కడ ఉండే మరో రెండు మంచు ఆకారాలు పార్వతీదేవి, వినాయకునిగా భక్తులు కొలుస్తారు.
ఈ గుహలో ఏర్పడే మంచు లింగాన్ని దర్శించేందుకే ప్రతీ సంవత్సరం అమర్నాథ్ యాత్ర చేస్తుంటారు భక్తులు.
300 బిసికి చెందిన రాజు ఆర్యరాజా ఈ లింగాన్ని అర్చించినట్టు చెబుతారు. కాశ్మీర రాజుల కథలను వివరించే రాజతరింగిణి పుస్తకంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. రాణి సూర్యమతి అమరనాథ్ స్వామికి త్రిశూలం, బాణలింగాలు సమర్పించినట్టు ఈ పుస్తకంలో వివరించారు.[8] ప్రజయభట్టుడు రాసిన రాజవ్లిపతకాలో కూడా అమర్నాథ్ యాత్ర గురించి వివరించారు. ప్రాచీన గ్రంధాల్లో ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి ఇంకా ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి.
మధ్యయుగంలో ఈ క్షేత్రం గురించి మర్చిపోయినట్టూ, తిరిగి ఒక గొర్రెల కాపరి 15వ శతాబ్దం లో తిరిగి కనుక్కున్నట్టు ఒక నమ్మకం.[8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.