అక్బర్ చక్రవర్తి భార్య. జోధాబాయిగా ప్రాముఖ్యం From Wikipedia, the free encyclopedia
మరియం - ఉజ్ - జమానీ (హీరా కుంవరి, హిరా కుంవర్ లేక హర్కా భాయి) (1542 అక్టోబరు 1 - 1623 మే 19) మొఘల్ చక్రవర్తినిగా ప్రఖ్యాతి గాంచింది. అక్బర్ చక్రవర్తికి ఆమె మొదటి రాజపుత్ర భార్య. అలాగే ఆమె అక్బర్ చక్రవర్తికి ప్రధాన రాజపుత్ర భార్యగా బాధ్యత వహించింది. ఆమె భష్యత్తు మొఘల్ చక్రవర్తి జహంగీర్‌కు జన్మ ఇచ్చింది. ].[4][5][6] మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు నాయనమ్మ.[7] మహోన్నతమైన మొఘల్ పాలనలో అక్బర్, జహంగీర్ మరియం- ఉజ్- జమాని రాజమాతగా గౌరవించబడింది.[8][9] అక్బర్ చక్రవర్తి, జహంగీర్ కాలంలో ఆమె చక్రవర్తినిగా గౌరవించబడింది. ఆమె 1562 ఫిబ్రవరి 6 నుండి 1605 అక్టోబరు 27 దాదాపు 43 సంవత్సరాలు చక్రవర్తినిగా ఉంది. అత్యధికకాలం చక్రవర్తినిగా ఉన్న మొఘల్ చక్రవర్తినిగా ఆమెకు ప్రత్యేకత ఉంది.
Rajkumari Heer Kunwari | |
---|---|
మొఘల్ మహారాణి "మరియం - ఉజ్- జమానీ " | |
పరిపాలన | ఫిబ్రవరి 6 1562 – 27 అక్టోబర్ 1605 |
జననం | అక్టోబర్ 1, 1542 అమర్ |
మరణం | మే 19, 1623 (వయసు 81)[1][2] Agra, India[3] |
Burial | |
చక్రవర్తిని | అక్బర్ |
వంశము | హాసన్ - హుస్సైన్ (మరణించిన కవలలు. కారణం మర్మం).జహంగీర్ , దనియా రాజకుమారుడు |
House | అమర్ కోట |
తండ్రి | రాజా భర్మల్ |
మతం | హిందూమతం |
ఆమె అక్బర్‌ను వివాహం చేసుకోవడం అక్బర్ జీవితంలో రాజకీయ, సాంఘిక జీవితంలో పెనుమార్పులు తీసుకువచ్చింది. [10] మొఘల్ చరిత్రలో అక్బర్ రాజకుమారి హీర్ కుంవరి వివాహం ప్రాధానన్యత కలిగిన సంఘటనగా నిలిచింది. ఆమె ఆధునిక చరిత్రలో అత్యధికంగా గౌరవించబడింది. ఆమె శ్రేష్ఠమైన అక్బర్, మొఘలుల మతసహనానికి, భిన్న సంప్రదాయాలకు చిహ్నంగా గుర్తించబడింది. .[11]
హీర్ కుంవర్ (హీరా భాయి, జోధాభాయి) అని పిలువబడింది. ఆమె రాజపుత్ర రాకుమారిగా జన్మించింది. ఆమె రాజా భర్మల్ (జయపూర్) పెద్ద కుమార్తెగా జన్మించింది., [4][6][12][13] ఆమె తండ్రి అమర్ కోటను రాజధానిగా చేసుకుని జయపూర్‌ను పాలించాడు. ఆమె రాజా ప్రిధ్వి సింగ్ (అనర్) మనుమరాలు. ఆమె సోదరుడు భగవంత్ దాస్ (అమర్). ఆమె మాన్ సింగ్‌కు (అమర్) అత్త.[13] మాన్ సింగ్ అక్బర్ సభలోని నవరత్నాలలో ఒకడుగా ఉన్నాడు. తరువాత అక్బర్ సభలో ఉన్నత పదవుని అలంకరించాడు.
అక్బర్ హీర్ కుంవర్ వివాహం అనుకూల ఫలితాలను ఇచ్చింది. ఇది అక్బర్ హిందూయిజం, హిందువులకు అనుకూలంగా మారడానికి సహకరించింది. .[14] అక్బర్ హీర్ కుంవర్ వివాహం రాజకీయ కూటమి కారణంగా 1562 ఫిబ్రవరి 6న జయపూర్ సమీపంలోని సంభర్ వద్ద జరిగింది. మరియం - ఉజ్ - జమాని (మరియం) మొఘల్ సామ్రాజ్యానికి వారసుడికి జన్మ ఇచ్చింది. హీరా కుంవర్ అక్బర్ రాజపుత్ర భార్యలపై ఆధిపత్యం వహించింది. ఆమె ప్రధాన హిందూ మొఘల్ రాణిగా గౌరవించబడింది. అక్బర్‌కు హీర్ కుంవర్ కాక మరొక ఇద్దరు రాజపుత్ర భార్యలు ఉన్నారు.[15] హీర్ కుంవర్ వివాహం తరువాత కూడా హిందువుగా ఉంది. ఆమె " మరియం - ఉజ్ - జమాని "గా గౌరవించబడింది. ఆమె హిందువుగా మొఘల్ రాజకుటుంబంలో గౌరవాభిమానాలు చూరగిన్నది.
1569 ఆరంభంలో అక్బర్ తన మొదటి హిందూ భార్య హీర్ కుంవర్ గర్భవతి అయిందన్న వార్త విని ఆనందించాడు. సిక్రీలో ఉన్న అక్బర్ గురువు షేక్ సలీం చిస్ట్ అక్బర్‌కు జన్మించనున్నారని చెప్పిన ముగ్గురు కుమారులలో మొదటి కుమారునికి హీరా కుంవర్ జన్మ ఇచ్చింది. హీరా కుంవర్ గర్భసమయంలో సిక్రీలో ఉన్న షేక్ ఆశ్రమంలో నివసించింది. 1569 ఆగస్ట్ 30 న హీర్ కుంవర్కు కుమారుడు జన్మించాడు. కుమారుడునికి సలీం అని నామకరణం చేయబడింది. అక్బర్‌కు తన గురువు మీద ఉన్న భక్తిశ్రద్ధలకు గుర్తుగా కుమారునికి సలీం అని నామకరణం చేయబడింది. గురువు ప్రార్థన ఫలితంగా కుమారుడు జన్మించాడని అక్బర్ విశ్వసించాడు.
[16] ఆమె " మరియం - ఉజ్ - జమాని " (డ్వెల్లింగ్ విత్ మేరీ) బిరుదు కొన్ని సార్లు అయోమయానికి గురిచేస్తుంది. అక్బర్ తల్లి హమీదా బాను బేగం (మరియం మకాని అంటే మేరీతో నివసించడం) [13] మరియం - ఉజ్ - జమానీ బిరుదుతో హీర్ కుంవర్కు " వాలి నిమత్ బేగం " (బంగారు కానుక) అనే బిరుదు కూడా ఉంది. ఆమెకు ఈ బిరుదులు జీవితపర్యంతం ఉన్నాయి. ఈ బిరుదులను ఉపయోగించి అధికారిక దస్తావేజులు కూడా తయారుచేయబడ్డాయి.
[17] అక్బర్ రాజపుత్ర స్త్రీలను వివాహం చేసుకోవడం ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభావితం చూపింది.. [13][18][19][20] ఆమె అక్బర్ మొదటి, చివరి అభిమానురాలుగా గుర్తించబడింది. తరువాత హిందూరాజులలో ముస్లిం పాలకులకు కుమార్తెలను ఇవ్వడం అనే ఆచారం మొదలైంది. అయినప్పటికీ పలు శతాబ్ధాల తరువాతకూడా సామాన్యకుటుంబాలలో ఈ సంప్రదాయం కొనసాగలేదు. అక్బర్ అంబర్ రాజకురిని వివాహం చేసుకోవడం మతప్రాదికత మీద వివాహాలు చేసుకునే ఆచారానికి అంకురార్పణ జరిగింది.
[4] అమర్ రాజకుమార్తెను వివాహం చేసుకోవడం. ఆమె కుటుంబానికి శక్తివంతమైన రక్షణ కలిగించింది. అలాగే అక్బర్‌కు హిందువులు, హిందువుల మధ్య బాద్షా, షహన్షా అనే గుర్తింపు లభించింది. [13] అక్బర్ ఇతర రాజపుత్ర రాజకుమార్తెలను వివాహం చేసుకున్నాడు. చక్రవర్తి కుటుంబంతో సంబంధం కారణంగా రాజాలు ప్రయోజనాలు పొందారు. రాజపుత్రులను గౌరవిస్తూ అక్బర్ ఇలాంటి వివాహాలు చేసుకున్నాడు. .[21] ఆమె అన్నకుమార్తె, మేనకోడలు మంభవాతి భాయి (మన్మాతి భాయి) ని 1585 ఫిబ్రవరి 13న రాజకుమారుడు సలీం వివాహం చేసుకున్నాడు. మన్ భాయి ఖుస్రౌ మిర్జాకు జన్మ ఇచ్చింది.[22][23] జహంగీర్ ఆమెకు " షాహ్ బేగం " అనే బిరుదిచ్చి సత్కరించాడు.[24] జహంగీర్ తన తల్లి పాదాలకు నమస్కరించి ఆమె పట్ల వినయవిధేయతలు ప్రదర్శించాడు. అది జహంగీర్ తనపుస్తకాలలో సహర్వంగా వ్రాసుకున్నాడు. జహంగీర్ తన తల్లిని " హజ్రత్ " అని పిలిచేవాడు. అది చ్క్రవర్తిగా జహంగీర్‌కు మాత్రమే అలవాటైన పిలుపు.
[25] ఈ మర్యాదలు జహంగీరుకు తల్లి పట్ల ఉన్న ప్రేమాభిమానాలను తెలియజేస్తుంది. మరియం - ఉజ్ - జమానీ నివాసంలో చక్రవర్తి జహంగీర్ ఆధ్వర్యంలో పలు ఉత్సవాలు జరిగేవి. [26] జహంగీర్ జగత్ సింగ్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు.[27] ముహమ్మద్ పర్వీజ్ సుల్తాన్ మురద్ మిర్జా కుమార్తెను వివాహం చేసుకున్నాడు.[28]
అక్బర్ హిందూమతం ఆంటే అభిమానం అభివృద్ధి చేసాడు. ఆయన తన భార్య హిందువులా ఉండాడానికి, భార్య హిందూ సంప్రదాయాన్ని అనుసరించడానికి అనుమతించాడు. [4][29] సాధారణంగా సుల్తాన్ కుటుంబాలలో ఇది సాధ్యపడదు. అక్బర్ ఆమెను హిందువులా ఉండాడానికి అనుమతించాడు. ఆమె రాజభవనంలో హిందూ ఆలయం నిర్వహించింది. అక్బర్ స్వయంగా హీరా కుంవర్ నిర్వహించే పూజలలో పల్గొనేవాడు. [4] ఆమె కృష్ణభక్తురాలు. ఆమె భవనం కృష్ణుని చిత్రాలతో నిండిఉంటుంది. ఆమె జీవితమంతా హిందువుగా గడిపింది. ఆమె మరణించిన తరువాత ఆమె కోరినట్లు అక్బర్ సమాధి సమీపంలో సమాధి చేయబడింది.
హీరా కుంవర్ను వివాహం చేసుకున్న తరువాత అక్బర్ రాజపుత్రుల పట్ల స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలలో ఇది ప్రధాన పాత్ర వహించింది.[30] వివాహం అక్బర్‌కు రాజకీయంగా హీరా కుంవర్ కుటుంబం నుండి బధ్రత కలిగించింది. వారు ఆయనకు ప్రధాన రాజకీయ సలహాదారులుగా ఉన్నారు. [14]
హిరా కుంవర్ను వివాహం చేసుకున్న తరువాత అక్బర్ హిరా కుంవర్ మేనల్లుడు మాన్సింగ్ను రాజా భారమల్ సొంహాసనానికి వారసునిగా ప్రకటించాడు. అలాగే తన రాజ సభలో సమున్నత పదవినిచ్చి సత్కరించాడు.[14] భగవంత్ దాస్‌కు కూడా రాజ్యసభలో తగిన పదవి ఇవ్వబడ్జింది.[30] తరువాత వారిరువురు అక్బర్ సభలో అత్యున్నత పదవులను చేపట్టారు. [13] వివాహం తరువాత మొఘల్ సామ్రాజ్యంతో వివాహసంబంధాల వలన ప్రత్యేకంగా అమర్ రాజులు ప్రయోజనం పొందారు. వారు విస్తారమైన సంపద, అధికారాలను పొందారు. అబుల్ ఫజ్ జాబితాలోని 27 రాజపుత్ర మంసబ్దార్లలో 13 అంబర్ వంశస్థులు ఉన్నారు. వారిలో కొందరు రాజకుమారులకు సమానమైన అంతస్తును అందికున్నారు. భగవంత్ దాస్ 5,000 సైనికుల దళానికి అధ్యక్షత వహించాడు. ఆ సమయంలో అది అత్యున్నత పదవిగా భావించబడింది. అంతేకాక ఆయన అమీర్- ఉల్- ఉమరా బిరుదును కూడా అందుకున్నాడు. ఆయన కుమారుడు మాన్సింగ్ అంతకంటే అధికంగా 7,000 మంది సైనికులు కలిగిన సైన్యానికి అధ్యక్షత వహించాడు. [31] ఈ అధికారాలు రాజకుమారులను తప్ప మిగిలిన వారిని ఆనందపరచలేదు. ఈ వివాహం మొఘల్ చక్రవర్తికి, అమర్ రాజ్యానికి చెందిన కచవా రాజపుత్రులకు ప్రయోజనం కలిగించింది. అక్బర్ అమర్ రాజ్య రాజులను గౌరవిస్తూ తనకుమారులలో ఒకరైన దనియా రాజకుమారుని రాజా భారమల్ కుటుంబంలో ఉండడానికి అనుమతించాడు. .[32]
మరియం- ఉజ్- జమానీ చాలా సూక్ష్మ బుద్ధి కలిగిన వ్యాపారదక్షత కలిగిన మహిళ. పట్టు, సుగంధ ద్రవ్యాలు మొదలైన అంతర్జాతీయ వాణిజ్యంలో ఆమె క్రియాశీలక పాత్ర వహించింది. [33] అమె మంచి వ్యాపారవేత్తగా వ్యవహరించింది. [34] మొఘల్ సభలో ఆమె అద్భుత వ్యాపారవేత్తలలో ఒకరుగా రాణించింది. .[35] రాజమాత లాగా మరే ఉన్నత వంశమహిళ వ్యాపారవేత్తగా నమోదుచేయబడ లేదు. [36] మరియం జమానీకి స్వంతమైన నౌకలు యాత్రీకులను పవిత్ర నగరం మక్కాకు తీసుకుపోతూ ఉండేవి. 1603లో ఆమె నౌక " రహీమి "ను 600- 700 మంది ప్రయాణీకులు, వస్తుసామాగ్రితో పోర్చుగీస్ దోపిడీ దారులు దోచుకున్నారు. రహిమీ ఎర్ర సముద్రం మీద ప్రయాణించే భారీ భారతియ నౌక. ఇది గొప్ప యాత్రీకుల నౌక అని యురేపియన్లకు తెలుసు. పోర్చుగీసులు నౌకను, యాత్రీకులను తిరిగి అప్పగించడానికి నిరాకరించినందుకు మొగల్ కోర్టులో ఆక్రందనలు మిన్నంటాయి. ఇది రాజమాతకు అవమానకరం అయింది. మొఘల్ రాజమాత అవమానం ఆమె ప్రియపుత్రుడు, మాతృభక్తుడు అయిన జహంగీరుకు అవమానం అయింది. ఆగ్రహించిన జహంగీర్ పోర్చుగీస్ పట్టణం డామన్ మీద దాడి సాగించాడు. ఇది సంపద కొరకు సాగిన పోరాటానికి చొహ్నంగా భావించవచ్చు. ఈ సంఘటన భవిష్యత్తులో భారతదేశంలో కాలనీ ప్రభుత్వాల స్థాపనకు నాంది అయింది. [37]
"Mariam-uz-Zamani was granted the right to issue official documents (singularly called farman), usually the exclusive privilege of the emperor."
ఆమె మొఘల్ సామ్రాజ్య సభలోని 4 సభ్యులలో ఒకరు. మరొకరు చక్రవర్తి. 12,000 సైన్యం కలిగిన ఒకే ఒక మహిళగా కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది., [39] అలాగే ఆమె కొత్తసంవత్సరం సంబరాల సమయంలో ప్రముఖుల నుండి ఆభరణాలను కానుకగా అందుకునేది. .[35] మొఘల్ సభలో అధికారపత్రాలను (ఫర్మన్ అంటారు) జారీచేసే అధికారం ఉన్న మహిళలలో ఆమె ఒకరుగా ఆమెకు ప్రత్యేకత ఉంది. ఇలా అధికారపత్రాలను జారీచేయకలిగిన ప్రముఖ మొఘల్ అంతఃపుర స్త్రీలలో మొగల్ హారెం, హమీదా బాను బేగం, మరియం ఉజ్ జమానీ, నూర్జహాన్, ముంతాజ్ మహల్, నదీరా బాను, జహనారా బేగం మొదలైన వారు ఉన్నారు. [35][38][40] మరియం జమానీ నూర్జహాన్ తమ సంపదను, పలుకుబడిని ఉపయోగించి పూదోటలు, బావులు, మసీదులు నిర్మించజేసారు.. [35][41]
మరియం - ఉజ్ - జమాని 1623లో మరణించింది.[1] మరణానంతరం కూడా ఆమె కోరిక అనుసరించి తన భర్తకు సమీపంలో సమాధి చేయబడింది. అక్బర్ భార్యలలో ఆమె మాత్రమే అక్బర్ ప్రక్కన సమాధి చేయబడింది. ఆమె ఫతేపూర్ సిక్రీలో సమాధి చేయబడింది.[42] ఆమె చివరి కోరికగా ఆమె కుమారుడు జహంగీర్ చక్రవర్తి ఆమె కొరకు ఒక మెట్లబావి (వావ్) నిర్మించాడు. ఆమె సమాధి నుండి కూడా బావిలోకి మెట్ల మార్గం ఉందని విశ్వసిస్తున్నారు. ఆమె సమాధి 1623-27 మధ్య ప్రస్తుత తాంత్పూర్ రోడ్డు సమీపంలో నిర్మించబడింది. Jyoti Nagar. ఆమె వివాహం తరువాత కూడా హిందూగానే ఉంది. అయినప్పటికీ ఆమె భౌతిక శరీరం మాత్రం ముస్లిం సంప్రదాయం అనుసరించి భర్త సమాధి సమీపంలో నిర్మించబడింది. మరియం సమాధి అక్బర్ సమాధికి ఒక కి.మీ దూరంలో ఉంది. పర్యాటక ఆకర్షణ కొరకు సమాధి ప్రదేశం దగ్గర చేయబడినప్పటికీ అసలైన సమాధి ఇప్పటికీ మరామత్తులు చేయవలసిన స్థితిలో ఉంది. [43] తరువాత హీరా కుంవర్ సమాధి ఆర్కియాలజీ శాఖ నిర్వహణలోకి తీసుకుని దానిని గౌరవనీయంగా నిర్వహిస్తుంది.[43]
మరియం - ఉజ్ - జమానీ సమాధి మీద ఉన్న ఫలకం మీద ఆర్కియాలజీ శాఖ " అక్బర్‌ను వివాహం చేసుకున్న అంబర్ రాజకుమార్తె" అని వ్రాసింది. [43] సమాధిలో నిర్మాణంలో ఒక ఆసకతికరమైన విషయం ఉంది. ఈ సమాధికి ప్రవేశద్వారం ఉన్నట్లే వెనుక వైపు నిర్మాణం ఉంటుంది. మిగిలిన మొఘల్ సమాధిలలో వెనుకవైపు డమ్మీ ద్వారం ఉంటుంది.[43] మరియం - ఉజ్ - జమానీ పేరు మీద ఆమె కుమారుడు జహంగీరు ఆమె గౌరవార్ధం మరియం - ఉజ్- జమానీ మసీదును నిర్మించాడు. అది లాహోరు నగరంలో (ప్రస్తుతం ఇది పాకిస్థాన్) నిర్మించబడింది. లహోర్ నగరంలో నిర్మిచబడిన మొదటి మసీదుగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుత పాకిస్థాన్ యాత్రీకులకు ప్రధాన యాత్రా గమ్యాలలో ఇది ఒకటి.
అక్బర్ భార్య, జహంగీర్ తల్లి పేరు జోధాభాయిగా ఎక్కడా పేర్కొనబడలేదు. [44] మొఘల్ చరిత్రలో ఆమెను మరియం - ఉజ్ - జమానీగా పేర్కొన్నారు. జహంగీర్ ఆత్మకథలో ఆమె పేరు తుజ్- ఇ- జహంగిరి జోధాభాయిగా కాని హీరాకుంవర్గా కాని హీర్ కుంవరీగా కాని పేర్కొనలేదు..[44] Therein, she is referred to as Mariam-uz-Zamani.[45] అక్బర్ స్వయంగా వ్రాసిన అక్బర్ ఆత్మకథ అక్బర్ నామా కాని మరే చారిత్రక వ్రాతలలో కాని ఆమెను జోధాభాయిగా పేర్కొనలేదు.
.[45] అలిఘర్ ముస్లిం విడ్వవిద్యాలయానికి చెందిన చరిత్రకారుడు " అక్బర్ భార్య జోధాభాయి అనే పేరు 18-19 వ శతాబ్దం నుండి వాడుకలో ఉందని భావిస్తున్నాడు. .[45] పాట్నాలోని " కుదా భక్షా ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ " డైరెక్టర్, చరిత్రకారుడూ ఇంతియాజ్ అహ్మద్ " జోధాభాయి అనే పేరును మొదటిసారిగా లెఫ్టినెంటు కల్నల్ తన " అన్నల్స్ అండ్ ఏంటిక్వీస్ ఆఫ్ రాజస్థాన్" పుస్తకంలో మొదటి సారిగా పేర్కొన్నాడని భావిస్తున్నాడు. [12] అక్బర్ నామాలో అక్బర్ వివాహం చేసుకున్న రాజపుత్ర స్త్రీ పేరు జోదాభాయి కాదని కూడా డైరెక్టర్, చరిత్రకారుడూ ఇంతియాజ్ అహ్మద్ భావిస్తున్నాడు. ఆమె మరియం - జమానీగా పిలువబడిందని అయినప్పటికీ అది బిరుదు మాత్రమే అని అది ఆమె పేరు కాదని ఆయన భావన.చక్రవర్తి జహ్ంగీరుకు ఆమె జన్మ ఇచ్చినందున ఆమెకు ఈ గౌరవనామం ఇవ్వబడిందని ఆయన భావించాడు. అయినప్పటికీ ఎక్కడా జోదాభాయి పేరు పేర్కొనబడలేదు. .[12] అలహాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఎన్.ఆర్ ఫరూక్ అభిప్రాయంలో " జోదాభాయి అక్బర్ భార్య పేరు కాదని, ఇది జహంగీర్ భార్య " తాజ్ బీబీ బిల్క్విస్ మకాని " పేరు అని భావించాడు. జహంగీర్ జోధ్‌పూర్ రాకుమారుని వివాహం చేసుకున్నాడు. ఆమె అసలు పేరు " జగత్ గొసైన్ " [44]
[47] అనార్కలి(1955)తెలుగు చిత్రం,ఇందులో ఆమె పేరు జోధ్ బాయి అని ప్రస్తావించారు,ఇందులో జోధాబాయిగా కన్నాంబగారు నటించారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.