From Wikipedia, the free encyclopedia
సెనెగల్ [2][3] అధికారిక నామం: రిపబ్లిక్ ఆఫ్ సెనెగల్. ఇది పశ్చిమ ఆఫ్రికా లోని ఒక దేశం. దీని పశ్చిమసరిహద్దులో అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరసరిహద్దులో మౌరిటానియ, తూర్పుసరిహద్దులో మాలి, దక్షిణసరిహద్దులో గినియా, గినియా-బిస్సావులు ఉన్నాయి. దేశవైశాల్యం 1,97,000 చ.కి.మీ., జనసంఖ్య 1,17,00,000. దీని రాజధాని డకార్ నగరం. గాంబియా నది ఒడ్డున సెనగల్ దేశానికి చెందిన సన్నని చీలిక వంటి భూభాగం సెనగల్ దక్షిణప్రాంతంలోఉన్న కసామన్సు ప్రాంతాన్ని మిగిలిన దేశం నుండి విడదీస్తుంది. సెనెగల్ కేప్ వెర్డేతో సముద్ర సరిహద్దును పంచుకుంటుంది. సెనెగల్ ఆర్ధిక, రాజకీయ రాజధాని డాకర్.
République du Senegal రిపబ్లిక్ ఆఫ్ సెనెగల్ |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం "Un Peuple, Un But, Une Foi" (French) "One People, One Goal, One Faith" |
||||||
జాతీయగీతం |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | డకార్ 14°40′N 17°25′W | |||||
అధికార భాషలు | ఫ్రెంచ్ | |||||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | Wolof (spoken by 94 percent) | |||||
ప్రజానామము | Senegalese | |||||
ప్రభుత్వం | Semi-presidential republic | |||||
- | President | Abdoulaye Wade | ||||
- | Prime Minister | Cheikh Hadjibou Soumaré | ||||
Independence | ||||||
- | from France | 20 ఆగస్టు 1960 | ||||
- | జలాలు (%) | 2.1 | ||||
జనాభా | ||||||
- | 2005 అంచనా | 11,658,000 (72వది) | ||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $20.688 billion[1] | ||||
- | తలసరి | $1,692[1] | ||||
జీడీపీ (nominal) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $11.183 billion[1] (112వది) | ||||
- | తలసరి | $914[1] (137వది) | ||||
జినీ? (1995) | 41.3 (medium) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2008) | 0.502 (medium) (153వది) | |||||
కరెన్సీ | CFA franc (XOF ) |
|||||
కాలాంశం | UTC | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .sn | |||||
కాలింగ్ కోడ్ | +221 |
సమైఖ్య పాక్షిక ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ ఓల్డు వరల్డు (ఆఫ్రో-యురేషియా) పశ్చిమాంత దేశంగా ఉంది.[4] తూర్పు, ఉత్తర సరిహద్దులుగా ఉన్న సెనెగల్ నది పేరు కారణంగా దేశానికి సెనగల్ అనే పేరు వచ్చింది. సెనెగల్ దాదాపుగా 1,97,000 చ.కి.మీ. వైశాల్యం కలిగి ఉంది. దేశజనసంఖ్య దాదాపు 15 మిలియన్లుగా అంచనా వేయబడింది. వర్షాకాలం ఉన్నప్పటికీ దేశంలో సాహిలియను వాతావరణం ఉంటుంది.
ఆధునిక సెనెగల్ భూభాగంలో చరిత్ర పూర్వం నుండి వివిధ జాతులకు చెందిన ప్రజలు నివసించారు. రాజ్యాలు 7 వ శతాబ్దం ప్రాంతంలో నిర్వహిత రాజ్యాలు ఉద్భవించాయి. దేశంలోని కొన్ని భాగాలు జోలోఫ్ సామ్రాజ్యం వంటి ప్రముఖ ప్రాంతీయ సామ్రాజ్యాలచే పాలించబడ్డాయి. ప్రస్తుతం సెనెగల్ ఐరోపా వలసవాద మూలాలు ఉన్నాయి. ఇది 15 వ శతాబ్దం మధ్యలో ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో వివిధ వాణిజ్యం కొరకు అనేక ఐరోపా శక్తులు పోటీ పడ్డాయి. తీరప్రాంత వ్యాపార కూడళ్ళు క్రమంగా ప్రధాన భూభాగాన్ని నియంత్రణకు దారితీసింది. 19 వ శతాబ్దం నాటికి స్థానిక నిరోధకతకు మధ్య ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో ఫ్రెంచి పాలన మొదలైంది. 1960 లో ఫ్రాన్సు నుండి సెనెగల్ శాంతియుతంగా స్వాతంత్ర్యం పొందింది. ఇది ఆఫ్రికాలో మరింత రాజకీయ స్థిరత్వం ఉన్న దేశాలలో ఒకటిగా ఉందిగా గుర్తించబడుతుంది.
సెనెగల్ ఆర్ధిక వ్యవస్థ ఎక్కువగా అత్యవసర వస్తువులు, సహజ వనరులపై ఆధారపడి ఉంది. ప్రధాన పరిశ్రమలలో చేపల ప్రాసెసింగు, ఫాస్ఫేటు మైనింగు, ఎరువులు ఉత్పత్తి, పెట్రోలియం రిఫైనింగు, నిర్మాణ వస్తువులు, ఓడ నిర్మాణం, మరమ్మత్తు మొదలైనవి ప్రాధాన్యత ఉన్నాయి. పలు ఆఫ్రికా దేశాలలో ఉన్నట్లు వ్యవసాయం ప్రధాన రంగంగా ఉంది. సెనెగల్ అనేక ప్రధాన వాణిజ్య పంటలను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో వేరుశెనగ, చెరకు, పత్తి, ఆకుపచ్చ బీన్సు, టమోటాలు, పుచ్చకాయలు, మామిడి పంటలు ఉన్నాయి. [5] రాజకీయ స్థిరత్వం కారణంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతూ ఉంది.
బహుళజాతి, లౌకిక దేశంగా ఉన్న సెనెగల్ ప్రజలను ప్రధానంగా సున్ని ముస్లిం, సుఫీ, అనిమిస్టు మతాలు ప్రభావితం చేస్తున్నాయి. అనేక స్థానిక భాషలు వాడుకలో ఉన్నప్పటికీ ఫ్రెంచి అధికారిక భాషగా ఉంది. 2012 ఏప్రెలు నుండి మాకీ సాలు సెనెగల్ అధ్యక్షుడుగా ఉన్నాడు. 1970 నుండి సెనెగల్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ డి లా ఫ్రాంకోఫోను సభ్యదేశంగా ఉంది.
ఈ ప్రాంతం అంతటా సాగించిన పురావస్తు అన్వేషణలు సెనెగల్ చారిత్రక పూర్వకాలాలలో నివసిత ప్రాంతంగా ఉండేదని తెలియజేస్తున్నాయి. ఈ ప్రాంతాంతాన్ని అనేక జాతుల సమూహాలు నిరంతరం ఆక్రమించాయని పురావస్తు అన్వేషణలు సూచిస్తున్నాయి. 7 వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో రాజ్యాలు సృష్టించబడ్డాయి. 9 వ శతాబ్దంలో తకుర్రు, 13 వ, 14 వ శతాబ్దాలలో జోల్ఫు సామ్రాజ్యం పాలించింది. తూర్పు సెనెగల్ ఘనా సామ్రాజ్యంలో భాగంగా ఉంది.
అల్మోరావిడు రాజవంశం (మఘ్రేబు)నికి చెందిన టౌకౌలెయూరు, సోనిన్కేలు ఈ ప్రాంతంలో ఇస్లాంను పరిచయం చేసారు. తద్వారా అది అల్మోరావిడు, టౌకులేరు మిత్రుల సహాయంతో ప్రచారం చేయబడింది. ఈ ఉద్యమం సాంప్రదాయ మతాలు (ముఖ్యంగా సెరెస్ల జాతులు)నుండి ప్రతిఘటనను ఎదుర్కొంది.[6][7]
13 వ - 14 వ శతాబ్దాలలో ఈ ప్రాంతం తూర్పున సామ్రాజ్యాల ఆధీనంలోకి వచ్చింది. ఈ సమయంలో సెనెగల్ జోలోఫు సామ్రాజ్యం కూడా స్థాపించబడింది. సెనెగాంబియా ప్రాంతంలో 1300 - 1900 ల మధ్య కాలంలో జనాభాలో మూడింట ఒక వంతు మంది బానిసలుగా ఉన్నారు. సాధారణంగా యుద్ధాల్లో తీసుకురాబడిన బందీలుగా వీరు ఈ ప్రాంతానికి తీసుకుని రాబడ్డారు.[8]
14 వ శతాబ్దంలో జోలోఫు సామ్రాజ్యం కయోరు, బావోల్, సిన్, సలోమ్, వాలో, ఫుటో టోరో, బాంబోకు రాజ్యాలు (ప్రస్తుతం పశ్చిమ ఆఫ్రికాలోని అనేక రాజ్యాలు)లతో ఐఖ్యత ఏర్పరచుకుని చాలా శక్తివంతంగా మారింది. సైనిక విజయంతో నిర్మించిన సామ్రాజ్యం కంటే అనేక రాష్ట్రాలతో కూడిన ఒక స్వచ్ఛంద సమాఖ్యగా ఇది రూపొందించబడింది.[9][10]
ఈ సామ్రాజ్యం అనేకమంది జాతుల సంకీర్ణంతో రూపుదిద్దుకొన్నప్పటికీ కొంతమంది సేరరు,[11][12]కొంతమంది టౌకోలూరు ప్రజలు (పలు స్థానిక సమూహాలతో సంకీర్ణం) స్థాపించారు. కాని 1549 లో లీలే ఫౌలి ఫాకు ఓటమిపొంది చంపబడడంతో ఈ సాంరాజ్యం కూలిపోయింది.
15 వ శతాబ్దం మధ్యకాలంలో పోర్చుగీసు సెనెగల్ తీరప్రాంతంలో అడుగుపెట్టింది. తరువాత ఫ్రెంచి వంటి ఇతర దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యాపారులు వారిని అనుసరించారు.[13] పోర్చుగలు, నెదర్లాండ్సు, గ్రేటు బ్రిటను వంటి అనేక ఐరోపా అధికారాలు -15 వ శతాబ్దం నుండి ఈ ప్రాంతంలో వాణిజ్యం కోసం పోటీ పడ్డాయి. 1677లో ఫ్రెంచి నియంత్రణలోకి మారిన గోరీ ద్వీపం (ఆధునిక డాకరు ద్వీపం సమీపంలో)ప్రధాన భూభాగంలో పోరాడుతున్న పోరాటనాయకుల నుండి బానిసలను కొనుగోలు చేయడానికి ఒక ఆధారంగా ఉపయోగించబడి అట్లాంటికు బానిస వాణిజ్యం ప్రధాన డిపాచూరు కేంద్రంగా మారింది.[14][15]
ఐరోపా మిషనరీలు 19వ శతాబ్దంలో సెనెగల్, కాసామన్సు ప్రాంతాలకు క్రైస్తవ మతాన్ని పరిచయం చేశారు. 1850లలో మాత్రమే ఫ్రెంచి వారు సెనెగల్స్ ప్రధాన భూభాగానికి విస్తరించడం ప్రారంభించి బానిసత్వాన్ని నిర్మూలించారు.[16] తరువాత ఫ్రెంచి కాలనీవాదులు క్రమక్రమంగా గవర్నరు లూయిస్ ఫాయిఫెర్బే సాయంతో సిన్, సాలౌం తప్ప మిగిలిన అన్ని రాజ్యాలను (వాలో, కాయరు, బొయలు, జొలోఫు సాంరాజ్యం) విలీనం చేసుకున్నారు.[9][17] ఫాస్-గాలోజినా ఆదేశంతో యోరో డ్యో లూయిసు ఫాయిఫెర్బే (1861 నుండి 1914 వరకూ వాలో (ఓయులో) ప్రతినిధిగా ఉన్నాడు) ఆధీనంలో ఉన్న వాలోను స్వాధీనం చేసుకున్నాడు.[18] [19] ఫ్రెంచి విస్తరణకు సెనెగల్ ప్రజల నిరోధకత ప్రదర్శిస్తూ లాట్-డియోర్, కాయార్ డామేల్, మాడ్ ఒక సినిగ్ కుంబా నఫ్ఫెనె ఫామాక్ జూఫ్, మాద్ సిన్నిగ్ ఆఫ్ సిన్, లాగెండ్ ప్రాంతాలలో వారి లాభదాయకమైన బానిస వాణిజ్యాన్ని తగ్గించడం ఫలితంగా "లొగందెమె యుద్ధం " దారితీసింది.
1959 ఏప్రెలు 4న సెనెగల్, ఫ్రెంచి సుడాన్ మాలి సమాఖ్యను ఏర్పాటుచేయడానికి విలీనం అయ్యాయి. ఇది 1960 జూను 20 న పూర్తిగా స్వతంత్రంగా మారింది. 1960 ఏప్రెలు 4న ఫ్రాంసుతో అధికార బదిలీ ఒప్పందం మీద సంతకం తరువాత అది పూర్తిగా స్వతంత్రం పొందింది. అంతర్గత రాజకీయ ఇబ్బందుల కారణంగా సమాఖ్య ఆగష్టు 20 న సెనెగల్, ఫ్రెంచి సుడాన్ (రిపబ్లికు అఫ్ మాలి పేరు మార్చబడింది) విడివిడిగా స్వాతంత్ర్యం ప్రకటించి విడిపోయాయి.
1960 సెప్టెంబరులో బ్లియోపోల్డు సెడారు సెనెఘరు సెనెగల్ మొదటి అధ్యక్షుడిగా ఉన్నాడు. సెనెగర్ చాలా బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన ఫ్రాంసులో విద్యాభ్యాసం చేశాడు. అతను వ్యక్తిగతంగా సెనెగలీస్ జాతీయ గీతం "పినుసెజి టౌసు వోసు కొరాసు, ఫ్రాపెజు లెసు బలాఫోంసు " రూపొందించిన కవి, తత్వవేత్తగా గుర్తించబడ్డాడు. ప్రో-ఆఫ్రికా పౌరుడిగా ఆయన ఆఫ్రికా సోషలిజం బ్రాండును సూచించాడు.[20]
1980లో రాష్ట్రపతి సెంఘరు రాజకీయాల నుండి విరమణ చేయాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి సంవత్సరం ఆయన 1981లో తన హస్థగత వారసుడు అబ్డౌ డియోఫుకు అధికారాన్ని ఇచ్చాడు. 1982 లో డియోఫుకు వ్యతిరేకంగా ఎన్నికలలో పోటీచేసిన మాజీ ప్రధానమంత్రి మమడో డియా ఓడిపోయాడు. సెంఘరు ఫ్రాన్సుకు వెళ్లాడు. తరువాత ఆయన 96 సంవత్సరాల వయసులో మరణించాడు.
1980వ దశకంలో బుకాబారు లాం మొదటి ప్రపంచ యుద్ధం తరువాత మొదటిసారిగా టకులారు ప్రముఖులు, యోరో డ్యూ సంకలనం చేసిన సెనెగల్లీ మౌఖిక చరిత్రను కనుగొన్నారు. ఇది నైలు నది నుండి పశ్చిమ ఆఫ్రికాలోకి వలసలని నమోదు చేసింది: వీరు తూర్పుప్రాంత సంప్రదాయ మూలం కలిగిన సెనెగలు నది, నుండి నైజరు నదీ ముఖద్వారానికి చెందిన ప్రజలు.[21]
1982 ఫిబ్రవరి 1 న నామమాత్ర " సెనెగాంబియా సమాఖ్య " ఏర్పాటు చేయడానికి సెనెగల్ గాంబియాతో కలిసింది. 1989 లో ఈ సమాఖ్య రద్దు చేయబడింది. శాంతి చర్చలు ఉన్నప్పటికీ దక్షిణ వర్జీనిస్టు బృందం కామమాన్సు (డెమోక్రటికు ఫోర్సెసు ఆఫ్ కాసామన్సు) నుండి పనిచేస్తూ 1982 నుండి ప్రభుత్వ దళాలతో పోరాడుతూ ఉంది. 21 వ శతాబ్దం ప్రారంభంలో హింస సద్దుమణిగింది. అధ్యక్షుడు మాకీ సాల్ 2012 డిసెంబరులో రోములో తిరుగుబాటుదారులతో చర్చలు జరిపారు.[22]
1981 - 2000 మధ్యకాలంలో అబ్దేవు డియోఫు అధ్యక్షుడుగా పనిచేసాడు. ఆయన విస్తృత రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు, ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం తగ్గించాడు, ముఖ్యంగా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో సెనెగల్ దౌత్య కార్యక్రమాలను విస్తరించారు. అంతర్గత దేశీయ రాజకీయాలు కొన్నిమార్లు వీధి హింస, సరిహద్దు ఉద్రిక్తతలు, దక్షిణ ప్రాంతంలో వేర్పాటువాద కాసమంసు ఉద్యమంలో హింస చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ ప్రజాస్వామ్యానికి, మానవ హక్కులకు సెనెగల్ నిబద్ధత బలపడింది. అబ్దుయ్ డియోఫ్ అధ్యక్ష పదవికి నాలుగు సార్లు పనిచేశాడు.
1999 అధ్యక్ష ఎన్నికలలో ప్రతిపక్ష నేత అబ్దౌలయె వాడే డియోఫెను ఓడించాడు. అంతర్జాతీయ పరిశీలకులు ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా జరిగాయని అంగీకరించారు. సెనెగల్ దాని రెండవ శాంతియుత అధికార బదిలీ చూసింది. ఒక రాజకీయ పార్టీ నుండి మరొక పార్టీకు మొదటిసారిగా అధికారం శాంతియుతంగా బదిలీ చేయబడింది. 2004 డిసెంబరు 30 న అధ్యక్షుడు వాడే, కాసమాన్సు ప్రాంతంలో వేర్పాటువాద బృందంతో శాంతి ఒప్పందంపై సంతకం చేస్తానని ప్రకటించాడు. అయితే ఇది ఇంకా అమలు చేయలేదు. 2005 లో మొదటి విడత చర్చలు జరిగినప్పటికీ ఫలితాలు తీర్మానం చేయబడలేదు.
సెనెగల్ ఆఫ్రికా ఖండంలో పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఇది అక్షాంశాల 12° నుండి 17° ఉత్తర అక్షాంశం, 11° నుండి 18° పశ్చిమ రేఖాంశంలో ఉంది.
సెనెగల్ పశ్చిమసరిహద్దులో అట్లాంటికు మహాసముద్రం, ఉత్తర సరిహద్దులో మౌరిటానియ, తూర్పు సరిహద్దులో మాలి, దక్షిణ సరిహద్దులో గినియా, గినియా-బిస్సావు ఉన్నాయి.
సెనెగలీస్ భూభాగంలో రోలింగ్ ఇసుక మైదానాలు ఉన్నాయి. ఇవి ఆగ్నేయ ప్రాంతంలో పర్వతపాదాల వరకు పెరుగాయి. ఇక్కడ సెనెగల్ ఎత్తైన ప్రదేశం కూడా కనుగొనబడింది. ఇది నేపాన్ దియాఖ ఆగ్నేయంలో (ఎత్తు 648 మీ (2,126 అడుగులు)) న 2.7 కిలోమీటర్ల దూరంలో ఉంది.[23] ఉత్తర సరిహద్దును సెనెగల్ నది ఏర్పరుస్తూ ఉంది. ఇతర నదులు గాంబియా, కాసామన్సు నది ఉన్నాయి. రాజధాని డాకర్ ఆఫ్రికా ఖండాంతర మద్య పశ్చిమ ప్రాంతంలోని కాప్-వెర్ట్ ద్వీపకల్పంలో ఉంది.
కేప్ వర్దె ద్వీపాలు సెనెగలిస్ తీరానికి 560 కిలోమీటర్ల (350 మైళ్ళు) దూరంలో ఉన్నాయి. కాని కాప్-వెర్ట్ ("కేప్ గ్రీన్") 105 మీటర్ల (344 అడుగులు) "లెస్ మమ్మీల్స్" పాదాల వద్ద ఒక సముద్రపు ప్రదేశం. కేప్-వెర్ట్ ద్వీపకల్పం ఒక చివరిలో సెనెగల్ రాజధాని డాకరు ఉంది.
ఈశాన్య శీతాకాల పవనాలు, నైరుతి వేసవి పవనాల ఫలితంగా పొడి, తేమ రుతువులతో ఏడాది పొడవునా సెనెగల్ ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. పొడి వాతావరణం (డిసెంబరు నుండి ఏప్రిలు వరకు) వేడి, పొడి, హార్మట్టను పవనాలు ఆధిపత్యం వహిస్తుంది.[24] జూన్, అక్టోబరు మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు 30 ° సెం (86.0 ° ఫా), కనిష్ట ఉష్ణోగ్రత 24.2 °సెం. (75.6 °ఫా.) ఉంటుంది. డాకర్ వార్షిక వర్షపాతం సుమారు 600 మి.మీ (24 in) ఉంటుంది. డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు 25.7 ° సెం (78.3 ° ఫా), కనిష్ట ఉష్ణోగ్రతలు 18 ° సెం (64.4 ° ఫా) ఉంటుంది.[25]
తీరప్రాంతంలో (ఉదాహరణకు, కాయలాకు టాంబాకౌండలలో సగటు రోజువారీ ఉష్ణోగ్రతలు మే 30 ° సెం (86.0 ° ఫా), 32.7 °సెం. (90.9 °ఫా.) ఉంటుంది, డాకరు 23.2 °సెం. (73.8 °ఫా.)),[26] వార్షికంగా 1,500 మి.మీ (59.1 అం) కన్నా ఎక్కువ వర్షపాతం గణనీయంగా దక్షిణంగా అధికరిస్తుంది.
సుదూర ప్రాంతములో ముఖ్యంగా ఎడారి ప్రారంభమయ్యే మాలి సరిహద్దులో టాంబుకౌడలో, ఉష్ణోగ్రతలు 54 °సెం. (129.2 °ఫా.) కి చేరతాయి. దేశంలోని ఉత్తర భాగంలో వేడిగా ఉన్న ఎడారి వాతావరణం ఉంది. మధ్య భాగం వేడి సెమీ వాయు వాతావరణం కలిగి ఉంటుంది. దక్షిణ భాగం ఉష్ణమండల తడి, పొడి వాతావరణం కలిగి ఉంటుంది. సెనెగల్ ప్రధానంగా ఎండ, పొడి వాతావరణం కలిగిన దేశం.
1993 లో దాని ఆర్ధికవ్యవస్థ 1993 లో 2.1% క్షీణించింది. సెనెగల్ అంతర్జాతీయ ఆర్ధిక సహాయంతో ఒక ప్రధాన ఆర్ధిక సంస్కరణ కార్యక్రమాన్ని స్థాపించింది. ఈ సంస్కరణ దేశం కరెన్సీ (సి.ఎఫ్.ఎ. ఫ్రాంకు) 50% విలువ తగ్గింపుతో ప్రారంభమైంది. ప్రభుత్వ ధరల నియంత్రణలు, రాయితీలు కూడా తొలగించబడ్డాయి. దీని ఫలితంగా సెనెగల్ ద్రవ్యోల్బణం తగ్గిపోయింది. పెట్టుబడులు పెరిగాయి 1995 - 2001 మధ్య స్థూల దేశీయ ఉత్పత్తి సంవత్సరానికి సుమారు 5% అభివృద్ధి చెందింది.[24]
ప్రధాన పరిశ్రమలలో ఆహార ప్రాసెసింగు, మైనింగు, సిమెంటు, కృత్రిమ ఎరువులు, రసాయనాలు, వస్త్రాలు, దిగుమతి చేసుకున్న పెట్రోలియం, పర్యాటక రంగం ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి. చేపలు, రసాయనాలు, పత్తి, బట్టలు, వేరుశెనగ, కాల్షియం ఫాస్ఫేటు ఎగుమతి చేయబడుతూ ఉన్నాయి. ప్రధాన విదేశీ మార్కెట్టు భారతదేశం 26.7% ఎగుమతులు (1998 నాటికి). ఇతర విదేశీ మార్కెట్లలో యునైటెడ్ స్టేట్సు, ఇటలీ, యునైటెడ్ కింగ్డం ఉన్నాయి.
సెనెగలుకు 12-నాటికలు మైలు (22 కిమీ; 14 మైళ్ళు) ప్రత్యేకమైన మత్స్య మండలం ఉంది. ఇది ఇటీవలి సంవత్సరాలలో క్రమంగా ఉల్లంఘించబడుతోంది (2014 నాటికి). దేశంలోని మత్స్యకారుల ద్వారా ప్రతి సంవత్సరం 3,00,000 టన్నుల చేపలు చట్టవిరుద్ధమైన ఫిషింగులో కోల్పోతాయని అంచనా వేయబడింది. సెనెగల్ ప్రభుత్వం ఫిషింగ్ ట్రైలర్లచే చేపట్టే అక్రమ ఫిషింగును నియంత్రించడానికి ప్రయత్నించింది. వీరిలో కొందరు రష్యా, మౌరిటానియ, బెలిజ్, ఉక్రెయిన్ మత్స్యకారులు నమోదు చేయబడ్డారు. 2014 జనవరిలో రష్యా మత్స్యకారుడు " ఒలేగ్ నడేడోవు " గునియా-బిసావుతో సముద్ర సరిహద్దుకు దగ్గరగా ఉన్న సెనెగలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.[27]
వెస్ట్ ఆఫ్రికన్ ఎకనామిక్ అండ్ మానిటరీ యూనియన్ (WAEMU) లో సభ్యదేశంగా సెనెగల్ సమైఖ్య బాహ్య సుంకంతో అధిక ప్రాంతీయ అనుసంధానంతో పని చేస్తుంది. సెనెగల్ " ఆఫ్రికన్ లోని ఆర్గనైజేషన్ ఫర్ ది హార్మోనిజేషన్ ఆఫ్ బిజినెస్ లా ఇన్ ఆఫ్రికా " లో కూడా సభ్యదేశంగా ఉంది.[28]
1996 లో సెనెగల్ పూర్తి ఇంటర్నెట్ కనెక్టివిటీని సాధించింది. సమాచార సాంకేతిక ఆధారిత సేవలలో చిన్న విప్లవం సృష్టించింది. ప్రైవేట్ భాగస్వామ్యం ప్రస్తుతం జి.డి.పి.లో 82% వాటాను కలిగి ఉంది. ప్రతికూలలో దీర్ఘకాలిక అధిక నిరుద్యోగం, సాంఘిక ఆర్ధిక అసమానత, బాల్య నేరస్తులు, మాదకద్రవ్య వ్యసనం మొదలైన లోతైన నగరప్రాంతీయ సమస్యలను ఎదుర్కొంటుంది. [29]
సెనెగల్ అంతర్జాతీయ అభివృద్ధి సహాయం ప్రధాన గ్రహీతగా ఉంది. విరాళాలలో యునైటెడ్ స్టేట్సు ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, జపాన్, ఫ్రాన్సు, చైనా ఉన్నాయి. 1963 నుండి 3000 మందికి పైగా పీసు కార్ప్సు వాలంటీర్లు సెనెగల్ పౌరులు పనిచేశారు.[30]
సెనెగల్ జనాభా సుమారు 15.4 మిలియన్లు.[31] వీరిలో 42% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాలలో జనసాంద్రత పశ్చిమ-మధ్య ప్రాంతంలో చదరపు కిలోమీటరుకు (200 చదరపు మైళ్ళు) సుమారు 77 మంది నివాసితుల నుండి శుష్క తూర్పు విభాగంలో చదరపు కిలోమీటరుకు 2 (5.2 / చదరపు మైళ్ళు) మంది నివాసితుల వరకు ఉంటుంది.
సెనెగల్‌లో అనేక జాతులకు చెందిన ప్రజలు ఉన్నారు. చాలా పశ్చిమ ఆఫ్రికా దేశాలలో మాదిరిగా అనేక భాషలు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. సెనెగలులో వోలోఫ్ 43% అతిపెద్ద జాతి సమూహంగా ఉంది. ఫులా,[32]టౌకౌలూర్ (దీనిని హాల్పులార్ అని కూడా పిలుస్తారు, వాచ్యంగా "పులార్-స్పీకర్లు" అంటారు) (24%) రెండవ అతిపెద్ద సమూహంగా ఉన్నారు. తరువాత స్థానంలో సెరర్ (14.7%),[33] తరువాత జోలా (ఇతరులు) 4%), మాండింకా (3%), మౌరెస్ లేదా (నార్కజోర్స్), సోనింకే, బస్సారీ, అనేక చిన్న సంఘాలు (9%) ఉన్నారు. (బేడిక్ జాతి సమూహం కూడా చూడండి).
ఐరోపియన్లు సుమారు 50,000 మంది (ఎక్కువగా ఫ్రెంచ్), లెబనీస్,[34] అలాగే తక్కువ సంఖ్యలో మౌరిటానియన్లు, మొరాకన్లు (ఇతరులు) ఉన్నారు. ప్రధానంగా కొంతమంది వయోజనులు నగరాలలోని మబోర్ ప్రాంతాలలో ఉన్న రిసార్టు పట్టణాలలో నివసిస్తున్నారు. లెబనీలలో ఎక్కువ మంది వాణిజ్యంలో పనిచేస్తున్నారు.[35] రెండవ ప్రపంచ యుద్ధం నుండి సెనెగల్ స్వాతంత్ర్యం పిందడానికి మధ్య దశాబ్దాలలో ఫ్రాన్స్ నుండి వలసల తరంగాలుగా ప్రజలు సెనగలులో ప్రవేశించారు. ఈ ఫ్రెంచి ప్రజలలో ఎక్కువ మంది డాకర్ లేదా ఇతర ప్రధాన పట్టణ కేంద్రాలలో గృహాలను కొనుగోలు చేశారు.[36] ప్రధానంగా పట్టణాలలో చిన్న వియత్నామీ సమూహాలు, క్రమంగా అభివృద్ధి చెందుతున్న చైనా వలస వ్యాపారులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు.[37][38] సెనెగల్‌లో (ప్రధానంగా దేశం ఉత్తర ప్రాంతాలలో) 10,000 మంది మౌరిటానియన్ శరణార్థులు కూడా ఉన్నారు.[39]
యు.ఎస్. రెఫ్యూజీస్ అండ్ ఇమ్మిగ్రెంట్స్ కమిటీ ప్రచురించిన ప్రపంచ రెఫ్యూజీ సర్వే 2008 ఆధారంగా సెనెగల్‌లో (2007 లో) శరణార్థుల సంఖ్య సుమారు 23,800 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది (20,200) మౌరిటానియాకు చెందినవారు ఉన్నారు. శరణార్థులు సెనెగల్ నది లోయ వెంట ఉన్న ఎన్డియమ్, డోడెల్ లోని చిన్న స్థావరాలలో నివసిస్తున్నారు.[40]
సెనగలులో ఫ్రెంచి అధికారిక భాషగా ఉంది. ఫ్రెంచి మూలానికి చెందిన విద్యావ్యవస్థలో చాలా సంవత్సరాలకాలం విద్యను అభ్యసించిన వారు అందరూ ఫ్రెంచి మాట్లాడగలరు. కోరానిక్ పాఠశాలలు మరింత ప్రాచుర్యం పొందినప్పటికీ కాని వెలుపల వాడుకలో లేదు. చాలా మంది ప్రజలలో తమ స్థానిక భాష కూడా వాడుకలో ఉంది. డాకర్లో, వోలోఫ్ భాషలు వాడుకలో ఉన్నాయి.[41] పులార్ భాష ఫులాస్, టౌకౌలూర్ ప్రజలకు వాడుక భాషగా ఉంది. సెరర్ భాష సెరెర్లు, నాన్-సెరర్లకు కూడా వాడుకలో ఉంది (ప్రెసిడెంట్ సాల్, ఆయన భార్య సెరర్). కాంగిన్ భాషలు కూడా వాడుకలో ఉన్నాయి. ఇది సెరర్లకు ఇది అధికంగా వాడుకలో ఉంది. కాసామెంసులో జోలా భాషలు వాడుకలో ఉన్నాయి.
"జాతీయ భాషల" చట్టపరంగా గుర్తింపు పొందిన భాషలు: బాలంటా-గంజా, హసానియా అరబిక్, జోలా-ఫోని, మాండింకా, మాండ్జాక్, మంకన్య, నూన్ (సెరర్-నూన్), పులార్, సెరర్, సోనింకే, వోలోఫ్.
కాసామాన్సు రాజధాని జిగుఇన్చోర్లో స్థానికంగా పోర్చుగీసు అని పిలువబడే పోర్చుగీసు క్రియోల్ భాష అల్పసంఖ్యాకుల భాషగా వాడుకలో ఉంది. గినియా-బిస్సావు నుండి వలస వచ్చినవారికి స్థానిక పోర్చుగీస్ క్రియోల్ భాష వాడుకభాషగా ఉంది. స్థానిక కేప్ వర్దె సమాజం పోర్చుగీసు క్రియోల్, కేప్ వర్దె క్రియోల్, ప్రామాణిక పోర్చుగీస్ భాషలు వాడుకలో ఉన్నాయి. 1961 లో మొదటి అధ్యక్షుడు లియోపోల్డ్ సెదార్ సెంగోర్ డాకర్లో సెనెగల్ మాధ్యమిక విద్యలో పోర్చుగీసును పరిచయం చేశారు. ఇది ప్రస్తుతం చాలా సెనెగల్ ఉన్నత విద్యలో అందుబాటులో ఉంది. ఇది స్థానిక సాంస్కృతిక గుర్తింపుతో సంబంధం కలిగి ఉన్నందున ఇది కాసామెన్స్లో అధికంగా వాడుకభాషగా ఉంది.[42]
దేశంలో ఫ్రెంచ్ మాత్రమే అధికారిక భాషగా ఉన్నప్పటికీ కానీ పెరుగుతున్న సెనెగల్ భాషా జాతీయవాద ఉద్యమం రూపంలో ఇది వ్యతిరేకత ఎదుర్కొంటుంది. దేశంలోని అత్యధికంగా వాడుకలో ఉన్న వోలోఫ్ భాషను జాతీయభాషగా రాజ్యాంగంలో చేర్చడానికి ప్రజలు అధికంగా మద్దతు ఇస్తున్నారు.[43]
సెనగల్ లోని డాకర్, డ్యోర్బెల్, కఫ్రినె, కయోలాక్, కెడౌగౌ, కొల్డా, లౌగా, మాటాం, సెయింట్ లూయిస్, సిధియవ్, తంబకౌండ, తియీస్, జిగుయ్ంచొర్ అంతర్జాతీయ సంస్థ అయిన ఫ్రాంకొఫొనెలో సభ్యత్వం కలిగి ఉన్నాయి.
సెనెగల్ రాజధాని డాకర్ సెనెగల్‌లో అతిపెద్ద నగరంగా ఉంది. ఇందులో రెండు మిలియన్ల మంది నివాసితులు ఉన్నారు.[44] రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరం టౌబా. ఈ నగరంలో ప్రాంతంలో 5 లక్షల మంది గ్రామీణ ప్రజలు నివసిస్తున్నారు.[44][45]
సెనెగల్ ఒక లౌకిక దేశం.[47]అయినప్పటికీ దేశంలో ప్రధాన మతంగా ఇస్లాం ఉంది. దేశ జనాభాలో సుమారు 92% మంది దీనిని ఆచరిస్తున్నారు; క్రైస్తవులు 7% ఉన్నారు. వీరిలో అధికంగా రోమన్ కాథలిక్కులు ఉన్నారు. కాని ఇప్పటికీ విభిన్న ప్రొటెస్టంటు తెగలవారు కూడా ఉన్నారు. 1% మందికి (ముఖ్యంగా దేశంలోని ఆగ్నేయ ప్రాంతంలో) ఆనిమిస్టు విశ్వాసాలు ఉన్నాయి.[24] కొంతమంది సెరర్ ప్రజలు సెరర్ మతాన్ని అనుసరిస్తారు.[48][49]
సెనెగల్ ముస్లింలలో ఎక్కువ మంది సూఫీ, సున్నీలు ఉన్నారు. సెనెగల్‌లోని ఇస్లామిక్ కమ్యూనిటీలు ఇస్లామిక్ సూఫీ ఆదేశాల ఆధారంగా నిర్వహించబడతాయి. వీటికి ఖలీఫ్ (వోలోఫ్లోని జాలిఫా, అరబిక్ ఖలీఫా నుండి) నేతృత్వం వహిస్తారు. స్థాపకుడి అసలైన వారసుడు ఖలీఫాగా నియమించబడతాడు. సెనెగల్‌లో రెండు అతిపెద్ద, ప్రముఖమైన సూఫీ ఆర్డర్ టిజానియా. టివౌనే, కౌలాక్ నగరాల్లో వీరు అధికసంఖ్యలో ఉన్నారు. తౌబా నగరంలో ఉన్న మురిడియా (మురిడ్)లో 27% మంది ముస్లింలు ఉన్నారు.[50]
సహెల్ తీరంలో సెనెగల్, వరకు విస్తరించిన హాల్పులార్ (పులార్-భాషా వాడుకరులు) ప్రజలు, టాఊకౌలర్లు జనాభాలో 23.8% మంది ఉన్నారు.[24]వారు చారిత్రాత్మకంగా ముస్లింలుగా మారారు. ఉత్తరాన సెనెగల్ నది లోయకు చెందిన చాలా మంది టౌకౌలర్లు, హల్పులార్ ఒక సహస్రాబ్ది క్రితం ఇస్లాం మతంలోకి మారిన తరువాత సెనెగల్ అంతటా ఇస్లాం మతప్రచారానికి దోహదపడ్డారు. వీరు మతప్రచారం చేయడంలో వోలోఫ్సులో విజయం సాధించినప్పటికీ వీరిని సెరెర్సు తిప్పికొట్టారు.
సెనెగల్ నది లోయకు దక్షిణంగా ఉన్న చాలా సమాజాలు పూర్తిగా ఇస్లామీకరించబడలేదు. ఇస్లామీకరణను ప్రతిఘటించడంలో వెయ్యి సంవత్సరాలు గడిపిన సమూహంలో సెరర్ ప్రజలు ఒకరు (సెరర్ చరిత్ర చూడండి). సెరర్లలో క్రైస్తవులు, ముస్లింలు ఉన్నారు. ఇటీవలి కాలంలో వారు వత్తిడిరహితంగా వారి స్వంత ఇష్టానుసారం ఇస్లాం మతంలోకి మారారు. శతాబ్దాల క్రితం కొనసాగిన వత్తిడి విజయవంతం సాధించలేదు.(ఫండనే-థియోథియోన్ యుద్ధం చూడండి).[51]
వలసరాజ్యాల కాలంలో టిడ్జానియ ప్రయత్నంతో అధికారిక ఖురాన్ పాఠశాల (వొలోఫ్లో దారా అని పిలుస్తారు) వ్యాప్తి చెందింది. మురిడ్ సమాజాలలో ఖురాన్ అధ్యయనాల కంటే, అందులోని నీతికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఒక మత నాయకుడి కోసం పనిచేయడాన్ని సాధారణంగా " డారా " అంటారు. ఇతర ఇస్లామిక్ సమూహాలలో చాలా పాత కదిరియా, సెనెగల్ లాయేన్ ఉన్నాయి. వీటిని తీరప్రాంత ప్రజలు ఆచరిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది సెనెగల్ పిల్లలు చాలా సంవత్సరాలు డారా అభ్యసిస్తున్నారు. ఈ విధానంలో ఖురాన్ ను ధారణ చేస్తారు. వారిలో కొందరు తమ మతపరమైన అధ్యయనాలను కౌన్సిల్స్ (మజ్లిస్), ప్రైవేట్ అరబిక్ పాఠశాల, బహిరంగంగా నిధులు సమకూర్చిన ఫ్రాంకో-అరబిక్ పాఠశాలలలో కొనసాగిస్తున్నారు.
తీరప్రాంతాలైన సెరర్, జోలా, మంకన్య, బాలాంట్ జనాభాలో, తూర్పు సెనెగల్‌లో బస్సరి, కొనియాగుయులలో చిన్న రోమన్ కాథలిక్ సమాజాలు కనిపిస్తాయి. వలసదారులు ప్రధానంగా ప్రొటెస్టంటు చర్చిలలో హాజరవుతారు. అయినప్పటికీ 20 వ శతాబ్దం రెండవ భాగంలో సెనెగల్ నాయకుల నేతృత్వంలోని ప్రొటెస్టంట్ చర్చిలు అభివృద్ధి చెందాయి. డాకర్లో లెబనీస్, కేప్ వెర్డియన్, ఐరోపా, అమెరికాకు చెందిన వలస జనాభాలో కాథలిక్, ప్రొటెస్టంట్ ఆచారాలను అనుసరించే ప్రజలు ఉన్నారు. ఇతర దేశాల ఆఫ్రికన్లలో ఉన్న సెనెగల్ ప్రజలు కూడా వీటిని ఆచరిస్తున్నారు. ఇస్లాం సెనెగల్ ఆధిఖ్యత కలిగిన మతం అయినప్పటికీ కాథలిక్ సెరర్ అయిన లియోపోల్డ్ సెదార్ సెంగోర్ సెనెగల్ మొదటి అధ్యక్షుడు అయ్యాడు.
సెరర్ మతానుయాయులు ఆరాధించే ప్రధానదేవత అయిన రూగ్ (కాంగిన్లలో కూక్స్)ను ఆరాధిస్తారు. సెరర్ ప్రజలు కాస్మోగోనీ, కాస్మోలజీ, సెరర్ సాల్టిగ్యూస్ (ప్రధాన పూజారులు, అర్చకులు) చేత నిర్ణయించబడిన వార్షిక క్సాయి (లేదా ఖోయ్) వేడుక వంటి భవిష్యవాణి వేడుకల మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. సెనెగాంబియన్ (సెనెగల్, గాంబియా రెండూదేశాల ప్రజల) తోబాస్కి, గామో, కొరితే, వెరి కోర్ మొదలైన ముస్లిం పండుగల పేర్లు సెరర్ మతం నుండి స్వీకరించిన పదాలతో రూపొందించబడ్డాయి.[52] అవి ఇస్లాం సంబంధిత పండుగలు కాదు సెరర్ మతంలో పాతుకుపోయిన పురాతన సెరర్ పండుగలు.[52] జోలా ప్రజల మతపరమైన వేడుకలలో బౌకౌట్ ఒకటి.
జుడాయిజం, బౌద్ధమతం అనుచరులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. అనేక జాతుల ప్రజలు జుడాయిజం అనుసరిస్తున్నారు.[ఎవరు?] అనేక వియత్నాం ప్రజలు బౌద్ధమతాన్ని అనుసరిస్తున్నారు.[ఆధారం చూపాలి] సెనెగలులో బహాయిమతాన్ని స్థాపించిన "అబు ఐ బహా" కుమారుడు బహాయీలు ఆఫ్రికాను తప్పక సందర్శించవలసిన ప్రదేశంగా పేర్కొన్నాడు.[53]ప్రస్తుతం సెనెగలుగా మారిన ఫ్రెంచ్ పశ్చిమ ఆఫ్రికా భూభాగంలో 1953 లో బహాయీలు మొట్టమొదటగా ప్రవేశించారు.[54] 1966 లో డాకర్లో మొదటి " లోకల్ స్పిరుచ్యుయల్ అసెంబ్లీ " ఎన్నుకొన బడింది.[55] 1975 లో బహాయి సమాజం సెనెగలులో మొదటి జాతీయ ఆధ్యాత్మిక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అసోసియేషన్ ఆఫ్ రెలిజియన్ డేటా ఆర్కైవ్స్ 2005 నివేదిక సెనెగల్ బహాయిస్ జనాభా 22,000 గా ఉందని తెలియజేసింది.[56]
సెనెగల్ ప్రజల ఆయుఃపరిమితి 57.5 సంవత్సరాలు.[57] 2004 లో ఆరోగ్యం సంరక్షణకొరకు ప్రభుత్వ జిడిపిలో 2.4% కేటాయించింది. ప్రైవేట్ వ్యయం 3.5% ఉంది.[58] 2004 లో తలసరి ఆరోగ్య వ్యయం US $ 72 అమెరికా డాలర్లు.[58] అధికారిక సర్వే (1986 లో 6.4, 1997 లో 5.7) ఎత్తి చూపినట్లుగా సంతానోత్పత్తి రేటు 2005 - 2013 మధ్య 5 నుండి 5.3 వరకు ఉంది. పట్టణ ప్రాంతాల్లో 4.1, గ్రామీణ ప్రాంతాల్లో 6.3 ఉన్నాయి.[59] 2000 ల ప్రారంభంలో (దశాబ్దం) 100,000 మందికి 6 వైద్యులు నిష్పత్తిలో ఉన్నారు.[58]2005 లో 1,000 లో 77 శిశు మరణాలు ఉన్నాయి.[58] కానీ 2013 లో మొదటి 12 నెలల్లో శిశుమరణాలు ప్రతి 1000 మందిలో 47 కి తగ్గించబడింది.[57] గత 5 సంవత్సరాలలో మలేరియా కారణంగా శిశు మరణాల రేటు తగ్గించబడిందని 2013 యునిసెఫ్ నివేదిక తెలియజేస్తుంది.[60] సెనెగల్‌లో 26% మంది మహిళలు స్త్రీ జననేంద్రియ వైకల్యానికి గురయ్యారు.
2001 జనవరి నాటికి సెనెగలులో పిల్లలందరికీ విద్య అందుబాటులోకి తీసుకునిరాబడింది.[61] సెనెగలులో 16 సంవత్సరాల వయస్సు వరకు నిర్బంధ ఉచిత విద్య అమలులో ఉంది.[61] ప్రతి సంవత్సరం తప్పనిసరిగా నమోదు చేయాల్సిన పిల్లల సంఖ్య ప్రభుత్వ పాఠశాల వ్యవస్థకు ఇబ్బందికరంగా మారిందని కార్మిక మంత్రిత్వ శాఖ సూచించింది.[61]మహిళల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది.[58] నికర ప్రాధమిక నమోదు రేటు 2005 లో 69% ఉంది. 2002-2005 మద్యకాలంలో విద్యాభివృద్ధి కొరకు ప్రభుత్వం జిడిపిలో 5.4% వ్యయం చేసింది.
పశ్చిమ ఆఫ్రికా చరిత్రను పాటల రూపంలో వివరించే సంప్రదాయానికి సెనగల్ ప్రత్యేకత కలిగి ఉంది. సెనగల్ వృత్తికళాకారులైన " గ్రియాట్లు " పశ్చిమ ఆఫ్రికా చరిత్రను పదాలు, సంగీతం ద్వారా వేలాది సంవత్సరాలుగా సజీవంగా ఉంచారు. గ్రిట్ వృత్తి ఒక తరం నుండి మరొక తరానికి వంశపారంపర్యంగా అందించబడుతుంది. ఈ క్రమంలో కళాకారులు సంగీతంలో సంవత్సరాల కాలం శిక్షణతీసుకుంటూ శిష్యరికం చేస్తుంటారు. గ్రియాట్లు తరతరాలుగా పశ్చిమ ఆఫ్రికా సమాజంలోని తరాలకు సంగీతస్వరాలు అందిస్తున్నారు.[13]
2010 లో డాకర్లో నిర్మించిన ఆఫ్రికన్ పునరుజ్జీవనోద్యమ స్మారకచిహ్నం ఆఫ్రికాలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. డాకర్ రెసిడాక్ అనే చలన చిత్రోత్సవాన్ని కూడా ఆతిథ్యం ఇస్తుంది. [62]
సెనెగల్ అట్లాంటిక్ మహాసముద్రం సరిహద్దులో ఉన్నందున ఆహారంలో చేపలు చాలా ముఖ్యపాత్రవహిస్తున్నాయి. దేశంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న కారణంగా కోడిమాంసం, గొర్రెమాంసం, బఠానీలు, గుడ్లు, గొడ్డు మాంసం కూడా సెనెగల్ వంటలో ఉపయోగిస్తారు కాని పంది మాంసం ఉపయోగించరు. సెనెగల్ ప్రాధమిక పంట అయిన వేరుశెనగ, అలాగే కౌస్కాస్, బియ్యం, చిలగడదుంపలు, కాయధాన్యాలు, బఠానీలు, వివిధ కూరగాయలు కూడా అనేక వంటకాలలో చేర్చబడుతుంటాయి. మాంసాలు, కూరగాయలను సాధారణంగా మూలికలు, సుగంధ ద్రవ్యాలలో ఉడికించడం, ఊరబెట్టడం చేసిన తరువాత అన్నం లేదా కౌస్కాస్ మీద పోసి, రొట్టెతో కలిపి తింటారు.
బిస్సాప్, అల్లం, బాయ్ ('బూయ్' అని ఉచ్ఛరిస్తారు, ఇది బయోబాబ్ చెట్టు యొక్క పండు, దీనిని "మంకీ బ్రెడ్ ఫ్రూట్" అని కూడా పిలుస్తారు) చేసే తాజా రసాలు తీసుకుంటారు. అదనంగా మామిడి లేదా ఇతర పండ్లు లేదా అడవి చెట్లు (అత్యంత ప్రసిద్ధ సోర్సాప్, దీనిని ఫ్రెంచిలో కొరోసోల్ అంటారు)చేసే రసాలు కూడా తీసుకుంటారు. భోజనానంతర ఆహారాలలో తీపి పదార్ధాలు అధికంగా ఉంటాయి. సెనెగల్ పాక పద్ధతుల మీద స్థానిక పదార్థాలతో చేసిన ఆహారాలే కాక ఫ్రెంచి ప్రభావిత ఆహారాలు ఉంటాయొ. సెనెగల్ ఆహారం తరచూ తాజా పండ్లతో వడ్డిస్తారు. తరువాత సాంప్రదాయకంగా కాఫీ లేదా టీ అందిస్తారు.
సెనెగల్ సంగీత వారసత్వం ఆఫ్రికా అంతటా ప్రసిద్ది చెందింది. సెరర్ పెర్క్యూసివ్ సాంప్రదాయం నుండి ముఖ్యంగా న్జుప్ నుండి ఉద్భవించిన బాలాక్సు సంగీతం అధిక ప్రజాదరణ పొందింది. దీనిలో యూసౌ ఎన్'డౌర్, ఒమర్ పెనే, ఇతరులు ప్రాచుర్యం పొందారు. ముఖ్యంగా ఇందులో సబర్ డ్రమ్మింగ్ ప్రాచుర్యం పొందింది. వివాహాలు వంటి ప్రత్యేక వేడుకలలో సబార్ ఎక్కువగా ఉపయోగించబడుతుంది. మరొక పరికరం, టామా, ఎక్కువ జాతి సమూహాలలో ఉపయోగించబడుతుంది. ఇతర ప్రసిద్ధ అంతర్జాతీయ ప్రఖ్యాత సెనెగల్ సంగీతకారులలో ఇస్మాయిల్ లొ, చెఖ్ లొ, ఆర్కెస్ట్రా బ్రొబాబ్, బాబా మాల్, ఎకాన్ థియోన్ సెక్, వివియానె, ఫల్లౌ డియాంగు టిటి, పాపె డియోఫ్ ప్రాబల్యత సాధించారు
సెనెగల్ సంస్కృతిలో ఆతిథ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఇది జాతీయ గుర్తింపులో భాగంగా పరిగణించబడుతుంది. ఆతిథ్యానికి వోలోఫ్[63] పదం "తెరంగ" ఉపయోగిస్తారు. సెనెగల్ గౌరవంగా గుర్తించబడింది. జాతీయ ఫుట్‌బాల్ జట్టును లయన్స్ ఆఫ్ టెరంగ అని పిలుస్తారు.[13]
సెనెగలులో అనేక క్రీడలు ప్రాచుర్యం పొందాయి. రెజ్లింగు, ఫుట్‌బాల్ దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందాయి. 2022లో సెనగలులోని డాకర్లో సమ్మర్ యూత్ ఒలింపిక్సు నిర్వహించనుంది. ఇది ఒలింపిక్ క్రీడల ఆతిథ్యంలో సెనెగలును మొదటి ఆఫ్రికన్ కౌంటరుగా చేస్తుంది.[64][65]
సెనగలులో రెజ్లింగు (ముష్టియుద్ధం) అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడగా ఉంది.[66] ఇది జాతీయ ముట్టడిగా మారింది.[67] ఇది సాంప్రదాయకంగా చాలా మంది యువకులకు పేదరికం నుండి బయటపడటానికి ఉపయోగపడుతుంది. స్వతంత్రంగా అభివృద్ధి చెందిన ఏకైక క్రీడగా ఇది గుర్తించబడుతుంది.
సెనెగల్‌లో క్రీడరంగంలో ఫుట్‌బాల్ అత్యంత ప్రాచుర్యం పొందింది. 2002 - 2019 సంవత్సరాలలో ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్‌లో జాతీయ జట్టు రన్నరుగా నిలిచింది. ఫిఫా ప్రపంచ కప్‌లో క్వార్టర్ ఫైనలుకు చేరుకున్న మూడు ఆఫ్రికా జట్లలో ఒకటిగా నిలిచింది. వారి మొదటి గేంలో ఫ్రాంసును ఓడించింది. సెనెగలులో ప్రాచుర్యం పొందిన ఆటగాళ్లలో ఎల్ హడ్జీ డియోఫ్, ఖలీలో ఫాడిగా, హెన్రీ కమారా, పాపా బౌబా డియోప్, సలీఫ్ డియావో, కలిడౌ కౌలిబాలీ, ఫెర్డినాండ్ కోలీ, సాడియో మానే ఉన్నారు. వీరంతా ఐరోపాలో ఆడారు. సెనెగల్ గ్రూప్ హెచ్లో జపాన్, కొలంబియా, పోలాండులతో పాటురష్యాలో 2018 ఫిఫా ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది.
సెనెగలులో బాస్కెట్‌బాల్ కూడా ఒక ప్రసిద్ధ క్రీడగా ఉంది. ఆఫ్రికా ఆధిపత్య బాస్కెట్‌బాల్ శక్తులలో సెనెగల్ ఒకటిగా ఉంది. "2014 ఎఫ్.ఐ.బి.ఎ." ప్రపంచ కప్పులో పురుషుల జట్టు ఇతర ఆఫ్రికన్ దేశాల కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. అక్కడ వారు మొదటిసారి ప్లేఆఫ్‌కు చేరుకున్నారు. మహిళా జట్టు 20 ఆఫ్రికా ఛాంపియన్‌షిప్‌లో 19 పతకాలు గెలుచుకుంది. ఏ ఇతర పోటీదారుల కంటే ఈ జట్టు రెట్టింపు పతకాలు సాధించింది.
2016 లో ఎన్.బి.ఎ. సెనెగలులో ఆఫ్రికా ఎలైట్స్ అకాడమీని ప్రారంభించినట్లు ప్రకటించింది.[68]
1979 - 2007 వరకు సెనెగల్ పారిస్-డాకర్ ర్యాలీని నిర్వహించింది. డాకర్ ర్యాలీని "ఆఫ్-రోడ్ ఎండ్యూరెంస్ మోటార్‌స్పోర్ట్ రేసు" అంటారు. ఇది ఫ్రాన్సు రాజధాని నుండి సెనెగల్ రాజధాని డాకర్ వరకు ఒక రేసును నిర్వహిస్తుంది. కష్టతరమైన భౌగోళిక మార్గాలను దాటడానికి పోటీదారులు ఆఫ్-రోడ్ వాహనాలను ఉపయోగించారు. మౌరిటానియాలో భద్రతా సమస్యల కారణంగా ఈ కార్యక్రమానికి ఒక రోజు ముందు 2008 ర్యాలీని రద్దు చేసారు. చివరి రేసు 2007 లో జరిగింది.[69]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.