యునిసెఫ్
From Wikipedia, the free encyclopedia
యునిసెఫ్ (ఆంగ్లం: UNICEF) ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు మానవతా, అభివృద్ధి సహాయాన్ని అందించే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ.[1][2] దీని పూర్తి పేరు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. అయితే ఇప్పుడు అధికారికంగా యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ గా పిలువబడుతోంది. 192 దేశాలు, టెర్రటరీస్[3] లలో ఉనికిని కలిగి ఉన్న ఈ ఏజెన్సీ ప్రపంచంలో అత్యంత విస్తృతమైన సామాజిక సంక్షేమ సంస్థలలో ఒకటి. దీని కార్యకలాపాలలో ప్రధానంగా వ్యాధి నిరోధక టీకాలు, ఎయుడ్స్ సోకిన పిల్లలు, తల్లులకు చికిత్స అందించడం, మాతా శిశు పోషణను మెరుగుపరచడం, పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, విద్యను ప్రోత్సహించడం, విపత్తులకు ప్రతిస్పందనగా అత్యవసర సహాయాన్ని అందించడం వంటివి ఉన్నాయి.[4]
![]() | |
---|---|
![]() | |
![]() | |
Org type | నిధి |
Status | 11 డిసెంబరు 1946 నుంచి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి అందిస్తున్న సంస్థ |
Headquarters | న్యూయార్క్ సిటీ, యు.ఎస్.ఎ |
Website | www.unicef.org |

1946 డిసెంబరు 11న న్యూయార్క్‌లో యు.ఎన్. రిలీఫ్ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రభావితమైన పిల్లలు, తల్లులకు తక్షణ ఉపశమనం అందించడానికి యునిసెఫ్ రూపొందించబడింది. అదే సంవత్సరం యు.ఎన్. జనరల్ అసెంబ్లీ యునిసెఫ్‌ను యుద్ధానంతర సహాయ కార్యక్రమాలను మరింత సంస్థాగతీకరించడానికి ఏర్పాటు చేసింది.[5] 1950లో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో పిల్లలు, మహిళల దీర్ఘకాలిక అవసరాలను పరిష్కరించడానికి దాని ఆదేశం పొడిగించబడింది. 1953లో ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి వ్యవస్థలో శాశ్వత భాగమైంది. తదనంతరం యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యునిసెఫ్) పేరును యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ గా మార్చబడింది, అయినప్పటికీ అసలు సంక్షిప్త రూపమైన యునిసెఫ్ అలాగే కొనసాగుతోంది.[6]
యునిసెఫ్ పూర్తిగా ప్రభుత్వాలు, ప్రైవేట్ దాతల నుండి స్వచ్ఛంద విరాళాలపై ఆధారపడుతుంది. 2020 నాటికి దాని మొత్తం ఆదాయం $7.2 బిలియన్లు; ఇందులో ప్రభుత్వ రంగ భాగస్వాములు $5.45 బిలియన్లు అందించారు.[7] ఇది 36-సభ్యుల కార్యనిర్వాహక బోర్డుచే నిర్వహించబడుతుంది. ఈ బోర్డు విధివిధానాలను ఏర్పాటు చేస్తుంది. ప్రోగ్రామ్‌లను ఆమోదిస్తుంది. పరిపాలనా, ఆర్థిక ప్రణాళికలను పర్యవేక్షిస్తుంది. సాధారణంగా మూడు సంవత్సరాల కాలానికి ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి (United Nations Economic and Social Council) చే ఎన్నుకోబడిన ప్రభుత్వ ప్రతినిధులతో బోర్డు రూపొందించబడుతుంది.
యునిసెఫ్ ప్రాంతీయ కార్యాలయాలు
ఈ కింది దేశాలలో UNICEF ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.[8]
అమెరికాస్, కరేబియన్ ప్రాంతీయ కార్యాలయం, పనామా సిటీ, పనామా
ఐరోపా, మధ్య ఆసియా ప్రాంతీయ కార్యాలయం, జెనీవా, స్విట్జర్లాండ్
తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతీయ కార్యాలయం, బ్యాంకాక్, థాయిలాండ్
తూర్పు, దక్షిణ ఆఫ్రికా ప్రాంతీయ కార్యాలయం, నైరోబి, కెన్యా
మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్రాంతీయ కార్యాలయం, అమ్మన్, జోర్డాన్
దక్షిణాసియా, ఖాట్మండు, నేపాల్
పశ్చిమ, మధ్య ఆఫ్రికా ప్రాంతీయ కార్యాలయం, సెనెగల్
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.