Remove ads
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో సిద్ధార్థనగర్ జిల్లా (హిందీ:सिद्धार्थनगर ज़िला) (ఉర్దు: سدھارتھ نگر ضلع) ఒకటి. నౌగఢ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. సిద్ధార్థనగర్ జిల్లా బస్తీ డివిజన్లో భాగంగా ఉంది. జిల్లాకేంద్రం నౌగఢ్‌కు 22 కి.మీ దూరంలో ఉన్నపిప్రాలి గ్రామంలో శాక్య జనపద శిథిలాలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎ వర్గానికి చెందిన జిల్లాలలో సిద్ధార్థనగర్ జిల్లా ఒకటి. 2001 సాంఘిక, ఆర్థిక సూచికలు, అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్లా అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది..[1]
సిద్ధార్థనగర్ జిల్లా
సిద్ధార్థనగర్ | |
---|---|
జిల్లా | |
Coordinates: 27°0′N 82°45′E - 27°28′N 83°10′E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజన్ | బస్తీ |
విస్తీర్ణం | |
• Total | 2,752 కి.మీ2 (1,063 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 25,53,526 |
• జనసాంద్రత | 882/కి.మీ2 (2,280/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN CODE | 272207 |
Vehicle registration | UP 55 |
అక్షరాస్యత | 67.81 per cent% |
రాజకుమారూడు సిద్ధార్ధ ఇక్కడ జన్మించినందున ఈ జిల్లాకు ఈ పేరు నిర్ణయించబడింది. ఙానోదయం రావడానికి ముందు గౌతమ బుద్ధుని పేరు సిద్ధార్ధుడు. 29 సంవత్సరాల ముందు వరకు బుద్ధుడు కపిలవస్తులో నివసించాడు.
సిద్ధార్ధ్ నగర్ జిల్లా 1988 డిసెంబరు 29న బస్తీ జిల్లా ఉత్తర భూభాగం నుండి కొంతభూభాగం వేరుచేసి రూపొందించబడింది. ప్రస్తుతం పిప్రవ (సిద్ధార్ధ్ నగర్‌కు 22కి.మీ) పురాతన కపిలవస్తు నగరమని భావిస్తున్నారు. కపిలవస్తు నగరంలో గౌతమ బుద్ధుడు జన్మించి ఆరంభకాల జీవితం గడిపాడు. కపిలవస్తు శాఖ్యరాజ్యానికి రాజధానిగా ఉండేది. అందుకని గౌతమ బుద్ధుడిని శాఖ్యముని అని కూడా అంటారు. క్రీ.పూ 6వ శతాబ్దంలో ఉన్న 16 స్వతంత్ర రాజ్యాలలో శాఖ్యరాజ్యం ఒకటి. రాజకుమారుడు గౌతముడు తన 29వ సంవత్సరంలో కపులవస్తు నగరాన్ని విడిచి తరువాత 12 సంవత్సరాలకు తిరిగి కపిలవస్తు నగరంలో ప్రవేశించాడు. .
ప్రస్తుత కపిలవస్తులో పలు గ్రామాలు ఉన్నాయి. పిప్రవ, గంవరియా. పురాత ప్రదేశంలో గౌతమబుద్ధుని అస్థికలు నిక్షేపించిన బృహత్తర స్థూపం నిర్మించబడి ఉంది. పిప్రవలో పురాతన బ్రాహ్మీ శిలాక్షరాలు లభించాయి. రాజాభవన శిథిలాలు విశాలమైన ప్రాంగణమంతా విస్తరించి ఉన్నాయి. ఆర్కిటెక్చురల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన త్రవ్వకాలలో లభించిన వస్తువుల ఆధారంగా ఈ ప్రాంతంతో కుషానులకు సంబంధం ఉందని భావిస్తున్నారు. స్థూపం వద్ధ నిర్వహించిన త్రవ్వకాలలలో ఇక్కడ దేవపుత్ర పేరుతో ఒక పురాతన స్థూపంఉండేదని ౠజువైంది. దగ్గరదగ్గరా ఉన్న రెండు గుట్టల వద్ద త్రవ్వకాలను నిర్వహించినప్పుడు శుద్ధోధనుని రాజభవన చుహ్నాలు బయటపడ్డాయి.
జిల్లాలోని ప్రఖులలో అహ్మద్ హుస్సేన్ అక్రహ్ర, ఖజురియా, బాద్షా మెహ్ది హసన్ ఖాన్ ఖజురియా, స్వాతంత్ర్య సమరయోధుడు ఖాజీ అదీల్ అబ్బాసి, ఖాజీఇఫ్టేఖర్, అహ్మద్, లేట్ హాజీ నూరుల్ హక్ (నౌఘర్ బజార్), మౌలానా అబ్దుల్ ఖయ్యూం రహ్మాన్. భారతదేశం, మౌలానా అబ్దుల్ ఖయ్యూం రహ్మాన్ మొదలైన వారు ప్రధానమైనవారు. మౌలానా అబ్దుల్ ఖయ్యూం రహ్మాన్ కాంగ్రెస్ ప్రముఖ నాయకుడిగా పేరు పొందిన తరువాత విభజన సమయంలో మతతత్వ అల్లర్లు, హత్యాకాండ కారణంగా వికల మనస్కుడై రాజకీయాలను త్యజించి తన స్వగ్రామం అయిన దుధ్వానియా గ్రామంలో తన శేషజీవితం గడిపాడు. స్వాతంత్ర్య సమరయోధుడు ప్రభుదయాళ్ విద్యార్థిసేవాగ్రాం వద్ద ఖైదుచేయబడి మహారాష్ట్ర లోని నాగపూర్‌లో 1942- 1945 వరకు జైలులో బంధించబడ్డాడు. ఫరెండా - బర్హిని సరస్వతి రహదారిలో ఉన్న వంతెనకు " ప్రభుదయాళ్ విద్యార్థివనగంగా వంతెన " అని నామకరణం చేయబడింది. .[2]
సిద్ధార్ధ్ నగర్ 27°నుండి 27°28' ఉత్తర అక్షాంశం 82°45' నుండి 83°10' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో నేపాల్ దేశంలోని కపిలవస్తు జిల్లా, ఈశాన్య సరిహద్దులో నేపాల్ దేశంలోని రూపందేహి జిల్లా, తూర్పు సరిహద్దులో మహారాజ్‌గంజ్ జిల్లా, దక్షిణ సరిహద్దులో బస్తీ జిల్లా, సంత్ కబీర్ నగర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో బలరాంపూర్ జిల్లా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 2,752 చ.కి.మీ.
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ... జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]
విషయాలు | వివరణలు |
---|---|
తాలూకాలు | నౌఘర్, షొహ్రత్గర్, బంసి, ఇత్వా (సిద్ధార్థనగర్), డొమరియాగంజ్ |
అసెంబ్లీ నియోజక వర్గం | 5 షొహ్రత్గర్, కపిలవస్తు, బస్తీ, ఇత్వా,, డొమరియాగంజ్ . |
పార్లమెంటు నియోజక వర్గం | డొమరియాగంజ్ |
జిల్లాలో పలు ఆకర్షణీయ ప్రదేశాలు ఉన్నాయి:-
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,553,526, [9] |
ఇది దాదాపు. | కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[10] |
అమెరికాలోని. | నవాడా నగర జనసంఖ్యకు సమం.[11] |
640 భారతదేశ జిల్లాలలో. | 164 వ స్థానంలో ఉంది.[9] |
1చ.కి.మీ జనసాంద్రత. | 882 [9] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 25.17%.[9] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 970:1000 [9] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 67.81%.[9] |
జాతియ సరాసరి (72%) కంటే. | |
మైనారిటీలు | 27% |
సోషియో ఎకనమిక్ అంతస్తు | ఎ [12] |
ఈ జిల్లా రాజకీయ వ్యక్తిత్వాలను, జాతీయ చిహ్నాలు అనేక ఉత్పత్తి చేసింది.
* లెఫ్టినెంట్ మంత్రి దినేష్ సింగ్ 2003 లో సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వం స్థాపనలోలో ముఖ్యమైన పాత్ర పోషించిన వారిలో ఒకరు.
ఈ జిల్లాలోని బర్హిని మండలంలో ఇమాలియా అనే ఒక చిన్న గ్రామానికి చెందినవాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.