From Wikipedia, the free encyclopedia
వాల్టర్ ఎలియాస్ డిస్నీ (1901 డిసెంబరు 5 - 1966 డిసెంబరు 15) ఒక అమెరికన్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, డబ్బింగ్ కళాకారుడు, వ్యాపారవేత్త. తన యానిమేషన్ చిత్రాల ద్వారా, యానిమేషన్ పరిశ్రమ ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన వ్యక్తి. వాల్ట్‌డిస్నీగా ప్రసిద్ధిచెందిన ఇతను అమెరికన్ యానిమేషన్ పరిశ్రమకు ఆద్యునిగా, మార్గదర్శిగా నిలిచాడు, కార్టూన్ల నిర్మాణంలో ఎన్నో వినూత్నమైన పద్ధతులను ప్రవేశపెట్టాడు. అతిఎక్కువ ఆస్కార్ అవార్డులు పొందిన వ్యక్తిగా సినీ నిర్మాతగా 59 ప్రతిపాదనల నుంచి 22 ఆస్కార్లు పొంది అతను రికార్డు సృష్టించాడు. అతనికి రెండు గోల్డెన్ గ్లోబ్ స్పెషల్ అఛీవ్మెంట్ అవార్డులు, ఎమ్మీ అవార్డు వంటి పురస్కారాలు పొందాడు. అతను తీసిన పలు చలనచిత్రాలు అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారి నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో స్థానం పొందాయి.
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
వాల్ట్ డిస్నీ | |
---|---|
జననం | వాల్టర్ అలియాస్ డిస్నీ 1905 డిసెంబర్ 05 చికాగో ఇల్లినాయిస్, అమెరికా |
మరణం | 1966 డిసెంబర్ 15 |
వృత్తి | చిత్రనిర్మాత, సహ-స్థాపకుడు వాల్ట్ డిస్నీ కంపెనీ, పాత పేరు వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ |
భార్య / భర్త | లిల్లియన్ బౌండ్స్ డిస్నీ |
పిల్లలు | డైన్ డిస్నీ(జ.1933), షరాన్ డిస్నీ (1936-1993) |
1901లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని చికాగో నగరంలో జన్మించిన డిస్నీ చిన్ననాటే డ్రాయింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. అతను చిన్నతనంలో ఆర్ట్స్ క్లాసులకు హాజరయ్యేవాడు, 18వ ఏటనే చిత్రకారునిగా ఉద్యోగం సంపాదించాడు. 1920ల్లో కాలిఫోర్నియాలో మకాంపెట్టి, తన సోదరుడు రాయ్ డి.డిస్నీతో కలిసి డిస్నీ బ్రదర్స్ స్టూడియో స్థాపించాడు. చిత్రకారుడు, యానిమేటర్ అబ్ ఇవెర్క్స్తో కలిసి 1928లో అత్యంత ప్రాచుర్యం పొందిన పాత్ర మిక్కీ మౌస్‌ను సృష్టించి, మొట్టమొదటిసారి ప్రాచుర్యం, ఘనవిజయం చవిచూశాడు. మొదట కొన్నేళ్ళపాటు పాత్రలకు గొంతునిచ్చాడు. స్టూడియో అభివృద్ధి చెందిన కొద్దీ డిస్నీ మరింత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు, సింక్రొనైజ్డ్ సౌండ్, ఫుల్-కలర్, త్రీ స్ట్రిప్ టెక్నీకలర్, పూర్తి నిడివి సినిమాగా కార్టూన్లు, కెమెరాల విషయంలో సాంకేతకాభివృద్ధి వంటివి చేపట్టాడు. వీటి ఫలితాలు యానిమేటెడ్ చలనచిత్రాల ప్రగతిని ముందుకుతీసుకువెళ్తూ - స్నోవైట్ అండ్ ద సెవెన్ డ్వార్ఫ్స్ (1937), పినోకియో, ఫాంటాసియా (రెండూ 1940లో), డంబో (1941), బంబి (1942) వంటి పూర్తి నిడివి చలనచిత్రాల రూపంలో కనిపించాయి. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత కొత్త యానిమేటెడ్, లైవ్-యాక్షన్ సినిమాలు యానిమేటెడ్ చలనచిత్రాలను మరింత అభివృద్ధి చేస్తూ నిర్మించారు. వీటిలో విమర్శకుల ప్రశంసలను అందుకున్న సిండ్రెల్లా, మారీ పాపిన్స్ (1964) ఈ క్రమంలోనే వచ్చాయి. మారీ పాపిన్స్ సినిమాకు ఐదు ఆస్కార్ అవార్డులు లభించాయి.
1950ల్లో అమ్యూజ్మెంట్ పార్కు రంగంలో డిస్నీ అడుగుపెట్టాడు, 1955లో డిస్నీలాండ్ ప్రారంభించాడు. డిస్నీలాండ్నువాల్ట్డిస్నీస్ డిస్నీలాండ్, ద మిక్కీమౌస్ క్లబ్ వంటి టెలివిజన్ కార్యక్రమాల రూపకల్పనకు నిధులు సమకూర్చుకునేందుకే డిస్నీలాండ్ ప్రారంభించాడు; అతను 1959 మాస్కో ఫెయిర్ అన్న అమెరికన్ జాతీయ ఎగ్జిబిషన్, 1960 వింటర్ ఒలింపిక్స్, 1964 న్యూయార్క్ వరల్డ్స్ ఫెయిర్ వంటివాటి నిర్వహణలో పాలుపంచుకున్నాడు. 1965లో డిస్నీవరల్డ్ అనే మరో థీమ్‌పార్కును కొత్త తరహా నగరంగా అభివృద్ధి చేయడం ప్రారంభించిన ఎక్సపరిమెంటల్ ప్రోటోటైప్ కమ్యూనిటీ ఆఫ్ టుమారో (ఈపీసీఓటీ) అన్న ప్రయోగాత్మకమైన భావి నగరపు నడిబొడ్డున అభివృద్ధ చేయడం ప్రారంభించాడు. డిస్నీ జీవితకాలమంతా విపరీతంగా పొగతాగేవాడు, దానితో ఊపిరితిత్తుల కాన్సర్ సోకి 1966 డిసెంబరులో డిస్నీవరల్డ్ కానీ, ఈపీసీఓటీ ప్రాజెక్టు కానీ పూర్తయ్యేలోగానే మరణించాడు.
వాల్ట్ డిస్నీ 1901 డిసెంబరు 5న చికాగోలోని హెర్మోసా ప్రాంతంలో 1249 ట్రిప్ అవెన్యూలో జన్మించాడు.[a] వాల్ట్ డిస్నీ తండ్రి ఐరిష్ మూలాలున్న ఎలియాస్ డిస్నీ, తల్లి అమెరికాలో స్థిరపడ్డ జర్మన్, ఇంగ్లీష్ తల్లిదండ్రుల కుమార్తె అయిన ఫ్లోరా (జన్మనామం కాల్).వాల్ట్ డిస్నీతన తల్లిదండ్రులకు నాలుగో కొడుకు.[2][3][b] ఎలియాస్, కాల్ దంపతులకు హెర్బర్ట్, రేమండ్, రాయ్‌లు డిస్నీ కన్నా ముందు జన్మించిన ముగ్గురు కొడుకులు కాగా, రూత్ అనే కూతురు డిస్నీ తర్వాత పుట్టింది. [6] 1906లో డిస్నీకి నాలుగేళ్ళ వయసప్పుడు మిస్సోరీలోని మార్సెలిన్ అనే ప్రాంతంలో తమ బంధువైన రాబర్ట్ కొనుగోలు చేసిన ఒక వ్యవసాయ క్షేత్రానికి ఎలియాస్ డిస్నీ కుటుంబ సమేతంగా మారాడు. మార్సెలిన్లో చుట్టుపక్కల నివసించే విశ్రాంత వైద్యుడు ఒకతను డిస్నీతో తన గుర్రం బొమ్మ గీయించుకుని అందుకు డబ్బిచ్చాడు. ఆ తర్వాత నుంచి డిస్నీకి బొమ్మలు గీయడంలో ఆసక్తి పెరిగింది.[7] ఎలియాస్ అప్పీల్ టు రీజన్ అనే పత్రిక తెప్పించుకునేది, ఆ పత్రిక మొదటి పేజీలో ప్రచురించే రియాన్ వాకర్ కార్టూన్లు చూసి తిరిగి వేస్తూ డిస్నీ బొమ్మలు వేయడం సాధన చేసేవాడు.[8] ఆ దశలోనే నీటి రంగులు, క్రేయాన్లు వాడగలిగే సామర్థ్యం సంపాదించాడు.[3] అతను అప్పట్లో అట్కిన్సన్, టోపెకా, శాంటాఫె రైల్వే లైను సమీపంలో జీవిస్తూ, రైళ్ళ పట్ల విపరీతమైన ఇష్టం పెంచుకున్నాడు.[9] 1909 చివరల్లో అతను, అతని చెల్లెలు రూత్ ఒకేసారి మార్సెలిన్లో పార్క్ స్కూల్లో చేరారు.[10]
1911లో డిస్నీ కుటుంబం మిస్సోరీ రాష్ట్రంలోని కన్సాస్ నగరానికి మారారు.[11] అక్కడ వాల్ట్ డిస్నీ బెంటన్ గ్రామర్ స్కూల్లో చేరాడు, అక్కడే తోటి విద్యార్థి వాల్టర్ ఫీఫర్ని కలిశాడు. వాల్టర్ ఫీఫర్ది నాటక రంగంపై మంచి అభిరుచి ఉన్న కుటుంబం. అతను డిస్నీకి అప్పట్లో ప్రాచుర్యంలో ఉన్న వాడెవిల్లే అన్న రంగస్థల కళారూపాన్ని, సినిమాలను పరిచయం చేశాడు. 1880ల నుంచి 1930ల వరకూ అమెరికాలో ప్రాచుర్యం పొందిన వాడెవిల్లే అన్న రంగస్థల కళారూపం. అమెరికాలోనూ, చైనాలోనూ వాడవిల్లే సినిమా ప్రారంభానికి, వికాసానికి ఒక పూర్వరంగంగా ఉపయోగపడింది.
క్రమక్రమంగా డిస్నీ తన సమయాన్ని ఇంటి దగ్గర కన్నా ఎక్కువ ఫీఫర్ ఇంటి దగ్గరే గడపసాగాడు.[12] ఎలియాస్ కన్సాస్ సిటీ స్టార్, కన్సాస్ సిటీ టైమ్స్ అన్న వార్తాపత్రికలు ఒక ప్రాంతంలో పంపిణీ చేయడానికి అవకాశాన్ని కొనుగోలు చేశాడు. డిస్నీ, అతని అన్న రాయ్ ప్రతీరోజూ 4:30కి లేచి టైమ్స్ పత్రికను స్కూలు ప్రారంభం కాక ముందే చందాదారులకు ఇంటింటికీ తిరుగుతూ వేసేవారు, మళ్ళీ సాయంత్రం స్కూలు తర్వాత అదే మార్గం అనుసరిస్తూ స్టార్ పత్రిక పంచేవాడు. ఈ పనీ, చదువూ రెండూ సాగించడం చాలా అలసట కలిగించేది, క్లాసుల్లో అలసటతో కళ్ళుమూతలుపడుతూండడంతో తరచు మార్కులు తగ్గేవి, ఐతే ఎంత ఇబ్బందిగా ఉన్నా ఈ పేపర్ రూట్ ఆరేళ్ళకు పైన కొనసాగింది.[13] అతను కన్సాస్ సిటీ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో శనివారపు క్లాసులకు హాజరయ్యేవాడు, కార్టూనింగ్‌లో కరస్పాండెన్స్ కోర్సు పూర్తిచేశాడు.[3][14]
1917లో చికాగో జెల్లీ తయారీ కంపెనీ ద 0 జెల్ కంపెనీలో వాటా కొని, కుటుంబంతో చికాగో తరలివెళ్ళాడు.[15] డిస్నీని మెక్కింగ్లే హైస్కూల్లో చేర్చారు, అక్కడ అతను పాఠశాల పత్రికకు కార్టూనిస్టు అయి మొదటి ప్రపంచ యుద్ధం గురించి దేశభక్తియుతమైన బొమ్మలు గీయసాగాడు;[16][17] చికాగో అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో రాత్రి పూట కోర్సు తీసుకుని చేశాడు.[18] 1918 మధ్యకాలంలో డిస్నీ అమెరికన్ సైన్యంలో చేరి జర్మన్లకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రయత్నించినా, మరీ చిన్నవయసు అన్న కారణంగా అతనిని సైన్యం తిరస్కరించింది. తన వయస్సును జనన ధ్రువపత్రంపై దిద్ది వయసు పెంచి రాసుకుని, దాని ఆధారంగా 1918 సెప్టెంబరు నాటికి రెడ్ క్రాస్‌లో అంబులెన్స్ డ్రైవరుగా చేరాడు. అతనిని ఫ్రాన్సు పంపడానికి ఓడ ఎక్కించారు, కానీ యుద్ధం పూర్తికావడంతో వెనక్కి తిరిగి వచ్చేశాడు.[19] అంబులెన్సు అలంకరణ కోసం అంబులెన్సుపై అటూ ఇటూ కార్టూన్లు గీశాడు, వాటిలో కొన్ని సైనిక వార్తాపత్రిక స్టార్స్ అండ్ స్ట్రైప్స్‌లో ప్రచురించారు.[20] అక్టోబరు 1919లో డిస్నీ కన్సాస్ నగరం తిరిగివచ్చి[21] ద పెస్మెన్-రూబిన్ కమర్షియల్ ఆర్ట్ స్టూడియోలో అప్రెంటిస్ కళాకారుడిగా చేరాడు. అక్కడ ప్రకటనలు, రంగస్థల ప్రదర్శనలకు అతను బొమ్మలు వేసేవాడు. తోటి కళాకారుడైన అబ్ ఇవెర్క్స్తో స్నేహం అక్కడే మొదలైంది.[22]
1920 జనవరిలో పెస్మెన్-రూబిన్ సంస్థ వ్యాపారంక్రిస్మస్ తర్వాత మందగించడంతో డిస్నీ, ఇవెర్క్స్ల ఉద్యోగాలు పోయాయి. వారు ఇవెర్క్స్-డిస్నీ కమర్షియల్ ఆర్టిస్ట్స్ అనే వ్యాపార సంస్థ ప్రారంభించారు.[23] ఎక్కువమంది ఖాతాదారులను సంపాదించడంలో విఫలం కావడంతో డిస్నీ తాత్కాలికంగా డబ్బు సంపాదించేందుకు ఎ.వి.కాగర్ నడిపించే కన్సాస్ సిటీ ఫిల్మ్ యాడ్ కంపెనీలో చేరాలని వారిద్దరూ నిర్ణయానికి వచ్చారు; ఒంటరిగా వ్యాపారాన్ని నిర్వహించలేక తర్వాతి నెలలోనే ఇవెర్క్స్ కూడా అదే కంపెనీలో చేరిపోవాల్సివచ్చింది.[24] కన్సాస్ సిటీ యాడ్ కంపెనీ కట్అవుట్ యానిమేషన్ టెక్నిక్ ఉపయోగించి ప్రకటనలు తయారుచేసేది.[25] మట్ అండ్ జెఫ్, కోకో ద క్లౌన్ లాంటి గీసిన కార్టూన్ల వైపే మొగ్గుచూపినా, డిస్నీకి ఈ యానిమేషన్ కూడా నేర్చుకోవడానికి ఆసక్తి కలిగింది. యానిమేషన్ మీద ఓ పుస్తకాన్ని, కెమెరానీ అరువుతెచ్చుకుని ఇంట్లోనే ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు.[26][c] ఆ క్రమంలో కట్అవుట్ పద్ధతి కన్నా సెల్ యానిమేషన్ మెరుగైనదని నిర్ణయానికి వచ్చాడు.[d] కంపెనీలో సెల్ యానిమేషన్ ఉపయోగించడానికి కాగర్ని ఒప్పించలేక డిస్నీ, తన సహోద్యోగి ఫ్రెడ్ హెర్మన్‌తో కలిసి కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టాడు.[28] వాళ్ళ ప్రధాన ఖాతాదారు స్థానిక న్యూమేన్ థియేటర్, వాళ్ళు రూపొందించిన చిన్న కార్టూన్లను "న్యూమాన్స్ లాఫ్-ఓ-గ్రామ్స్"కి అమ్మేవారు.[29] డిస్నీ తన కార్టూన్లకు నమూనా కోసం పాల్ టెర్రీ రూపొందించిన ఈసప్ ఫేబుల్స్ను తీసుకున్నాడు, డిస్నీ రూపొందించిన మొదటి ఆరు "లాఫ్-ఓ-గ్రామ్స్" ఆధునికీకరించిన ఫెయిరీ టెయిల్స్ (దేవకన్యలు ప్రధానంగా ఉండే ఐరోపా జానపద కథలు).[30]
"లాఫ్-ఓ-గ్రామ్" విజయవంతం కావడంతో 1921 మేలో లాఫ్-ఓ-గ్రామ్ స్టూడియో ప్రారంభించి ఫ్రెడ్ హెర్మన్ సోదరుడు హు, రూడో, ఇవెర్క్స్ సహా మరికొందరు యానిమేటర్లను నియమించుకున్నాడు.[31] "లాఫ్-ఓ-గ్రామ్స్" కార్టూన్లు కంపెనీ నడపడానికి తగ్గ ఆదాయం ఇవ్వలేకపోవడంతో డిస్నీ అసైస్'స్ అడ్వంచర్స్ ఇన్ వండర్లాండ్ (ఆంగ్లం:Alice's adventures in Wonderland) అన్న పుస్తకం ఆధారంగా లైవ్ యాక్షన్‌తో యానిమేషన్ కలిపి అలైస్'స్ వండర్లాండ్ (ఆంగ్లం: Alice's Wonderland) అన్న సినిమా నిర్మాణం మొదలుపెట్టాడు; అలైస్గా వర్జీనియా డేవిస్‌ని తీసుకున్నాడు.[32] ఫలితంగా 12 నిమిషాల 30 సెకన్ల నిడివితో ఒక రీల్ సినిమా పూర్తైంది. అయితే అది విడుదల కావడం ఆలస్యం అవడంతో 1923 నాటికి దివాలా తీస్తున్న లాఫ్-ఓ-గ్రామ్ స్టూడియోని కాపాడేందుకు వీల్లేకపోయింది.[33]
1923 జూలైలో డిస్నీ హాలీవుడ్‌కు వెళ్ళిపోయాడు. అప్పటికి న్యూయార్క్ కార్టూన్ పరిశ్రమకు కేంద్రంగా విరాజిల్లుతూన్నా, లాస్ ఏంజలెస్ తన సోదరుడు రాయ్ క్షయవ్యాధి నుంచి కోలుకొంటూ ఉండడంతో అక్కడికే వెళ్ళాడు.[34] అలైస్'స్ వండర్ లాండ్ సినిమా హక్కులను అమ్మడానికి డిస్నీ ఎన్నో ప్రయత్నాలు చేసి నిరాశచెందాకా, న్యూయార్క్‌కు చెందిన సినిమా పంపిణీదారు మార్గరెట్ జె.వింక్లర్ గురించి తెలిసింది. ఆమె అవుట్ ఆఫ్ ద ఇంక్వెల్, ఫెలిక్స్ ద క్యాట్ సినిమాలు రెంటి మీదా హక్కులు కోల్పోతున్న సందర్భంలో కొత్త కార్టూన్ సీరీస్ హక్కులు చేజిక్కించుకునేందుకు చూస్తోంది. 1923 అక్టోబరులు ఆరు అలైస్ కామెడీలు తీయాలనీ, మరో ఆరేసి ఎపిసోడ్లతో ఇంకో రెండు సీరీస్లు తీసే వీలుందనీ ఒక కాంట్రాక్టు వారిద్దరూ సంతకం చేశారు.[35] వాల్ట్ డిస్నీ, అతని సోదరుడు రాయ్ డిస్నీ కలిసి ఈ సినిమాలు తీయడానికి డిస్నీ బ్రదర్స్ స్టూడియో పెట్టారు. ఇదే తదనంతరం ద వాల్ట్ డిస్నీ కంపెనీ అయింది.[36][37] అలైస్ సీరీస్ నిర్మించేందుకు అలైస్'స్ వండర్లాండ్లో అలైస్గా నటించిన డేవిస్నీ, ఆమె కుటుంబాన్నీ హాలీవుడ్ ప్రాంతానికి మారేలా ఒప్పించి, ఆమెకు నెలకు వంద డాలర్ల పారితోషికాన్ని నిర్ణయించారు. వాల్ట్ డిస్నీ1924 జూలైలో ఇవెర్క్స్ని కన్సాస్ నగరం నుంచి హాలీవుడ్‌కి మారడానికి ఒప్పించి, అతనికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చాడు.[38]
డిస్నీ 1925 తొలినాళ్ళలో లిలియన్ బౌండ్స్ అనే ఇంక్ ఆర్టిస్టును ఉద్యోగంలో చేర్చుకున్నాడు. అదే సంవత్సరం జూలైలో లిలియన్ సొంతూరైన లెవిస్టన్లో ఆమె సోదరుడి ఇంట్లో లిలియన్-వాల్ట్ డిస్నీ పెళ్ళిచేసుకున్నారు.[39] లిలియన్ ప్రకారం వారి వివాహ జీవితం సాధారణంగా సంతోషకరంగానే గడిచింది, ఐతే డిస్నీ జీవితచరిత్రకారుడు నీల్ గాబ్లర్ ప్రకారం "ఆమె డిస్నీ నిర్ణయాలను నమ్రతతో ఎప్పుడూ అంగీకరించలేదు, అతని స్థితిగతులను సూటిగా ఒప్పుకున్నదీ లేదు. పైగా డిస్నీ తాను ఎంత భార్యావిధేయుడి(Henpecked)గా ఉంటున్నానన్నది జనంతో చెప్పుకుంటూండేవాడని ఆమె అంగీకరించింది".[40][e] లిలియన్‌కు సినిమాల పట్ల కానీ, హాలీవుడ్ సామాజిక స్థితిగతుల పట్ల కానీ పెద్ద ఆసక్తి లేదు, చరిత్రకారుడు స్టీవెన్ వాట్స్ ప్రకారం - "ఇంటిని నిర్వహించుకోవడం, భర్తకు సహకారం అందించడం"వంటి పనులు చేస్తూ వాటితో సంతృప్తిగా జీవించేది.[41] వారికి ఇద్దరు కుమార్తెలు వారు డైన్ (1933 డిసెంబరులో జన్మించింది), షరాన్ (1936 డిసెంబరులో దత్తత తీసుకున్నారు, దత్తత నాటికి ఆమె వయసు ఆరు వారాలు).[42][f] కుటుంబంలో డిస్నీ కానీ, అతని భార్య కానీ షరాన్ వద్ద ఆమె దత్తత వచ్చిందన్న విషయం దాచిపెట్టలేదు, కానీ బయటివారు ఎవరైనా ఆ విషయం తీసుకువచ్చి మాట్లాడితే చాలా చిరాకు పడేవారు.[43] డిస్నీ దంపతులు తమ కుమార్తెలను ప్రపంచం దృష్టి నుంచి వీలైనంత దూరంగా ఉంచేవారు. 1932లో ప్రముఖ వైమానికులు చార్లెస్ లిండ్బర్గ్, అన్నే మారో లిండ్బర్గ్ దంపతుల ఏడాది కుర్రాడు లిండ్బర్గ్ అపహరణ-హత్య జరిగి, ఆ ఉదంతం అమెరికాను కుదిపేయడంతో జాగ్రత్తపడ్డ వాల్ట్ డిస్నీ తన కూతుళ్ళ ఫోటోలు పత్రికా ప్రతినిధులు తీయకుండా, వారి చేతిలో పడకుండా సాధ్యమైనన్ని జాగ్రత్తలూ తీసుకునేవాడు.[44]
1926లో అలైస్ సీరీస్ పంపిణీదారుగా వింక్లర్కి ఉన్న హక్కు, ఆమె తన భర్త, సినిమా నిర్మాత చార్లెస్ మింట్జ్కు అప్పగించింది, అతనికీ, డిస్నీకి మధ్య సంబంధాలు అప్పుడప్పుడూ ఇబ్బందిపడుతూన్నా ఆ ఒప్పందం కొనసాగింది.[45] 1927 జూలై వరకూ అలైస్ సీరీస్ కొనసాగింది,[46] అప్పటికి డిస్నీ కార్టూన్లు-లైవ్ యాక్షన్ కలిపి చేసే మిశ్రమ రూపంలో సినిమాలు చేయడంపై ఆసక్తి కోల్పోయాడు, దానితో పూర్తి యానిమేషన్ చిత్ర నిర్మాణం వైపుకు అడుగులు వేయసాగాడు.[45][47] మింట్జ్ యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా పంపిణీచేయడానికి కొత్త తరహా సినిమాల కోసం అడిగాకా, డిస్నీ, ఇవెర్క్స్ కలిసి ఆస్వాల్డ్, ద లక్కీ రాబిట్ అన్న కుందేలు పాత్రను సృష్టించాడు. డిస్నీ ఈ పాత్రను "ఉత్సాహంగా, చురుకుగా, తుంటరిగా, సాహసంతో" ఉంటూ "తనను తాను శుభ్రంగా ఉంచుకునే" పాత్రగా రూపొందించాడు.[47][48]
1928 ఫిబ్రవరిలో ఆస్వాల్డ్ సీరీస్ నిర్మించడానికి ఇంకా పెద్ద మొత్తాన్ని ఫీజుగా పొందాలని ఆశించాడు, కానీ మింట్జ్ అప్పటికి ఇస్తున్న సొమ్మును తగ్గించాలనుకుంటున్నట్టు చెప్పాడు. హెర్మన్, ఐసింగ్, కార్మన్ మేక్స్వెల్, ఫ్రిజ్ ఫ్రెలెంగ్ సహా డిస్నీ వద్ద పనిచేస్తున్న చాలామంది కళాకారులను నేరుగా తన వద్దనే పనిచేయమంటూ అడుగుతున్న విషయమూ బయటపడింది.ఆస్వాల్డ్ పాత్రకు, ఆ సీరీస్‌కు మేధో సంపత్తి హక్కులు యూనివర్సల్ పిక్చర్స్ వద్దే ఉన్నాయనీ డిస్నీకి తెలిసింది. ఫీజులో తాను ప్రతిపాదించిన తగ్గింపులు డిస్నీ అంగీకరించకపోతే స్వంత స్టూడియో ప్రారంభించి, తానే ఆస్వాల్డ్ సీరీస్ నిర్మిస్తానని మింట్జ్ బెదిరించాడు. అలాంటి పరిస్థితిలోనూ డిస్నీ బెదిరింపులకు లొంగలేదు, అతని యానిమేషన్ సిబ్బందిలో చాలావరకూ కోల్పోయాడు, ముఖ్యుల్లో ఒక్క ఇవెర్క్స్ మాత్రం డిస్నీతోనే ఉండిపోయాడు.[49][50][g]
యూనివర్సల్ సంస్థకు కోల్పోయిన ఆస్వాల్డ్ పాత్రకు బదులుగా డిస్నీ, ఇవెర్క్స్ కలిసి మిక్కీ మౌస్ పాత్రను రూపొందించారు. ఈ పాత్ర మూలాలు స్పష్టంగా లేకున్నా, డిస్నీ లాఫ్-ఓ-గ్రామ్ స్టూడియో సమయంలో పెంచుకున్న పెంపుడు ఎలుకను ఆధారం చేసుకుని సృష్టించినట్టు భావిస్తారు,[52][h] మొదట ఈ పాత్రకు డిస్నీ మార్టిమర్ మౌస్ అన్న పేరు పెట్టాలనుకున్నాడు, కానీ లిలియన్ ఆ పేరు పిలవడానికి మరీ భారీగా, డాంబికంగా ఉందంటూ మిక్కీ అన్న పేరును సూచించింది.[53][i] డిస్నీ తాత్కాలికంగా వేసిన మౌలికమైన మిక్కీ మౌస్ రూపాన్ని ఇవెర్క్స్ మరింత మెరుగుచేసి, యానిమేట్ చేసి కదిపేందుకు వీలుగా రూపొందించాడు. 1947 వరకూ మిక్కీకి డిస్నీయే గొంతునిచ్చాడు. డిస్నీ ఉద్యోగుల్లో ఒకరు చెప్పినదాని ప్రకారం, "మిక్కీకి అబ్ రూపం కల్పిస్తే, వాల్ట్ జీవం పోశాడు."[55]
మిక్కీ మౌస్ మొట్టమొదటి సారి పరీక్షించుకునేందుకు ఒకే ఒక్క సారి ప్రదర్శించిన తెరపై 1928 మేలో ప్లేన్ క్రేజీ అన్న లఘుచిత్రంలో కనిపిచింది., ఐతే రెండోదీ పూర్తి నిడివి సినిమా అయిన గాలోపిన్ గూచో సినిమాలో పూర్తినిడివి పాత్రగా వచ్చింది. ఐతే గాలోపిన్ గూచో సినిమా పంపిణీదారు దొరకక విఫలమైంది.[56] 1927 నాటి సంచలనాత్మకమైన ద జాజ్ సింగర్ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన స్టీమ్‌బోట్ విల్లీలో మూడో షాట్లో సింక్రనైజ్డ్ సౌండ్ ఉపయోగించి, తద్వారా మొట్టమొదట శబ్దంతో కూడిన కార్టూన్ రూపొందించి చరిత్రకెక్కాడు. యానిమేషన్ పూర్తయ్యాకా యూనివర్సల్ పిక్చర్స్ పూర్వ ఉద్యోగి అయిన పాట్ పోవర్స్తో ఒప్పందం కుదుర్చుకుని, సినిమాని అతని పోవర్స్ సినీఫోన్ ద్వారా పంపిణీ చేయడానికి డిస్నీ అంగీకరించాడు.;[57] అలా డిస్నీ తొలినాటి సౌండ్ కార్టూన్లకు సినీ ఫోన్ కొత్త పంపిణీదారుగా మారింది.[58]
తన సినిమాల్లో మరింత నాణ్యమైన సంగీతాన్ని అందించడానికి డిస్నీ స్వరకర్త కార్ల్ స్టాలింగ్ను నియమించుకున్నాడు. కార్ల్ స్టాలింగ్ సూచన మేరకు సిల్లీ సింఫనీ సీరీస్ రూపొందింది. సిల్లీ సింఫనీ సీరీస్‌లో సంగీతాన్ని వినియోగిస్తూ, తదనుగుణంగా కథలను రూపొందించి చిత్రీకరించారు. ఈ సీరీస్‌లో మొదటిదైన ద స్కెలిటన్ డ్యాన్స్‌ని పూర్తిగా ఇవెర్క్స్ అభివృద్ధి చేసి, బొమ్మలు వేసి రూపొందించాడు. ఆపైన పలువురు స్థానిక కళాకారులను ఉద్యోగంలోకి తీసుకున్నారు, వారిలో కొందరు కంపెనీ కోర్ యానిమేటర్లుగా కంపెనీతోనే ఉండిపోయారు, తర్వాతికాలంలో ఈ బృందం ద వాల్ట్ డిస్నీ కంపెనీలో నైన్ ఓల్డ్ మెన్ (తొమ్మిదిమంది పెద్దలు) అని పేరొందింది.[59][j] మిక్కీమౌస్, సిల్లీ సింఫనీ సీరీస్లు రెండూ విజయవంతమయ్యాయి, కానీ తమకు న్యాయంగా దక్కాల్సిన వాటా లాభాలు పావెర్స్ నుంచి తాము పొందడం లేదని డిస్నీ, అతని సోదరుడు భావించారు.1930లో డిస్నీ ముఖ్యమైన పోజులను మరింత సమర్థవంతంగా చిత్రీకరించేందుకు ప్రతీ సెల్నీ ప్రత్యేకంగా యానిమేట్ చేసే పద్ధతి విడిచిపెట్టమనీ, ముఖ్యమైన పోజులకు నడుమ వచ్చే పోజులను తక్కువ జీతాలకు పనిచేసే సహాయకులతో గీయించాలని ఇవెర్క్స్ను కోరాడు, తద్వారా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేశాడు. డిస్నీ తన కార్టూన్లకు చెల్లింపులను పెంచమని పావెర్స్ని కోరాడు. పావెర్స్ అందుకు అంగీకరించక, ఇవెర్క్స్ నేరుగా తనకే పనిచేసేలా ఒప్పించి ఉద్యోగంలో పెట్టుకున్నాడు; కొద్దికాలానికే ఇవెర్క్స్ లేకుండా డిస్నీ స్టూడియో నడవదనీ, మూతపడిపోతుందనీ భావించిన స్టాలింగ్ కూడా రాజీనామా చేశాడు.[60] 1931 అక్టోబరున డిస్నీకి నాడీ సమస్యతో మూర్ఛ పోయాడు, ఇదంతా పావెర్స్ కుట్ర వల్ల, తనను తాను ఎక్కువ శ్రమపెట్టుకుని పనిచేయడం వల్ల వచ్చిందని భావించాడు. దాంతో లిలియన్కి సంస్థ వ్యవహారాలు అప్పగించి, క్యూబాకి సెలవుపై వెళ్ళాడు. అక్కడ క్రూయిజ్ మీద పనామా కాలువ దాకా ప్రయాణించాడు.[61]
పావెర్స్ పంపిణీదారుగా వైదొలగగా, డిస్నీ స్టూడియోస్ తర్వాతికాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రాచుర్యం పొందిన కొలంబియా పిక్చర్స్‌ని మిక్కీమౌస్ కార్టూన్లు పంపిణీ చేయడానికి నియమించుకున్నాడు.[62][63][k] డిస్నీ కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండేవాడు, ఆ క్రమంలో ఫ్లవర్స్ అండ్ ట్రీస్ (1932) చిత్రాన్ని 3-స్ట్రిప్ టెక్నికలర్లో పూర్తి రంగుల చిత్రంగా రూపొందించాడు;[64] అంతేకాక 31 ఆగస్టు 1935 వరకూ 3-స్ట్రిప్ విధానాన్ని కేవలం తాను మాత్రమే ఉపయోగించుకోగలిగేలా ఒక ఒప్పందం కూడా కుదుర్చుకోగలిగాడు.[65] తర్వాత వచ్చిన అన్ని సిల్లీ సింఫనీ కార్టూన్లూ రంగుల్లోనే ఉన్నాయి.[66] ఫ్లవర్స్ అండ్ ట్రీస్ ప్రేక్షకుల్లో ప్రాచుర్యం పొందడంతో పాటుగా[64] ఉత్తమ షార్ట్ సబ్జెక్ట్ (కార్టూన్) విభాగంలో ఆస్కార్ అవార్డు పొందింది. మిక్కీస్ ఆర్ఫన్స్ అనే డిస్నీ మరో చిత్రం కూడా అదే విభాగంలో నామినేషన్ దక్కించుకోగా, "మిక్కీ మౌస్‌ను సృష్టించినందుకు" గాను అకాడమీ గౌరవ పురస్కారాన్ని కూడా డిస్నీ అందుకున్నాడు.[67][68]
1933లో డిస్నీ ద త్రీ లిటిల్ పిగ్స్ అన్న సినిమాని నిర్మించాడు, మీడియా చరిత్రకారుడు ఆడ్రియాన్ డంక్స్ ఈ సినిమాని "చరిత్రలో అత్యంత విజయవంతమైన షార్ట్ యానిమేషన్"గా అభివర్ణించాడు.[69]ఈ సినిమా ద్వారా షార్ట్ సబ్జెక్ట్ (కార్టూన్) విభాగంలో డిస్నీ మరోసారి ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. ఈ సినిమా విజయంతో మరింతగా స్టూడియోకి సిబ్బందిని తీసుకున్నాడు డిస్నీ, సంవత్సరాంతానికి స్టూడియో సిబ్బంది 200 మంది అయ్యారు.[70] డిస్నీ ప్రేక్షకులకు నచ్చేలా భావోద్వేగపరంగా ఆకట్టుకుంటూ సాగే కథలను చెప్పడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నాడు,[71] దాంతో యానిమేటర్లే కాకుండా ప్రత్యేకించి "కథా విభాగం" ఏర్పరుస్తూ డిస్నీ సినిమాలకు కథల్లో సూక్ష్మాంశాలు సహా వివరిస్తూ స్టోరీబోర్డు వేసే కథకులను నియమించుకుని, కథావిభాగంపై పెట్టుబడి పెట్టాడు.[72]
1934 నాటికల్లా డిస్నీ అలవాటైన పద్ధతిలో చిన్న కార్టూన్ సినిమాలు తీయడం సంతృప్తి కలిగించలేదు, [73] దాంతో నాలుగేళ్ళు పట్టే పూర్తి నిడివి కార్టూన్ సినిమా ఫెయిరీ టెయిల్ (ఐరోపా మూలాలున్న జానపద కథలు) ఆధారంగా స్నో వైట్ అండ్ ద సెవన్ డ్వార్ఫ్స్ (అర్థం: స్నోవైట్, ఏడుగురు మరుగుజ్జులు) నిర్మాణం మొదలుపెట్టాడు. ఈ ప్రాజెక్టు గురించిన వార్త బయటికి పొక్కినప్పుడు సినిమా పరిశ్రమలో చాలామంది ఈ ప్రయత్నం డిస్నీని దివాలా తీయిస్తుందని భావించారు, సినిమా వర్గాలు దీనికి డిస్నీస్ ఫాలీ (డిస్నీ వెర్రితనం) అని పేరుపెట్టుకున్నారు.[74] ఈ సినిమా పూర్తి రంగుల్లోనూ, శబ్దంతోనూ తీసిన తొలి పూర్తినిడివి యానిమేటెడ్ సినిమా. దీనిని పూర్తిచేయడానికి 15 లక్షల డాలర్ల ఖర్చయింది, ఈ బడ్జెట్ అంచనాకు మూడు రెట్లు.[75] యానిమేషన్ వీలైనంత నమ్మదగ్గదిగా ఉండడానికి కౌయినార్డ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో డిస్నీ యానిమేటర్లకు క్లాసులు ఇప్పించాడు;[76] యానిమేటర్లు నిజమైన కదలికలను అధ్యయనం చేసి గీసేందుకు వీలుగా స్టూడియోకి జంతువులను కొనుక్కువచ్చాడు, నటులను నియమించాడు.[77] ఒక సన్నివేశం నుంచి మరొకదానికి కెమెరా కదిలేప్పుడు నేపథ్యంలో కనిపించే మార్పును చిత్రీకరించేందుకు, డిస్నీ యానిమేటర్లు ఒక మల్టీప్లేన్ కెమెరాను రూపొందించారు, ఇది కెమెరాకు వేర్వేరు దూరాల్లో గాజు ముక్కలను పెట్టేందుకు వీలిచ్చింది, అవి బొమ్మకు లోతు ఉన్న భ్రాంతి కల్పిస్తాయి. ఈ గాజును కదిలించడం ద్వారా సీన్ నుంచి కెమెరా కదులుతుందన్న భావన కల్పించారు. ఈ కెమెరాతో సృష్టించిన తొలి సినిమా సిల్లీ సింఫనీ సీరీస్‌లో వచ్చిన ద ఓల్డ్ మిల్ (1937), ఈ చిత్రం ఆకట్టుకునే దృశ్య శక్తి కారణంగా యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఈ మల్టిప్లేన్ కెమెరా తయారయ్యేనాటికే స్నోవైట్ చాలావరకూ పూర్తైపోయినా, కొత్త ప్రభావాలు చూపించేందుకు కొన్ని సీన్లను తిరిగి చిత్రీకరించమని డిస్నీ ఆదేశించాడు.[78]
1937 డిసెంబరు నెలలో స్నో వైట్ ప్రీమియర్ ప్రదర్శించారు, సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. 1938లో అత్యంత విజయవంతమైన చిత్రం అయింది, 1939 మే నాటికి 6.5 మిలియన్ డాలర్లు సంపాదించి, అప్పటికి విడుదలైన సౌండ్ చిత్రాలన్నిటిలోకీ అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది.[74][l] స్నోవైట్ సినిమా విడుదల తర్వాత డిస్నీ మరొక గౌరవ ఆస్కార్ అవార్డు అందుకున్నాడు, ఈ అవార్డును ఒక పెద్ద సైజ్ ఆస్కార్ ప్రతిమ, ఏడు చిన్న సైజు ఆస్కార్ ప్రతిమలతో రూపొందించి ప్రదానం చేశారు.[79][m]
అకాడమీ అవార్డులు Among many awards, Walt Disney holds the record for sixty-four Academy Award nominations, winning twenty-six of them. Some of them include:
Walt Disney was the inaugural recipient of a star on the Anaheim walk of stars. The star was awarded in honor of Disney's significant contributions to the city of Anaheim, California, specifically, en:Disneyland, which is now the Disneyland Resort. The star is located at the pedestrian entrance to the Disneyland Resort on Harbor Boulevard.
Walt Disney also received the en:Congressional Gold Medal on 24 May 1968 (P.L. 90-316, 82 Stat. 130-131) and the en:Légion d'Honneur in ఫ్రాన్స్ in 1935.[81] In 1935, Walt received a special medal from the League of Nations for creation of Mickey Mouse.[82] He also received the Presidential Medal of Freedom on 14 September 1964.[83] On 6 December 2006, California Governor Arnold Schwarzenegger and First Lady Maria Shriver inducted Walt Disney into the California Hall of Fame located at The California Museum for History, Women, and the Arts.
A en:minor planet en:4017 Disneya discovered in 1980 by సోవియట్ యూనియన్ astronomer en:Lyudmila Georgievna Karachkina is named after him.[84]
Seamless Wikipedia browsing. On steroids.