From Wikipedia, the free encyclopedia
లార్డ్ ఆఫ్ ది రింగ్స్ (ఆంగ్లం: The Lord of the Rings) కొంత మందికి సినీమా రూపంగా, కొంత మందికి పుస్తక రూపంగా తెలుసు. (సినీమా పుస్తకాల పైననే ఆధారపడింది).
లార్డ్ ఆఫ్ ది రింగ్స్, మూడు చలన చిత్రాల సీరీస్ .
కాల్పానిక మిడిల్ ఎర్త్ లో, ఒక పొట్టి హాబిట్ (ఒక కల్పించబడిన పాత్ర, వ్యాసము చివరలో వివరణలు ఇవ్వబడ్డాయి) ఫ్రోడో బేగిన్స్ ఆతని ఎనిమిది మంది సహచరులు కలిపి(ఫెలోషిప్), దుష్టశక్తులు ఉన్న ఉంగరాన్ని, తద్వారా దుష్ట రాక్షసుడైన సారాన్ ను నాశనము చెయ్యడానికి బయలుదేరుతారు. ఫెలోషిప్ విడిపోయి ఫ్రోడో తన విశ్వసనీయ సహచరుడు సామ్వైస్ గామ్జీ, ద్రోహబుద్ది గల గోల్లుమ్ లతో ఉంగరాన్ని పట్టుకుని మోర్డోర్ (అక్కడి అగ్నిపర్వతము లో కాని ఉంగరము నాశనము కాదు.) వైపు బయలుదేరతాడు. గాండోర్ నగర సింహాసనానికి వారసుడు ఆరగార్న్, మంత్రగాడు గేండాల్ఫ్ మిడిల్ ఎర్త్ లో ఉన్న సామ్రాజ్యాలను ఏకము చేస్తూ ఉండగా, దుష్ట సారోన్ తన దుష్ట మాంత్రిక అనుచరుడు సారోమాన్ తో కలిసి తన శక్తి ని పెంచుకుంటాడు.
జె.ఆర్.ఆర్. టోల్కీన్ రచించిన నవలల ఆధారంగా పీటర్ జాక్సన్, 8 సంవత్సరములు శ్రమంచి, 27 కోట్ల డాలర్ల బడ్జెట్ తో,మొత్తము 10 గంటలు నిడివి గల మూడు సినీమాలు నిర్మించాడు. అన్నిటి షూటింగు ఒకటే సారి న్యూజిలాండు లో జరిగింది.
The Lord of the Rings | |
Cover design for the three volumes of The Lord of the Rings | |
కృతికర్త: | జె.ఆర్.ఆర్.టోల్కీన్ |
---|---|
దేశం: | United Kingdom |
భాష: | English |
విభాగం (కళా ప్రక్రియ): | Fantasy novel |
ప్రచురణ: | Allen & Unwin |
విడుదల: | 1954 and 1955 |
ప్రచురణ మాధ్యమం: | Print (Hardback & Paperback) |
పేజీలు: | 1216 pp |
దీనికి ముందు: | The Hobbit |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | NA |
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ బ్రిటిష్ విద్యావేత్త జె.ఆర్.ఆర్.టోల్కీన్ రచించిన 'ఫాంటసీ ప్రభందము'. ది హాబిట్ అనే ఒక పుస్తకము న కు ఉత్తరము(సీక్వెల్) గా మొదలై, పెద్ద కథ గా మారి పోయింది. 1937 నుండి 1949 వరకు దశలు గా వ్రాయబడినది. మొదటి ప్రపంచయుద్దములో సైనికుడైన టోల్కీన్ ఈ గ్రంథాన్ని చాలా మటుకు రెండవ ప్రపంచ యుద్దకాలము లో నే రచించారు.[1] 1954-55 లో మొదటి సారి ప్రచుచ్రితమైన ఈ గ్రంథము అనేక మాట్లు పునర్ముద్రితమై సుమారు 38 భాషల లోకి అనువదించబడినది.[2] 20 వ శతాబ్దపు సాహితీ చరిత్ర లోనే ఒక ప్రముఖ స్థానాన్ని పొందింది.
"ధైర్యము అస్సలు అనుకోని ప్రదేశాల లో దొరుకుతుంది.(Courage is found in the most unlikely places)" --జె.ఆర్.ఆర్. టోల్కీన్
జాన్ రోనాల్డ్ రూయల్ టోల్కీన్ (జనవరి 3, 1892 - సెప్టెంబరు 2, 1973) సౌత్ ఆఫ్రికా లో జన్మించిన ఒక బ్రిటిష్ రచయత, వ్యాకరణ/లక్షణ శాస్త్రజ్ఞుడు, రచయత, యూనివర్శిటీ ప్రొఫెసరు. క్రానికల్స్ అఫ్ నార్నియా ను రచిచంచిన సి.ఎస్' లూయీస్ కు స్నేహితుడు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.