Remove ads
From Wikipedia, the free encyclopedia
ఒక విషయాన్ని వివరంగా విస్తరించి రాయటమే వ్యాసం. తెలుగు సాహిత్య చరిత్రలో వ్యాసాలకు ముఖ్య స్థానం ఉంది.
ఆంగ్లంలో వచ్చిన వ్యాసాల ఆధారంగా తెలుగు రచయితలు వ్యాసాలను రాసారు. ఇందులో సాక్షి వ్యాసాలు, వదరుబోతు వ్యాసాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వ్యాస రచన జ్ఞానానికి, సృజనశక్తికి, తార్కికతకు అద్దం పడుతుంది.ఇతర మాధ్యమాలలో కార్యక్రమాల రూపకల్పనకు కూడా మూలం వ్యాసం రచన మెళకువలు ఉపయోగపడ్తాయి.వ్యాసం అనేది ఫ్రెంచ్ భాషలో పుట్టింది.మాంటేన్ అనేవ్యక్తి ఫ్రెంచ్ భాషలో వ్యాసం ప్రారంభించాడు.ఆంగ్లంలో వ్యాసాన్ని ప్రారంభించిన వ్యక్తి ప్రాన్శిస్ బేకన్. తెలుగులో వ్యాసరచనను ప్రారంభించిన వ్యక్తి స్వామినేని ముద్దు నర్సింహంనాయుడు. తెలుగు లో వ్యాసరచనను ప్రారంభించిన సంవత్సరం 1842. హితవాది పత్రికలో వ్యాసాన్ని ప్రారంభించారు. స్వామినేని వారు వ్యాసానికి పెట్టిన పేరు ప్రమేయం.ఈ ప్రమేయం సంకలనమే హితసూచిని'.ఆధునిక ప్రక్రియలలో తొలుత ఆవిర్భవించిన ప్రక్రియ వ్యాసం.
ఉపన్యాసం,సంగ్రహం,ప్రమేయం అనే పేర్లు అనంతరం 20వ శతాబ్దంలో వ్యాసం అనే పేరు స్థిరపడింది.వ్యాసాలు అధికంగా రచించింది కందుకూరు వీరేశలింగంపంతులు. తొలితెలుగు వ్యాసరచయిత్రి పోతం జానకమ్మ.1880లో ఆంధ్రభాష సంజీవని పత్రికలో రాసారు.మొట్టమొదటి సారిగా వైజ్ఞానిక వ్యాసాలు రచించినవారు ఆచంట వేంకటరాయ సాంఖ్యాయనమ్మ.
ఒక విషయాన్ని వివరంగా విస్తరించి రాయటమే వ్యాసం. వ్యాస రచన జ్ఞానానికి, సృజనశక్తికి, తార్కికతకు అద్దం పడుతుంది. ఇతర మాధ్యమాలలో కార్యక్రమాల రూపకల్పనకు కూడా మూలం వ్యాసం రచన మెళకువలు ఉపయోగపడ్తాయి.
ప్రారంభం వైవిధ్యంగా వుండాలి. మంచి సూక్తులు, గొప్ప వ్యక్తుల ప్రవచనాలు, చమత్కారాలు, కవితలోని ముఖ్యమైన పంక్తులు వాడవచ్చు.
దీనిలో విషయ సందర్భాన్ని, ఇప్పటివరకుతెలిసిన సంగతులను క్లుప్తంగా సమీక్షించాలి. వ్యాసంలో ముఖ్యాంశాలను క్లుప్తంగా, వ్యాసా భాగాలను పరిచయంచేయాలి. విషయం కొత్తగా అనిపించినవారికి, ఇది చదివితే మిగతా వ్యాసం అర్థం అవడానికి సులువువతుంది.
విషయంలో ముఖ్యమైనవాటిని విస్తరించాలి. గణాంకాలు అవసరమైనపుడు వాడాలి. (ఉదా: అక్షరాస్యత పై వ్యాసంలో, దేశాల, రాష్ట్రాల అక్షరాస్యత గణాంకాలు, వర్గాల వారీగా, కాలానుగుణంగా మార్పుల గణాంకాలు రాయాలి. విషయానికి వ్యాస రచయిత ప్రతిపాదన వివరించాలి.
ప్రతిపాదనకు అనుకూల, ప్రతికూల అంశాలు రాయాలి.
సంభందిత ప్రయోగాల వివరణలు రాయాలి.
వ్యాస సారాంశాన్ని రాయాలి. దీనిలోసూక్తులు, సుభాషితాలను వాడవచ్చు.
వాడుక భాషలో, సాధ్యమైనంతవరకు భాషా దోషాలు రాకుండా రాయాలి. ముఖ్యంగా వ్యక్తులు, స్థలాలు, పుస్తకాల పేర్లలో తప్పులుండకూడదు.
పొడుగు వాక్యాలు వాడితే స్పష్టత లేక అర్థం చేసుకోవటం కష్టం. చిన్న వాక్యాలు వాడాలి. కర్త వచనాన్ని బట్టి క్రియని చేర్చాలి. ఇతర భాషా పదాలు సాధ్యమైనంతవరకు తక్కువగా వాడాలి. 'విజయం' బదులుగా 'సక్సెస్' ఎందుకు వాడటం. వాడుకలో వున్న పరభాషా పదాలు (రోడ్డు, టికెట్, బజారు, వసూలు) ఉపయోగించవచ్చు.
సంఖ్య | వ్యాసం | రచయిత |
1 | సంగ్రహాలు అనేపేరుతో వ్యాసాలు రచించింది | పరవస్తు వేంకటరంగాచార్యులు. |
2 | బేకన్ ఉపన్యాసాలు అనేపేరుతో వ్యాసాలు రచించినది | కళాంచి రామనుజాచార్యులు. |
3. | సాక్షి వ్యాసాలు రచించింది | పానుగంటి లక్ష్మీనరసింహ (సాక్షి వ్యాసాలలో ఉన్న ప్రధాన పాత్ర జంగాల శాస్త్రీ) |
4 | తెలుగు వ్యాస పరిణామం | తిరుమల రామచంద్ర |
5 | మాణిక్యవీణ | విద్వాన్ విశ్వం |
6 | స్త్రీ కళాకల్లోలని | జియరీ సూరి |
7 | మిత్రవాక్యం | వాకాటి పాండురంగారావు |
8 | ఇల్లాలి ముచ్చట్లు | పురాణం సీత |
9 | నుడీ నానుడి | తిరుమల రామచంద్ర |
10 | వ్యాస చంద్రిక | గురజాడ అప్పారావు |
11 | ప్రాదెనుగుకమ్మ | గిడుగు రామమూర్తిపంతులు |
12 | ఆంధ్రభాషాపండిత బిషక్కుభేషజం | గిడుగు రామమూర్తిపంతులు |
13 | వ్యాస వాణి | వేలూరి శివరామశాస్త్రీ |
14 | సాహిత్య చరిత్రలో చర్చినీయాంశాలు | జి.వి.సుబ్రహ్మణ్యం |
15 | సాహిత్యంలో దృక్పదాలు | ఆర్.యస్.సుదర్శనం |
16 | తెలుగుపై ఆంగ్లభాషా ప్రభావం | కె.వీరభద్రారావు |
17 | తెలుగు సాహిత్య విమర్శ | యస్.వి.రామారావు |
18 | కవిసేన మేనఫెస్టో | గుంటూరు శేషేంద్ర శర్మ |
19 | గౌతమీ వ్యాసాలు | పింగళి లక్స్మీకాంతం (ఆంధ్ర సాహిత్య శిల్ప సమీక్ష పుస్తకం) |
20 | ఊహాగాణం | లత |
21 | ఆంధ్రసాహిత్య సంగ్రహం | కవిత్వవేధి (కలం పేరు) |
22 | కఠోర షడ్జమాలు | వసంత కర్ణబిరాన్ |
23 | మినీ కవిత విప్లవం | కె.సత్యనారాయణ |
24 | కాల జ్ఞానం (వార్తాపత్రిక వ్యాసాల సంకలనం)[1] | వేముల ప్రభాకర్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.