గుజరాత్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో మహెసనా జిల్లా (గుజరాతీ:મહેસાણા જિલ્લો) ఒకటి. మహెసనా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,837,892.
జిల్లాలో 600 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 22.40% ప్రజలు నగరాలలో నివసిస్తున్నారు.[1]
జిల్లాలో లోతేశ్వర్ వంటి " సింధూనాగరికతకు" చెందిన పలు ప్రాంతాలు ఉన్నాయి.[2]
చరిత్ర
చారిత్రకంగా జిల్లాలోని భూభాగాలను వేరు చేసి ఇతర జిల్లాలు రఒందించబడ్డాయి.
1964 గాంధీనగర్ జిల్లా.
2000 పఠాన్ జిల్లా.
జిల్లాలో 11 తాలూకాలు ఉన్నాయి: బెచరజి, కడి (భారతదేశం), ఖెరలు, మహెసన, వాద్నగర్, విజపూర్, విస్నగర్, సత్లసన, జొతన, గొజరీ, ఉంఝా
జిల్లాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: ఖెరలు, ఉంఝా, విస్నగర్, బెచరజి, కాది, మహెసన, విజపూర్.
ఖెరలు పఠాన్ జిల్లా లోక్సభ నియోజకవర్గంలో ఉంది. మిగిలిన తాలూకాలు మహెసనా లోక్సభ నియోజకవర్గంలో ఉంది.
వ్యవసాయం
జిల్లాలో ప్రధానంగా సజ్జలు, జొన్నలు, జిలకర, పత్తి, నూనె గింజలు (అముదాలు, ఆవాలు, పత్తి), కూరగాయలు, మిరపకాయలు, పెసలు, గొవర్ మొదలైన పంటలు పండించబడుతుంటాయి.
వాణిజ్యం
నూనెగింజలు, జిలకర, ఫిసిలియం మైయు సోంబు వంటి వాణిజ్యం జరుగుతుంది.
జిల్లాలో 1200 చమురుబావులు, 23 గ్యాస్ బావులు ఉన్నాయి.
మహెసనా " లో ఆసియాలోని రెండవ పెద్ద డైరీగా గుర్తింపు పొందిన " దూద్ సాగర్ " ఉంది.