Remove ads
గుజరాత్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో సురేంద్రనగర్ జిల్లా ఒకటి. జిల్లా జనసంఖ్య 1.7 మిలియన్లు. సురేద్రనగర్ను పూర్వం ఝలావద్ అని పిలిచే వారు. ఝలా రాజపుత్రులు సురేంద్రనగర్ జిల్లా ప్రాంతంలోని పలు రాజాస్థానాలను పాలించారు. వల్వాద్తో కూడిన సురేంద్రనగర్ 400,000 మంది నివసిస్తున్నారు. హైటెక్ బంగళాలకు ఈ నగరం కేంద్రంగా ఉంది.
సురేంద్రనగర్ జిల్లా | |
---|---|
జిల్లా | |
Coordinates: 22.73°N 71.51°E | |
దేశం | India |
రాష్ట్రం | గుజరాత్ |
విస్తీర్ణం | |
• Total | 10,489 కి.మీ2 (4,050 చ. మై) |
Elevation | 547 మీ (1,795 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 17,55,873 |
• జనసాంద్రత | 144.45/కి.మీ2 (374.1/చ. మై.) |
భాషలు | |
• అధికార | Gujarati, హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 363031 |
టెలిఫోన్ కోడ్ | 02752 |
Vehicle registration | GJ-13 |
Largest city | Surendranagar |
లింగ నిష్పత్తి | 0.924 ♂/♀ |
అక్షరాస్యత | 61.61% |
జిల్లా వైశాల్యం 10489 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,515,148. జనసంఖ్యలో 26% నగరాలలో నివసిస్తున్నారు. [1][2]
జిల్లాలోని ఇతర నగరాలు : ధ్రంగద్ర, హల్వద్, వధ్వన్, లింబ్ది, చుదా, లఖ్తర్, కతొసన్ రాజ్, ములి (గుజరాత్), సయ్ల, థంగద్, తర్నెతర్.
బ్రిటిష్ కాలంలో సురేంద్రనగర్ కాలనీ హిల్‌స్టేషన్‌గా ఉండేది. ఇక్కడి పొడి వాతావరణం భౌతిక, మానసిక బాధలకు నుండి విముక్తి కలిగిస్తుంది. సురేంద్రనగర్ పొడి వాతావరణం క్షయ వ్యాధి నివారణకు సహకారం అందిస్తుంది.
గుజరాత్ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాలలో సురేంద్రనగర్ జిల్లా రెండవస్థానంలో ఉంది. జిల్లాలో అధికస్థాయిలో విద్యాకేంద్రాలు ఉన్నాయి. గుజరాత్ రాష్టపత్రికలలో అనేకం సురేంద్రనగర్‌లో ప్రచురితమౌతున్నాయి.
జిల్లాలో కాంఫెక్షనరీ, పాటరీ, ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ ఫ్లాస్టిక్స్, ఉప్పు ఉత్పత్తి చిన్నతరహా, మధ్యతరాహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో వధవన్ ప్రధాన వ్యాపార కూడలిగా ఉంది. వధ్వన్ వ్యవసాయ ఉత్పత్తుల ప్రొసెసింగ్ కేంద్రం, పత్తి, ఉప్పు, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, ఫ్లాస్టిక్స్, టెక్స్టైల్ బియరింగ్స్, సెరామిక్స్, శానిటరీ వేర్ మొదలైన వ్యాపారాలకు కేంద్రంగా ఉంది.
దేశానికి అవసరమైన ఉప్పులో 25% సురేంద్రనగర్‌లో ఉత్పత్తి చేయబడుతుంది.జిల్లాలో మైళ్ళ పొడవున ఉప్పునీటి సరసులు ఉన్నాయి. ప్రత్యేకంగా కరగోడా ప్రాంతంలో ఇవి అధికంగా ఉన్నాయి. జింజువాడా ఎడారి ప్రాంతంలో నాణ్యమైన ఉప్పు ఉత్పత్తి చేయబడుతుంది.
దేశంలో పత్తి, కాటన్ జిన్నింగ్ పతిశ్రమలకు సురేంద్రనగర్ కేంద్రంగా ఉంది. జిల్లాలో జిన్నింగ్, ప్రెసింగ్ యూనిట్లు అధికసంఖ్యలో ఉన్నాయి. అధికస్థాయిలో పత్తి ఉత్పత్తి చేయబడుతున్న ప్రాంతాలలో ఇది ఒకటిగా గుర్తించబడుతుంది. శంకర్ కాటన్ వరల్డ్. సురేంద్రనగర్ కాటన్ ఆయిల్, ఆయిల్ సీడ్స్ అసోసియేషన్ లిమిటెడ్ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. 1964లో ఇక్కడ కాటన్ ఫ్యూచర్ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ స్థాపించబడింది. సురేంద్రనగర్ నగరం వస్త్రాల తయారీకి, వస్త్రాల విక్రయానికీ (ప్రధానంగా చీరలకు ) ప్రధాన కేంద్రంగా ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,755,873,[3] |
ఇది దాదాపు. | గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం..[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 274 వ స్థానంలో ఉంది..[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 167 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 15.89%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 929:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 73.19%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
జిల్లాలో అధికంగా జైనులు ఉన్నారు. నగరకేంద్రంలో ప్రధాన జైనఆలయం ఉంది. తరువాత స్థానంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, పఠేల్ ప్రజలు ఉన్నారు. గుర్తించతగినంతగా భర్వద్, రాబరీ ప్రజలు ఉన్నారు.
జిల్లాలో అనేక సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి
పురాతన కాలంలో జునాగఢ్ రాజు చౌడసమా వధ్వన్ రాకుమారి రణక్దేవి అందానికి ముగ్ధుడయ్యాడు. వధ్వన్ రాకుమారి రణక్దేవి కొరకు వధ్వన్ మీద యుద్ధం చేసాడు. రాకుమారి నగరం విడిచి భొగావో నదికి వెళ్ళి నదిలో మునిగి ప్రాణాలు వదిలింది. ఆమె ప్రాణం వదలడానికి ముందు నదిని శపించుంది. శాపకారణంగా నదిలో నీరు ఇంకిపోయిందని ఈ నది సంవత్సరానికి ఒకరిని బలి తీసుకుంటుందని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. వధ్వలోని భిగ్వద నదీతీరంలో రాకుమారి రణక్దేవికి ఆలయం నిర్మించబడింది.
ఖు.ఎం.ఆర్.దర్ది విద్యాలయ, అనింద్ర.
శ్రీ శారదా పాఠశాల - జొరవర్నగర్
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.