Remove ads
From Wikipedia, the free encyclopedia
మింగ్ రాజవంశం (AD 1368–1644) The మింగ్ వంశం, లేదా గ్రేట్ మింగ్ రాజు సామ్రాజ్యం, చైనాకు చెందినా ఒక రాజ వంశం. ఈ వంశం చైనాను 276 సంవత్సరాలు పరిపాలించింది (1368–1644). మంగోలులకు చెందిన యువాన్ వంశం పతనమైన తరువాత స్థాపింపబదినది. కొందరి అభిప్రాయం ప్రకారం, మానవజాతి చరిత్రలోనే అత్యంత పటిష్ఠమైన, సామాజిక నిలకడ గల రాజ్యం ఈ మింగ్ రాజ్యం.,[5] హాన్ చైనీయులు పరిపాలించిన ఆఖరి వంశం ఇది . బీజింగ్ రాజధాని లీ జీచెంగ్ ల వశమైన తరువాత మంచూ రాజధాని అయినది. దీనిని తరువాత ఖింగ్ వంశం పరిపాలించింది. ఈ మింగ్ వంశం 1662 వరకూ పరిపాలించింది.
గ్రేట్ మింగ్ 大明 | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1368–1644 | |||||||||||||||
Ming China at its greatest extent under the reign of the Yongle Emperor | |||||||||||||||
రాజధాని | en:Nanjing (Yingtian prefecture) (1368–1644)[1] Beijing (Shuntian prefecture) (1403–1644)[2][3] | ||||||||||||||
సామాన్య భాషలు | Official language: Mandarin Other Chinese dialects Other languages: Turki (Modern Uyghur), Tibetan, Mongolian, Jurchen, others | ||||||||||||||
మతం | Heaven worship, టావోఇజం, కంఫ్యూషియానిజం, బౌద్ధ మతము, Chinese folk religion, ఇస్లాం | ||||||||||||||
ప్రభుత్వం | రాచరికం | ||||||||||||||
Emperor (皇帝) | |||||||||||||||
• 1368–1398 | The en:Hongwu Emperor | ||||||||||||||
• 1627–1644 | The en:Chongzhen Emperor | ||||||||||||||
Senior Grand Secretary | |||||||||||||||
• 1402–1407 | Xie Jin | ||||||||||||||
• 1644 | Wei Zaode | ||||||||||||||
చరిత్ర | |||||||||||||||
• స్థాపన నాంజింగ్ లో | జనవరి 23 1368 | ||||||||||||||
ఏప్రిల్ 25 1644 | |||||||||||||||
• End of the Southern Ming | January 22, 1662 | ||||||||||||||
విస్తీర్ణం | |||||||||||||||
1415[4] | 6,500,000 కి.మీ2 (2,500,000 చ. మై.) | ||||||||||||||
జనాభా | |||||||||||||||
• 1393 | 65,000,000 | ||||||||||||||
• 1403 | 66,598,337¹ | ||||||||||||||
• 1500 | 125,000,000² | ||||||||||||||
• 1600 | 160,000,000³ | ||||||||||||||
ద్రవ్యం | Bimetallic: copper cashes (文, wén) in strings of coin and paper Silver taels (兩, liǎng) in sycees and by weight | ||||||||||||||
| |||||||||||||||
Today part of | |||||||||||||||
Remnants of the Ming Dynasty ruled southern China until 1662, a dynastic period which is known as the en:Southern Ming. ¹The numbers are based on estimates made by CJ Peers in Late Imperial Chinese Armies: 1520–1840 ²According to A. G. Frank, ReOrient: global economy in the Asian Age, 1998, p. 109 ³According to A. Maddison, The World Economy Volume 1: A Millennial Perspective Volume 2, 2007, p. 238 |
శతాబ్ది కాలానికి ముందే ముగిసిపోయిన యువాన్ రాజవంశ పాలన పొడవునా, మంగోల్ పాలనకు వ్యతిరేకంగా చైనా ప్రజానీకంలో సాపేక్షికంగా గట్టి వ్యతిరేకత ఏర్పడుతూ వచ్చింది. 1340ల నుంచి తరచుగా వచ్చిన ప్రకృతి వైపరీత్యాలు అంతిమంగా రైతాంగ తిరుగుబాట్లకు దారితీశాయి. యువాన్ రాజవంశం క్రమంగా 1368నాటికి మింగ్ రాజవంశం చేత కూలదోయబడింది.
జనాభా పెరగడంతో నగరీకరణ పెరుగుతూ వచ్చింది, శ్రమ విభజన మరింత సంక్లిష్టంగా పెరిగింది. నాంజింగ్, బీజింగ్ వంటి అతి పెద్ద నగర కేంద్రాలు, ప్రయివేట్ పరిశ్రమ వృద్ధికి దోహదపడింది. ప్రత్యేకించి, చిన్న-కుటీర పరిశ్రమలు పెరిగి, కాగితం, పట్టు, నూలు, పింగాణీ సరకుల తయారీలో ప్రత్యేక నైపుణ్యం సాధించాయి. చాలా వరకు, సాపేక్షికంగా మార్కెట్లతో కూడిన చిన్న నగర కేంద్రాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. పట్టణ మార్కెట్లు ప్రధానంగా ఆహారాన్ని అమ్మేవి, గుండుసూదులు లేదా చమురు వంటి కొన్ని అవసరమైన తయారీదారులు కూడా ఉండేవారు.
విదేశీ భయం, పెరుగుతున్న ప్రజాదరణ పెరుగుతున్న నయా-కన్ప్యూసియజం యొక్క మేధో అత్మ శోధనం కొనసాగుతున్నప్పటికీ, మింగ్ రాజవంశ పాలన తొలి దశలో చైనా ఏకాకిగా లేదు. విదేశీ వాణిజ్యం, బయటి ప్రపంచంతో ప్రత్యేకించి జపాన్‌తో ఇతర సంబంధాలు గణనీయంగా పెరిగాయి. చైనా వర్తకులు హిందూ మహాసముద్రం పొడవునా ప్రయాణించి, జెంగ్ హె సముద్రయానం ద్వారా తూర్పు ఆఫ్రికాను చేరుకున్నారు.
మింగ్ రాజవంశ స్థాపకుడు జూ యువాన్జాంగ్ లేదా (హాంగ్-ఉ వాణిజ్యంపై తక్కువ ఆసక్తిని, వ్యవసాయ రంగం నుంచి మరింత ఆదాయాలను ఆశిస్తున్నటువంటి ప్రభుత్వ స్థాపనకు పునాది వేశాడు. చక్రవర్తి రైతాంగ పునాది కారణంగా కావచ్చు, మింగ్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చింది దీనితో పోలిస్తే సాంగ్, మంగోలియన్ రాజవంశాలు ఆదాయం కోసం వ్యాపారం, వర్తకులపై ఆధారపడుతూ వచ్చాయి. సాంగ్, మంగోల్ పాలనలోని నయా-భూస్వామ్య కమతాలను మింగ్ పాలకులు కైవశం చేసుకున్నారు. భూ ఎస్టేట్లను ప్రభుత్వం స్వాధీనపర్చుకుని, వాటిని విభజించి, కౌలుకు ఇచ్చాయి. వ్యక్తిగత బానిసత్వం నిషేధించబడింది. తత్ఫలితంగా, చక్రవర్తి యాంగ్-లె మృతితో, స్వతంత్ర రైతాంగ యజమానులు చైనా వ్యవసాయంలో ప్రాధాన్యత వహించారు. గత పాలనా వ్యవస్థలలో చెలరేగిన తీవ్ర దారిద్ర్యాన్ని నిర్మూలించడానికి ఈ చట్టాలు తోడ్పడ్డాయి.
ఈ రాజవంశం దృఢమైన, సంక్లిష్ట కేంద్ర ప్రభుత్వాన్ని నెలకొల్పి సామ్రాజ్యాన్ని ఐక్యం చేసి నియంత్రించింది. చక్రవర్తుల పాత్ర రానురాను మరింత నిరంకుశంగా మారింది, జు యువాన్జాంగ్ నిరంకుశాధికార వర్గపు తీవ్రమైన రాతకోతల వ్యవహారాలు, జ్ఞాపికలు (రాజుకు దరఖాస్తులు, సిఫార్సులు చేయడం) సమాధానం, రకరకాల నివేదికలు, పన్ను రికార్డులు వంటి వాటిపై ఇంపీరయల్ శాసనాల తయారీలో సహాయం చేయడం కోసం "గ్రాండ్ సెక్రటరీలు" (内阁) గా అతడు పిలిచిన వారిని ఉపయోగించుకోవడాన్ని కొనసాగించాడు. ఈ నిరంకుశాధికారవర్గమే తదుపరి దశల్లో మింగ్ ప్రభుత్వం సమాజంలో జరుగుతున్న మార్పులను స్వీకరించకుండా అడ్డుకుంది, ఫలితంగా సామ్రాజ్యమే క్షీణించిపోయింది.
చైనాకు ఇతర పాలకులు తమ రాయబారులను పంపి విధేయత ప్రకటించాలని డిమాండ్ చేయడం ద్వారా చైనా ప్రభావాన్ని దాని సరిహద్దుల అవతలకు విస్తరించాలని చక్రవర్తి యాంగ్-లె తీవ్రంగా ప్రయత్నించాడు. 1,599 టన్నుల బరువు మోసుకు పోయే నాలుగు స్తంభాల ఆధారం కలిగిన భారీ నావికా బలగం నిర్మించబడింది. దాదాపు ఒక మిలియన్ సైనికులతో కూడిన స్టాండింగ్ ఆర్మీ (కొంతమంది దీన్ని 1.9 మిలియన్ సైనికులుగా వర్ణించారు [ఎవరు?]) సృష్టించబడింది. చైనా సైన్యాలు దాదాపు 20 ఏళ్లపాటు వియత్నాంను జయించాయి, చైనా నావికాదళం చైనా సముద్రాలు, హిందూ మహాసముద్రంలో విహరించడమే కాక ఆఫ్రికా తూర్పుతీరాన్ని కూడా చేరుకున్నాయి. చైనీయులు తూర్పు టర్కిస్తాన్లో ప్రభావం చూపారు. సముద్రతీరం పొడవునా ఉన్న పలు ఆసియా దేశాలు చైనా చక్రవర్తికి విధేయత ప్రకటించాయి. దేశీయంగా, మహా కాలువ విస్తరించబడి, దేశీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించింది. సంవత్సరానికి 100,000 టన్నుల ఇనుమును చైనా ఉత్పత్తి చేసింది. కదిలే టైప్‌ను ఉపయోగించి అనేక పుస్తకాలు ముద్రించారు. బీజింగ్ నిషిద్ధ నగరంలోని ఇంపీరియల్ ప్యాలెస్ తన ప్రస్తుత వైభవాన్ని అప్పుడే పొందింది. ఈ శతాబ్దాలలోనే దక్షిణ చైనాలో వనరులను పూర్తిగా ఉపయోగించారు కొత్త పంటలను విస్తృతంగా సాగులోకి తీసుకు వచ్చారు పింగాణీ, వస్త్రాలకు సంబంధించిన పరిశ్రమలు ఏర్పడ్డాయి.
1449లో ఎసెన్ తాయిసి ఉత్తర చైనాలో ఓరియట్ మంగోల్ దాడిని నిర్వహించాడు, ఈ దాడిలో జెంటోంగ్ చక్రవర్తిని టుము వద్ద బందీగా పట్టుకున్నారు. 1542లో మొఘల్ పాలకుడు అల్తాన్ ఖాన్ ఉత్తర చైనా సరిహద్దు పొడవునా చైనాను వేధించడం ప్రారంభించాడు. 1550లో అతడు బీజింగ్ శివార్ల వరకు వచ్చాడు. వాయవ్య చైనా తీరంపై దాడి చే్స్తున్న జపనీస్ సముద్ర బందిపోట్లతో కూడా చక్రవర్తి ఒప్పందం కుదుర్చుకోవలసి వచ్చింది; జనరల్ క్వి జిగువాంగ్ ఈ బందిపోట్లను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద భూకంపం షాంగ్జీ భూకంపం 1556లో వచ్చింది, ఇది దాదాపు 830.000 ప్రజల ప్రాణాలు తీసింది, ఇది జియాజింగ్ చక్రవర్తి ప్రాంతంలో జరిగింది.
చైనాను విదేశీ దాడులనుంచి కాపాడటం కోసం మింగ్ రాజవంశ పాలనలోనే మహా కుడ్యం చివరి నిర్మాణాన్ని చేపట్టారు. మహాకుడ్యం చాలావరకు గడిచిన కాలాల్లోనే నిర్మించబడినప్పటికీ, నేడు కనిపిస్తున్న మహాకుడ్యాన్ని మింగ్ పాలనలోనే నిర్మించారు లేదా మరమ్మతులు చేశారు. గోడలోని ఇటుక, నల్లరాయి పని విస్తరించబడింది, వాచ్ టవర్లు తిరిగి డిజైన్ చేయబడ్డాయి, కోట పొడవునా ఫిరంగులు నెలకొల్పారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.