పన్నా జిల్లా

మధ్య ప్రదేశ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia

పన్నా జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో పన్నజిల్లా ఒకటి. పన్నా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.

త్వరిత వాస్తవాలు పన్నా జిల్లా पन्ना जिला, దేశం ...
పన్నా జిల్లా
पन्ना जिला
Thumb
మధ్య ప్రదేశ్ పటంలో పన్నా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుSagar
ముఖ్య పట్టణంPanna, India
Government
  లోకసభ నియోజకవర్గాలుKhajuraho
విస్తీర్ణం
  మొత్తం7,135 కి.మీ2 (2,755 చ. మై)
జనాభా
 (2011)
  మొత్తం10,16,028
  జనసాంద్రత140/కి.మీ2 (370/చ. మై.)
జనాభా వివరాలు
  అక్షరాస్యత66.08%
  లింగ నిష్పత్తి907
ప్రధాన రహదార్లుNH 75
Websiteఅధికారిక జాలస్థలి
మూసివేయి
Thumb
పన్నా నేషనల్ పార్క్‌లోని కెన్ నది

చరిత్ర

దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత 1950లో పన్నా జిల్లా రూపొందించబడింది. బ్రిటిష్ ఇండియా లోని రాజాస్థానాలైన పన్నా, జాసో, అజ్‌ఘర్ రాజాస్థానంలో అధికభాగం, పాల్డియో రాజాస్థానంలో కొంత భాగం కలిపి ఈ జిల్లా రూపొందించబడింది. పన్నా జిల్లా సరికొత్త భారతీయ రాష్ట్రం అయిన విద్యప్రదేశ్‌లో భాగంగా ఉండేది. వింధ్యప్రదేశ్ రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగం అయిన తరువాత ఇది 1956 నవంబరు 1 నుండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగం అయింది.

భౌగోళికం

పన్నా జిల్లా 23° 45' నుండి 25° 10' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79° 45' నుండి 80° 40' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.[1] జిల్లా వైశాల్యం 7,135 చ.కి.మీ.[2] జిల్లా గుండా కెన్ నది ప్రవహిస్తుంది. జిల్లాలో పాండవ జలపాతాలు, గథ జలపాతాలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న " పన్నా నేషనల్ పార్క్ " పర్యాటక ఆకర్షణగా ఉంది. .[3]

ఆర్ధికం

జిల్లాలో ఉన్న వజ్రాల గనులు జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తున్నాయి. వజ్రాల గనులు పన్నా నగరానికి 80 కి.మీ దూరంలో ఉన్నాయి. [2] పురాతన కాలంలో గనులు అధికంగా సుకారియూ గ్రామంలో ఉండేవి.[4] ప్రస్తుత కాలంలో గనులు మఝగావ్ మాత్రమే ఆసియా ఉనికిలో ఉన్న ఏకైక వజ్రాలగనిగా గుర్తించబడుతుంది. [5]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో పన్నా జిల్లా ఒకటి అని గుర్తించింది.[6] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[6]

విభాగాలు

గ్రామపంచాయితీలు

జిల్లాలోని కమ్యూనిటీ డేవెలెప్మెంటు బ్లాకులు. [7], గ్రామ పంచాయితీ అంటారు.[8] తాలూకాలు [9] లేక తెహ్సిల్స్ .[9] పన్నా జిల్లాలో 5 ఉపవిభాగాలు ఉన్నాయి.

  • అజైగర్
  • అమ్ంగంజ్
  • గునౌర్ (లేదా గునౌర్, లేదా గునౌర్ పంచాయతీ, ఆవాసాలు పేరు[7] లేక గునార్ గ్రామం [7])
  • పన్నా (భారతదేశం)
  • పావై
  • షహ్నగర్

2001 లో గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,016,028,[10]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[11]
అమెరికాలోని. మొంటోనా నగర జనసంఖ్యకు సమం..[12]
640 భారతదేశ జిల్లాలలో. 442వ స్థానంలో ఉంది..[10]
1చ.కి.మీ జనసాంద్రత. 142 [10]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.62%.[10]
స్త్రీ పురుష నిష్పత్తి. 907:1000 [10]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 66.08%.[10]
జాతియ సరాసరి (72%) కంటే.
మూసివేయి

భాషలు

పన్నా జిల్లాలో హిందీ భాషతో పాటు లెక్సికల్ భాషను పోలిన బుండెలి భాష 72.91% ప్రజలలో వాడుకలో ఉంది.[13][14] దీనిని బగేల్‌ఖండ్ ప్రాంతంలో దాదాపు 78,00,000 మంది మాట్లాడుతున్నారు.[13] ద్రవిడ భాషలలో ఒకటైన భరియా భాషను జిల్లాలో 20,000'మంది భరియా ప్రజలలో వాడుకలో ఉంది. భరియా ప్రజలు ద్రావిడ భాషా లిపిని వాడుకుంటారు. వీరు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు. .[15]

మూలాలు

వెలుపలి లింకులు

వెలుపలి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.