ధోలా సాదియా వంతెన
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
ధోలా-సాదియా వంతెనను ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లను కలుపుతూ నిర్మించిన ఒక బీమ్ వంతెన.[1] ఈ వంతెన బ్రహ్మపుత్ర ప్రధాన ఉపనది అయిన లోహిత్ నదిపై కట్టారు. ఇది దక్షిణాన ధోలా గ్రామాన్ని ఉత్తరాన టిన్సుకియా జిల్లాలో ఉన్న సాదియా గ్రామాన్ని కలుపుతుంది. దీనికి అధికారికంగా భూపేన్ హజారికా వంతెన అని పేరు పెట్టారు. అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళేందుకు చక్కటి వీలు కలిగిస్తుంది. సాదియా నుండి కొద్ది దూరం లోనే అరుణాచల్ సరిహద్దు ఉంటుంది.[2] ఈ వంతెన ఉత్తర అస్సాం, తూర్పు అరుణాచల్ ప్రదేశ్ల మధ్య మొదటి శాశ్వత రహదారి.[3]
ధోలా సాదియా వంతెన | |
---|---|
నిర్దేశాంకాలు | 27°47′55″N 95°40′34″E |
OS grid reference | |
దీనిపై వెళ్ళే వాహనాలు | Motor vehicles |
దేనిపై ఉంది | లోహిత్ నది |
స్థలం | ధోలా–సాదియా, అసోం |
అధికారిక పేరు | భూపేన్ హజారికా సేతు |
నిర్వహణ | రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ |
లక్షణాలు | |
డిజైను | బీం బ్రిడ్జి |
మొత్తం పొడవు | 9.15 కి.మీ. (5.69 మై.) |
వెడల్పు | 12.9 మీ. (42 అ.) |
అత్యంత పొడవైన స్పాన్ | 50 మీ. (160 అ.) |
స్పాన్ల సంఖ్య | 183 |
చరిత్ర | |
నిర్మించినవారు | నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ |
నిర్మాణం ప్రారంభం | 2011 నవంబరు |
నిర్మాణం పూర్తి | 2017 మార్చి 10 |
ప్రారంభం | 2017 మే 26 |
ప్రదేశం | |
9.15 కిలోమీటర్లు (5.69 మై.) పొడవుతో, ఇది నీటిపై భారతదేశంలో రెండవ పొడవైన వంతెన.[4][5] అయితే, 9.76 కిలోమీటర్లు (6.06 మై.) పొడవుతో బీహార్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న కచ్చి దర్గా-బిదుపూర్ వంతెన 2025 లో పూర్తయినపుడు అది భారతదేశంలోనే అతి పొడవైన వంతెనగా అవతరిస్తుంది.[6] [7]
చైనీస్ సైన్యం చొరబాట్లను దృష్టిలో ఉంచుకుని భారత రక్షణ ఆస్తుల వేగవంతమైన తరలింపును దృష్టిలో ఉంచుకుని, ధోలా-సాదియా వంతెన భారత సైన్యపు ప్రధాన యుద్ధ ట్యాంకులైన (మెయిన్ బ్యాటిల్ ట్యాంక్) అర్జున్, T-72 వంటి 60 టన్నుల ట్యాంకుల బరువును తట్టుకునేలా ఈ వంతెనను రూపొందించారు.[8][9] భారత చైనా యుద్ధం తరువాత, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి రాజకీయంగా, సైనికపరంగా అరుణాచల్ ప్రదేశ్‌పై భారతదేశ హక్కును చైనా వివాదం చేసింది. కొనసాగుతున్న ఈ వివాదంలో వంతెన ఒక ముఖ్యమైన వ్యూహాత్మక ఆస్తిగా మారింది. [10]
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్థానిక నియోజకవర్గాల నుండి వచ్చిన డిమాండ్ల తర్వాత 2003 ఆగస్టులో ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని ప్రారంభించింది.[9] 2009 జనవరిలో, అరుణాచల్ ప్రదేశ్ రోడ్లు రహదారుల ప్యాకేజీలో భాగంగా భారత ప్రభుత్వం వంతెన నిర్మాణానికి ఆమోదం ఇచ్చింది.[11][12]
నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో 2011 నవంబరులో నిర్మాణం ప్రారంభించింది. 2015 లో పూర్తి చెయ్యాల్సి ఉంది. అయితే, నిర్మాణ జాప్యాలు, ఖర్చు పెరుగుదల కారణంగా, వంతెన 2017 లో పూర్తైంది.[13][14]
ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు వెయ్యి కోట్లు, ఐదు సంవత్సరాలు పట్టింది.[15] దీని పొడవు ముంబైలోని బాంద్రా వర్లీ సీ లింక్ కంటే 3.55 కి.మీ. ఎక్కువ. ఇది భారతదేశంలోనే అతి పొడవైన వంతెన.[16]
ఈ వంతెనను 2017 మే 26 న భారత ప్రధాని నరేంద్ర మోదీ, నితిన్ గడ్కరీ ( రోడ్డు రవాణా, రహదారుల మంత్రి ) ప్రారంభించారు. అస్సాంకు చెందిన ప్రసిద్ధ గాయకుడు, చిత్రనిర్మాత భూపేన్ హజారికా పేరు మీద ఈ వంతెనకు పేరు పెట్టారు. [17]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.